B.Com
-
Chandrababu : జలీల్‌ఖాన్‌కు పెద్దన్న ఎవరో తెలిసిపోయింది
జలీల్‌ఖాన్.. పరిచయం అవసరం లేని పేరు. బీకాంలో ఫిజిక్స్‌తో అపారమైన ఖ్యాతి సంపాదించి అంతులేని ప్రాచుర్యాన్ని పొందిన నాయకుడు. నిజానికి పార్టీ ఫిరాయించిన దాని కంటే ఎక్కువ మైలేజీని తన మాటలతో మూటగట్టుకున్నారు. చరిత్రలో ఫిజిక్స్‌తో అత్యంత ఘనత సాధించిన అల్బర్ట్ ఐన్‌స్టీన్ కంటే తననే ఎక్కువ గుర్తుంచుకునేలా చేశారు జలీల్‌ఖాన్. ఆయన నోటి నుంచి వచ్చిన అణిముత్యాలు ఇవిగో. ఇక చాన్నాళ్లకు జలీల్‌ఖాన్‌కు పెద్దన్నయ్య ఎవరో తెలిసిపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు .. ఇప్పుడు జలీల్‌ఖాన్ కంటే ఓ ఆకు ఎక్కువ చదివానని నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమైన చంద్రబాబు.. పార్టీ పూర్తిగా పతనమవుతున్నా.. లేని ఢాంబికాలకు పోతున్నాడని తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. తన మాటలకు అంతగా క్రెడిబిలిటీ లేకపోవడంతో.. కొత్తగా విజన్ అంటూ మరో పాట అందుకున్నారు. విజన్ 2020కి బదులు ఇప్పుడు విజన్ 2047 పేరిట ఓ ప్రకటన చేశారు. తాజాగా విశాఖలో ‘విజన్-2047’ను ప్రకటించిన చంద్రబాబు.. అదే సభలో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవాలంటూ మతిలేని మాటలు చెప్పారు. ప్రపంచంలో అన్నీ తనకే తెలుసని, కంప్యూటర్ నుంచి మొబైల్ ఫోన్ వరకు తానే కనిపెట్టానని, ఐటీకి తాత అని చెప్పుకునే చంద్రబాబు గురించి ఇన్నాళ్లు ఎల్లో మీడియాలో వీపరీతంగా కలరింగ్ ఇచ్చారు. సత్య నాదెళ్లకు ట్రైనింగ్ ఇచ్చి అమెరికా పంపానని చెప్పుకున్నప్పుడు అవునా అనుకున్నారు కానీ.. చంద్రబాబు చాణక్యం అంతా ఒట్టి డొల్ల అని తెలిసిపోయి ఇప్పుడు నవ్వుకుంటున్నారు. -
ఆర్ట్స్‌లోనే కామర్స్ కూడా.. ఏపీ హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికర కేసు..
సాక్షి, అమరావతి : బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందకు వస్తుందా రాదా అంటూ హైకోర్టు ముందుకు ఓ ఆసక్తికర కేసు వచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగం కిందకే వస్తుందని తీర్పు చెప్పింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు బీకాంను ఈ విభాగం కిందే బోధిస్తున్నాయని గుర్తు చేసింది. బీకాం, ఆర్ట్స్ విభాగం కిందకు రాదనేందుకు ఆధారాలేవీ అధికారులు సమర్పించలేదంది. కామర్స్ కోర్సు ఆర్ట్స్ కిందకు వస్తుందని యూజీసీ సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇచ్చిందని వివరించింది. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్–2) పోస్టుకు బీకాం చదివిన వారు అర్హులు కాదనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. వారు ఈ విధులు నిర్వర్తించలేరన్న అధికారుల వాదనను తోసిపుచ్చింది. నోటిఫికేషన్లో ఈ ఉద్యోగులు ఎలాంటి విధులు నిర్వర్తించాలో ఎక్కడా ప్రస్తావించలేదని, ఆర్ట్స్ నేపథ్యం ఉన్న వారు మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారని కూడా చెప్పలేదంది. క్రీడాకారులు, ఎక్స్ సర్విస్‌మెన్, ఎన్సీసీలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసిన వారికి అవకాశం ఇచ్చారని, వయో పరిమితిని సైతం సడలించారని గుర్తు చేసింది. వీరంతా వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించగలిగినప్పుడు, బీకాం చదివిన వారూ అర్హులవుతారని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సర్టీఫికెట్ల పరిశీలన సమయంలో అనర్హులుగా తేల్చిన అభ్యర్థులను ఆ పోస్టుకు అర్హులుగా పరిగణించాలని అధికారులను ఆదేశించింది. పిటిషనర్లను ఆ పోస్టుకు పరిగణనలోకి తీసుకుని, నియామకాలు చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్ తదితరులతో కూడిన ధర్మాసనం గత వారం తీర్పు వెలువరించింది. విచారణ ద్వారా తేల్చాలన్న సింగిల్ జడ్జి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టుకు పురపాలక శాఖ 2019లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు బీకాం చదివిన వారూ దరఖాస్తు చేయగా, వారిని అధికారులు రాతపరీక్షకు అనుమతించారు. సర్టీఫికెట్ల పరిశీలన సమయంలో బీకాం కోర్సు ఆర్ట్స్, హ్యుమానిటీస్ విభాగం కిందకు రాదని, పోస్టుకు అర్హులు కారని అధికారులు తిరస్కరించారు. దీనిపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అధికారులకు పూర్తిస్థాయి వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది. దానిపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పింది. అభ్యర్థులు పురపాలక శాఖ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించగా, దానిని తిరస్కరిస్తూ కమిషనర్ 2020లో ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. పిటిషనర్లు చదివిన బీకాం కోర్సు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కిందకు వస్తుందో లేదో తేల్చాలని అధికారులను ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. చదవండి: Fact Check: దగా చేసింది ఎవరో తెలియదా రామోజీ ? ఈ అప్పీళ్లపై జస్టిస్ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది. అభ్యర్థుల తరఫున న్యాయవాది జొన్నలగడ్డ సుదీర్ వాదనలు వినిపిస్తూ.. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బీకాం ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కిందకే వస్తుందని యూజీసీ సమాధానం ఇచ్చిందంటూ, ఆ వివరాలను కోర్టు ముందుంచారు. రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలు బీకాంను ఆర్ట్స్ విభాగం కింద పేర్కొంటూ ఇచ్చిన డిగ్రీ సర్టీఫికేట్లను ధర్మాసనం ముందుంచారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, యూజీసీ 2014లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టు అణగారిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిందని, కార్పొరేట్ అకౌంటింగ్ తదితర సబ్జెక్టులు ఈ పోస్టు కింద నిర్వర్తించే విధులకు సరిపోవన్నారు. అందువల్ల పురపాలక శాఖ నిర్ణయంలో ఎలాంటి తప్పులేదని తెలిపారు. -
బీఎస్సీకి బీకామ్ పట్టా: మంత్రి గంటా సీరియస్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదువుకున్న విద్యార్థికి బీకామ్ పట్టా ఇవ్వడంపై మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆంధ్ర వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌తో ఆయన మాట్లాడారు. బీఎస్సీ చదివిన విద్యార్థికి బీకామ్ పట్టా ఎలా ఇచ్చారని ఈసందర్భంగా ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, పట్టా ఇచ్చిన బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన వీసీకి ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే.. బాధ్యులను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం విద్యార్థికి షాక్..! శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి.. టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీబీజెడ్ కోర్సు చేశాడు. 2015లో డిగ్రీ పట్టా కూడా చేతికొచ్చింది. దాన్ని చూసి ఆనందంతో మెరిసిన అతని కళ్లు.. అందులోని వివరాలు చూసి అంతలోనే బైర్లుకమ్మాయి. మార్కుల వివరాల వద్ద సైన్సు సబ్జెక్టులుగానే పేర్కొన్నా.. పైన మాత్రం బ్యాచిలర్ ఇన్ కామర్స్ అని ఉంది. పొరపాటు జరిగిందని గ్రహించిన శ్రీ హరి వెంటనే కళాశాల యాజమాన్యాన్ని సంప్రదిస్తే.. తమకేం సంబంధం లేదని, విశాఖ వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాలని సూచించారు. దీంతో ఆ యువకుడు వర్సిటీ అధికారులను కలిసి.. జరిగిన పొరపాటు గురించి వివరించారు. ‘ఆహా అలా జరిగిందా.. ఏముంది మార్చేద్దాంలే’.. అని చాలా తేలిగ్గా మాట్లాడిన పరీక్షల విభాగం అధికారులు మూడేళ్లయినా తమ తప్పును సరిదిద్దుకోలేదు. బాధిత విద్యార్థిని అదిగో.. ఇదిగో.. అంటూ తిప్పుతూనే ఉన్నారు. ఉద్యోగావకాశమూ పోయె.. సర్టిఫికెట్లో తప్పు కారణంగా శ్రీహరికి ఉద్యానవనశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేజారింది. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఇతని డిగ్రీ పట్టా తిరస్కరణకు గురైంది. బీఎస్సీ అని చెప్పి బీకామ్ సర్టిఫికెట్ ఎలా పెట్టావని సంబంధిత అధికారులు శ్రీహరిని మందలించారు. ‘సార్.. పొరపాటున అలా వచ్చింది.. నేను బీఎస్సీ సీబీజెడ్ చదివానని మొత్తుకున్నా.. సర్టిఫికెట్టే ప్రధానమంటూ అధి కారులు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. పోనీ బీకామ్ సర్టిఫికెట్తో ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కామర్స్‌లో అవగాహన లేదు. దీంతో రెం టికీ చెడ్డ రేవడిలా తన పరిస్థితి తయారైందని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విద్యార్ధి వేదన మాత్రం వర్సిటీ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. -
బీకాంలో ఫిజిక్సు పెట్టించేస్తా..
పార్టీ మీటింగ్‌లో బిజీగా ఉన్నాడు చంద్రబాబు. లోకేష్ వచ్చి గుసగుసగా చంద్రబాబు చెవిలో చెప్పాడు. ‘నాన్నగారూ.. మీరు చెప్పినట్టే అంతా రెడీ చేశాను. పక్క రూంలో ఇద్దరు ఎమ్మెల్యేలు వెయిటింగ్..’‘వస్తున్నా, పద..’ అన్నాడు చంద్రబాబు.చంద్రబాబు ఏం చెప్పాడు? ఎమ్మెల్యేలు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇది తెలియాలంటే ఓ రోజు వెనక్కి వెళ్లాలి.ముందురోజు సాయింత్రం.. మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి కూర్చున్నాడు లోకేష్ బాబు. అతడి గెడ్డం పుచ్చుకుని బతిమాలుతున్నాడు చంద్రబాబు. ‘చూడు నాన్నా.. నువ్వలా మూతి బిగించుకు కూర్చుంటే ఎలా చెప్పు.. ఫేసు మరీ దరిద్రంగా ఉంటుంది.. సమయం చూసుకుని నిన్ను మినిస్టర్‌ని చేస్తానుగా.. కాస్త ఓపిక పట్టు ..‘గంయ్ మన్నాడు లోకేష్. ‘ఏంటి ఇంకా ఓపిక పట్టేది .. ఏడాది నించి అడుగుతూనే ఉన్నా.. అదుగో, ఇదిగో అంటూ నానబెడుతున్నారు. అవతల పుణ్యకాలం మించిపోతోంది. అటుచూస్తే, కేటిఆర్ మంత్రయిపోయి, బుగ్గ కారులో ఝామ్మని తిరిగేస్తూ, కాబోయే సీఎమ్‌గా పేరు తెచ్చేసుకుంటున్నాడు. నేనిక్కడ పార్టీ మీటింగుల్లో తిరుగుతూ ఇలా అఘోరిస్తున్నాను. మీరు చూస్తే మంత్రివర్గ విస్తరణకి రెడీ అయిపోతున్నారు. నా ఊసే ఎత్తరాయే..’ వెక్కుతూ అన్నాడు లోకేష్.చంద్రబాబు పితృ హృదయం పగిలి ముక్కలైంది. ఏరుకుని అతికించుకుంటూ లాలనగా చెప్పాడు. ‘నీకన్నా నాకెవరు ఉన్నారు లోకేష్ బాబూ.. కొంచెం ఓపిక పట్టు , అంతే..! నిన్ను కేటిఆర్ బాబు లెవెల్‌కి తీసుకుపోతా.. అంతకన్నా ప్రత్యేక హోదా కల్పిస్తా..!’ ప్రత్యేక హోదా మాట వినగానే పుచ్చిపోయిన పల్లీ నమిలిన వాడిలా మొహం పెట్టాడు లోకేష్. ‘ఆ ఒక్క మాట అనకండి నాన్నా.. మీకు పుణ్యం ఉంటుంది..’ చేతులు జోడించాడు.‘చిలిపి..’ కిసుక్కున నవ్వాడు చంద్రబాబు.‘అయినా మీకు నా సత్తా ఇంకా అర్థం కావడం లేదు నాన్నగారూ.. నన్నింకా ఎన్నేళ్లు ఓపిక పట్టమంటారు చెప్పండి..’‘ సరే.. ఒక పని చేస్తా.. నువ్వొక ఇద్దరు ఎమ్మెల్యేలని పట్టుకు రా.. అచ్చంగా నీ మనుషుల్నే తీసుకు రా.. ఆ ఇద్దర్నీ మంత్రులుగా తీసేసుకుంటాను.. వాళ్లెవరైనా నాకు ఓకే.. ’ రాజీ మార్గం సూచించాడు చంద్రబాబు. ‘చావుకి పెడితే లంఖనాలకి దిగొచ్చింది’ అని మనసులో అనుకుంటూ, ‘ రేపు సాయింత్రం కల్లా రెడీ చేస్తాను నాన్నగారూ’ అన్నాడు లోకేష్.‘ముందు వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడతా.. కేవలం ఫార్మాలిటి..అంతే ..’ చెప్పాడు చంద్రబాబు.తలూపి వెళ్లిపోయాడు లోకేష్. మీటింగ్‌లోంచి లేచి వెళ్లి తన రూంలో కూర్చున్నాడు చంద్రబాబు.లోకేష్ ఒక ఎమ్మెల్యేని లోపలికి పంపాడు.ఆ ఎమ్మెల్యే వస్తూనే బాబు కాళ్ల మీద పడిపోయే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు పరేంగితజ్ఞుడు. చటుక్కున కాళ్లు వెనక్కి లాక్కున్నాడు. వచ్చిన ఎమ్మెల్యే మరింత పరేంగితజ్ఞుడు. రుద్ద కంఠంతో చెప్పాడు.