Bauxite excavations
-
వేల కోట్లు కొల్లగొట్టారు.. అయ్యన్నే అసలైన మైనింగ్ డాన్
దొంగే.. ‘దొంగ.. దొంగ’ అని అరిచినట్లుంది. గత ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టానుసారం తవ్వకాలు సాగించి, వారికీ వాటాలు పంచి.. అమాయక గిరిజనం నోట్లో మట్టి కొట్టారు. ఇప్పుడా బాగోతం బట్టబయలు కావడంతో గురివింద గింజను తలపిస్తూ సరికొత్త డ్రామాకు తెరలేపారు. సాక్షి, అమరావతి: బాక్సైట్ తవ్వకాలు అక్రమంగా జరిగిపోతున్నాయని ఆందోళన చేస్తున్న టీడీపీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే అసలైన మైనింగ్ డాన్ అని తేటతెల్లమైంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయన కొడుకు చింతకాయల విజయ్.. విశాఖ మన్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని అడ్డూ అదుపు లేకుండా ఖనిజ వనరుల్ని కొల్లగొట్టినట్లు స్పష్టమైంది. అప్పటి అధికారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకుని లేటరైట్ తవ్వకాలను యథేచ్చగా జరిపించారు. అయ్యన్న ముఠా మన్యంలో జరిపిన అక్రమ తవ్వకాల విలువ వేల కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అయ్యన్న కుమారుడి అక్రమాల్లో చంద్రబాబు కుమారుడు లోకేశ్‌కు కూడా వాటాలున్నాయని ప్రచారం జరుగుతోంది. భూగర్భ గనుల శాఖ నిర్వహించిన విచారణలో ఈ అక్రమాలన్నీ బహిర్గతమయ్యాయి. వాటిని కప్పి పుచ్చేందుకు, అక్రమ ఆదాయానికి గండి పడిందనే అక్కసుతో ఎదురుదాడి మొదలుపెట్టినట్లు స్పష్టమవుతోంది. విచారణలో వాళ్ల అక్రమాలన్నీ బయట పడడంతోపాటు మైనింగ్ దోపిడీపై అయ్యన్న గ్యాంగ్‌పై కోట్ల రూపాయల జరిమానా పడింది. ఆ లీజులు రద్దయ్యాయి. అందుకే తమకు అంటిన బురదను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటించాలనే దుర్బుద్ధితో తాజాగా లేని బాక్సైట్‌ను తవ్వేస్తున్నారని మొసలి కన్నీరు కారుస్తున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి ప్రస్తుతం విశాఖ ప్రాంతంలో ఉన్న ఏడు లేటరైట్ లీజులు చంద్రబాబు హయాంలో ఇచ్చినవే. అందులో మూడు చింతకాయల విజయ్‌వే. అమాయక గిరిజనులకు లేటరైట్ లీజులు వాళ్లు అమాయక గిరిజనులు. వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేనివాళ్లు. అలాంటి ముగ్గురికి వేల కోట్ల రూపాయల విలువైన లేటరైట్ లీజులు వచ్చాయి. కాయకష్టంతో కడుపు నింపుకునే వాళ్లకు అంత విలువైన లీజులు ఎలా వచ్చాయి? చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన మాయ అది. ఇప్పుడు నీతులు చెబుతున్న చింతకాయల అయ్యన్న పాత్రుడి ముఠా లీల అది. ఆ మూడు లీజులు చింతకాయల విజయ్‌వే. ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్ లీజులు గిరిజనులకే ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే అమాయక గిరిజనుల పేరుతో మూడు లేటరైట్ లీజులు తీసుకుని మన్యాన్ని కబళించేశారు విజయ్ అతని అనుయాయులు. సర్వే చేయని కొండను సైతం.. విశాఖ జిల్లా నాతవరం మండలం సుందరకోట గ్రామంలో 4.97 హెక్టార్లలో లేటరైట్ తవ్వకానికి 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెంటనే సింగం భవానీ పేరుతో మైనింగ్ లీజును తీసుకున్నారు. ఇది సర్వే చేయని కొండ ప్రాంతం. అక్కడ డీజీపీఎస్ సర్వే జరగలేదు. నిబంధనల ప్రకారం ఈ భూమికి మైనింగ్ లీజు ఇవ్వకూడదు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చేసింది. మైనింగ్ ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమంగా లేటరైట్‌ను తవ్వారు. లీజు భూమిలో తవ్విన లేటరైట్‌ను బయట ప్రాంతాలకు రవాణా చేసేందుకు రిజర్వు ఫారెస్టులో అడ్డగోలుగా రెండు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు వేశారు. ఇందుకోసం గ్రావెల్, లేటరైట్, ఎర్రరాయిని తవ్వి వాడేశారు. అంతేకాకుండా లీజు పరిధిలోకి రాని భూముల్లో కూడా ఇష్టానుసారం మైనింగ్ చేసి 18,942 మెట్రిక్ టన్నుల లేటరైట్‌ను అమ్మేసుకున్నారు. మరోవైపు ఈ లీజు కింద ఇచ్చిన పర్మిట్లను తూర్పుగోదావరి జిల్లా వంతాడ మైనింగ్ లీజుకు చూపించి వినియోగించుకున్నారు. ఇక్కడ 4,09,542 మెట్రిక్ టన్నులకు పర్మిట్లు తీసుకున్నారు. కానీ తవ్వింది మాత్రం 2,81,488 మెట్రిక్ టన్నులే. మిగిలిన 1,28,054 మెట్రిక్ టన్నుల పర్మిట్లను వంతాడ మైనింగ్ లీజుకు చూపించి భారీగా డబ్బు దండుకున్నారు. వీటిపై ఆరోపణలు రావడంతో విచారణకు వెళుతున్న మైనింగ్ అధికారుల్ని అడ్డుకునేందుకు విజయ్ మనుషులు రోడ్డు తవ్వేశారు. అయినా అధికారులు విచారణ చేశారు. అవకతవకలు తేలడంతో రూ.9.34 కోట్ల జరిమానా విధించారు. కొండను తవ్వి నాలుగు కిలోమీటర్లు రోడ్డు నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలోని తోరాడ గ్రామంలో సర్వే నంబరు 532లో 68 ఎకరాలను గిరిజనుడైన కిలె లోవరాజుకు లేటరైట్ తవ్వకానికి తెలుగుదేశం హయాంలో 2017లో అనుమతి ఇచ్చారు. లోవరాజును మభ్యపెట్టి అతని పేరుతో విజయ్ ఈ లీజును తీసుకున్నట్లు విచారణలో తేలింది. అడ్డగోలుగా తవ్వడమే కాక.. తవ్వే ప్రాంతానికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా, సీనరేజి కట్టకుండా ఏకంగా రిజర్వు ఫారెస్టులో కొండను తవ్వి నాలుగు కిలోమీటర్ల రోడ్డును వేశారు. ఈ గనిలో 3,26,187 మెట్రిక్ టన్నుల లేటరైట్‌ను తవ్వారు. దాన్ని రవాణా చేయడం కోసం తీసుకున్న పర్మిట్లను తూర్పుగోదావరి జిల్లా వంతాడ మైనింగ్‌లో వినియోగించారు. తోరాడ లీజులో తవ్విన ఖనిజానికి సంబంధించిన పర్మిట్లను వంతాడలో వాడి, అక్కడా లేటరైట్‌ను తవ్వి అమ్మేసుకున్నారు. 50,169 మెట్రిక్ టన్నుల బిల్లుల్ని ఇలా వంతాడకు చూపించి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జరిపిన విచారణలో ఈ ఉల్లంఘనలు స్పష్టమవడంతో మైనింగ్ శాఖ రూ.8 కోట్ల జరిమానా విధించింది. ప్రస్తుతం తవ్వకాలు నిలిచిపోయాయి. అల్లూరి గుహలు కనుమరుగయ్యేలా తవ్వకాలు నాతవరం మండలం అసనగిరి గ్రామంలో సింగం భవానీ పేరు మీద 89 ఎకరాలకు మరో లేటరైట్ లీజు తీసుకున్నారు. ఈ లీజు ప్రాంతంలోనే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తలదాచుకున్న ఎర్రమట్టి గుహలున్నాయి. స్థానిక గిరిజన దేవత గంగాలమ్మను పూజించే ప్రాంతం ఇది. గిరిజనులు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం ఈ లీజు ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ అనుయాయులు రంగంలోకి దిగి ఎర్రమట్టి గుహల వద్దకు వెళ్లేందుకు అడవిని నాశనం చేసి ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. ఇందుకోసం ఎర్రమట్టి, గ్రావెల్‌ను ఇష్టానుసారం వాడుకున్నారు. తవ్వకాలు జరుగుతున్న తీరు చూసి ఇది పూర్తయితే చారిత్రక ప్రదేశంగా ఉన్న సీతారామరాజు ఉన్న గుహలు కనుమరుగవుతాయని స్థానికులు ఆందోళన చెందారు. తమ దేవతను పూజించే ప్రాంతం ఉండదని తవ్వకాల్ని అడ్డుకున్నారు. ఈ లీజులోనూ అయ్యన్న కుమారుడి అక్రమాలు బయటపడడంతో దీని రద్దుకు మైనింగ్ అధికారులు సిఫారసు చేశారు. ప్రస్తుతం తవ్వకాలు నిలిచిపోయాయి. ఈ గనుల్లో తవ్విన లేటరైట్‌ను దొంగతనంగా ఒరిస్సాలోని వేదాంత కంపెనీకి అమ్ముకుని వందల కోట్లు గడించారు. లోకేశ్‌కు వాటా! ఈ అక్రమాల్లో చంద్రబాబు కుమారుడు, అప్పటి మంత్రి లోకేశ్‌కు వాటా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేశ్, చింతకాయల విజయ్ అత్యంత సన్నిహితులు. లోకేశ్ అండతోనే మన్యంలో విజయ్ చెలరేగిపోయారు. లోకేశ్ ప్రోద్బలంతోనే విజయ్.. విశాఖ మన్యాన్ని గుప్పిట్లో పెట్టుకుని కబళించారు. ఐదేళ్లపాటు లేటరైటే కాదు.. మన్యంలో కనిపించిన ప్రతి ఖనిజాన్ని అయ్యన్న ముఠా తవ్వేసి అమ్ముకుంది. ఎర్రరాయి, గ్రావెల్‌ను పెద్దఎత్తున తవ్వి సొమ్ము చేసుకుంది. వీళ్లు తవ్వి అమ్ముకున్న ఖనిజం విలువ వేల కోట్లకుపైనే ఉంటుందని మైనింగ్ అధికారులు చెబుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత అయ్యన్న గ్యాంగ్ అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట పడింది. మైనింగ్ విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. తవ్వకాలు నిలిచి పోవడంతో ఈ ముఠా ఆదాయానికి గండి పడింది. మరోవైపు కోట్ల రూపాయల జరిమానాలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అక్కసుతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అయ్యన్న ముఠా ఎదురు దాడికి దిగింది. ప్రభుత్వంపై బురదజల్లడం మొదలు పెట్టింది. తాము చేసిన అక్రమాలు ఇప్పుడు జరుగుతున్నట్లు చిత్రీకరించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యంత విలువైన ఖనిజ వనరుల్ని మింగేసి ఇప్పుడు వాటి కోసం ఆందోళనల పేరుతో హడావుడి చేస్తుండడం చూసి గిరిపుత్రులు నవ్వుకుంటున్నారు. లేటరైట్‌ను దోచేసిన అయ్యన్నపాత్రుడు నిజ నిర్ధారణ పేరుతో మన్యంలోకి వెళ్లేందుకు హడావుడి చేయడం చూసి ఇంతకన్నా దారుణం ఏముంటుందని గిరిజనులు వాపోతున్నారు. తమను మోసం చేసిన వాళ్లే ఇప్పుడు తమను రక్షించడానికి వస్తున్నట్లు డ్రామాలాడడం మన్యంలో చర్చనీయాంశమైంది. నిజానికి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక లేటరైట్ లీజు కూడా మంజూరు చేయలేదు. ఉన్న ఏడు లీజులు చంద్రబాబు హయాంలో ఇచ్చినవే. లేని బాక్సైట్‌ను తవ్వేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. నిజానికి ఆ లీజును ఇచ్చేందుకు అయ్యన్న మంత్రిగా ఉన్నప్పుడే అంగీకరించారు. ఇప్పుడు అదే తప్పు అని రోడ్డెక్కడం కొసమెరుపు. -
‘గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోలేరు’
సాక్షి, అమరావతి : గిరిజనుల అభిప్రాయాన్ని గౌరవించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్సైట్ తవ్వకాలను రద్దు చేశారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. గిరిజనులు పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. గిరిజనులు ఈ రోజు పండుగ చేసుకునే రోజని అన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనుల సంపదను దోచుకోవాలని చూశాడని, బాక్సైట్ కోసం బాబు గిరిజన ఎమ్మెల్యేలను సైతం కొనుగోలు చేశాడని మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు పోరాడారని గుర్తు చేశారు. 2015 లో చంద్రబాబు ఇచ్చిన 97 జీవో కు వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్రెడ్డి పోరాడారని, ఆ సమయంలోనే వైఎస్ జగన్ బాక్సైట్ అనుమతులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం అయిన నాలుగు నెలల్లోనే గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌పై ఉన్న నమ్మకంతోనే గిరిజన ప్రాంతాల్లోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీని గెలిపించారని తెలిపారు. ఇక గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోరని అన్నారు. -
