beechupally temple
-
త్రినేత్రం
– రూ.2కోట్లతో పుష్కరఘాట్ల వద్ద 500 సీసీ కెమెరాల ఏర్పాటు – 11వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు – జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా కృష్ణా పుష్కరాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జాతీయ రహదారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు 32పుష్కరఘాట్ల వద్ద 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. 11వేల మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జరగనున్న కృష్ణా పుష్కరాలకు జిల్లా పోలీస్‌శాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోనే కృష్ణా పరివాహక ప్రాంతం ఉండటంతో జిల్లాలో పుష్కరఘాట్లకు దాదాపు మూడు కోట్ల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 40నుంచి 45వేల మందికి ఒక సీసీ కెమెరాతో పర్యవేక్షణ చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే జిల్లాలో 32 ఘాట్లను గుర్తించిన అధికారులు, అందులో అత్యంత ముఖ్యమైన 9 ఘాట్లను గుర్తించారు. బందోబస్తుపరంగా ఎక్కడ తగ్గకుండా చూస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాలను పూర్తిగా నిఘా నేత్రంతో పహారా చేయాలని భావిస్తున్న పోలీసులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 32ఘాట్లలో 500సీసీ కెమెరాలు.. గుర్తించిన 32ఘాట్లలో రూ.2కోట్లతో 500సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా పోలీసు అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చి పుష్కరాలకు కావాల్సిన కెమెరాలు, పోలీస్ బలగాలు, భారీ గ్రేడ్స్ ఇతర వాటికి కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వనికి జిల్లా పోలీస్ శాఖ నుంచి ప్రతిపాదన వెళ్లింది. పుష్కరాల కోసం ఏర్పాటు చేసే కెమెరాలు 360డిగ్రీల కోణంలో తిరిగే వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు రూ.70నుంచి 80వేలను ఒక్కో కెమెరాకు ఖర్చు చేసి అత్యంత టెక్నాలజీతో కూడిన నిఘా పెట్టాలని భావిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరిగిన సకాలంలో స్పందించడానికి ఈ కెమెరాలను ఉపయోగించుకోనున్నారు. మొత్తం 500కెమెరాలకు కలిపి రెండు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఏ ప్రదేశంలో ఎలాంటి సంఘటన చొటుచేసుకున్న స్థానిక విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం చేరవేయనున్నారు. జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి రానున్న పుష్కరాల సందర్భంగా జిల్లాలో దాదాపు 185కిలోమీటర్ల పొడవు ఉన్న జాతీయరహదారిపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. హైవేపై అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. బీచుపల్లి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఎలాంటి ఇబ్బంది రాకుండా పోలీసులు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెల రోజుల ముందే నుంచి పుష్కరఘాట్ల పరిసర ప్రాంతాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఘాట్ల సమీపంలో సరికొత్త బారీకేడ్లను వాడుతున్నట్లు తెలుస్తోంది. 11వేల మంది బందోబస్తు పుష్కరాల సమయంలో జిల్లాలో బందోబస్తు నిర్వహించడానికి పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్థానికంగా ప్రభుత్వం ఎక్కువ సంఖ్యలో ఘాట్లు ఏర్పాటు చేయడంతో బందోబస్తు భారీస్థాయిలో ఉండాలని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు వేల పోలీస్ సిబ్బంది ఉండటంతో అదనంగా మరో 8వేల మందిని ఇతర జిల్లాల నుంచి రప్పిస్తున్నారు. సివిల్ పోలీసులతో పాటు పారా మిలిటరీ, ట్రాఫిక్ ఇతర విభాగాలు వారు ఉండనున్నారు. ముఖ్యంగా పుష్కరాల కోసం వచ్చే భక్తుల వాహనాలను పార్కింగ్ స్థలాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బందోబస్తులో 10మంచి అదనపు ఎస్పీలు, 25మంది డీఎస్పీలు, 150మంది సీఐలు, 750మంది ఎస్ఐలు ఉంటారు. -
పుష్కరస్నానంతో పునీతం
అన్ని పాపాలు తొలగిపోతాయి గురుడు కన్యారాశిలో ప్రవేశంతో ‘పుష్కర’ం ప్రారంభం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీచుపల్లి ప్రధాన అర్చకుడు ప్రహ్లాదచారి పుష్కర సమయంలో నదిలో స్నానాలు ఆచరించడం ద్వారా దీర్ఘకాలిక రోగాలు మాయమవుతాయని, కోటి జన్మలలో చేసిన పాపం తొలగిపోతుందని బీచుపల్లి పుణ్యక్షేత్రం ఆంజనేయస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ప్రహ్లాదచారి అంటున్నారు. కృష్ణా పుష్కరస్నానం కోసం రాష్ట్రంలో బీచుపల్లికే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పారు. ఈ క్షేత్రం వద్ద కృష్ణానది దక్షిణ వాయువ్యదిశగా ప్రవహిస్తోందని, మహాబలేశ్వరంలో నది పుట్టిన ప్రాంతం నుంచి హంసల దీవిలో సముద్రంలో కలిసే వరకు ఎక్కడా కృష్ణమ్మ ఇలా ప్రవహించదన్నారు. బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద ఇదే ఎంతో ప్రత్యేకమైనది పేర్కొన్నారు. పుష్కరస్నానం ఆచరించడం వల్ల ¿¶ క్తులకు కలిగే ప్రయోజనాలు, వాటి ఫలితాలు, బీచుపల్లి తదితర అంశాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లో.. – ఇటిక్యాల పుష్కరస్నానంపై భక్తులకు అవగాహన శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసరాయలు బీచుపల్లి పుణ్యక్షేత్రంలో క్రీ.శ.1487లో ఆభయాంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి నిత్యం ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. నేను అర్చకుడిగా ఉన్నప్పటి నుంచి బీచుపల్లి వద్ద మూడుసార్లు కృష్ణా పుష్కరాలు జరిగాయి. ఇప్పుడు నిర్వహించే పుష్కరాలు నాలుగోసారి అవుతాయి. మొదట 1980లో జరిగిన కృష్ణాపుష్కరాలు కేవలం ఆధ్యాత్మిక అవగాహన ఉన్న భక్తులు మాత్రమే పుష్కరాలకు హాజరయ్యారు. 1992లో జరిగిన పుష్కరాలపై భక్తులకు అవగాహన కొరవడి ఎక్కువ సంఖ్యలో రాలేదు. కానీ 2004లో దాదాపు 80శాతం మంది భక్తులకు పుష్కర స్నానంపై అవగాహన వచ్చింది. దీంతో బీచుపల్లిలో ఆ ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజÔó ఖరరెడ్డి పుష్కరాల ప్రారంభోత్సవానికి, ముగింపునకు హాజరయ్యారు. ప్రస్తుతం పుష్కరాలపై భక్తులకు పూర్తి అవగాహన కలిగి ఉండటంతో ఈ ఏడాది 50లక్షల మందికి పైగా బీచుపల్లిలో పుణ్యక్షేత్రంలో పుష్కరస్నానం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దేవతలతో పాటు భక్తుల పుణ్యస్నానం ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం మొదలుతో పుష్కరం ప్రారంభమవుతుంది. అదే నెల 23వతేదీ సూర్యాస్తమయం వరకు భక్తులు పుష్కరస్నానం ఆచరించవచ్చు. గురువు (బృహస్పతి) కన్యారాశిలో ప్రవేశించినప్పుడు పుష్కర సమయం ప్రారంభమవుతుంది. పుష్కర సమయం ప్రారంభంలో ముక్కోటి దేవతలు నదిలో స్నానాలు ఆచరిస్తారు. పుష్కరాలు జరిగే 12 రోజులు... ఒక్కో ప్రత్యేక రోజులుగా ముక్కోటి దేవతామూర్తులు స్నానమాచరించే సమయంలో భక్తులు సైతం పుష్కర స్నానాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. పుష్కర శ్లోకం.. పుష్కరాలలో పాల్గొనే భక్తులు ఈ శ్లోకంను స్మరించుకుంటూ పుణ్యస్నానం ఆచరిస్తే మంచి జరుగుతుంది. ‘గంగేచ యమున చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిమ్ సన్నిబింకుర్’ అంటూ నదిలో స్నానమాచరించే సమయంలో మనసులో స్మరించుకోవాలి. దీంతో అన్ని నదులలో పుణ్యస్నానమాచరించిన ఫలితం దక్కుతుంది. భక్తులు చేయాల్సిన దానాలు.. పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు పుష్కరాలు జరిగే 12రోజుల పాటు భక్తులు దానధర్మాలు చేయాల్సి ఉంటుంది. స్నానమాచరించిన తరువాత ఒకటో రోజు బంగారం, వెండి, ధాన్యం, భూమి, అన్నదానం చేయాలి. రెండోరోజు ఆవు, రత్నాలు, ఉప్పు, మూడోరోజు పండ్లు, కూరలు, బెల్లం, వెండితో చేసిన గుర్రం బొమ్మ, నాలుగో రోజు నెయ్యి, నూనె, తేనె, పాలు, చక్కెర, 5వ రోజు ధాన్యం, పండ్లు, గేదెలు, నాగలి, 6వ రోజు మంచి గంధపు చెక్క, కర్పూరం, కస్తూరి, ఔషధాలు, 7వ రోజు ఇల్లు, వాహనం, కూర్చొనే ఆసనం, 8వ రోజు పూలు, అల్లం, గంధపు చెక్క, 9వ రోజు కన్యాదానం, పిండ ప్రదానం, 10వ రోజు హరిహర పూజ, లక్ష్మిపూజ, నదిపూజ, గౌరిపూజ, 11వ రోజు వాహనం, పుస్తకాలు, తాంబూలం, 12వ రోజు నువ్వులు, మేకలను పేదవారికి దానం చేస్తే పుణ్యం కలుగుతుంది.