Bhadrakali pond
-
భద్రకాళి చెరువుకు గండి!
సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ అర్బన్/ వరంగల్/ ఖిలావరంగల్/ హనుమకొండ అర్బన్: ఇప్పటికే నీట మునిగి అతలాకుతలమైన వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు శనివారం గండిపడింది. చెరువుకు ఒక్కసారిగా వరద పెరగడంతో.. పోతననగర్ వైపు కట్టకు కోతపడింది. దీంతో పోతననగర్, సరస్వతినగర్ కాలనీల జనం భయాందోళనకు గురయ్యా రు. విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి.. ఈ రెండు కాలనీలతోపాటు కాపువాడ కాలనీ, రంగపేటల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గండిపడిన ప్రాంతంలో వెంటనే మరమ్మతులు చేపట్టారు. చెరువు గండిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్‌లు పరిశీలించారు. కాలనీల ప్రజలను ముందు జాగ్రత్తగా మాత్రమే తరలించామని.. చెరువు గండి కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కాగా.. భద్రకాళి చెరువు శిఖం భూముల్లో ఆక్రమణలే ప్రస్తుత దుస్థితికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పాత రికార్డుల ప్రకారం భద్రకాళి చెరువు విస్తీర్ణం 621 ఎకరాలు అయి తే.. సుమారు41 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు చెప్తున్నారు. ఇంకా నీటిలోనే పలు కాలనీలు..: భారీ స్థాయిలో వరదలతో జలమయమైన వరంగల్ నగరంలో ఇంకా పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. 33వ డివిజన్ సీఆర్‌నగర్, 34వ శివనగర్, 39వ డివిజన్ శాకరాసికుంట కాలనీ రోడ్లపై వరద నీరు పారుతూనే ఉంది. అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఖిలా వరంగల్ అగర్త చెరువుల మత్తడి నీరు మైసయ్యనగర్ మీదుగా శివనగర్‌లోని రహదారులపై పారుతోంది. ఇక మిగతా ప్రాంతాల్లోని కాలనీల్లో వరద తగ్గిపోవడంతో జనం ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ ఇళ్ల నిండా బురద ఉండటం, సామగ్రి అంతా తడిసిపోవడాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌లో వరద నష్టం రూ. 414కోట్లు: వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో భారీ వర్షాలు, వరదలతో ఊహించని విధంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని.. బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.414 కోట్లు నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని మంత్రి తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లా ల్లో 36 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 38 రెస్క్యూ టీమ్‌ల ద్వారా 2,055 మందిని వివరించారు. 207 ఇళ్లు పూర్తిగా, 480 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించినట్టు తెలిపారు. బాధితులు ఆందోళన చెందవద్దని, త్వరలో పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. -
భద్రకాళి చెరువుకు గండి.. వరంగల్‌కు మరో డేంజర్!
సాక్షి, వరంగల్: తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. ఇక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, తాజాగా మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు శనివారం ఉదయం గండిపడింది. పోతననగర్‌వైపు చెరువు కోతకు గురైంది. దీంతో, చెరువులోని నీరు ఉధృతంగా కిందరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో పోతననగర్, సరస్వతి నగర్ కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే, వర్షం లేకపోయినప్పటికీ భద్రకాళి చెరువుకు వరద నీరు భారీగా తరలివస్తోంది. దీంతోనే చెరువు కట్ట కోతకు గురైనట్టు తెలుస్తోంది. ఇక, సమాచారం అందిన వెంటనే మున్సిపల్ కమిషనర్ భద్రకాళి చెరువుకు గండిపడిన ప్రదేశానికి చేరుకున్నారు. చెరువు కట్టను పరిశీలిస్తున్నారు. అనంతరం.. లోతట్టు ప్రాంతాల ప్రజలను కమిషనర్ అప్రమత్తం చేశారు. అనంతరం.. మున్సిపల్ డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఏసీపీ కిషన్ నేతృత్వంలో పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇసుకు బస్తాలతో గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో పోతన నగర్, సరస్వతి నగర్, కాపువాడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇది కూడా చదవండి: శాంతించిన మున్నేరు.. హైదరాబాద్-విజయవాడ హైవే క్లియర్ -
