Battula Vijayarani
-
తినడానికి లేకపోతే పోలీసులే అన్నం పెట్టారు:విజయరాణి
హైదరాబాద్:తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న తనకు పోలీసులే అన్నం పెట్టారని టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి మీడియా ముందు వాపోయింది. ప్రస్తుతం తన వద్ద చిల్లి గవ్వ కూడా లేదని తెలిపింది. బెంగళూరులో పట్టుబడిన ఆమెను సీసీఎస్ పోలీసులు శుక్రవారం విచారించారు. పోలీస్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ గగ్గోలు పెట్టుకుంది. తాను రూ. 10 కోట్లకు పైగా చిట్టీలతో మోసం చేయలేదని, కేవలం తాను జూనియర్ ఆర్టిస్టులకు మాత్రమే రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని, అప్పులపాలు కావడంతో పారిపోయానని, తన వద్ద చిల్లిగవ్వలేదని విజయరాణి విచారణలో తెలిపింది. కోట్లాది రూపాయలు దోచుకుందని ఒకవైపు బాధితులు చెప్తుంటే... మరోవైపు ఆమె తన వద్ద ఒక్కపైసాకూడా లేదని చెప్పడంతో ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. విజయరాణిని విచారించిన సీసీఎస్ పోలీసులు .. ఆమె టీవీ ఆర్టిస్టుల వద్ద చిట్టీల పేరుతో రెండు కోట్లను వసూలు చేసిందని తెలిపారు. ఇప్పటికే ఆమె పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్తులతో వచ్చిన డబ్బులను బాధితులకు అందజేస్తామన్నారు. -
చేతులేత్తేసిన ‘చిట్టీలరాణి’
అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని వెల్లడి తన వద్ద చిల్లిగవ్వలేదని పోలీసుల విచార ణలో ఏకరవు సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరులో పట్టుబడిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి (46)ని సీసీఎస్ పోలీసులు గురువారం నగరానికి తీసుకొచ్చారు. ఓ రహాస్య ప్రదేశంలో సీసీఎస్ ఏసీపీ విజయ్‌కుమార్ ఆమెను విచారిస్తున్నారు. విజయరాణి రూ.10 కోట్లకుపైగా చిట్టీలు, అధిక వడ్డీల పేరుపై డబ్బులు వసూలు చేసుకొని పారిపోయిందని బాధితుల కథనం ప్రకా రం నిన్నటి వరకూ అనుకున్నారు. అయితే విచారణలో మాత్రం అందుకు భిన్నంగా కథనాలు వినిపిస్తున్నాయి. అసలు తాను ఎవరికీ ఒక్కపైసా కూడా ఇవ్వాల్సి లేదని, అసలు కంటే వడ్డీలే ఎక్కువ కట్టానని, అప్పులపాలు కావడంతో పారిపోయానని, తన వద్ద చిల్లిగవ్వలేదని విజయరాణి విచారణలో ఏకరువు పెట్టినట్టు సమాచారం. కోట్లాది రూపాయలు దోచుకుందని ఒకవైపు బాధితులు చెప్తుంటే... మరోవైపు ఆమె తన వద్ద ఒక్కపైసాకూడా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పోలీసులంటున్నారు. అసలు ఈ ఉదంతంలో వడ్డీల పేరుతో ఆమెకు ఎంత మంది ఎంత డబ్బు ఇచ్చారు..? ఆమె వద్ద చిట్టీలు ఎవరు ఎత్తుకున్నారు..? ఇంకా చిట్టీలు ఎత్తుకోని వారు ఎందరు?.. చిట్టీలు ఎత్తుకుని డబ్బులు కట్టని వారు ఎంత మంది?... ఇలా బాధితుల నుంచి వేర్వేరుగా వివరాలను సీసీఎస్ పోలీసులు సేకరిస్తున్నారు. ఆ తర్వాతే డబ్బు ఎవరి వద్ద ఉంది అనే అంశం తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు. వియజరాణి వద్ద నిజంగా డబ్బు లేదా? ఉండే నాటకం ఆడుతుందా.. అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. విజయరాణి ఎదుటే బాధితులను కూర్చోబెట్టి ప్రశ్నించాలని పోలీసులనుకుంటున్నారు. నగరంలోని ఆమె రెండు ఇళ్లతో పాటు గుడివాడలోని ఇల్లును కూడా విక్రయించిందని తేలింది. విక్రయించగా వచ్చిన డబ్బు ఎక్కడ ఉంది? ఎవరికిచ్చింది అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. వడ్డీల రూపంలో ఆమె నుంచి ఎవరెవరు ఎంత పెద్దమొత్తం తీసుకున్నారు అనే వివరాలపై ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ఆరా తీశారు. అధిక వడ్డీలు ఇవ్వడం వల్లనే ఆమె నష్టపోయిందా అనేది సందేహం కలిగిస్తోంది. గతనెలలో నమోదైన కుట్ర, మోసం కేసులో విజయరాణితో పాటు ఆమెకు సహకరించిన మరో 11 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇక ఆమె ఇళ్లను ఖరీదు చేసిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిజానికి వీరు ఆమెకు నగదు ఇచ్చి ఇళ్లు ఖరీదు చేశారా? లేక వారికి డబ్బులు బాకీ ఉంటే ఇళ్లను కబ్జా చేశారా అనే విషయాలు తేలాల్సి ఉంది. ఆమె విక్రయించిన మూడిళ్లను ఇప్పటికే పోలీసులు సీజ్ చేశారు. బెంగళూరుకు పారిపోయిన విజయరాణి బృందం అక్కడ కూడా నాలుగు ఇల్లు మార్చి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ప్రతి రోజు సెల్నెంబర్లను మారుస్తూ పోలీసుల దృష్టి మరల్చింది. -
'రూ.3కోట్లు వసూలు చేసిన మాట నిజమే'
హైదరాబాద్ : తోటి నటీనటులకు చిట్టీల పేరుతో శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి తాను రూ. 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు స్వయంగా అంగీకరించింది. బెంగళూరులో నిన్న విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. అధిక వడ్డీకి కూడా ఆమె రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు వున్నాయి. చిట్టీల పేరుతో పలువురు ఆర్టిస్టులకు డబ్బు ఎగగొట్టిన విజయరాణి నెల రోజుల క్రితం పరారైన విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు విజయరాణితో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసులను సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. విజయరాణికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. వారి కోసం ఆరు పోలీస్ ప్రత్యేక బృందాలు వెతికాయి. కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వారిని పట్టుకుంది. బత్తుల విజయరాణి, పాలరాజు, చిట్టీలు, టీవీ ఆర్టీస్టులు, tv artist, Battula Vijayarani, Palaraju, ccs police -
'రూ.3కోట్లు వసూలు చేసిన మాట వాస్తవమే'
-
‘చిట్టీలరాణి’ దొరికేనా..!
