BCCI President Anurag Thakur
-
ఐపీఎల్ లేదా చాంపియన్స్ ట్రోఫీ!
ఒక టోర్నీలోనే ఆడగలమన్న బీసీసీఐ కోల్‌కతా: లోధా కమిటీ సిఫారసుల్లో చాలా అంశాలను తాము ఇప్పటికే అమల్లోకి తెచ్చామని, అయితే కొన్ని విషయాల్లో ఉన్న సమస్యలను సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. తాము సుప్రీంను గౌరవిస్తామని, అయితే తమకు బోర్డు నియమావళి కూడా ముఖ్యమని ఆయన చెప్పారు. ఐపీఎల్‌కు ముందు, తర్వాత 15 రోజుల చొప్పున విరామం ఉండాలని లోధా కమిటీ చెబుతోందని... ఇలాంటి స్థితిలో తాము వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ లేదా ఐపీఎల్‌లలో ఒక దానినే ఎంచుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. చాంపియన్స ట్రోఫీ జూన్ 1నుంచి ప్రారంభం కానుండగా, ఐపీఎల్ మే చివరి వారంలో ముగుస్తుంది. బిజీ షెడ్యూల్లో ఐపీఎల్‌ను వేరే తేదీల్లో నిర్వహించే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. భారత క్రికెట్‌పై ఎంతో ప్రభావం చూపించిన పలు దేశవాళీ జట్లకు ఒకే రాష్ట్రం-ఒకే ఓటు నిబంధన ఇబ్బందులు సృష్టిస్తుందని, అందుకే ఆ సూచనను వ్యతిరేకిస్తున్నట్లు ఠాకూర్ వెల్లడించారు. మరో వైపు బీసీసీఐ అకౌంట్లనుంచి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు డబ్బులు బదిలీ చేయరాదంటూ లోధా కమిటీ రెండు బ్యాంకులను కోరింది. సెప్టెంబర్ 30న ఎస్‌జీఎంలో బీసీసీఐ తీసుకున్న కొన్ని ఆర్థిక పరమైన నిర్ణయాలు సుప్రీం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉన్నాయని, అందు వల్ల దీనికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని లోధా కమిటీ సదరు బ్యాంకులకు లేఖ రాసింది. క్రికెట్ అభివృద్ధి కోసం వివిధ రాష్ట్ర సంఘాలకు ప్రతీ ఏటా ఇస్తున్న రూ. 60 కోట్లకు అదనంగా మరో రూ. 10 కోట్లు ఇవ్వాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. -
పాక్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదు
ముంబై: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌పై దాడులకు తెగబడుతున్న పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తేల్చి చెప్పారు. వాస్తవానికి ఈ ఏడాది చివర్లో ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, రెండు టి20లు జరగాల్సి ఉంది. అయితే వేదిక ఎక్కడో తేల్చే విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాలు ఓ కొలిక్కి రాకపోవడంతో సిరీస్ అటకెక్కింది. ఇప్పుడు తాజా ఉడీ దాడుల నేపథ్యంలో ఠాకూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘పాకిస్తాన్ దేశం ఉగ్రవాదానికి ఊతమిస్తుందనే విషయాన్ని బహిర్గతపరచడం ఇప్పుడు మన ముందున్న లక్ష్యం. అలాంటి దేశంతో క్రికెట్ ఆడడమనే ప్రశ్నే లేదు’ అని ఠాకూర్ స్పష్టం చేశారు. -
పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదు..
న్యూఢిల్లీ : ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌లపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. ఇప్పటికే దౌత్య, వాణిజ్య పరమైన సంబంధాలు దిగజారిపోతుండగా తాజాగా క్రికెట్ కూడా ఆ జాబితాలో చేరింది. భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ బంధానికి అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించే ప్రసక్తే లేదని బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ శుక్రవారం స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని, ఆ దేశంతో క్రికెట్ ఆడే ఆలోచనే లేదని ఆయన తెలిపారు.