బై.. బై! బాక్సైట్
సాక్షి, అరకులోయ/పాడేరు: తమ బతుకులను నాశనం చేసే బాక్సైజ్ తవ్వకాలు వద్దంటూ మన్యం ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా గత పాలకులు పట్టించుకోలేదు. గిరిపుత్రుల గోడును ఆలకించలేదు. టీడీపీ సర్కార్ ఏకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిస్తూ జీవో 97ను సైతం జారీ చేసింది. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల పక్షాన నిలిచారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంబంధిత జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాక్సైట్ తవ్వకాలకు గుడ్‌బై చెబుతూ..సంబంధిత జీవోను రద్దు చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. దీంతో గిరిపుత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. తమకు మంచి రోజులు వచ్చినట్లేనని మురిసిపోతున్నారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని అపారమైన బాక్సైట్ ఖనిజ సంపదను దోపిడీ చేసేందుకు 1970 నుంచి పాలకులు అనేక విధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. గిరిజనులంతా బాక్సైట్ తవ్వకాల చర్యలను నిరసిస్తూ గత 50 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. గిరిజనుల ప్రయోజనాలే ముఖ్యమని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కూడా గత పదేళ్ల నుంచి గిరిజనుల పక్షాన నిలిచి బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రతిపక్ష నేత హోదాలో మూడేళ్ల క్రితం చింతపల్లిలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి భారీ సదస్సు నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన బాక్సైట్‌కు అనుకూల జీవో నంబర్97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం తవ్వకాలకు వెనుకంజ వేసినప్పటికీ సంబంధిత జీవో 97ను మాత్రం రద్దు చేయలేకపోయింది. దీంతో గిరిజనులు, గిరిజన సంఘాలు ఉద్యమం చేశాయి. జీవో నంబర్ 97ను రద్దు చేయాలని పోరుబాట పట్టాయి. వారి పోరాటానికి వైఎస్సార్సీపీ అధినేత హోదాలో జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏజెన్సీలో వైఎస్సార్సీపీ నాయకులు కూడా బాక్సైట్ వ్యతిరేక పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు.2015 డిసెంబర్ 10వ తేదీన జరిగిన బాక్సైట్ వ్యతిరేక ఉద్యమంలో జగన్మోహన్రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాక్సైట్ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి, గిరిజనులకు మేలు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తక్కువ రోజుల్లోనే తమ ప్రభుత్వం గిరిజనుల పక్షాన ఉందని నిరూపించారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, గత ప్రభుత్వాలు జారీ చేసిన బాక్సైట్ అనుకూల జీవోలన్నీ రద్దు చేస్తున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రకటించారు. దీంతో విశాఖ ఏజెన్సీలోని అన్ని వర్గాల గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ మనుగడను కాపాడిన సీఎం జగన్మోహన్రెడ్డికి గిరిజనులంతా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. 75 కోట్ల టన్నుల బాక్సైట్ నిక్షేపాలు విశాఖ ఏజెన్సీలోని అరకులోయ మండలం గాలికొండ, రక్తికొండ, చిత్తంగొంది, చింతపల్లి ప్రాంతంలోని జర్రెల, సప్పర్ల, తూర్పుగోదావరి జిల్లాలోని గుర్తెడు అటవీ ప్రాంతాలలో 75 కోట్ల టన్నుల బాక్సైట్ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలలో 27 బాక్సైట్ కొండలను గుర్తించారు. ఈ కొండలల్లో బాక్సైట్ తవ్వకాలు జరిపితే 270 గ్రామాల గిరిజనులు పూర్తిగా నిర్వాసితులవుతారని, వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాల్లోని అటవీ సంపద అంతా నాశనమవుతుందని, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఏజెన్సీ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, మైదాన ప్రాంతాల్లోని సాగునీటి ప్రాజెక్టుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని, పర్యావరణవేత్తలు హెచ్చరించారు. ఇప్పటికే ఒడిశాలోని దమన్‌జోడి ప్రాంతంలో నాల్కో సంస్థ గత పదేళ్ల నుంచి 48 లక్షల టన్నుల బాక్సైట్ ఖనిజ సంపదను తవ్వి తీయడంతో సమీప గ్రామాల గిరిజనులంతా నిర్వాసితులయ్యారు. అటవీ సంపద కనుమరుగవ్వగా.. తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. వేలాది ఎకరాల వ్యవసాయ భూములన్నీ నాశనమయ్యాయి. గిరిజనులంతా మనుగడను కోల్పోయారు. ఈ పరిస్థితిని చూసిన పర్యావరణ వేత్తలంతా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలోని బాక్సైట్ ఖనిజ సంపదను తవ్వే చర్యలను తప్పుపట్టారు. గిరిజనులు కూడా ఉద్ధృతంగా పోరాటం చేశారు. వారి పోరాటం ఫలించింది. బాక్సైట్ తవ్వకాల కోసం గత టీడీపీ సర్కార్ జారీ చేసిన జీవో 97ను వైఎస్ఆర్సీపీ సర్కార్ రద్దు చేయాలని నిర్ణయించింది. ఆదివాసీ బిడ్డలను రక్షించే శక్తి జగన్ పెందుర్తి: ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం గత ప్రభుత్వం కుట్రపూరితంగా జారీ చేసిన జీవో నంబర్ 97ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ శాసనసభ్యుడు కుంభా రవిబాబు అన్నారు. ఆదివాసీ బిడ్డల జీవీతాలతో పాటు ఏజెన్సీలో పర్యావరణాన్ని రక్షించే శక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు రూ.లక్షలాది కోట్ల విలువైన బాక్సైట్ తవ్వకాల కోసం తహతహలాడాయని గుర్తు చేశారు. కానీ ఆదివాసీ బిడ్డలు, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో గత ప్రభుత్వాల ఆటలు సాగలేదన్నారు. తొలినుంచీ బాక్సైట్ తవ్వకాల కోసం కుట్ర చేస్తున్న చంద్రబాబు 2000 మే 24న హైదారాబాద్‌లో నిర్వహించాల్సిన గిరిజన మండలి సమావేశాన్ని విశాఖలో నిర్వహించి ఏజెన్సీలో మైనింగ్ ఎవరైనా చేసుకోచ్చన్న తీర్మాణం చేయించడంతో పాటు ఎమ్మెల్యేలందిరితో బలవంతంగా సంతకాలు తీసుకున్నారన్నారు. ఇలాంటి పరిణామాల మధ్యలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు ప్రకటన గిరిజన బిడ్డల గుండెల్లో హత్తుకుందన్నారు. బాక్సైట్ జీవో రద్దు ప్రకటన హర్షణీయం ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం మంచి పరిణామమని ఏయూ తెలుగు శాఖాధిపతి ఆచార్య జర్రా అప్పారావు అన్నారు. గిరిజనులపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా ఈ నిర్ణయం నిలుస్తోందన్నారు. 2015 నవంబరులో చంద్రబాబు ప్రభుత్వం జీవో నంబరు 97ను విడుదల చేసిందని..దీని ద్వారా గిరిజన ప్రాంతంలో విలువైన బాక్సైట్ ఖనిజాన్ని విక్రయించాలని నిర్ణయించారని అన్నారు. దీనిని నాటి నుంచి అనేక మంది గిరిజనులు వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేసిం దని, ప్రశ్నించే ప్రతి వ్యక్తిపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించిందని మండిపడ్డారు. దీనిలో భాగంగానే 2015 నవంబరు 15న బాక్సైట్ వ్యతిరేకంగా ఆదివాసీ శాసన సభ్యులతో సమావేశం పెట్టినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుందన్నారు. జీవోకు వ్యతిరేకంగా తెడబారికి సురేష్‌కుమార్, సుర్ల లోవరాజు ఆమరణ నిరాహార దీక్షలకు సైతం దిగారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ బాక్సైట్ జీవోను రద్దుచేస్తానని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో సైతం ఆదివాసీల సంరక్షణ, భద్రతకు ప్రభుత్వ పెద్దపీట వేస్తుందని భావిస్తున్నామన్నారు. -
బాక్సైట్ తవ్వకాలకు నో
సాక్షి, అమరావతి : విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను అనుమతించబోమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. బాక్సైట్ తవ్వకాలకన్నా గిరిజనుల శాంతి, సంతోషాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. శాంతిభద్రతలపై కలెక్టర్లు – ఎస్పీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులతో మంగళవారం ప్రజావేదికలో జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి ఈ మేరకు ప్రకటించారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని, జీవనోపాధి లేకపోవడాన్ని అనుకూలంగా మార్చుకుని వామపక్ష తీవ్రవాద విస్తరణకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. బాక్సైట్ తవ్వకాలు జరపాలని ప్రభుత్వం భావిస్తే ముందుగా ఆ ప్రాంత గిరిజనులకు ఉపాధి కల్పించి అవగాహన కల్పించాలని, ఇది పెద్ద సమస్య కాదని వివరిస్తూ బాక్సైట్ తవ్వకాలు జరపడం గిరిజనులకు అంతర్గతంగా ఇష్టంలేదని చెప్పుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ ‘ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు ఇష్టం లేనప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరపాల్సిన అవసరం ఏముంది? గిరిజనులు శాంతియుతంగా, సంతోషంగా ఉండటమే మన ప్రభుత్వ లక్ష్యం. బాక్సైట్ తవ్వకపోతే రాష్ట్రానికి వచ్చే నష్టమేమీ లేదు. ఇక నుంచి ఏజెన్సీలో మైనింగ్‌కు అనుమతించబోం’ అని స్పష్టం చేశారు. గిరిజనుల జీవనోపాధి మెరుగుపరుద్దాం మారుమూల గిరిజన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వ అధికారులు భయంతో వెళ్లడం లేదని పోలీసు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా.. ప్రభుత్వం తమ కోసం పని చేస్తుందనే నమ్మకం గిరిజనుల్లో కలిగించాలని చెప్పారు. ‘ఒక్కొక్కరుగా, విడివిడిగా మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్లలేమని చెబుతున్నప్పుడు వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వేర్వేరుగా వెళ్లే వారికి రక్షణ కల్పించాలన్నా కష్టమే. అందువల్ల సంబంధిత అన్ని విభాగాల వారిని కలిపి ఒకేసారి తీసుకెళ్లండి. అన్ని విభాగాల వారందరూ నెలకు ఒకసారైనా వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. కలెక్టరు, ఎస్పీలు ఈ విషయంపై దృష్టి సారించాలి’ అని దిశానిర్దేశం చేశారు. ‘గిరిజనులు గంజాయి సాగు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. జీవనోపాధి లేకపోవడం వల్లే గిరిజనులు గంజాయి సాగు చేస్తున్నారనే అభిప్రాయం కూడా ఉంది కదా.. అలాంటప్పుడు కచ్చితంగా జీవనోపాధి కల్పించడం ద్వారా సాంఘిక, ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించడం సర్కారు బాధ్యత. ఇందుకు ఏమి చేయడానికైనా సర్కారు సిద్ధంగా ఉంది. ఏమి చేయాలో ఆలోచించి నివేదిక ఇవ్వండి’ అని సీఎం ఆదేశించారు. చెప్పిన మాటకు కట్టుబడి.. ఎట్టి పరిస్థితుల్లో బాక్సైట్ తవ్వకాలు జరపబోమని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. 