best national film
-
ఆస్కార్‌కి భారత్ తరపున ‘విలేజ్ రాక్‌స్టార్స్’
ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ‘విలేజ్ రాక్‌స్టార్స్’ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది. 2019లో జరగబోయే 91వ ఆస్కార్ అవార్డుల నామినేషన్‌కు భారత్ తరపున ఈ అస్సాం చిత్రం ఎంపికైనట్లు తెలిసింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఆస్కార్ అవార్డుకు పోటీపడుతోందని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) శనివారం ప్రకటించింది. 2019 ఆస్కార్ అవార్డుల బరిలో భారత్ నుంచి 28 చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిలో ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో పాటు సంజయ్‌లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’, ఆలియాభట్ ‘రాజీ’, రాణీముఖర్జీ ‘హిచ్కీ’, శూజిత్ సిర్కార్ ‘అక్టోబర్’ చిత్రాలున్నాయి. ఇన్ని భారీ చిత్రాలతో పోటీ పడి ‘విలేజ్ రాక్‌స్టార్స్’ చిత్రం ఆస్కార్ అవార్డు నామినేషన్‌కు ఎంపికైనట్లు ఎఫ్ఎఫ్ఐ తెలిపింది. అస్సాంలోని ఓ మారుమూల పల్లెటూరుకు చెందిన పదేళ్ల అమ్మాయి ‘ధును’కు గిటార్ అంటే ఎంతో ఇష్టం. అంతేకాక తనే సొంతంగా ఓ బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటుంది. ఈ క్రమంలో ధును తనకు వచ్చిన ఇబ్బందులను ఎలా అధిగమించింది.. చివరకు తన కలను ఎలా సాకారం చేసుకుని రాక్‌స్టార్‌గా ఎదిగింది అనేదే ‘విలేజ్ రాక్‌స్టార్స్’ కథ. రీమా దాస్ తెరకెక్కించిన ఈ సినిమా 2018లో ఉత్తమ ఫీచర్ సినిమాగా జాతీయ అవార్డు సాధించింది. అంతేకాక ఈ చిత్రంలో ధును పాత్రలో నటించిన భనిత దాస్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును అందుకుంది. గతేడాది వచ్చిన ‘న్యూటన్’ సినిమాతో పాటు అంతకు ముందు వచ్చిన ‘కోర్ట్’, ‘లయర్స్ డైస్’, ‘విసరానై’, ‘ద గుడ్ రోడ్’ వంటి చిత్రాలు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. కానీ ఒక్క చిత్రం కూడా ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ఫైనల్ ఐదు చిత్రాల్లో నిలవలేదు. చివరిసారిగా 2001లో ‘లగాన్’ చిత్రం మాత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ఫైనల్ ఐదు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతకుముందు 1958లో ‘మదర్ ఇండియా’, 1989లో ‘సలాం బాంబే’ కూడా టాప్ 5కి వెళ్లాయి. కానీ ఇంతవరకూ ఒక్క భారతీయ చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డ్ రాలేదు. -
కనువిందుగా పద్మ అవార్డుల ప్రదానం
-
జాతీయ అవార్డుల విజేతలు వీరే
రికార్డుల మీద రికార్డులు సృష్టించుకుంటూ వెళ్తున్న బాహుబలి సినిమా సిగలో మరో అరుదైన గౌరవం చేరింది. 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమా జాతీయ ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది. దీంతోపాటు జాతీయస్థాయిలో ఉత్తమ స్పెషల్ ఎఫెక్టుల అవార్డు కూడా ఈ సినిమాకే దక్కింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా 600 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో పాటు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికై, తెలుగు సినిమా కీర్తి ప్రతిష్ఠలను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఇంతకుముందు జాతీయ స్థాయిలో శంకరాభరణం సినిమాకు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఇప్పటివరకు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు రావడం ఇదే ప్రథమం. ఇతర జాతీయ అవార్డులు ఇలా ఉన్నాయి... ఉత్తమ నటుడు: అమితాబ్ బచ్చన్ (పికు) ఉత్తమ నటి: కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్) ఉత్తమ దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ కొరియోగ్రాఫర్: రెమో డిసౌజా (బాజీరావు మస్తానీ) ఉత్తమ హిందీ చిత్రం: దమ్ లగాకే హైసా ఉత్తమ తెలుగు చిత్రం: కంచె ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: నీరజ్ ఘేవాన్ (మసాన్) ఉత్తమ స్పెషల్ ఎఫెక్టులు: బాహుబలి ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్ చటర్జీ (బాజీరావు మస్తానీ) ఉత్తమ సహాయనటుడు: సముద్రకని (విసారనై) ఉత్తమ సహాయనటి: తన్వీ అజ్మీ (బాజీరావ్ మస్తానీ) ఉత్తమ బాల నటుడు: గౌరవ్ మీనన్ (బెన్) ఉత్తమ బాలల చలనచిత్రం: దురంతో జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రం: నానక్ షా ఫకీర్ పర్యావరణ పరిరక్షణపై ఉత్తమచిత్రం: వాలియా చారకుల్ల పక్షికల్ ఉత్తమ గాయని: మోనాలి ఠాకూర్ (మోహ్ మోహ్ కే ధాగే.. దమ్ లాగాకే హైసా) ఉత్తమ వినోదాత్మక చిత్రం: బజరంగీ భాయీజాన్ ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: విశాల్ భరద్వాజ్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జుహు చతుర్వేది (పికు), హిమాన్శు శర్మ (తను వెడ్స్ మను రిటర్న్స్) ఉత్తమ కొరియోగ్రఫీ: రెమో డిసౌజా (బాజీరావ్ మస్తానీలో 'దివానీ మస్తానీ' పాట) ఉత్తమ చలనచిత్రం (నర్గీస్ దత్ జాతీయ సమైక్యత పురస్కారం): నానక్ షా ఫకీర్ ఉత్తమ మలయాళ సినిమా: పథేమరి ఉత్తమ సామాజిక చిత్రం: నిర్ణయకం పర్యావరణం పరిరక్షణపై ఉత్తమ చిత్రం: వలియ చిరుకుల్లా పక్షికల్ ఉత్తమ బాలల చిత్రం: దురంతో ఉత్తమ తమిళ సినిమా: విసారనై ఉత్తమ తెలుగు సినిమా: కంచె ఉత్తమ సంస్కృత సినిమా: ప్రియమానసం ఉత్తమ కన్నడ సినిమా: థిథీ ఉత్తమ పంజాబీ సినిమా: చౌథీ కూట్ ఉత్తమ కొంకణి సినిమా: ఎనిమీ ఉత్తమ అస్సామీ సినిమా: కొథానొడి ఉత్తమ హర్యాన్వి సినిమా: సత్రంగి ఉత్తమ ఖాసి సినిమా: ఒనాటా ఉత్తమ మణిపురి సినిమా: ఐబసు యావోహన్బియూ ఉత్తమ మిజో సినిమా: కిమస్ లోడ్ బియాండ్ ద క్లాస్ ఉత్తమ ఒడియా సినిమా: పహడ ర లుహా స్పెషల్ మెన్షన్: 'ఇరుధి సుత్రు'కు గాను రితికాసింగ్