Battery Car
-
ఆరు నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే కారు (ఫొటోలు)
-
భలే బ్యాటరీ బుగ్గీ
ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందో లేదోగానీ సరికొత్త ఆవిష్కరణతో శభాష్ అనిపించుకున్నాడా ఔత్సాహికుడు రామక్రిష్ణ. తన తల్లి గుడికి వెళ్లేందుకు ఈజీగా ప్రయాణించేలా వాహనం చేయాలని అతని సంకల్పానికి పట్టుదల తోడైంది. పనికిరాని పాత ఇనుప సామాన్లు అతని చేతిలో కొత్తరూపు సంతరించుకున్నాయి. వీటికి మరికొన్ని విడి భాగాలు జోడించి, బ్యాటరీ బుగ్గీ (బ్యాటరీతో ఏర్పాటు చేసిన బండి) రూపొందించి భళా అనిపించాడు. చిత్తూరు, చౌడేపల్లె : మండలంలోని కాగతి పంచాయతీ కరణంవారిపల్లెకు చెందిన రామక్రిష్ణ బీటెక్ చేశారు. నెల్లూరులో ఉంటున్నారు. కొంతకాలం కృష్ణపట్నం పోర్ట్‌లో పనిచేశారు. లాక్డౌన్ కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. వృద్ధురాలైన తన తల్లి విజయమ్మ ప్రయాణించడానికి వీలుగా ఓ వాహనం తయారు చేయాలని పూనుకున్నాడు. ఇంటిలో నిరుపయోగంగా పడేసిన సైకిల్, మోపెడ్ వస్తు సామగ్రితో పాటు సాధారణంగా దొరికే ఇనుప వస్తువులను సేకరించారు.అలాగే, పుంగనూరులోని పాత ఇనుప సామాన్ల అంగడి (గుజిరీ షాపు)కి వెళ్లి దాదాపు 70కిలోల అవసరమైన వాటిని కొన్నారు. వీటినంతా శుద్ధి చేసి, వాహనానికి పనికొచ్చేలా చేశారు. పాతకాలపు జట్కా బండి తరహాలో వాహనాన్ని తయారుచేశాడు. దీనికి 750 వాట్స్ మోటారు, 48 ఓల్ట్ కెపాసిటీ గల బ్యాటరీని అమర్చారు. ముందుకెళ్లడమే కాకుండా, రివర్స్ ఫార్వడ్ ఫంక్షన్‌ను సైతం అమర్చాడు. డిజిటల్ స్పీడోమీటర్ కూడా పెట్టారు. ఆ తర్వాత దీనిని నాలుగు గంటల పాటు బ్యాటరీకి చార్జింగ్ చేశాడు. కూలీలంటూ ఎవరూ లేకపోవడం మూలాన దీని తయారీకి నెలన్నర సమయం పట్టింది. ఓ శుభముహూర్తాన గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలోని అభయాంజనేయస్వామి ఆలయానికి తొలిసారి ఈ వాహనంలో తన తల్లిని తీసుకెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్నాడు. తనకోసం శ్రమించి దీనిని తయారు చేసినందుకు ఆ తల్లి హృదయం ఉప్పొంగింది. ప్రేమతో హత్తుకుని ఆశీర్వదించింది. ఖర్చు రూ.20వేలే! ఈ బ్యాటరీ బుగ్గీ తయారీకి రూ.20 వేల వరకు అయ్యింది. ముగ్గురు ప్రయాణించేలా రూపొందించా. దీని తయారీకి నా అన్న కుమారుడు తేజరామ్ సహకరించాడు. మోపెడ్ మీద పాలక్యాన్లు తీసుకెళ్లేవారు, ఊరూరా తిరిగి తినుబండారాలు అమ్మేవారు ఇలాంటివి తయారు చేసిమ్మని అడుగుతున్నారు. దీనికి అమర్చిన బ్యాటరీ చార్జింగ్కు సోలార్ సిస్టం సైతం అమర్చడానికి ట్రై చేస్తున్నా. దీనికి అదనంగా 15–20వేలు అవ్వొచ్చు. చార్జింగ్ చేస్తే 40 నుంచి 55 కిలోమీటర్ల వరకు ఆ బుగ్గీ ప్రయాణిస్తుంది. వేగం కూడా 30 నుంచి 35 కిలోమీటర్ల వరకూ ఉంటోంది. దీనిపై ఆసక్తి కలిగిన వారు 9985555691 సెల్‌నంబర్‌ను సంప్రదించొచ్చు. –రామక్రిష్ణ -
ఈజీ జర్నీ
సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో మరో సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఉన్నాయి. తాజాగా ఫ్లాట్‌ఫామ్‌పై ఒకచోటు నుంచి మరో చోటుకు వేళ్లేందుకు బ్యాటరీ ఆపరేటెడ్ కార్ల (బీఓసీ)ను ప్రవేశపెట్టారు. వయోధికులు, దివ్యాంగులు, మహిళలు, పిల్లలు ప్లాట్‌ఫామ్‌లకు చేరుకునేందుకు వీలుగా ఐదు వాహనాలను 24 గంటలూ అందుబాటులో ఉంచారు. బ్యాటరీతో నడిచే ఈ వాహనాల్లో ఒకేసారి ఆరుగురు వెళ్లవచ్చు. వాహనం పైన లగేజీ పెట్టుకునేందుకు తగినంత స్థలం కూడా ఉంది. వీటిలో సాంకేతిక లోపాల వల్ల ఇబ్బందులు ఏర్పడినప్పుడు హ్యాండ్ బ్రేక్‌ను వినియోగించి తగిన రక్షణ పొందవచ్చు. క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (సీయూజీ) ఫోన్లతో అనుసంధానం కలిగిన శిక్షణ పొందిన డ్రైవర్లు వీటిని నడుపుతారు. ఈ వాహనాల్లో కెమరాలు కూడా ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు పటిష్టమైన భద్రత ఉంటుంది. ఈ వాహనాలను ముందుగా బుక్ చేసుకునేందుకు 88273 31111 నంబర్లో సంప్రదించవచ్చు. ప్రయాణికుడికి రూ.45 చొప్పున చార్జీ నిర్ణయించారు. -
