29 నుంచి శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ పర్యటన | 29 Onwards Assembly BC Welfare Committee tour | Sakshi
Sakshi News home page

29 నుంచి శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ పర్యటన

Published Mon, Aug 22 2016 6:57 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

29 Onwards Assembly BC Welfare Committee tour

జిల్లాలో మూడు రోజులు 
 
గుంటూరు వెస్ట్‌ : శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో పర్యటించనుంది. ఏపీ శాసనసభ సెక్రటరీ కె.సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. 29న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని సమావేశపు హాలులో బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి కమిటీ వినతిపత్రాలు స్వీకరిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంను సందర్శిస్తుంది. వీసీ, రిజిస్ట్రార్‌లతో సమావేశమై రిజర్వేషన్ల అమలు, సంక్షేమ పథకాలపై చర్చిస్తుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు గుంటూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్, ఇతర జిల్లా అధికారులతో సమావేశమవుతుంది. సాయంత్రం 4.30 గంటలకు హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులతో గుంటూరు ఆర్‌డీవో కార్యాలయ ప్రాంగణంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో సమావేశమవుతుంది. అనంతరం ధోబీఘాట్లను, బీసీ వెల్ఫేర్‌ హాస్టళ్లను సందర్శిస్తుంది.
 
30న అమరావతి, తెనాలిల్లో..
30న ఉదయం 9.30 గంటలకు అమరావతిలో ని అమరేశ్వర, ఉమామహేశ్వరస్వామి  ఆల యాల ఎగ్జిక్యూటివ్‌ అధికారులతో సమావేశం కానుంది.  మధ్యాహ్నం 12 గంటలకు సంగం డెయిరీని సందర్శిస్తుంది.  12.45 గంటలకు తెనాలి ఆర్‌డీవో కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తుంది.  తెనాలి డివిజన్‌లోని బీసీ హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులతో సమావేశం నిర్వహించనుంది. 3.30 గంటలకు అడవి గ్రామంలోని మత్య్సకారులతో  ముఖాముఖి,  5 గంటలకు బాపట్ల వ్యవసాయ యూనివర్సిటీని సందర్శించి, వీసీ, రిజిస్ట్రార్‌లతో వివిధ అంశాలపై చర్చిస్తుంది.  
 
31న నర సరావుపేటలో...
31న ఉదయం 10 గంటలకు నరసరావుపేట ఆర్‌డీవో కార్యాలయంలో బీసీ సంఘాలు, ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తుంది.  డివిజన్‌లోని బీసీ హాస్టళ్ల అధికారులతో సమావేశమవుతుంది. 11.30 గంటలకు కోటప్పకొండను సందర్శించి అక్కడి దేవాదాయశాఖ అధికారులతో రిజర్వేషన్ల అమలుపై చర్చిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి గురజాల ఆర్‌డీవో కార్యాలయంలో బీసీ సంఘాలు, ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తుంది.  డివిజన్‌లోని బీసీ హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులతో సమావేశమవుతుంది.  రాత్రికి హైదరాబాద్‌ పయనమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement