వైఎస్ జగన్ దీక్షకు బీసీల మద్దతు: ఉదయ్ కిరణ్
అనంతపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న దీక్షకు బీసీలంతా మద్దతు తెలపాల్సిన అవసరముందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు బేరంగుల ఉదయ్ కిరణ్ పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయంలో బీసీ వర్గీకరణ చేపడతానని చెప్పి అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటతప్పారని ఆరోపించారు. బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు.