పాకిస్తాన్ తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదు..
న్యూఢిల్లీ : ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌లపై తీవ్ర ప్రభావమే చూపుతున్నాయి. ఇప్పటికే దౌత్య, వాణిజ్య పరమైన సంబంధాలు దిగజారిపోతుండగా తాజాగా క్రికెట్ కూడా ఆ జాబితాలో చేరింది. భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ బంధానికి అవకాశం లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. పాకిస్థాన్‌తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించే ప్రసక్తే లేదని బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ శుక్రవారం స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని, ఆ దేశంతో క్రికెట్ ఆడే ఆలోచనే లేదని ఆయన తెలిపారు.