బ్యుటీషీయన్స్‌కు అబార్డ్ సహకారం
శ్రీ అంజలి బ్యూటీ అసోసియేషన్ ప్రారంభ సభలో డైరెక్టర్ సుబ్బదాసు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : ఆంధ్రాబ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ (అబార్డ్) ద్వారా బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న బ్యుటీషియన్లకు పూర్తి సహకారం అందిస్తామని సంస్థ డైరెక్టర్ సుబ్బదాసు పేర్కొన్నారు. స్థానిక గేదెల నూకరాజు కల్యాణమండపంలో సోమవారం ఉభయగోదావరి జిల్లాల శ్రీ అంజలి బ్యూటీ అసోసియేషన్ ప్రారంభమైంది. ఎలయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నరు మాటూరి మంగతాయారు మాట్లాడుతూ ఎలయన్స్ క్లబ్ తరఫున బ్యుటీషీయన్స్‌కు పూర్తి సహకారం అందిస్తామన్నారు. కార్పొరేటర్లు బాపన సుధారాణి, పిల్లి నిర్మల, ఎలయన్స్‌క్లబ్ నాయకురాలు కొయ్యన కుమారి మాట్లాడారు. అసోసియేషన్ వ్యవస్థాపకురాలు జీవీ లక్ష్మి మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా బ్యుటీషీయన్స్‌కు మరింత వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. అసోసియేషన్ సభ్యులకు బ్యూటీవరల్డ్, బ్యూటీకలెక్షన్స్ వారు డిస్కౌంట్లో కాస్మోటిక్స్‌ను పదిరోజులు పాటు ఇస్తారని తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బ్యూటీ అసోసియేషన్ ఏర్పడిందని తెలిపారు. ఈసందర్బంగా మలబార్‌గోల్డ్ సంస్థ వారు బ్యుటీషీయన్స్‌కు పలు పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. మలబార్‌గోల్డ్ మార్కెటింగ్ మేనేజర్లు ప్రవీణ్‌కుమార్, లక్ష్మీపతి, బ్యూటీ అసోసియేషన్ నాయకురాలు శ్రీదేవి, అనురాధ, ఉష, అధికసంఖ్యలో బ్యుటీషీయన్స్ పాల్గొన్నారు.