2009 ఎన్నికల ముందు బాక్సైట్ వ్యతిరేక పోరాటం చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబునాయుడు 2014లో అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి మరీ బాక్సైట్ తవ్వకాలకు జీవో జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ చింతపల్లిలో వైఎస్ జగన్ గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలను ఎలాంటి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. నాడు చెప్పిన మాటకు జగన్ ఇప్పటికీ కట్టుబడి ఉన్నందున విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహం ఉరకలేస్తోంది ‘ఊకదంపుడు ఉపన్యాసాలు లేవు.. అర్థంకాని లెక్కలు, గ్రాఫిక్స్ అసలేలేవు. స్తోత్కర్షకు చోటే లేదు. సర్కారు లక్ష్యాలు, ప్రాధామ్యాలు, పాలన ఎలా ఉండాలో సూటిగా, స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మనం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులమని చెప్పడం ద్వారా ప్రజల పట్ల ఎంత గౌరవభావం, అభిమానం ఉందో చాటుకున్నారు. చెరగని చిరునవ్వుతో అధికారులను సాంబశివన్నా, శ్యామలన్నా, జవహరన్నా.. అంటూ గౌరవం, ప్రేమతో సంభోదించారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన సూచించిన దిశగా పని చేయాలన్న ఉత్సాహం పెరిగింది’ అని సమీక్షకు హాజరైన పలువురు ఉన్నతాధికారులు చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సోమ, మంగళవారాల్లో ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల తొలి సదస్సు పూర్తి స్థాయి దిశా, దశా నిర్దేశంతో గతానికి పూర్తి భిన్నంగా జరిగింది. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమని, వారిని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సీఎం సూచిస్తూనే.. అవినీతి పనులు చెబితే తిరస్కరించాలంటూ కుండబద్దలు కొట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చి తీరాల్సిందేనని చెప్పడం ద్వారా మాట తప్పరని చాటుకున్నారు. అధికారులు వేరు, మనం వేరు కాదు.. ఇది మన ప్రభుత్వం.. వారూ మనం కలిసి పని చేయాలన్నారు. తద్వారా అధికారుల్లో మన సీఎం జగన్ అని తొలి సమావేశంలోనే ముద్ర వేసుకున్నారు. ఆయన మాటలు మాలో స్ఫూర్తి నింపాయి తాను మరణించినా ప్రతి ఒక్కరి ఇంటా తన ఫొటో ఉండాలన్నదే తన తపన అని జగన్ చెప్పుకున్నారు. కలెక్టర్లు కూడా తాము పని చేసిన ప్రాంత ప్రజల్లో వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా సేవలు అందించాలని, మంచి పనులు చేయాలని సీఎం సూచించారు. ‘ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి వినతుల స్వీకరణ కోసం ప్రతి కార్యాలయంలో ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు. తీసుకున్న ప్రతి వినతికీ నంబరు ఇవ్వడంతోపాటు ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కరిస్తారో కూడా అందులోనే పొందుపరిచి పరిష్కరించాలని చెప్పారు. ఈ మాటలు మాలో స్ఫూర్తి రగలించాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఇంత పట్టుదలతో వినూత్నంగా ఆలోచించి గొప్ప పనులు చేస్తుంటే ఐఏఎస్ చేసిన మనం ఎందుకు ప్రజల గుండెల్లో నిలిచిపోయే స్థాయిలో సేవలు అందించకూడదనే పట్టుదల పెరిగింది. నేను పనిచేసే స్థానం నుంచి బదిలీ చేస్తే జిల్లా వారంతా బాధపడేలా పని చేయాలని ఈ రోజే నిర్ణయానికి వచ్చా. ఇందుకు సీఎం ప్రసంగమే స్ఫూర్తి..’ అని ఒక జిల్లా కలెక్టర్ ‘సాక్షి’తో అన్నారు. ఇలాంటి సంబోదన ఊహించలేదు ‘నేను 20 ఏళ్లుగా రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశా. ఇప్పటి వరకు ప్రతి సీఎం పేరుతో పిలవడమే చూశా. జగన్ తొలిసారి ‘అన్నా’ అంటూ ఆప్యాయంగా రెండు మూడు సార్లు పిలిచారు. ఇది నాకెంతో సంతోషం కలిగించింది. గతంలో ఒకసారి అప్పటి సీఎం చంద్రబాబు అయితే మా సహచర అధికారిని నీవు ఆ సంస్థ ఎండీవా? నీ మొఖం నాకెప్పుడూ కనిపించలేదే. నిద్రపోతున్నావా.. అని ఆయన తప్పులేకపోయినా అవమానించేలా మాట్లాడారు. ప్రస్తుత సీఎం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా స్నేహభావంతో నవ్వుతూ, నవ్విస్తూ సమీక్షించారు. సీఎం చేసిన మార్గనిర్దేశం మాలో నూతనోత్సాహం నింపింది. మా సహచరులందరం ఇదే మాట్లాడుకున్నాం.. ఫలితాలు త్వరలో కనిపిస్తాయి.’ అని ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు కలెక్టర్లు సాక్షితో అన్నారు. -
‘బాబు’ల కనుసన్నల్లోనే.. బాక్సైట్ మాఫియా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తూర్పు కనుమలుగా పరిగణించే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొండల్లో వందల కోట్ల టన్నులకుపైగా విలువైన బాక్సైట్ ఖనిజ నిక్షేపాలున్నాయి. దేశంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వ రంగ సంస్థలకే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అనుమతులివ్వడానికి వీల్లేదు. ఖనిజంలో అల్యూమినియం 40 శాతం లోపు ఉంటే లేటరైట్‌గా, అంతకు మించి ఉంటే బాక్సైట్గానూ పరిగణిస్తారు. లేటరైట్‌ను సిమెంటు తయారీకి, బాక్సైట్‌ను అల్యూమినియం తయారీకి వినియోగిస్తారు. 2014కి ముందు విశాఖలో తవ్వకాలకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అనుమతులు ఇవ్వలేదు. బాక్సైట్ తవ్వకాలకే కాదు లేటరైట్ తవ్వకాలకూ నాటి ప్రభుత్వాలు అంగీకరించలేదు. 2014లో టీడీపీ సర్కారు కొలువుదీరిన వెంటనే ఖనిజాసురులకు రెక్కలు వచ్చేశాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే కుమారుడు, తూర్పు గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు చెందిన నాయకుడు, విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడు, మరో మంత్రి అల్లుడు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు కలసి ఓ ముఠాగా తయారై తమ బినామీలతో మైనింగ్ కోసం దరఖాస్తు చేయించారు. నాతవరం మండలం సరుగుడు పంచాయతీ సుందరకోట గ్రామంలో అల్యూమినియం 40 శాతం లోపే ఉందని, అందువల్ల తమకు లేటరైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలంటూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన సింగం భవానీతో మైనింగ్ శాఖకు దరఖాస్తు చేయించారు. 2010లో ఆమె దరఖాస్తును తిరస్కరించిన మైనింగ్ శాఖ 2014లో మాత్రం సుందరకోటలో 4.97 హెక్టార్లలో 20 ఏళ్ల పాటు తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. మంత్రి అనుచరులకు లీజులు ఇదే క్రమంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పిట్టాచలం గ్రామస్తుడు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడు కిల్లో లోవరాజుకు 2015లో తొరడ గ్రామంలో 20 ఏళ్ల పాటు లేటరైట్ తవ్వకాలకు లీజు అనుమతులిచ్చారు. బమిడికలొద్దు గ్రామంలో 121 హెక్టార్ల విస్తీర్ణంలో లేటరైట్ తవ్వకాలకు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడు జర్తా లక్ష్మణరావుకు కూడా లీజు అనుమతిలిచ్చారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు.. విశాఖ మన్యంలోనూ కొన్నాళ్లుగా తవ్వకాలు సాగిస్తున్నారు. చింతపల్లి మండంలం రాజుపాకలు, గూడెంకొత్త వీధిలో జడుమూరు. చాపరాతి పాలెం, రంపుల వద్ద కొండలు తొలిచేస్తున్నారు. భూ కుంభకోణాల్లో ప్రధానంగా పేరు వినిపించిన ఓ మంత్రి అల్లుడు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు, అతడి సన్నిహితులు కలిసి కొన్నేళ్లుగా మన్యంలోని కొండల్లో మైనింగ్ చేస్తున్నారు. వీరంతా లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారనే విషయాన్ని గనుల శాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అవి బాక్సైట్ నిల్వలేనన్న గనులశాఖ విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడులో ఉన్న నిక్షేపాలు లేటరైట్ గనులు కావని అవి బాక్సైట్ నిల్వలేనని గనుల శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ లభ్యమయ్యే ఖనిజంలో 44 శాతానికి పైగా బాక్సైట్ ఉన్నట్టు తేల్చింది. కానీ గత నాలుగున్నరేళ్లుగా లేటరైట్ పేరిటే బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారు. ఇలా వీరందరికీ తవ్వుకునేందుకు లీజులు ఇప్పించిన సర్కారు పెద్దలు ఓ కచ్చితమైన నిబంధన విధించారు. ఎవరు ఎక్కడ ఎంత తవ్వుకున్నా చివరకు మెటీరియల్ మాత్రం ‘ఆండ్రు మినరల్స్’కే విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రి లోకేష్ దగ్గరుండి మరీ ఈ పంచాయితీ చేసినట్టు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మైనింగ్ వ్యాపారవేత్త వెల్లడించారు. ఆండ్రూ దోచిందెంత..? మార్కెట్లో టన్ను లేటరైట్ రూ.850 దాకా ఉండగా బాక్సైట్ రూ.1,700 నుంచి రూ.1,800 వరకు ధర పలుకుతోంది. అంటే లేటరైట్ కంటే బాక్సైట్తోనే రెట్టింపు ఆదాయం లభిస్తోందని అర్ధమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ జిల్లాలో మైనింగ్ శాఖ అనుమతించిన ప్రాంతాల్లో తవ్విన మొత్తం సుమారు 2 కోట్ల టన్నులకుపైనే ఉంటుందని అంచనా. ఆండ్రు మినరల్స్ గత నాలుగున్నరేళ్లలో నెలకు సగటున 4 లక్షల టన్నుల బాక్సైట్‌ను కొనుగోలు చేసి అల్యూమినియం కర్మాగారాలకు విక్రయిస్తోందని ఓ మైనింగ్ వ్యాపారి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. అంటే సగటున ఏడాదికి 48 లక్షలు... నాలుగున్నరేళ్లలో సుమారు 2 కోట్ల టన్నులకుపైనే క్రయవిక్రయాలు చేసిందని అంచనా. ఈ లెక్కన రూ.3,000 కోట్లకుపైగా టర్నోవర్ చేసి ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇందులో సింహభాగం వాటా ముఖ్యనేత, అధికార పార్టీ ముఖ్యులకు ఉండటంతో ఈ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. ఆండ్రు మినరల్స్ లేటరైట్ పేరిట టన్నుకు రూ.200 రాయల్టీ, రూ.37 పన్ను, 5 శాతం జీఎస్టీ మాత్రమే చెల్లిస్తూ రెట్టింపు విలువైన బాక్సైట్‌ను తరలిస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా బడా‘బాబు’కు రూ.వందల కోట్లు నజరానాగా ఇవ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయం ఆండ్రూ రమేష్‌బాబు భరించేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. అందువల్లే మన్యం సహా తూర్పు కనుమల్లో బాక్సైట్ నిక్షేపాలను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నా ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొంటున్నారు. ఎవరీ ‘ఆండ్రూ’..? తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన ఆండ్రు రమేష్‌బాబు తొలుత పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో స్టోన్క్రషర్గా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. తూర్పు గోదావరి జిల్లాలోని మహేశ్వరి మినరల్స్ సంబంధీకులతో తొలుత సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత వారితో విభేదించాడు. అనంతరం మైనింగ్ రంగంలోకి దిగిన రమేష్‌బాబు తన సోదరుడు ఆండ్రు శ్రీనివాస్ అలియాస్ బాబీతో కలిసి ఆండ్రూ మినరల్స్ స్థాపించి స్వల్ప కాలంలోనే మైనింగ్ మాఫియాగా అవతరించాడు. తూర్పు గోదావరి జిల్లా వంతాడ రిజర్వ్ ఫారెస్ట్‌లోని ఏలేశ్వరంలో గనులు లీజుకు తీసుకుని తవ్వకాలు మొదలుపెట్టిన రమేష్‌బాబు 2014 తర్వాత ఈ నాలుగున్నరేళ్లలోనే తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్న బాక్సైట్ కొండలపై గుత్తాధిపత్యం సాధించాడు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎవరు, ఎక్కడ మైనింగ్ చేసినా రమేష్‌బాబుకే విక్రయించాలని మంత్రి లోకేష్ దగ్గరుండి పంచాయితీ చేశారు. ఆండ్రూ మినరల్స్‌కు అమ్మాలని షరతు విధించడంతోపాటు గనులశాఖ ఆంక్షలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వుకోవచ్చని అడ్డగోలుగా అనుమతులిచ్చేశారు. దీంతో ఎవరు ఎక్కడ తవ్వకాలు చేపట్టినా మెటీరియల్ మాత్రం ఆండ్రు మినరల్స్‌కే విక్రయిస్తూ వస్తున్నారు. పచ్చని తూర్పు కనుమల్లో అధికారం అండతో మైనింగ్ మాఫియా గాండ్రిస్తోంది! టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లుగా లేటరైట్ ముసుగులో ఇక్కడ సాగిస్తున్న ఖనిజ దోపిడీ, విచ్చలవిడి అమ్మకాలు చూస్తే ఇదంతా బడా‘బాబు’ల డైరెక్షన్లో సాధ్యమనే సంగతి బోధపడుతోంది. గిరిజనులను బినామీలుగా చేసుకుని.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వి పోస్తూ.. గోరంత అనుమతులతో కొండలకు కొండలు కరిగించేసి కోట్లు కొల్లగొడుతున్న అధికార పార్టీ నేతలు, మంత్రుల కుమారులు ఇక్కడ తవ్విన ఖనిజాన్ని కేవలం ఒక్కడికే కట్టబెట్టాలి. ఆ ఒక్కడే అన్నీ కొనుగోలు చేసి సిమెంట్ ఫ్యాక్టరీలు, స్టీల్ ఫ్యాక్టరీలకు విక్రయించుకుని భారీగా వెనకేసుకుంటున్నాడు. ఆ ఒక్కడికే గుత్తాధిపత్యం కట్టబెట్టినందుకు పెద్ద‘బాబు’కు రూ.వందల కోట్లు నజరానాగా ఇవ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఖర్చును భరించేలా ఒప్పందం కుదిరింది. ఇంతకీ ఆ ఒక్కడు ఎవరు..? అతడి గుత్తాధిపత్యం గుట్టు ఏమిటి? అనే తెలియాలంటే పూర్తి కథనంలోకి వెళ్లాల్సిందే. ఆయనకే ఎందుకు అమ్ముతున్నారో తెలియదు ‘విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతి పరిధిలోని గ్రామాల్లో మైనింగ్ చేస్తున్న ఖనిజాన్ని లీజుదారులందరూ ఆండ్రూ మినరల్స్‌కే విక్రయిస్తున్నారనే విషయం నాకూ తెలిసింది. వాస్తవానికి లీజుల వరకే మా ప్రమేయం ఉంటుంది. మైనింగ్ తర్వాత మెటీరియల్ ఎవరికి అమ్ముకుంటారో మాకు సంబంధం లేదు. గతంలో కొన్ని ఫ్యాక్టరీలకు నేరుగా విక్రయించారు. కానీ ఇప్పుడు ఆండ్రుకే అమ్ముతున్న విషయం వాస్తవమే. అది ఎందుకో మాకు తెలియదు. మాకు ఆ అవసరం లేదు కూడా.’ – శివాజీ, మైనింగ్ శాఖ సహాయ సంచాలకులు(ఏడీ) -
బాక్సైట్ తవ్వకాల కోసం కేంద్రం ఒత్తిడి
సాక్షి విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ గనుల తవ్వకాల కోసం కేంద్రం ఒత్తిడి తెస్తోందని, గిరిజనుల మనోభావాలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గురువారం పాడేరులో జరిగిన గిరిజన ఉత్సవాలలో సీఎం పాల్గొన్నారు. అంతకుముందు గ్రామదర్శినిలో భాగంగా చింతలవీధి పంచాయతీ ఆడారిమెట్టలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం పాడేరు జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ఆదివాసీ ఉత్సవాల్లో మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి వ్యతిరేకమని చెప్పారు. బాక్సైట్ కోసం ఒప్పందం కుదుర్చుకున్న రసల్ ఆల్‌ఖైమా సంస్థ అంతర్జాతీయ కోర్టుకు వెళ్లడానికి ఎవరు కారణమో తెలుసుకోవాలన్నారు. బాక్సైట్‌పై కేంద్రం కూడా తమను తప్పుపట్టి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గడిచిన ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని, అయినప్పటికీ తాను చేస్తున్న అభివృద్ధిని చూసి అరుకు, పాడేరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారని చెప్పుకొచ్చారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం గత నాలుగేళ్లలో 14 వేలు కోట్లు ఖర్చు చేశామని, రానున్న ఏడాది రూ.2,564 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్లు ఇప్పిస్తానని పునరుద్ఘాటించారు. గిరిజన విశ్వ విద్యాలయం విజయనగరం జిల్లాలో వస్తోందన్నారు. మౌలిక వసతుల మెరుగుదలకు పాడేరు పంచాయితీకి 20 కోట్లు కేటాయిస్తామన్నారు. పాడేరు, అరుకులను కలుపుతూ హెల్త్ టూరిజం ఏర్పాటు చేస్తామన్నారు. కాఫీ, పెప్పర్‌లకు బ్రాండింగ్ ఇచ్చి వాటి విలువ పెంచుతామన్నారు. గత ఎన్నికల్లో తనకు ఓట్లయలేదు, ఈ సారైన వేయాలని అభ్యర్ధించారు. కార్యక్రమంలో మంత్రులు నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సభలో గిరిజనుల నుండి తీవ్ర నిరసనల సెగ ఎదురయింది. బాక్సైట్ జీవో రద్దు చేయడంతో పాటు గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ, గిరిజన విశ్వ విద్యాలయం కావాలంటూ పెద్ద పెట్టున యువత నినాదాలు చేశారు. దీంతో అసహనానికి గురైన సీఎం వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాక్సైట్ జీవో రద్దు చేస్తూ ప్రకటన చేయాలని లేదంటే సీఎం పర్యటనను అడ్డుకుంటామన్న ఏపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్సతో పాటు మరో పది మందిని పోలీస్‌లు గృహ నిర్బంధం చేశారు. విద్యుదాఘాతంతో సీఎం సభకు వస్తున్న వ్యక్తి సజీవ దహనం జి.మాడుగుల (పాడేరు): పాడేరులో ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబునాయుడి సభకు బైక్‌పై వెళ్తుండగా విద్యుత్ తీగ తెగిపడి ఒక గిరిజనుడు సజీవ దహనమయ్యాడు. జి.మాడుగుల మండలం సింగర్భ పంచాయతీ మాదేమామిడి గ్రామానికి చెందిన సాగేని శివానందచారి (తౌడాచారి) బైక్‌పై సీఎం సభకు వెళ్తుండగా లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామ సమీపాన విద్యుత్ వైరు తెగి మీద పడటంతో మంటలు చెలరేగాయి. తీవ్ర గాయాలతో శివానందచారి అక్కడక్కడే మృతి చెందగా, బైక్ పూర్తిగా దగ్ధమైంది. -
బాక్సైట్ భగభగలు
చింతపల్లి: ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యంలో మళ్లీ బాక్సైట్ సెగ రాజుకుంది. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా సీపీఐ పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో చింతపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. గిరిజన సంఘాలు, వైఎస్సార్సీపీతోపాటు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు మళ్లీ ఇప్పుడు బాక్సైట్ వ్యతిరేకపోరు పేరుతో తెరవెనుక చురుగ్గా కదులుతున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు చేపడతామని ప్రకటించింది. ఆగస్టు 10న విశాఖలో నిర్వహించిన గిరిజన సదస్సులో సీఎం చంద్రబాబు దీనిపై స్పష్టమైన ప్రకటన చేశారు. అప్పటి నుంచి మన్యంలో నిరసన జ్వాలలు మిన్నంటుతూనే ఉన్నాయి. దళసభ్యులు బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు సిద్ధం కావడంతో రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు చోటుచేసుకుంటోంది. కంటి మీద కునుకు లేకుండా అధికారపార్టీ నాయకులు గడుపుతున్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా కొన్నేళ్లుగా గిరిజనులు అలుపెరుగని ఉద్యమాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. విపక్షంలో ఉన్నంతకాలం బాక్సైట్ తవ్వకాలకు తాము వ్యతిరేకమంటూ టీడీపీ నమ్మబలికింది. అప్పట్లో చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావులు జీకేవీధిలో జరిగిన బహిరంగ సభల్లో బాక్సైట్‌కు వ్యతిరేకంగా విల్లంబులు ఎక్కిపెట్టి మరీ శపథం చేశారు. బాక్సైట్ కారణంగానే జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సమిడి రవిశంకర్, ఉంగ్రంగి సోమలింగం, జీకేవీధి వైస్ ఎంపీపీ సాగిన సోమ లింగంలు మావోయిస్టుల చేతిలో ప్రాణాలుకోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలోని స్థానిక ప్రజాప్రతినిధులు పదవులకు, పార్టీలకు రాజీనామాలు చేసి అప్పట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. బాక్సైట్ తవ్వకాల అంశానికి కొంతకాలం తాత్కాలికంగా తెరపడింది. మన్యంవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రశాంత వాతావరణం నెలకొంది. టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ ఆ తుట్టెను కదిపింది. బాక్సైట్ తవ్వకాల అంశాన్ని మరోసారి తెరపైకి తె చ్చింది. దీంతో ఏజెన్సీలో వాతావరణం మళ్లీ వేడెక్కింది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు దీనిని తమకు అనుకూలంగా మలచుకుని బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలకు గిరిజనులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గరిమండ, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోను, జి.మాడుగుల మండలంలోను గిరిజనులతో భారీ సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత రాజకీయనాయకులు, గిరిజనులు మరోసారి తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. దినదినగండం..నూరేళ్ల ఆయుష్షుగా కాలం వెళ్లదీస్తున్నారు.