benificeries
-
పెన్షనర్ల కష్టాలు...ఈ పాపం చంద్రబాబుదే
-
మండుటెండల సాక్షిగా చంద్రబాబును శపిస్తున్న వృద్ధులు
-
మహిళా బెనిఫిషరీ మాటలకు జగన్ ఫిదా...
-
జగనన్న శాశ్వతంగా ఉండాలి లబ్ధిదారుల ఆనందం
-
థ్యాంక్యూ సీఎం సార్...వైఎస్ఆర్ ఆసరా అక్క చెల్లెమ్మలు
-
నవరత్నాలు పొందిన కుటుంబం
-
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకంతో మహిళల జీవితాల్లో వెలుగులు
-
లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణి చేసిన సీఎం వైఎస్ జగన్
-
YSR ఈబీసీ నేస్తం లబ్ధిదారులతో సీఎం జగన్ ముచ్చట్లు
-
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు లైన్ క్లియర్.. లబ్ధిదారుల ఎంపిక షురూ!
సాక్షి, హైదరాబాద్: గందరగోళంగా తయారైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని దారిలో పెట్టేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు ప్రారంభించింది. పథకం ప్రారంభమైన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు మొదలుపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.29 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినా, లబ్ధిదారుల ఎంపిక జరగకపోవటంతో ఆ ఇళ్లలో గృహప్రవేశాలు లేకుండాపోయిన సంగతి తెలిసిందే. నామమాత్రంగా కొన్ని చోట్ల అధికారికంగా ఇళ్లను కేటాయించటం తప్ప మిగతా చోట్ల అవి ఖాళీగానే ఉన్నాయి. దీంతో కొందరు పేదలు వాటిని బలవంతంగా ఆక్రమించుకోవడంతో ఆ పథకమే గందరగోళంగా మారింది. ఇప్పుడు అధికారికంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రా రంభించాలని నిర్ణయించారు. ఈమేరకు గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంతరెడ్డి బుధవారం గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ గృహసముదాయాల్లో మౌలిక వసతుల కల్పనను వేగిరం చేయాలని ఆదేశించారు. నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లబ్ధిదారుల ఎంపిక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇందులో స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశముంది. లబ్ధిదారుల జాబితా ఇస్తే కేంద్రం నుంచి రూ.12 వేల కోట్లు కేంద్రం ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రానికి పేదల ఇళ్లను మంజూరు చేస్తోంది. ఈమేరకు మొదటి దఫా నిధులు కేటాయించింది. వాటి లెక్కలు సమర్పించే సమయంలో లబ్ధిదారుల జాబితాను కోరింది. ఆ జాబితా ఉంటేనే మలిదఫా నిధులు ఇవ్వాల్సి ఉంటుందని, లేకుంటే ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అలా రాష్ట్రానికి అందాల్సిన రూ.12 వేల కోట్లు నిలిచిపోయాయి. అందుకే వీలైనంత తొందరగా లబ్ధిదారుల జాబితా సిద్ధంచేసి కేంద్రానికి పంపి ఆ నిధులు రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: రామోజీ మీ టూరిజానికి ఆ భూములే కావాలా?: సీపీఎం -
పవన్ కల్యాణ్ పై మండిపడుతున్న గుంకలాం ఇళ్ళ లబ్ధిదారులు
-
జనసేన నాయకులను అడ్డుకున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు
-
స్టేజ్ మీద ఎమోషనల్ అయిన కాపు మహిళ
-
గోతికాడి గుంటనక్కలా పచ్చ విషాన్ని కక్కుతున్న ఈనాడు
-
సొంతింటి కల నెరవేరటంపై సంతోషం వ్యక్తం చేస్తున్నలబ్ధిదారులు
-
Hyderabad: ఆశలు ‘డబుల్’
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో డబుల్ బెడ్రూం ఇళ్లు దశలవారీగా అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం శుక్రవారం బన్సీలాల్‌పేట చాచానెహ్రూనగర్ (సీసీనగర్)లో 264 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనుంది. మురికివాడలు లేని విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా ప్రభుత్వం పేదలు ఉంటున్న ప్రాంతాల్లోనే వారు నివసిస్తున్న ఇరుకు ఇళ్ల స్థానే కొత్తగా డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు ఏ ఆసరా లేని వారికి సైతం డబుల్ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో నిర్మాణం చేపట్టింది. లక్ష్యం 2 లక్షలు.. గ్రేటర్లో 2 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, తొలి దశలో లక్ష గృహాల నిర్మాణానికి అవసరమైన స్థలాలు సేకరించింది. వాటిల్లో స్లమ్స్‌లోని పేదలు నివసిస్తున్న ఇరుకు ఇళ్లను కూల్చివేసి 40 ప్రాంతాల్లో 8,898 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరో 71 ఖాళీ ప్రదేశాల్లో మిగతా 91,102 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. అన్నీ కలిపి మౌలిక సదుపాయాలతో సహా మొత్తం 4,038 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, 2,710 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. మిగతా 1,328 ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉండగా, శుక్రవారం సీసీనగర్లో 264 ఇళ్లను లబ్ధిదారులకు మంత్రులు కేటీఆర్, తలసాని పంపిణీ చేయనున్నా రు. సంబంధిత జిల్లా కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేశాక మిగతా వాటిని పంపిణీ చేయనున్నారు. మౌలిక సదుపాయాల కోసం.. దాదాపు 70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాల పనులు జరగనందునే జాప్యం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. వాటిని పూర్తిచేస్తే లబ్ధిదారులకు పంపిణీ చేయవచ్చని పేర్కొన్నారు. నిధుల లేమి.. ప్రభుత్వం నుంచి సకాలంలో అందాల్సిన నిధులందకపోవడంతో పనులు కుంటుపడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించి రూ. 300 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దాంతో వారిని వేగిరపెట్టే పరిస్థితి లేదు. ఇళ్లు ఇలా.. ► విస్తీర్ణం: 560 చదరపు అడుగులు ► 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, 2 టాయ్‌లెట్స్ ఖర్చు ► డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్‌కు మంజూరైన నిధులు: రూ.8598.58 కోట్లు ► పెరిగిన ధరలు, మౌలిక సదుపాయాలతో వెరసి అంచనా వ్యయం: రూ.9714.59 కోట్లు ► ఇప్పటి వరకు చేసిన ఖర్చు దాదాపు: రూ.6,507 కోట్లు ► పనుల పూర్తికి కావాల్సిన నిధులు: రూ.3,207 కోట్లు ► గ్రేటర్ పరిధిలోని జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి ► డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అందిన దరఖాస్తులు: 6.50 లక్షలు. ► ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై) కింద మంజూరు చేసిన ఇళ్లు: 1,00,781 ► లక్ష ఇళ్లకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ: రూ.1500 కోట్లు. ► ఇప్పటి వరకు అందిన సబ్సిడీ: రూ.800 కోట్లు. కోవిడ్ దెబ్బ.. వాస్తవానికి పనులు చేపట్టిన అన్ని ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, గత సంవత్సరం కోవిడ్ కారణంగా నిర్మాణ కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో పనులు కొంత మేర మందగించినప్పటికీ, తిరిగి జరుగుతున్నాయి. బండ మైసమ్మనగర్‌లో 310 ఇళ్లు కూడా ప్రారంభానికి సిద్ధం చేసినప్పటికీ, లబ్ధిదారుల అభీష్టం మేరకు వచ్చేనెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. – వెంకటదాస్‌రెడ్డి, హౌసింగ్ ఈఈ -
ఆనందోత్సవాల ‘ఆసరా’
సాక్షి, అమరావతి: చెప్పిన సమయానికి చెప్పినట్టుగా.. సరిగ్గా పండుగ సమయంలో వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండో విడత పొదుపు సంఘాల రుణాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అక్కచెల్లెమ్మలు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నృత్యాలు, కోలాటాలు నిర్వహిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాల చుట్టూ ముగ్గులు వేసి, పూలతో అలంకరించి వాటి చుట్టూ కోలాటాలు నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 7.97 లక్షల పొదుపు సంఘాల్లో ఉన్న 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా కింద ఈ ఏడాది ప్రభుత్వం రూ.6,439 కోట్లు చెల్లిస్తోంది. రెండో విడత నగదు చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ నెల 7 నుంచి లబ్ధిదారులతో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 54 మండలాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. 7 నుంచి ఇప్పటివరకు 12 జిల్లాల పరిధిలో మొత్తం 556 చోట్ల ఆసరా వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాల్లో ఘనంగా ఆసరా ఉత్సవాలు.. వైఎస్సార్ ఆసరా కింద రెండో విడత నగదు సాయానికి సంబంధించిన చెక్కులను గురువారం ప్రకాశం జిల్లావ్యాప్తంగా అందజేశారు. త్రిపురాంతకంలో మంత్రి ఆదిమూలపు సురేష్ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా ఆసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో చెక్కులు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా పామర్రులో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, వెలుగు సిబ్బంది సీఎం వైఎస్ జగన్ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు. పెడన మండలంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే జోగి రమేష్.. అక్కచెల్లెమ్మలకు రూ.6,79,88,739 చెక్కును అందజేశారు. విజయనగరం జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ ఆసరా ఉత్సవాలు సందడిగా సాగాయి. రుణమాఫీ చెక్కులను అందుకున్న అక్కచెల్లెమ్మలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. బాడంగి మండలంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చెక్కులు అందజేశారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం గుళ్లపల్లిలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ భరత్ ఆసరా చెక్కులు అందించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతీనగర్‌లో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి ఆసరా చెక్కులు పంపిణీ చేశారు. గూడూరు మునిసిపల్ కార్యాలయం ఆవరణలో సీఎం జగన్ చిత్రపటానికి అక్కచెల్లెమ్మలు క్షీరాభిషేకం చేశారు. -
రుణమాఫీ పేరిట దగా
అర్హులకు చేకూరని లబ్ధి ఉద్యానవన రైతులకు దక్కని ‘మాఫీ’ నూజివీడు రూరల్ : ఉద్యానవన రైతులకు రుణామాఫీ వర్తించకుండా ప్రభుత్వం నిబంధనల పేరిట మోసం చేస్తోందని పలువురు ఉద్యానవన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి, జామ, అరటి, బొప్పాయి, సపోట, దానిమ్మ, కూరగాయలు సాగు చేసిన రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేసినట్లు పాలకులు పదేపదే చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో తమకు న్యాయం జరగలేదని రైతులు అంటున్నారు. జిల్లాలో 6,897 మంది రైతులకు 15.05 కోట్ల మేర రుణమాఫీ జరిగినట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో ఉద్యాన రైతులకు ఆర్థిక ఇబ్బందులతో సావాసం తప్పడం లేదు. కొందరికే లబ్ధి 2013 ఏడాది లోపు ఉద్యానవన పంటలకు పంటరుణాలు తీసుకున్న వారందరూ రుణమాఫీకి అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసిన ప్పటికీ లబ్ధిదారులకు న్యాయం జరగలేదు. జిల్లాలో కేవలం 15 వేల ఎకరాలకు మాత్రమే రుణమాఫీ వర్తింపజేసింది. లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేస్తున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో ఇబ్బందులు వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ రెండూ వేరు వేరు శాఖలు అయినప్పటికీ కుటుంబానికి లక్షన్నర లోపు రుణమాఫీ చేయడంతో చాలమంది రైతులు రుణమాఫీకి అనుర్హులయ్యారు. రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను మాత్రమే ఉన్నతాధికారులు తమకు పంపారని, అర్హుల సమాచార సేకరణ పని తమకు అప్పగించలేదని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు.