మాస్టర్ చెఫ్
భక్తి అరోరా.. ఈ సీజన్ మాస్టర్ చెఫ్ ఇండియాకు ఎంపికైన ఏకైక హైదరాబాదీ. ఆ కార్యక్రమంలో ఏడుగురు పార్టిసిపెంట్స్‌లో ఈమె ఒకరు. అందరూ ‘ఝాన్సీ కి రాణి’, ‘భక్తి కి శక్తి’ అని పిల్చుకునే ఈ అమ్మాయి ఫ్లేవర్-ఇ-ఆజమ్ రుచులతో ఇప్పటికే జడ్జెస్ మనసు గెలుచుకుంది. హైదరాబాద్ ఆడిషన్స్‌లో మిస్సయినా... బై నుంచి ప్రయత్నించి, ఎంపికై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
..:: కట్ట కవిత
షోలో పాల్గొన్నవాళ్లందరూ పాకశాస్త్రంలో ప్రవీణులే. అయితే కాంపిటీషన్ వేరు కదా! ఇచ్చిన టైమ్‌లోనే వంటల్ని ది బెస్ట్‌గా చేసి చూపాలి. ఆ టైమ్‌ను ఎలా మేనేజ్ చేస్తున్నామన్నదే ప్రధానం. ఇంట్లో తాపీగా వండటం తప్ప... ఇలా షోస్‌కి వెళ్లింది లేదు కాబట్టి మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే చుట్టూ కెమెరాలు, మనం చేస్తున్న దాన్ని ఎంతో మంది చూస్తున్నారన్న స్పృహ వెరసి కొంత కంగారు. కానీ తరువాత సెట్ అయ్యాను.
కలినరీ స్టూడియో...
కుకింగ్ మీద ప్యాషన్‌తో ఉద్యోగాన్ని సైతం వదిలేసి ముంబైలో ‘బెల్ పెప్పర్’ రెస్టారెంట్ ప్రారంభించాను. కేవలం పార్టీ ఆర్డర్స్ మాత్రమే తీసుకునేవాళ్లం. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో ఓ కేఫ్, కలినరీ స్టూడియో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నా.
అమ్మ పోరు పడలేక..
ఎనిమిదేళ్లప్పటి నుంచే వంట నేర్చుకున్నాను. మా అమ్మ వంట నేర్చుకోమని ఎప్పుడూ నా వెంటపడేది. ‘భవిష్యత్‌లో ఎవరి మీదా ఆధారపడకూడదంటే నువు కచ్చితంగా వంట నేర్చుకోవాలి’ అనేది. అయితే నేను అమ్మాయిని కాబట్టి అలా అనేది అనుకోకండి. ఎందుకంటే మా బ్రదర్‌ను కూడా వంట నేర్చుకోమని పట్టుబట్టేది. అప్పుడు అలా అమ్మ పోరాడి నేర్పిన వంటి ఇప్పుడు ఇలాపనికొస్తోంది.
ఆయన ప్రోత్సాహం...
మాది ముంబై. పెళ్లి తరువాత హైదరాబాద్‌కు షిఫ్టయ్యాం. నా హజ్బెండ్ సురేందర్ మానేకర్ ఆడిషన్స్‌కు వెళ్లాలని నన్ను ప్రోత్సహించారు. నేను కచ్చితంగా ఎంపికవుతానని తన నమ్మకం. తను డయాబెటిక్. దాంతో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న రైస్, పొటాటోస్ ఎక్కువగా తీసుకోకూడదు కదా! అయితే... వాటిని రిప్లేస్ చేస్తూ కొత్త ప్రయోగాలతో వంటలు చేయడం ప్రారంభించాను. నేను వంటల్లో ఆరితేరడానికి అదీ ఒక కారణం.