హైదరాబాద్ : టీవీ ఆర్టిస్టులకు రూ.10 కోట్లకుపైగా శఠగోపం పెట్టి పారిపోయిన టీవీ ఆర్టిస్టు బత్తుల విజయరాణి నెల కావొస్తున్నా నేటికీ ఆచూకీ దొరకలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ డీసీపీ పాలరాజు ఆమెతో పాటు చెల్లెలు బి.సుధారాణి, నాని, శరణ్, శ్రీనివాస్‌రావు, హరిబాబు, దుర్గ, రమేష్‌లపై చీటింగ్, కుట్ర కేసు నమోదు చేశారు. విజయరాణిని అరెస్టు చేయాలని బాధితులు వరుసగా ఆందోళనలు చేయడంతో నిందితురాలికి చెందిన రెండు ఇళ్లతో పాటు కారును పోలీసులు సీజ్ చేశారు. అయితే నేటి వరకు అసలు నిందితురాలి ఆచూకీ తెలియరాలేదు. ఇంటి సామానులతో సహా ఆమె బెంగుళూరుకు పారిపోయి ఉంటుందని కూకట్‌పల్లిలోని ఓ లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన క్లూ ఆధారంగా ప్రత్యేక బృందం బెంగుళూరు వెళ్లి వచ్చింది. అయినా ఆమె ఆచూకీ దొరకలేదు. రెండేళ్ల నుంచే పక్కా పథకం వేసుకున్న విజయరాణి చిట్టీల పేరుతోనే కాకుండా తెలిసివారందరి దగ్గర అధిక వడ్డీ పేరుతో కోట్లాది రూపాయలు అప్పు చేసింది. అంతేకాకుండా తన కుమారుడు సినిమాలో హీరో అవుతున్నాడని నమ్మించి బంధువులు వద్ద నుంచి బంగారు ఆభరణాలను సైతం తీసుకుంది. ఆ తరువాత తన పేరుపై ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసి ఇంటి సామానుతో పారిపోయింది. ఇంతవరకు ఆమె, మిగిలిన నిందితుల ఆచూకీ లభించకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అయితే, నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బృందాలను పంపినా ఇంత వరకు ఆచూకీ లభించలేదని, త్వరలోనే అరెస్టు చేస్తామని సీసీఎస్ అధికారులు అంటున్నారు. -
ఇంకా ఆచూకీ దొరకని చిట్టీల రాణి
-
లారీలో పారిపోయిన చిట్టీలరాణి
-
సామాన్లతో సహా.. లారీలో పారిపోయిన చిట్టీలరాణి
హైదరాబాద్: టీవీ ఆర్టిస్ట్‌లను నిలువునా ముంచిన బత్తుల విజయరాణి తన ఇంటి సామాన్లను సైతం సర్ధుకుని లారీలో పారిపోయినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది. ఎల్లారెడ్డిగూడలో ఉన్న అద్దె ఇంటిని ఈ నెల 10వ తేదీనే ఖాళీ చేసిందని అక్కడికి వెళ్లిన పోలీసులకు ఇంటి యజమాని తెలిపారు. సామాన్లను తరలించిన లారీ ఎక్కడ నుంచి తెచ్చారో కనిపెడితే ఆమె చిక్కినట్లేనని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మరో నిందితురాలు మధులత కుమారుడు శ్రీను ఆమె వద్ద వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆమె దగ్గరి కుటుంబ సభ్యులు అందరి ఇళ్లను పోలీసులు గాలించినా అందరి ఇళ్లకు తాళాలు కనిపించాయి. పథకం ప్రకారమే కొడుకు, కోడలుతో పాటు చెల్లెలు, ఇతర బంధువులను ఇతర ప్రాంతాలకు తరలించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే ఆమె పథక రచన చేసినట్లు తెలుస్తుందని ఓ అధికారి తెలిపారు. శ్రీనగర్ కాలనీ, అమీర్‌పేటలో ఆమె నిర్వహిస్తున్న మూడు మెస్‌లను కూడా ఖాళీ చేసిందని పోలీసుల విచారణలో తేలింది. -
విజయరాణిపై కేసు నమోదు చేస్తాం