కట్నం ఇచ్చి మరీ పెళ్లి.. అతడు డబ్బు తీసుకుని వెళ్లిపోతే?: హీరోయిన్
ఈ రోజుల్లో వైవాహిక బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. పెళ్లి ఆల్బమ్ వచ్చేలోపే విడాకులంటున్నారు. దశాబ్దాలు కలిసున్న జంటలు సైతం విడిపోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణి సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే హీరోయిన్ భామ కూడా విడాకులు తీసుకుందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. భర్తతో కలిసున్న ఫోటోలు డిలీట్ చేయడం, తాను సింగిల్ మదర్‌నని ప్రకటించడంతో విడాకులు నిజమేనని అంతా ఫిక్సయ్యారు.కట్నం ఇచ్చి మరీ పెళ్లితాజాగా ఈ నటి పెళ్లి గురించి ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. అమ్మాయిలు పెళ్లెందుకు చేసుకోవాలి? తన దగ్గరున్న డబ్బు కట్నంగా ఇచ్చి మరీ పెళ్లి చేసుకోవాలా? అవసరమే లేదు. పెళ్లయ్యాక ఆ భర్త మనల్ని వదిలేస్తే? మన డబ్బుతో వాళ్లు సుఖంగా బతుకుతారు. కానీ మనం మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తాం. అసలు మన జీవితంలోకి వచ్చేవాళ్లతో మనం ఎలా మసులుకోవాలనేది తెలుసుకునేలోపే అంతా అయిపోతుంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.పెళ్లితో సినిమాలకు దూరంకాగా భామ, అర్జున్ 2020 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత భామ సినిమాలకు గుడ్‌బై చెప్పింది. వీరికి గౌరి అనే కూతురు పుట్టింది. దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భామ తన కూతురే ప్రపంచంగా బతుకుతోంది. నివేద్యం చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన భామ మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో యాక్ట్ చేసింది. తెలుగులో మంచివాడు అనే ఒకే ఒక్క సినిమాలో కనిపించింది.చదవండి: Nawazuddin Siddiqui: సౌత్ సినిమాలు అందుకే చేస్తున్నా..