Bengali poet
-
వివాదంలో ఏఆర్ రెహ్మాన్
కోల్‌కతా: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహా్మన్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రఖ్యాత బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం రచించిన ప్రఖ్యాత స్వాతంత్య్రోద్యమ గీతం ‘కరార్ ఓయ్ లౌహో కొపట్’ను తాజాగా విడుదలైన బాలీవుడ్ సినిమా పిప్పాలో వాడుకున్నారాయన. దాని ట్యూన్ మార్చడం ద్వారా తమతో పాటు అసంఖ్యాకులైన అభిమానుల మనోభావాలను రెహా్మన్ దెబ్బ తీశారంటూ నజ్రుల్ కుటుంబసభ్యులు శనివారం దుయ్యబట్టారు. ‘‘రెహా్మన్ కోరిన మీదట ఆ గీతాన్ని వాడుకునేందుకు అనుమతించాం. కానీ దాని ట్యూన్, లయ పూర్తిగా మార్చేయడం చూసి షాకయ్యాం’’ అంటూ నజ్రుల్ మనవడు, మనవరాలు తదితరులు మండిపడ్డారు. ‘‘ఈ వక్రీకరణను అనుమతించేది లేదు. తక్షణం ఆ గీతాన్ని సినిమా నుంచి తొలగించాలి. పబ్లిక్ డొమైన్లో కూడా అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవాలి’’ అని వారు డిమాండ్ చేశారు. ట్యూన్ మార్పును నిరసిస్తూ బెంగాలీ గాయకులు, కళాకారులతో కలిసి నిరసనకు దిగుతామని ప్రకటించారు. బెంగాలీలు కూడా దీనిపై భగ్గుమంటున్నారు. రెహా్మన్ వంటి సంగీత దర్శకుడి నుంచి ఇది ఊహించలేదంటూ బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ తదితరులు విమర్శించారు. రెహా్మన్ తీరుపై ఇంటర్నెట్లో కూడా విమర్శల వర్షం కురుస్తోంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో నజ్రుల్ ఇస్లాం గీతాలు, పద్యాలు బెంగాల్లోనే దేశమంతటా మారుమోగాయి. టాగూర్ గీతాల తర్వాత అత్యంత ప్రసిద్ధి పొందాయి. -
బెంగాలీ కవికి జ్ఞాన్‌పీఠ్
శంఖ ఘోష్‌కు పురస్కారం కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఘోష్ న్యూఢిల్లీ: ప్రసిద్ధ బెంగాలీ కవి, విమర్శకుడు శంఖ ఘోష్‌కు ప్రతిష్టాత్మక ‘జ్ఞాన్‌పీఠ్’ పురస్కారం దక్కింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశంలో 2016 సంవత్సరానికి గాను ఘోష్ పేరును ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రముఖ రచయిత నమ్వార్ సింగ్ నేతృత్వంలోని ‘జ్ఞాన్‌పీఠ్ ఎంపిక మండలి’ ప్రకటించింది. గతేడాది గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి జ్ఞాన్‌పీఠ్ దక్కింది. ఈ అవార్డు కింద సరస్వతి దేవి కాంస్య విగ్రహంతో పాటు నగదు బహుమతి అందిస్తారు. ఆధునిక బెంగాలీ కవి, విద్యావేత్త అయిన శంఖ ఘోష్ 1932లో జన్మించారు. ప్రయోగాత్మక కవిత్వ రూపాలతో అరుదైన శైలిలో కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించారు. నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ టాగూర్ రచనలపై ఆయనకు మంచి పట్టుంది. ఆయన కవిత్వం ఆద్యంతం సామాజిక స్పృహ, సందేశాలతో సాగుతుంది. ఎక్కడా విమర్శలకు తావు లేకుండా సున్నితంగా అక్షరాలు పేర్చడంలో ఘోష్ దిట్ట. ఆయన ప్రతిభావంతమైన కవితా పంక్తుల్లో సంఘంలోని రుగ్మతలపై ఆవేదన ప్రతిధ్వనిస్తుంది. ఎన్నో అపురూపాలు... అవార్డులు... 52వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారం అందుకోనున్న శంఖ ఘోష్ కలం నుంచి ఎన్నో అపురూప కవితలు జాలువారాయి. ‘అదిమ్ లతాగుల్మోమే, ముర్ఖా బారో.. సమాజిక్ నే, కబీర్ అభిప్రాయ్, ముఖ్ దేఖే జే బిగ్యాపనే, బాబరర్ ప్రార్థనా’ వంటివి ఘోష్ సృజనాత్మక కవితా సృష్టికి మచ్చుతునకలు. ముఖ్యంగా ఆయన రచించిన ‘డింగులి రాత్‌గులి, నిహితా పటాల్చయా’లు ఆధునిక కవితా స్రవంతికి స్ఫూర్తిగా నిలిచాయి. ఘోష్ రచనలు హిందీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, మళయాళం తదితర భారతీయ భాషలతో పాటు విదేశీ భాషాల్లోకీ అనువాదమయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు నర్సింగ్‌దాస్ పురస్కార్, సరస్వతి సమ్మాన్, రవీంద్ర పురస్కార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులెన్నో ఘోష్ అందుకున్నారు. -
బెంగాలీ రచయితకు జ్ఞానపీఠ్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రముఖ బెంగాలీ కవి శంఖ ఘోష్‌ను దేశ సాహిత్య రంగంలోనే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2016 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వారిలో శంఖ ఘోష్ 52వ వారు. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా భారతీయ జ్ఞాన్‌పీఠ్ ఈ పురస్కారాన్ని అందిస్తోంది. దీన్ని 1961లో ఏర్పాటు చేశారు. శంఖ ఘోష్ ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని చాందీపూర్‌లో జన్మించారు. 2011లో ఆయనకు పద్మభూషణ్ పురస్కారం లభించింది.