అక్రమాల కట్ట
ట్యాంక్‌బండ్ పనుల్లో నాణ్యతాలోపం నాసిరకం మట్టి వినియోగం వర్షమొస్తే కట్ట కనుమరుగే.. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం ప్రసిద్ధిగాంచిన భద్రకాళి చెరువును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్దనున్న నెక్లెస్‌రోడ్డు తరహాలో భద్రకాళి చెరువులో కట్ట(ఫోర్ షోర్ బండ్) నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంతో గ్రేటర్ వరంగల్‌కు కొత్త శోభ తేవాలని ప్రభుత్వం భావించింది. ఇలాంటి ప్రతిష్టాత్మక పనుల్లో నాణ్యత ఎక్కడా కనిపించడం లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మద్దతు ఉందన్న ధీమాతో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన పనులు చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా పనులు జరిగేలా చూడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. వరంగల్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చారిత్రక నగరాల అభివృద్ధి పథకం(హృదయ్)లో భాగంగా భద్రకాళి చెరువును సుందరీకరించేందుకు రూ.15 కోట్లు కేటాయించారు. చెరువును అభివృద్ధి చేసి... హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డు తరహాలోనే భద్రకాళి చెరువు ముందువైపు కట్ట(ఫోర్ షోర్ బండ్) నిర్మించాలని నిర్ణయించారు. చెరువు కట్టను ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు మొదటి దశలో రూ.2.97 కోట్లు విడుదలయ్యాయి. హృదయ్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం కింద అదనంగా రూ.4.05 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల టెండర్ల నిర్వహణ చిన్ననీటి పారుదల శాఖ అధ్వర్యంలో జరగగా.. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. నాణ్యత లేని పనులు ఫోర్ షోర్ బండ్ పనులకు సంబందించి టెండర్ల ప్రక్రియలోనే నిబంధనల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తే కూడా ఇదే స్పష్టమవుతోంది. అన్ని దశల్లోనూ పనులు టెండరు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. భద్రకాళి చెరువు కట్టను పరిష్టపరిచేందుకు సమీపంలోని రంగసముద్రం చెరువు నుంచి మట్టి తేవాలని నిబంధన ఉంది. రంగసముద్రంలోని చెరువు మట్టి గట్టిగా ఉంటుంది. దూరంలో ఉన్న ఈ చెరువు మట్టిని తెస్తే ఖర్చు ఎక్కువవుతుందనే ఉద్దేశంతో కాంట్రాక్టరు.. భద్రకాళి చెరువులోని బురద మట్టినే తీసి కట్ట నిర్మాణం కోసం వినియోగిస్తున్నాడు. చెరువులోని అడుగు మట్టి(రేగడి) బురదమయంగా ఉంది. ఇలాంటి మట్టిని కట్ట నిర్మాణ కోసం ఉపయోగించడం వల్ల ఫోర్ షోర్ బండ్ నాణ్యత లేకుండా పోతోంది. ఎండాకాలం కావడంతో ఆ మట్టి ఇప్పుడు కొంత గట్టిగా ఉంది. ఒక్క వర్షం పడితే నల్లమట్టి మొత్తం బురదగా మారి కట్ట మొత్తం నీళ్లలోకి జారిపోతుంది. అప్పుడు నెక్లెస్‌రోడ్డు తరహా నిర్మాణం కాదు కదా... అసలు కట్ట ఆనవాళ్లే కనిపించని పరిస్థితి ఉంటుంది. ఇది కాకుండా మట్టి కట్ట నిర్మాణంలో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కట్టను వెడల్పు చేసేందుకు మట్టి పోస్తూ పాత రోలర్‌ను ఉపయోగిస్తే ప్రతి 22సెం.మీటర్లకు, వైబ్రేటర్ రోలర్‌ను ఉపయోగిస్తే ప్రతి 0.45 సెం.మీటర్లు నీళ్లు చల్లుకుంటూ రోలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇదేమీ చేయకుండా ఒకేసారి పెద్దఎత్తున మట్టిపోస్తూ రోలింగ్ చేయ డం వల్ల భవిష్యత్తులో భారీ వర్షాలకు గుంతలు పడే అవకాశాలుంటాయని ఇం జనీరింగ్ నిఫుణులు అంటున్నారు. ఈ పనులు పర్యవేక్షిస్తున్న కుడా ఇంజనీరింగ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పనుల్లో మట్టిపైన మొ రం పోస్తూ నాణ్యత లోపాలను పైకి కనిపించకుండా చేస్తున్నారు. చారిత్రక చెరు వు పనుల్లో ఇన్ని రకాలుగా అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలు తావిస్తోంది. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతి నిధి అండతోనే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.