బ్యాటరీ కార్ల సేవ అంతంతమాత్రమే
అన్నానగర్:సెంట్రల్ రైల్వే స్టేషన్-ఎగ్మూరు రైల్వే స్టేషన్లలో వృద్ధులు, వికలాంగులకు నిర్దేశించిన బ్యాటరీ కార్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వీటిని ఇతర వ్యా పారాలకు వాడుకోవడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ మేరకు దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. వృద్ధులూ - వికలాంగులను నిర్దేశిత ప్లాట్‌ఫాంలైన రైళ్ల వద్దకు చేర్చడానికి స్టేషన్ అధికారులు ఈ కార్లను ఏర్పాటు చేశారు. నిస్సహాయ ప్రయాణికులు ఈ బ్యాటరీ కార్ల సేవ కోసం డబ్బు చెల్లించాల్సి వస్తోంది. మనిషికి రూ.10 నుంచి రూ.15 ఇస్తేనే బ్యాటరీ కార్ల ఆపరేటర్ వారిని ప్లాట్‌ఫాంలపైకి చేరుస్తున్నారు. డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే వాణిజ్య పార్శిల్స్‌ను ఈ కార్లపై ఉంచుకొని డబ్బు సంపాదించుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌కు ఫిర్యాదులు ఇస్తే సదరు అధికారులు బ్యాటరీ కారు ఆపరేటర్‌ను ప్రశ్నించడానికి వచ్చినపుడు కారులో బ్యాటరీ డౌన్లో ఉందనో లేక ఇతర సాంకేతిక లోపాలో చెప్పి ఆపరేటర్లు తప్పించుకుంటున్నారు. సెంట్రల్ రైల్వే స్టేషన్లో మొత్తం 11 ప్లాట్‌ఫారాలుండగా కేవలం 3 బ్యాటరీ కార్లను మాత్రమే నడుపుతున్నారు. ఎగ్మూరు స్టేషన్లలో ఆరు ప్లాట్‌ఫారాలకు ఒకే కారు వినియోగంలో ఉంది. ఇతర రాష్ట్రాలూ - జిల్లాల నుంచి వైద్య పరీక్షల కోసం చెన్నైకు రోజూ కనీసం వంద నుంచి 250 వరకు వృద్ధులూ, వికలాంగులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాటరీ కార్ల ఆపరేటర్ల వైఖరి వారిని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తోంది. మెట్లు దిగి ప్లాట్‌ఫారాలు మారాల్సివస్తే ఈ బ్యాటరీ కార్ల ఆపరేటర్లు ఏ మాత్రం సాయం చేయడం లేదు. కేవలం మెట్ల వద్దనే వారిని దింపేసి ‘మీ చావు మీరు చావండి’ అని చెప్పి జారుకుంటున్నారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చి రెండు నెలలు దాటుతున్నా ఈ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. వృద్ధులూ - వికలాంగుల సమస్యకు రైల్వే వద్ద సత్వర పరిష్కార మార్గాలున్నా వాటిని అమలుపర్చడంలో ఎందుకు జాప్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్లాట్‌ఫాంకూ - ప్లాట్ ఫాంకు మధ్య రిమూవబుల్ లింక్ ట్రాకులను వేసి బ్యాటరీ కార్ల సేవలను అన్ని ప్లాట్‌ఫాంలపై నున్న వృద్ధులకూ - ప్రయాణికులకు అందించే ప్రయత్నంలో ఉన్నామని నిర్వాహకులు తెలిపారు. 45 రోజుల వ్యవధిలో ఈ సమస్యను పరిష్కరిస్తామని వారు హామీను ఇచ్చారు. -
భలే... భలే.. బ్యాటరీ కారు
నరసరావుపేట: స్కూటర్లు, మోటర్ సైకిళ్లకు చెందిన తీసేసిన విడిభాగాలను ఉపయోగించి విద్యుత్ సహాయంతో నడిచే బ్యాటరీ కారును తయారుచేశారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగం చివరి సంవత్సరం చదువుతున్న జాన్ సందీప్, ఆర్.భార్గవ్‌లు ఈ ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. దీనికోసం మూడు నెలలపాటు శ్రమించి రెండు సీట్ల కారును తయారుచేశారు. దీన్ని ఒకసారి చార్జిచేస్తే ఇద్దరు వ్యక్తులు 60 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని. ఒకరైతే 80 కిలోమీటర్లు వరకూ ప్రయాణించవచ్చని వారు చెబుతున్నారు. ఇటువంటి కార్లు శబ్దకాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడతాయంటున్నారు. దీని తయారీకి రూ.50 వేలు ఖర్చయిందని, ఒకేసారి పెద్ద మొత్తంలో తయారుచేస్తే రూ.30 వేలకే తయారు చేయవచ్చంటున్నారు. ఈ కారుకు ‘ఫినిక్స్’ అనే పేరు కూడా పెట్టుకున్నారు. వీరిద్దరూ ఆ కారుపై పట్టణంలో ఎటువంటి శబ్దంలేకుండా రయ్‌మని దూసుకెళుతుంటే చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.