to be sworn
-
సర్వం సిద్ధం
- 22న శాసనసభాపక్ష నేతగా ఎన్నిక - 23న జయ ప్రమాణ స్వీకారం చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కోసం నగరం సింగార చెన్నైగా మారిపోతోంది. అమ్మ సీఎంగా ఈనెల 23వ తేదీన ప్రమాణస్వీకారం చేయబోతున్న తరుణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సకల ఏర్పాట్లు సాగుతున్నాయి.ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి జయకు విముక్తి లభించిన రెండు వారాల తరువాత సీఎం పదవిని అధిష్టించడం అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత ఏడునెలలుగా విపక్షాల విమర్శలతో కృంగిపోయిన పార్టీ నేతలు, కార్యకర్తలు గర్వంగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. ఈనెల 23వ తేదీన జయ పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న పార్టీ అధికారికంగా ప్రకటించకున్నా నగరంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తే నిజమేనని నిర్ధారించాల్సి వస్తోంది. ఈనెల 22వ తేదీన శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ ఇప్పటికే ప్రకటించి ఉంది. ఈ సమావేశంలోనే జయను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని తెలిసింది. జయ ఎన్నిక తరువాత ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తన పదవికి రాజీ నామా చేసి గవర్నర్‌కు సమర్పిస్తారు. పార్టీ నేతలు వెంటరాగా 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల తరువాత నగరంలోని పెరియార్, అన్నాదురై, ఎంజీఆర్ విగ్రహాలకు జయ పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. 23వ తేదీన ఉదయం 11 గంటలకు మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ ఆడి టోరియంలో జయ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆడిటోరియం బయటా లోపలా రంగులువేసి తీర్చిదిద్దుతున్నారు. 22, 23వ తేదీల్లో అమ్మ పర్యటించే మార్గాలన్నీ శోభాయమానం చేస్తున్నారు. సచివాలయం, పార్టీ కార్యాలయానికి దారితీసే ప్రధాన రోడ్లన్నీ కొత్తగా కళకళలాడుతున్నాయి. పదవీ ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లపై జయ ఆంతరంగిక సలహాదారులు షీలా బాలకృష్ణన్, రామానుజం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, డీజీపీ అశోక్‌కుమార్, నగర కమిషనర్ జార్జ్ మంగళవారం రాత్రి సమావేశమై సమీక్షించారు. జయ పదవీ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, రవిశంకర ప్రసాద్, ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హాజరవుతున్నట్లు అంచనా. జయతో పాటూ సుమారు 32 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. -
23న తమిళనాడు సీఎంగా జయ ప్రమాణం
-
23న తమిళనాడు సీఎంగా జయ ప్రమాణం
చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి జే జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై ఆశీనులయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23న తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నా డీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఈ విషయాన్ని వెల్లడించారు. 22న అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమై జయలలితను శాసనసభ పక్ష నాయకురాలిగా ఎన్నుకోనున్నారు. ఇదే రోజు తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం పదవికి రాజీనామా చేసి జయకు మార్గం సుగమం చేయనున్నారు. మద్రాసు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆమె ప్రమాణం చేసే అవకాశముంది. చెన్నైలోని ఆర్కే నగర్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ ఇటీవల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జయ ఈ స్థానం నుంచి పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. ఏడు నెలల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జయలలితను దోషీగా ప్రకటించడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి అనర్హురాలయ్యారు. ఇటీవల కర్ణాటక హైకోర్టును కింది కోర్టు తీర్పును నిలుపుదల చేస్తూ జయను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు లైన్ క్లియరైంది. -
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ రాష్ట్రంలో మాంఝీ తన సీఎం పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నితీష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నితీష్ నాల్గోసారి సీఎంగా ఎన్నికయ్యారు. ఆదివారం బీహార్ గవర్నర్ త్రిపాఠీ నితీష్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గోగయ్,బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాంఝీ తదితరులు హాజరయ్యారు. శుక్రవారం గవర్నర్.. నితీష్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. బీహార్ తాజా ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఈ రోజు విశ్వాస పరీక్షకు ముందే పదవికి రాజీనామా చేయడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. బీహార్ అసెంబ్లీలో మెజార్టీ ఉన్న నితీష్ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి లైన్ క్లియరైంది. నితీష్ వారసుడిగా బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాంఝీ జేడీయూతో విభేదించడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మాంఝీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. ఓ దశలో బీహార్ రాజకీయం ఢిల్లీకి చేరింది. ఇలా అనేక మలుపులు తిరిగిన అనంతరం ఈ రోజు రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు ఉన్న నితీష్ చివరకు తన కల నెరవేర్చుకున్నారు. -
22న బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం
పాట్నా: బీహార్ రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ మరోసారి ప్రమాణం చేయనున్నారు. ఆదివారం బీహార్ గవర్నర్ నితీష్ చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్.. నితీష్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. బీహార్ తాజా ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ ఈ రోజు విశ్వాస పరీక్షకు ముందే పదవికి రాజీనామా చేయడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. బీహార్ అసెంబ్లీలో మెజార్టీ ఉన్న నితీష్ ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి లైన్ క్లియరైంది. నితీష్ వారసుడిగా బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాంఝీ జేడీయూతో విభేదించడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీలో తగిన బలంలేని మాంఝీ సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు నిరాకరించడంతో రాజకీయ డ్రామా మొదలైంది. జేడీయూ శాసనసభ పక్ష నేతగా నితీష్‌ను ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నిక చెల్లదని పాట్నా హైకోర్టు తీర్పు ఇచ్చింది. మాంఝీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ ప్రయత్నించినా కార్యరూపం దాల్చలేదు. ఓ దశలో బీహార్ రాజకీయం ఢిల్లీకి చేరింది. ఇలా అనేక మలుపులు తిరిగిన అనంతరం ఈ రోజు రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు ఉన్న నితీష్ చివరకు తన కల నెరవేర్చుకున్నారు.