benami accounts
-
బినామీ ఖాతాల్లోడిపాజిట్లు కాలేజీ చైర్మన్ అరెస్ట్!
-
బినామీ ఖాతాల్లో డిపాజిట్లు : కాలేజీ చైర్మన్ అరెస్ట్!
విజయవాడ : నల్లడబ్బును మార్చుకునేందుకు ఓ ప్రైవేటు బ్యాంక్ సహకారంతో బినామీ అకౌంట్లు తెరిచి, డిపాజిట్లు చేసిన ఓ కాలేజీ చైర్మన్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ వన్‌టౌన్‌లోని మహాత్మా గాంధీ మహిళా కళాశాల చైర్మన్ కాంతారావు తన వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు వ్యూహాన్ని రచించాడు. అందులో భాగంగా వన్‌టౌన్‌లోని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో కాలేజీ సిబ్బంది పేరుతో బినామీ ఖాతాలు తెరిచాడు. ఆయా ఖాతాల్లో లక్షలాది రూపాయలు డిపాజిట్ చేశారు. దీంతో మహిళా అధ్యాపకుల మొబైల్స్‌కు సొమ్ము డిపాజిట్ అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీనిపై ఓ అధ్యాపకురాలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో సూత్రధారి కాంతారావు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కళాశాల చైర్మన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయనకు సహకరించిన బ్యాంక్ అధికారులతో పాటు దీని వెనక ఎవరెవరు ఉన్నారో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
శ్మశానవాటికపై భూబకాసురుల కన్ను?
ఐదువేల గజాల స్థలాన్ని కాజేయాలని పన్నాగం.. మార్కెట్ విలువ రూ.5 కోట్లకు పైమాటే.. కాపాడాల్సిన వారే కాజేయడానికి సిద్ధమైన వైనం.. విచారణ కమిటీ వేసిన సబ్ కలెక్టర్.. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ వికారాబాద్: ‘కంచే చేను మేసింది’ అనే చందంగా ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వారే కాజేయడానికి సిద్ధమయ్యారు. చట్టబద్ధంగా తప్పించుకునేందుకు అన్ని జాగ్రతలు తీసుకుని, వాటిని ఆక్రమించుకోవడానికి తమదైన శైలిలో భూ బకాసురులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ స్థలాలను భూ బకాసురులు ఆక్రమించుకున్న తరువాత వాటిని చట్టప్రకారం పొందడానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ తప్పించుకుంటున్నారు. ఈ సలహాలు సైతం వారికి మున్సిపల్ యంత్రాంగమే ఇవ్వడం విడ్డూరంగా ఉంది. న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నా.. మున్సిపల్ స్థలాలు పాత శిశుమందిర్ దగ్గర ఉన్న స్థలం, పోలీస్‌స్టేషన్ దగ్గర ప్రభుత్వ టాయిలెట్స్ స్థలం.. ఇలా అనేక ప్రాంతాల్లో మున్సిపల్ స్థలాలను కబ్జా చేసుకుని, వాటిని న్యాయస్థానాల ద్వారా భూ బకాసురులు దక్కించుకొని ఇళ్లు నిర్మించుకుని విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పథకం కింద వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఇటీవల అక్రమార్కులు కొందరు బినామీ పేర్లతో దరఖాస్తులు చేసుకోవడం గమనార్హం. అక్రమ కబ్జాలపై అనేకసార్లు పత్రికల్లో కథనాలు వచ్చినా.. అధికారులు స్పందించకపోవడంతో కాపాడాల్సిన వారే కాసులకు కక్కుర్తి పడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాధుల స్థలంపై భూ బకాసురుల దృష్టి.. రామయ్యగూడ, అంబేద్కర్ కాలనీ దగ్గర ఉన్న ఎంఐజీ, ఎల్ఐజీ సమీపంలోని వికారాబాద్ నుంచి అనంతగిరి పల్లి వైపు వెళ్లే రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 224, 225, 226లో ఐదు వేల గజాలకుపైగా స్థలం ఉంది. దీనిపై భూ బకాసురుల కన్ను పడింది. ప్రభుత్వం ఎంఐజీ, ఎల్‌ఐజీలో ఉంటున్న ప్రజలకోసం శ్మశానవాటిక స్థలాన్ని హోజింగ్బోర్డు కేటాయించింది. ఇప్పటికే చాలామంది సమాధులను ఏర్పాటు చేశారు. మిగిలిన స్థలం మాత్రం హాట్‌కేక్‌లా ఉంటుంది. సమాధుల స్థలానికి రెండువైపులా రోడ్డు మార్గాలున్నాయి. ఈ స్థలం సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల గజాల వరకు ఉంటుందని స్థానిక ఎంఐజీ కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఈ స్థలం గజం విలువ సుమారు రూ.10 వేల నుంచి రూ.16 వేల వరకు పలుకుతుందంటున్నారు. దీంతో భూ బకాసురుల కన్ను దీనిపై పడింది. రోడ్డుకు ఇరువైపులా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయలు తమ స్వంతం అవుతాయని భావించి కొందరు ఆ దిశగా ప్రణాళికను రూపొందించారు. అనుకున్నదే తడువుగా మున్సిపల్ పాలకవర్గంలో ఉన్న కొందరు కీలకనేతలు, రెవెన్యూ విభాగంలో కీలకపోస్టుల్లో ఉన్నవారి అండదండలతో సమాధుల స్థలాన్ని కొల్లగొట్టడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో రికార్డులను పకడ్బందీగా మార్చడానికి ప్రణాళికను రూపొందించారు. సబ్ కలెక్టర్ స్పందించి గ్రేవ్‌యార్డుకు కేటాయించిన ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి భూ బకాసురుల పాలు కాకుండా చూస్తే బాగుంటుందని ఎంఐజీ కాలనీ ప్రజలు కోరుతున్నారు. -
ఘరానా మోసం
43 బినామీ ఖాతాలతో రూ. కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్ ఆలస్యం వెలుగు చూసిన వైనం దర్యాప్తు చేపట్టిన పోలీసులు శివమొగ్గ:బ్యాంక్‌లో బినామీ ఖాతాలు సృష్టించి రూ. కోట్లు కాజేసిన బ్యాంక్ మేనేజర్ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... శివమొగ్గలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరులో మేనేజర్‌గా పనిచేస్తున్న గణపతి ముంగ్రి తన బంధువుల పేరుతో 43 బినామీ ఖాతాలు తెరిచి వీటి ద్వారా రూ. 2.16 కోట్లను స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నగదు మొత్తం బయటి వ్యక్తులకు రుణాలుగా ఇచ్చారని, వాటిని ఇప్పటి వరకు కట్టలేదని ఆడిట్ అధికారుల వద్ద బ్యాంక్ మేనేజర్ బుకాయించాడు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో రికార్డులు పరిశీలిస్తే అసలు విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించి బ్యాంక్ ఏజీఎం ఇటీవల జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని జిల్లా ఎస్పీ రవి.డి.చెణ్ణన్నవర్ సీరియస్‌గా పరిగణించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందుకోసం జిల్లా ఏసీపీ ఎస్.విష్ణువర్ధన్‌ను ఆయన నియమించారు. కాగా, ఈ కుంభకోణంలో బ్యాంక్ సిబ్బంది హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
బినామీ అకౌంట్లతో బీకేర్‌ఫుల్
అపరిచిత వ్యక్తుల స్నేహం అసలే వద్దు.. అనవసర కామెంట్లకు దూరంగా ఉండడమే మేలు.. పర్సనల్ డేటా.. ఫొటోలు అప్లోడ్ చేయొద్దు.. లేదంటే లైఫ్ రిస్క్‌లో పడ్డం ఖాయం ఒక పోస్టింగ్.. ఒక రెక్వెస్ట్ ద్వారా స్నేహితులను సంపాదించుకోవచ్చు. దానిపై పెట్టిన అనవసర కామెంట్ అనర్థాలను తెచ్చిపెట్టవచ్చు. అవును మరి.. ఫేస్‌బుక్‌తో ఉన్న ముప్పు ఇది. ఒక ఫేస్బుక్ అకౌంట్ మనిషి తలరాతను నిమిషాల్లో మార్చేగల శక్తి దానికి ఉంది. ప్రస్తుతం ట్రెండీగా కొనసాగుతున్న ఈ సామాజిక సంబంధాల వేదికతో జాగ్రత్తగా ఉండాల్సిందే..! ఫేస్బుక్.. ఇప్పుడు స్కూల్ పిల్లాడి నుంచి తాతయ్య దాకా అందరూ వినియోగిస్తున్న సామాజిక వెబ్సైట్. చాలామంది యువతీ యువకులైతే ఇందులో ఏదైనా పోస్ట్ చేయకపోతే నిద్ర కూడా పట్టదు.. ఫ్రెండ్స్ నుంచి వచ్చే పోస్టింగ్‌లకు లైక్ కొట్టనిదే పొద్దు పోదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వివిధ అంశాలపై పలు దేశాలను సైతం ప్రభావితం చేసిన శక్తివంతమైన సామాజిక నెట్వర్కింగ్ సైట్‌గా పేరు తెచ్చుకుంది ఫేస్బుక్. అయితే దీని వల్ల లాభాలే కాదు.. నష్టాలూ అదే స్థాయిలో ఉన్నారుు. మొన్నీ మధ్య ఫేస్బుక్లో పరిచయమైన పాకిస్థాన్ యువతికి దేశరహస్యాలను చెప్పేశాడు ఓ జవాన్. ఇలా సామాజిక మాధ్యమాల వల్ల కలిగే నష్టాలు ఏంటి.. వాటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి అంశాలపై ప్రత్యేక కథనం. - న్యూఢిల్లీ ఆ నోట.. ఈ నోట.. ఫేస్బుక్ మాట.. ఫేస్బుక్.. ఈ మధ్యకాలంలో యువత నోట్లో బాగా నానుతున్న మాట. స్నేహితులను ఆన్లైన్లో కలుసుకోవడంతోపాటు ఏ సందర్భమైనా అందరితో పంచుకునేందుకు, శుభాకాంక్షలు తెలుపుకునేందుకు వీలుగా దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. విద్య, సినిమాలు, రాజకీయాలు, సరదా కబుర్లు, జన్మదిన, వివాహ శుభాకాంక్షలు, విషాద సంఘటనలు సందర్భం ఏదైనా ఫేస్బుక్లో ఇట్టే ప్రత్యక్షమవ్వాల్సిందే. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటూ విస్తరించిన సోషల్ నెట్‌వర్క్‌గా ఫేస్బుక్ ప్రాచుర్యం పొందింది. యువత రోజువారీ కార్యకలాపాల్లో ఫేస్బుక్ ఒక భాగమైపోయింది. ఫేస్బుక్లో లాగిన్ అయి ఏదో ఒకటి పోస్టు చేస్తేనే కాస్తంత సరదా... ఓ పనరుుపోరుుందనే ఫీలింగ్ చాలా మంది యువతది. తల్లిదండ్రులు దృష్టి సారించాలి సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తే అదో విజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ దిశగా పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లతో ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే పిల్లలు ఈ వ్యసనానికి బానిసలయ్యే అవకాశం ఉంది. అమ్మాయిలూ.. జర జాగ్రత్త ఫేస్బుక్ అనేది స్నేహానికి వారధి మాత్రమేనన్న విషయాన్ని మరిచిపోయి చాలా మంది దానికి బానిసలవుతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా సెల్‌ఫోన్, కంప్యూటర్ ముందు కూర్చుని పోస్టులు, లైక్‌లు, కామెంట్ల్లుతో కాలం గడిపేస్తున్నారు. ఫేస్బుక్ మాయలోపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసు కుంటున్నా. ఆన్లైన్లో స్నేహం చేయడం వల్ల ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులు పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బినామీ అకౌంట్లతో బీకేర్‌ఫుల్ కొందరు బినామీ పేర్లతో ఫేస్బుక్ అకౌంట్లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్‌లతో ఫ్రిండ్‌షిప్ పెంచుకుని వారితో చాటింగ్ చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా సెలబ్రెటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫ్రెండ్స్‌కు షేర్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇలాంటివన్నీ బినామీ అకౌంట్ల నుంచే పంపుతున్నారు. ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితే గానీ బినామీల సంగతి బయటకు రావడం లేదు. పోలీస్ దర్యాప్తుల్లో నేరాలకు పాల్పడ్డవారిని గుర్తించి ఫేస్బుక్ అకౌంట్ గురించి ఆరా తీసినా చాలా సందర్భాల్లో ఫలితం దక్కడం లేదు. ఇవి అసలే వద్దు.. అందరికీ తెలిసేలా ఫోన్ నంబర్లు, ఇంటి వివరాలు, చిరునామాలు, ఫొటోలు పెట్టొద్దు. తమ కార్యాలయం.. చేస్తున్న ఉద్యోగంపై రహస్య సమాచారాన్ని లీక్ చేయడం ఉండొద్దు. ఒకప్పటి ప్రేమలు, పెళ్లిళ్లపై వ్యాఖ్యలు వద్దు. స్నేహితుల పోస్ట్‌లు.. కామెంట్లపై తీవ్రంగా స్పందించడం.. సవాల్ విసరడం లాంటివి చేయొద్దు. స్నేహితుల ఫొటోలు వారి అనుమతి లేకుండా పోస్ట్ చేయడం మంచిది కాదు. ఆఫీసు విషయూలు.. కుటుంబ సమస్యలు.. పర్సనల్ ముచ్చట్లు వద్దు. వ్యంగమైన చిత్రాలు పెట్టడం.. ఫొటోలు మార్ఫింగ్ చేయడం చేయొద్దు. ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి వినోదాలకు పిలిస్తే వెళ్లడంలాంటివి అసలేవద్దు. రెచ్చగొట్టే.. అవమానపరిచే ఫొటోలకు లైక్‌లు కొట్టడం చిక్కుల్లో పండేందుకేనని గుర్తుంచుకోవాలి. ఏ మేరకు వినియోగించాలి.. స్నేహితులతో టచ్‌లో ఉండడం.. కొత్త స్నేహా లను సంపాదించుకోవడం. ప్రపంచ సమాచార వేదికపై అప్డేట్గా ఉండడం. ప్రపంచంలోని కొత్త, మంచి విషయూలను నేర్చుకోవడం. ఏ ఫొటో, కామెంట్ పోస్టింగ్ చేసినా తమ ఇమేజ్ను పెంచేలా.. నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. ఫొటోలు, కామెంట్స్ పోస్టింగ్ విషయంలో గందరగోళం ఉండరాదు.