‘ సార్.. సార్.. మీరు పొరబాటు పడుతున్నారు. నేను మీ కాళ్లు పట్టుకుని మిమ్మల్ని కుర్చీలోంచి లాగేస్తాననుకుంటున్నారేమో.. నా ఉద్దేశం అది కాదు సార్.. తనివితీరా మీ కాళ్లకు దండం పెట్టుకుందామని.. అంతే..అంతే..’చంద్రబాబు మొహం గంటు పెట్టుకుని ఆ ఎమ్మెల్యేని కూర్చోమన్నట్టు గంభీరంగా సైగ చేశాడు. ఎమ్మెల్యే కిక్కురుమనకుండా కూర్చున్నాడు. ‘సరే .. పాయింటుకి వచ్చేద్దాం.. నీకు మినిస్టర్ పోస్టు ఇవ్వాలని మా లోకేషు రికమెండ్ చేశాడు’ అన్నాడు చంద్రబాబు. ఎమ్మెల్యే మెలికలు తిరిగిపోతూ ‘చిత్తం .. చిత్తం’ అన్నాడు. చంద్రబాబు చిరాగ్గా చూసి చెప్పాడు. ‘ముందా మెలికల్ని స్ట్రెయిట్ చేసి తిన్నగా కూర్చుని నేను అడిగిందానికి స్టెయ్రిట్ గా సమాధానం చెప్పు’.ఎమ్మెల్యే బిక్క మొహం పెట్టి ‘అలాగే సార్’ అన్నాడు.చంద్రబాబు గొంతు సవరించుకుని అన్నాడు.. ‘ఇప్పుడు మన కేబినెట్ ఎలాంటి కేబినెట్ అనుకున్నావు? మన మంత్రులందరూ మేలిమి ముత్యాలు.. కోహినూర్ వజ్రాలు అనుకో.. నిన్ను తీసుకుంటే నువ్వు వాళ్లతో సరి సమానంగానయినా ఉండాలి.. లేదా ఓ మెట్టు ఎక్కువైనా ఉండాలి.. ఇప్పుడు చెప్పు’ఎమ్మెల్యే వినయంగా చేతులు కట్టుకుని ‘మన మంత్రులకి నేను ఏమాత్రం తీసిపోను గానండి .. మీరేం అనుకోకపోతే ఒక్క మాటండి..’‘చెప్పవోయ్ పర్వాలేదు ..’ భరోసా ఇచ్చాడు చంద్రబాబు. ‘మన మంత్రుల్ని విమర్శించడం కాదు గాని పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు వాళ్లెవరూ సరిగ్గా స్పందించడం లేదని నాకనిపిస్తోందండి ..’చంద్రబాబు గెడ్డం గోక్కుంటూ ‘ఏంటా కష్ట కాలం? చెప్పు’ అన్నాడు.ఎమ్మెల్యే అటూ ఇటూ చూసి గొంతు తగ్గించి చెప్పాడు – ‘మన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు ఈమధ్య ఒక ఇంటర్వూ్యలో మాట్లాడుతూ బీకాంలో ఫిజిక్సు ఉంటుందని పొరపాటున అనేశారు సార్..’‘అవును.. ఆయన పాపం పొరపాటున నోరు జారితే దాని మీద యాగీ చేసి మన పార్టీ ఇమేజీని కాస్తా డ్యామేజి చేశారు’ విచారంగా అన్నాడు చంద్రబాబు.‘ఆయన పాపం ఏదో అన్నాడే అనుకోండి.. మన మంత్రులు దాన్ని ఏదో రకంగా కవర్ చేయొచ్చుగా’ అన్నాడు ఎమ్మెల్యే. ‘ఆయన అలా అడ్డంగా దొరికిపోయాక ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు’ అన్నాడు చంద్రబాబు.ఎమ్మెల్యే కిసుక్కున నవ్వాడు. ‘సార్.. నేనే గనక మీ కేబినెట్లో విద్యాశాఖగా మంత్రిగా ఉండి ఉంటే పార్టీకి జరిగిన డ్యామేజిని ఇట్టే పూడ్చేసి ఉండేవాణ్ణి’ అన్నాడు.‘అదెలా?’ ఆసక్తిగా అడిగాడు చంద్రబాబు.ఎమ్మెల్యే విజృంభించాడు. ‘సింపుల్ సార్.. జలీల్ ఖాన్ గారు అన్న మాటే నిజం చేస్తా .. ఇమ్మీడియట్‌గా బీకాంలో ఫిజిక్సు పెట్టించేస్తా.. ఆమాటకొస్తే నర్సరీ నుంచి పీజీ దాకా అన్ని క్లాసుల్లో ఫిజిక్సుని సబ్జెక్టుగా పెట్టించేస్తా.. ఆఖరికి మ్యూజిక్ కాలేజీల్లో, వేద పాఠశాలలో కూడా ఫిజిక్సు కంపల్సరీగా చెప్పేటట్టు సిలబస్ తయారు చేయిస్తా.. మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శాస్త్రానికి ఎంత ఇంపార్టెన్సు ఇస్తుందో ప్రపంచానికి చాటి చెబుతా.. ఆ రకంగా ఆ డ్యామేజిని రిపేరు చేసి మన ప్రిస్టేజీని నిలబెడతా ..’ ఆయాసపడుతూ గుక్క తిప్పుకోకుండా చెప్పాడు ఎమ్మెల్యే. చంద్రబాబు కళ్ళు ఆనందంతో చెమర్చాయి. కళ్ళు తుడుచుకుని అన్నాడు.‘బ్రదర్ .. ఇక నువ్వెళ్ళు.. బయట ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన్ని లోపలికి పంపించు..’రెండో ఎమ్మెల్యే లోపలికి గంతులేసుకుంటూ వచ్చాడు. ‘సార్.. మీరేం అడుగుతారో నాకు తెలిసిపోయిందోచ్.. మావాడు కొశ్చెను పేపరు లీక్ చేశాడోచ్..’వెంటనే చంద్రబాబు అందుకున్నాడు. ‘మన ప్రభుత్వంలో ఇది మామూలేనోచ్.. నీ జవాబేదో నువ్వు ఏడువ్వోచ్..’రెండో ఎమ్మెల్యే కూర్చుని స్తిమితపడి అన్నాడు. ‘సార్.. మేలైన జాతి రత్నాల్లాంటి మేధావులతో కిటకిటలాడిపోతున్న మన మంత్రివర్గంలో నాకెందుకు చోటివ్వాలీ అన్నదే కదూ మీ ప్రశ్న? నేను చెప్పేది వింటే మీరు డంగై పోయి ఇప్పటికిప్పుడే ప్రమాణ స్వీకారం చెయ్యమంటారు.. నేను రెడీ అనుకోండి..’‘వెధవ సొద ఆపి పాయింటుకి రా మహాప్రభో..’ విసుగ్గా అన్నాడు చంద్రబాబు.రెండో ఎమ్మెల్యే గొంతు సద్దుకుని ప్రారంభించాడు – ‘సార్.. మన పెద్దాయన, స్పీకర్ కోడెల శివప్రసాదు గారు ఆడవాళ్ల మీద ఏదో ఉపన్యాసం ఇస్తే దాని మీద గొడవైంది కదా సార్..’‘అవునయ్యా.. పెద్దాయన మంచి ఉద్దేశంతోనే ఏదో చెబితే దాన్ని రకరకాలుగా వక్రీకరించారని విన్నాను’ అన్నాడు చంద్రబాబు. ‘పేపర్లలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా రచ్చ రచ్చ అయింది సార్.. అయినా మనకేం పర్వాలేదు సార్.. ఆ సోషల్ మీడియాని ఎంతమంది చూస్తారు లెండి..’‘‘కరెక్టు.. అందుకే నేను దాన్ని‘కంఠ శోషల్ మీడియా’ అంటాను’’ కసిగా అన్నాడు చంద్రబాబు.‘ఏదైనా మన మంత్రులు సరిగ్గా పట్టించుకోలేదు గాని .. అదే నేనే గనక మంత్రినై ఉంటే ఆ పరిస్థితిని మనకి అనుకూలంగా మార్చేసి .. మన ప్రతిష్ట రెండింతలు పెరిగేలా చేస్తాను సార్..’చంద్రబాబుకి ఇంట్రస్టు కలిగింది. ముందుకి వంగి ‘నువ్వు అతడి కంటె ఘనుడిలా ఉన్నావే.. ఏం చేస్తావో చెప్పు..’ అన్నాడు. బాబు ఆసక్తి చూసి రెండో ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. ‘ఆడవాళ్లు వాహనాల్లాంటివాళ్ళనీ, షెడ్డు్డల్లోనే ఉంచితే యాక్సిడెంట్లు అవవని కోడెల గారు అన్నారని కదా ఆ గొడవంతా.. మీరు నన్ను మంత్రిని చేస్తే నేనూ ఆ విషయమే మరోలా చెబుతా .. మనం మన వాహనాల్ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టే మహిళల్ని కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం .. వాహనాలకి యాక్సిడెంట్ ఇన్సూరెన్సు ఉన్నట్టే మహిళలకి కూడా యాక్సిడెంట్ .. అంటే మాన భంగం అనుకోండి .. అలాంటిదేదయినా జరిగితే