bc welfare committee
-
‘విశ్వకర్మబంధు’ను ప్రకటించి అమలు చేయాలి: జాజుల
కవాడిగూడ (హైదరాబాద్): విశ్వకర్మ సామాజికవర్గం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్న ప్రభు త్వానికి గుణపాఠం చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపు నిచ్చారు. దళిత బంధులాగే విశ్వకర్మల అభివృద్ధికోసం ‘విశ్వకర్మబంధు’ను తక్షణమే ప్రకటించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో విశ్వకర్మలు తమ ఓటుద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. విశ్వకర్మీయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద విశ్వకర్మనేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు జాజుల, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేషాచారి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసి ప్రత్యేక రాష్ట్రం రావడానికి ప్రధాన కారకులైన విశ్వకర్మల బతుకులు ఏమాత్రం బాగాలేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు ప్రకటించిన అన్ని హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసీబంధు అమలు చేయండి ఆదిలాబాద్‌లో తుడుందెబ్బ ధర్నా.. కలెక్టరేట్ ముట్టడి సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచి్చన దళితబంధు పథకం తరహాలోనే అత్యం త వెనుకబడిన తమ వర్గానికి కూడా ఆదివాసీబంధు అమలు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పెద్ద ఎత్తున ఆదివాసీలు ఆదిలాబాద్ కలెక్టరేట్‌ను ముట్ట డించారు. కలెక్టర్ బయటకు వచ్చి తమ వినతిపత్రం స్వీకరించాలని డిమాండ్ చేశారు. అయితే కలెక్టర్ బయటకు రాకపోవడంతో దా దాపు రెండు గంటలు ధర్నా కొనసాగించా రు. అనంతరం సమీపంలోని కుమురం భీం చౌక్‌కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకు ఆదివాసీల ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ ఆదివాసీబంధు అమ లు చేసి ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే లంబాడా సామాజికవర్గాన్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆదివాసీలు సా గు చేస్తున్న అటవీ భూములకు హక్కు పత్రా లు ఇవ్వాలని కోరారు. సాయంత్రం అదనపు కలెక్టర్ నటరాజ్, ఆర్డీవో జాడి రాజేశ్వర్ ఆదివాసీల దగ్గరికి రావడంతో వారు శాంతించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాగా, ఆదివాసీల రాస్తారోకో కారణంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు మూడు గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సమయంలోనే రిమ్స్‌కు వెళ్లే అంబులెన్స్‌లు రావడంతో ఆదివాసీలు వాటి కి దారి వదిలారు. తుడుందెబ్బ జిల్లా అధ్య క్షుడు గొడం గణేశ్, ఉపాధ్యక్షుడు శ్యామ్‌రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బీసీలకు సబ్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు కూడా సబ్ ప్లాన్ అమలు చేయాలని బీసీ కమిటీ ప్రతిపాదనల్లో మొదటి అంశంగా చేర్చినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనచారి, మంత్రి ఈటల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. బీసీల జనాభాను కచ్చితంగా తేల్చేందుకు బీసీ కమిషన్ ఆధ్వర్యంలో త్వరలోనే సర్వే నిర్వహించనున్నామన్నారు. బీసీల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం 100 ఎకరాల్లో పూలే పేరిట బీసీ ఆత్మగౌరవ భవన్‌ను ఏర్పాటు చేయాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం, ఎలక్టెడ్, సెలక్టెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీఎంకు నివేదించనున్నామన్నారు. 31 జిల్లాల్లో రెండేసి చొప్పున 62 డిగ్రీ, 62 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ కమిటీ ప్రతిపాదించిందన్నారు. కొత్తగా మరో 119 బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక రంగంలో రిజర్వేషన్ కల్పించాలని, ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తున్నామన్నారు. -
29 నుంచి శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ పర్యటన
జిల్లాలో మూడు రోజులు గుంటూరు వెస్ట్ : శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనుంది. ఏపీ శాసనసభ సెక్రటరీ కె.సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. 29న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు హాలులో బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి కమిటీ వినతిపత్రాలు స్వీకరిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంను సందర్శిస్తుంది. వీసీ, రిజిస్ట్రార్లతో సమావేశమై రిజర్వేషన్ల అమలు, సంక్షేమ పథకాలపై చర్చిస్తుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో సమావేశమవుతుంది. సాయంత్రం 4.30 గంటలకు హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో గుంటూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో సమావేశమవుతుంది. అనంతరం ధోబీఘాట్లను, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లను సందర్శిస్తుంది. 30న అమరావతి, తెనాలిల్లో.. 30న ఉదయం 9.30 గంటలకు అమరావతిలో ని అమరేశ్వర, ఉమామహేశ్వరస్వామి ఆల యాల ఎగ్జిక్యూటివ్ అధికారులతో సమావేశం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు సంగం డెయిరీని సందర్శిస్తుంది. 12.45 గంటలకు తెనాలి ఆర్డీవో కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తుంది. తెనాలి డివిజన్లోని బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో సమావేశం నిర్వహించనుంది. 3.30 గంటలకు అడవి గ్రామంలోని మత్య్సకారులతో ముఖాముఖి, 5 గంటలకు బాపట్ల వ్యవసాయ యూనివర్సిటీని సందర్శించి, వీసీ, రిజిస్ట్రార్లతో వివిధ అంశాలపై చర్చిస్తుంది. 31న నర సరావుపేటలో... 31న ఉదయం 10 గంటలకు నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో బీసీ సంఘాలు, ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తుంది. డివిజన్లోని బీసీ హాస్టళ్ల అధికారులతో సమావేశమవుతుంది. 11.30 గంటలకు కోటప్పకొండను సందర్శించి అక్కడి దేవాదాయశాఖ అధికారులతో రిజర్వేషన్ల అమలుపై చర్చిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి గురజాల ఆర్డీవో కార్యాలయంలో బీసీ సంఘాలు, ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తుంది. డివిజన్లోని బీసీ హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో సమావేశమవుతుంది. రాత్రికి హైదరాబాద్ పయనమవుతుంది. -
సెల్‌టవర్ ఎక్కిబోయి... అరెస్టు అయ్యాడు
కృష్ణా(మైలవరం): ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కేందు యత్నించి అరెస్టు అయ్యాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా మైలవరంలో సోమవారం చోటుచేసుకుంది. బీసీ సంక్షేమ సంఘం మైలవరం నియోజకవర్గం అధ్యక్షుడు మన్నె సాంబశివరావు ఈ రోజు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపేందుకు యత్నించాడు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచార మిచ్చారు. పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచికత్తు పై విడుదల చేశారు.