bb
-
అమర్ దీప్ కారుపై దాడి, పోలీసుల లాఠీఛార్జ్
-
పోతురాజు ప్రేయసిగా రష్మీ గౌతమ్
బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ పేరు తెలియని వాళ్లు ఉండరు. అటు టీవీ షోలు చేస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన "గుంటూరు టాకీస్" చిత్రంలో అందాల ఆరోబోతకే ప్రాధాన్యం ఇచ్చిన రష్మీ ఇప్పుడు అభినయానికి స్కోప్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం "బొమ్మ బ్లాక్ బస్టర్" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో హీరో నందు పోతురాజు పాత్రను పోషిస్తున్నారు. అతని ప్రేయసి వాణిగా రష్మీ అలరించనున్నారు. వాణి ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ బుధవారం విడుదల చేసింది. (చదవండి: ప్లీజ్.. అలా రాయొద్దు!) కిరీటం ధరించి, ఏడు కొండల నామం పెట్టుకుని, మెడలో పూల మాల వేసుకున్న రష్మీ చిరునవ్వులు చిందుస్తున్నారు. ఈ గెటప్‌లో రష్మీ చాలా బాగుందంటూ ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో నందు పూరీ జగన్నాథ్ అభిమానిగా కన్పిస్తారు. విజయూభవ బ్యానర్‌పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు, ఆనంద్ రెడ్డి, మనోహర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతమందిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా వుంటే ఆ మధ్య నందు బీబీ గురించి బిగ్ అనౌన్స్ మెంట్.. ఇక రచ్చ రచ్చే అని వరుస పోస్టులతో తన అభిమానులను తెగ ఊరించారు. బీబీ అనగానే అందరూ బిగ్‌బాస్ అనుకున్నారు కానీ, అనూహ్యంగా "బొమ్మ బ్లాక్‌బస్టర్" అంటూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎలాగైతేనేం, తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ చేసుకున్నారు. (చదవండి: టిక్‌టాక్ వీడియోపై రష్మి ఆగ్రహం) -
పోరాటయోధుడు బీబీ నాయుడు
వందలాది మందితో అంతిమ యాత్ర కోటిలింగాలపేటలో దహన సంస్కారాలు కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కార్మికోద్యమ నేత, సీఐటీయు నాయకుడు బీబీ నాయుడు చూపిన బాటలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు నడవాలని వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. మూత్ర పిండాల వ్యాధితో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన సీఐటీయూ నాయకుడు బీబీ నాయుడు భౌతిక కాయానికి శనివారం మధ్యాహ్నం కోటిలింగాల పేట కైలాస భూమిలో అంతిమ సంస్కారం నిర్వహించారు. పేపరు మిల్లు ఎదురుగా ఉన్న బీటీఆర్ భవ¯ŒS నుంచి బీబీ నాయుడు భౌతిక కాయానికి వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన యాత్ర పేపరుమిల్లు మీదుగా నందం గనిరాజు జంక్షన్, జాంపేట, గణేష్‌చౌక్, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా కోటిలింగాల పేట కైలాస భూమికి చేరుకుంది. మధ్యాహ్నం దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ప్రముఖుల నివాళి ఎర్ర జెండా పట్టుకుని అదే జెండా కింద నిబద్ధతతో నడిచిన బీబీ నాయుడు బాటలో అంతా నడవాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి అన్నారు. నాయుడు మృతి కార్మిక లోకానికి తీరనిలోటన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణే ఊపిరిగా బీబీనాయుడు బతికారని మాజీ ఎంపీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మిడియం బాబూరావు అన్నారు. కుల రహిత సమాజం కోసం అంతా పోరాడాలని మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకరచౌదరి సూచించారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్ని కృష్ణ, సీసీసీ ఛానల్ ఎండీ పంతం కొండలరావు, సీపీఎం అర్బ¯ŒS జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సీపీఐ నాయకులు మీసాల సత్యనారాయణ, నల్లా రామారావు, బయ్యా జోసఫ్, ట్రేడ్ యూనియ¯ŒS నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, డి.శేషుబాబ్జీ మాట్లాడారు. -
కార్మిక నేత కన్నుమూత
బీబీ నాయుడుకు ప్రముఖుల నివాళి l నేడు అంత్యక్రియలు కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : కార్మిక ఉద్యమనేత, సీఐటీయూ నాయకుడు బగాది బలుసు నాయుడు (బీబీ నాయుడు ) (69) శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య భారతి, కుమార్తెలు వాణి, రాణి ఉన్నారు. దీర్ఘకాలంగా సుగర్ వ్యాధితో బాధపడుతున్న నాయుడు గురువారం ఉదయం అస్వస్తతకు గురై ఆస్పత్రిలో చేరారు. రెండు కిడ్నీలు పని చేయకపోవడంతో ఆయన మృతి చెందారు. ఆయన మృతి కార్మిక ఉద్యమానికి, సీపీఎం పార్టీకి తీరని లోటని సీపీఎం, సీఐటీయూ నాయకులు నివాళులర్పించారు. ఆయన భౌతికకాయానికి శనివారం ఉదయం 10 గంటలకు కోటిలింగాల ఘాట్‌లోని కైలాస భూమిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. నాయుడు పాత్ర కీలకం కార్మిక ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన కార్మిక నేత బీబీ నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అయోధ్యపురం గ్రామంలో 1948 నవంబరు 9న జన్మించారు.1971లో రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లులో రీవైండింగ్లో ట్రైనీ కార్మికునిగా చేరారు. 1973లో సీఐటీయూలో చేరారు. నిబద్ధతతో ఎదిగి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడిగా, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. నాయుడు రాష్ట్రంలోని వివిధ పేపరు మిల్లులను సందర్శించి యూనియన్లు ఏర్పాటు చేసేందుకు చేసిన కృషి ఎనలేనిది. అన్ని యూనియన్ నాయకులను ఏకం చేసి కార్మికోద్యమాలను నిర్వహించి విజయం సాధించారు. పలువురి సంతాపం బీబీ నాయుడి మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు ఫోన్ ద్వారా సందేశం పంపగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబూరావు, దడాల సుబ్బారావు, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి, రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి, అర్బన్ జిల్లా కార్యదర్శి టి.అరుణ్, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం, వివిధ కార్మిక సంఘాల నేతలు ఆనందనగర్ వద్ద గణపతి నగర్‌లోని బీబీ నాయుడు స్వగృహానికి చేరుకుని నివాళులర్పించారు. పేపరు మిల్లు ఎదురుగా ఉన్న సీఐటీయూ కార్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.