పరిహారం చెల్లిస్తాం.. వాహనాల బీమాకి ప్రీమియం కట్టాలి గాని ఈ పథకంలో మహిళలు దమ్మిడీ ప్రీమియం కట్టక్కర్లేదు. ప్రభుత్వమే కడుతుంది. ఆడపిల్ల పుట్టినప్పటినుంచే బీమా అమలవుతుంది. ఎటొచ్చీ, వయసు బట్టి పరిహారం రేటు మారుతూ ఉంటుంది. ఆ విధంగా కోడెల గారి మాటని మహిళలకు బంగారు బాటగా మార్చేద్దాం.. ఇంకా చాలా డిటైల్సు వర్కవుట్ చెయ్యాలి సార్.. ప్రమాణ స్వీకారం కాగానే ఆ పనిలోనే ఉంటా..’చంద్రబాబు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు.ఎమ్మెల్యే కంటిన్యూ చేశాడు. ‘సార్.. ఈ పథకానికి మంచి పేరు కూడా పెట్టాను సార్..’చంద్రబాబు తేరుకుని ‘ఏమిటది’ అని అడిగాడు.‘భామ–బీమా పథకం’ తడుముకోకుండా చెప్పాడు ఎమ్మెల్యే ’చంద్రబాబు గుండె ఆనందంతో ఉరకలు వేసింది. తన సంతోషాన్ని మొహం మీద కనబడనివ్వకుండా దాచుకుంటూ, ‘ఇక నువ్వెళ్ళు .. మా లోకేష్ మాట్లాడతాడు’ అన్నాడు. ఎమ్మెల్యేలు వెళ్లగానే లోకేష్ లోపలికి వచ్చాడు. లోకేషుని చూస్తూనే అన్నాడు చంద్రబాబు. ‘వీళ్లలో ఇంత టాలెంటు ఉందని నేనెప్పుడూ అనుకోలేదు.. నువ్వెలా పసిగట్టావో కాని లోకేష్ గుంభనగా నవ్వి ‘నాన్నగారూ .. మీకు అసలు విషయం చెప్పమంటారా?’ అన్నాడు.‘ఏమిటా అసలు విషయం?’ అనుమానంగా అడిగాడు చంద్రబాబు.‘వీళ్ళకి ఈ ఆన్సర్లు చెప్పింది నేనే’ కూల్ గా చెప్పాడు లోకేష్. షాక్ తిన్నట్టు చూశాడు చంద్రబాబు. లోకేష్ తాపీగా చెప్పాడు. ‘అవును నాన్నగారూ.. మీరేం అడుగుతారో నాకు తెలుసు .. ఆన్సర్లు రాసిచ్చి రాత్రంతా వీళ్ళకి ట్రయినింగ్ ఇచ్చా.. కావాలంటే ఇదిగో ఆన్సర్ పేపర్లు.. చూడండి..’ కాగితాలు బయటికి తీశాడు. చంద్రబాబు ఆ ఆన్సర్ షీట్లని, లోకేష్‌ని మార్చి మార్చి చూశాడు. ఆ క్షణంలో చంద్రబాబు కళ్ళకి లోకేష్ కురుక్షేత్రంలో కర్తవ్య బోధ చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడిలా కనిపించాడు.చంద్రబాబు లోకేష్ భుజాలు పట్టుకు ఊపుతూ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘నాన్నా, లోకేష్ బాబూ.. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా గాలించాన్రా .. నీలో ఇంత టాలెంట్ ఉందని గ్రహించక వేరే మంత్రుల కోసం వెతికి పెద్ద పొరపాటే చేశాను. ఇప్పటికైనా నా పొరపాటు దిద్దుకోకపోతే చరిత్రకి తీరని ద్రోహం చేసినవాడిని అవుతాను. వెంటనే నిన్నే మంత్రిగా చేసి నీ సత్తా దశదిశలా చాటుతాను’ పూడుకు పోయిన కంఠంతో చెప్పాడు చంద్రబాబు. – మంగు రాజగోపాల్ mangurajagopal@gmail.com -
బి.కాంలో ఫిజిక్స్‌పై జలీల్‌ఖాన్ అవస్థలు
-
ఐబీపీఎస్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్
ఆకర్షణీయ వేతనాలు, ఆహ్లాదకర పనివాతావరణం, కెరీర్లో చకచకా ఎదిగేందుకు విస్తృత అవకాశాలు.. ఇవే నేటి యువతకు బ్యాంకులో కొలువుదీరడాన్ని లక్ష్యంగా నిర్దేశిస్తున్నాయి. బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ.. చేసిన కోర్సు ఏదైనా ఇప్పుడు చాలా మంది బ్యాంకు ఉద్యోగం లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) గేట్ వే వంటిది. ఇది నిర్వహించే పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులో కొలువును ఖాయం చేసుకోవచ్చు. బ్యాంకు ఉద్యోగ నియామకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఐబీపీఎస్ తాజాగా కొన్ని పరీక్షల విధానాన్ని మార్చింది. వీటిపై స్పెషల్ ఫోకస్.. ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఎస్బీఐ సొంతంగా నియామక ప్రక్రియ చేపడుతోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. అలహాబాద్ బ్యాంకు, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యునెటైడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. వీటి తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పుడు ఐబీపీఎస్ కొన్ని పరీక్షల విధానంలో మార్పులు చేసింది. వీటికి పాత విధానమే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల్లో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్లు; ఆఫీస్ అసిస్టెంట్ నియామకాలకు కామన్ రిటెన్ ఎగ్జామినేషన్(సీడబ్ల్యూఈ)-4ను పాత విధానంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఒకే పరీక్ష నిర్వహిస్తారు.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ వంటి స్పెషలిస్టు ఆఫీసర్ల నియామకాలకు కూడా పాత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. నియామక ప్రక్రియలో ఒకే పరీక్ష ఉంటుంది. ప్రధాన మార్పులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లరికల్ కేడర్, ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రెయినీ నియామకాలకు ఇప్పటి వరకు ఒకే పరీక్ష ఉండేది. ఇక నుంచి రెండు దశల్లో అంటే ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో నిర్దేశ మార్కులు సాధించిన వారిని మెయిన్ రాసేందుకు అనుమతిస్తారు. ఇందులో విజయం సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. తుది జాబితా రూపకల్పనకు ప్రిలిమ్స్ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. సీడబ్ల్యూఈ-5 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుంది. మార్పులెందుకు? ప్రస్తుతం బ్యాంకు పరీక్షలకు ఏటా లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. 2013-14లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని క్లరికల్ పరీక్షలకు 14.24 లక్షల మంది, ఆఫీసర్ కేడర్ పరీక్షలకు 13.19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకే పరీక్ష ఉండటం వల్ల అందులో ఉత్తీర్ణత సాధించిన వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం కష్టమవుతోంది. అందువల్ల పరీక్ష దశలోనే అభ్యర్థులను వడపోసేందుకు ప్రిలిమనరీ, మెయిన్ పరీక్షల విధానాన్ని తెచ్చినట్లు తెలుస్తోంది. మారిన ఫీజు చెల్లింపు విధానం ఇప్పటి వరకు దరఖాస్తు ఫీజును ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో చెల్లించే వెసులుబాటు ఉండేది. ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, మొబైల్ వేలెట్, క్యాష్‌కార్డు ద్వారా చెల్లించవచ్చు. ప్రిపరేషన్ ప్రణాళిక ఐబీపీఎస్ 2015-16లో నిర్వహించనున్న పరీక్షలకు కేలండర్‌ను ముందుగానే విడుదల చేసింది కాబట్టి అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు పటిష్ట ప్రణాళిక వేసుకునేందుకు అవకాశం లభించింది. పరీక్ష విధానం ఏదైనా కష్టపడేవారికి విజయం తథ్యం. ప్రభుత్వరంగ బ్యాంకుల క్లరికల్, పీవో పరీక్షలకు ప్రిలిమినరీ, మెయిన్ రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టినా, పరీక్షల సిలబస్, మార్కులు, సమయం, ప్రిలిమ్స్ నుంచి మెయిన్‌కు ఎందరిని ఎంపిక చేస్తారు తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రిలిమ్స్‌లో రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లపై ప్రశ్నలు ఉండే అవకాశముంది. తక్కువ ప్రశ్నలు ఉండి, స్వల్ప వ్యవధిలో పరీక్ష ముగిసేలా ఉంటుంది. మెయిన్‌లో ఇప్పుడున్న సబ్జెక్టుల నుంచి కొంత క్లిష్టతతో ప్రశ్నలు అడిగే అవకాశముంది. గత సబ్జెక్టులనే కొనసాగించే అవకాశముంది కాబట్టి పరీక్ష విధానంలో మార్పుల వల్ల ఆందోళన చెందనవసరం లేదు. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ముఖ్యం. రోజూ కోచింగ్ తీసుకునే సమయాన్ని మినహాయించి, ఇంటి దగ్గర ప్రిపరేషన్‌కు మూడు, నాలుగు గంటలు కేటాయించాలి. శిక్షణ కేంద్రంలో నిర్వహించే రోజువారీ, వారంతపు పరీక్షలను తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ఏ సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. దానికనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకోవచ్చు. రీజనింగ్‌లో ఎరేంజ్మెంట్, పజిల్ సాల్వింగ్ విభాగాలు చాలా ముఖ్యమైనవి. వీటితో పాటు బ్లడ్ రిలేషన్స్ సమస్యల సాధన కీలకం. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో డేటా ఇంటర్‌ప్రిటేషన్ ముఖ్యమైంది. 8, 9 పాఠ్యపుస్తకాల్లోని అంశాలను ప్రాక్టీస్ చేస్తే క్వాంటిటేటివ్ విభాగంలో అధిక స్కోర్ సాధనకు వీలవుతుంది. ఇంగ్లిష్‌లో కటాఫ్ దాటేందుకు చాలా మంది అభ్యర్థులు ఇబ్బందులుపడుతున్నారు. ఈ పరిస్థితి రాకూడదంటే కాంప్రెహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. దీనికోసం ఇంగ్లిష్ గ్రామర్, రూట్ వర్డ్స్‌పై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ గ్రామర్‌పై పట్టు సాధించడానికి ఇంగ్లిష్ దినపత్రికలు, ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి. ోజూ తప్పకుండా నమూనా పరీక్షలు రాయాలి. గ్రూపుగా ఏర్పడి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది.