‘భారత్ -22’ కొత్త ఈటీఎఫ్
న్యూఢిల్లీ: భారత్ -22 పేరుతో కొత్త ఇటిఎఫ్ (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్) ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆయిల్ , ఎనర్జీ, ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, తదితర 22 కంపెనీలు ఇందులో ఉన్నాయి. మొత్తం డివెస్ట్మెంట్ టార్గెట్ రూ.72,500 కోట్ల గా ఉండనుందని జైట్లీ ప్రకటించారు.
ప్రభుత్వం ప్రకటించిన బారత్-22 ఇండెక్స్‌లో మొత్తం 22 కంపనీలు ఉండనున్నాయని ఆర్థికమంత్రి మీడియాకు వివరించారు. అలాగే ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక పెట్టుబడుల విక్రయం రూ.9,300 కోట్ల రూపాయల మేరకు గుర్తించామని చెప్పారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ నుంచి రూ. 72,500 కోట్లను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మరోసారి స్పష్టం చేశారు.
భారత్-22 ఈటీఎఫ్‌లో సెక్టార్ల వారీగా బ్యాంకులు అత్యధికంగా 20.3శాతం. 17.5 శాతం వాటాతో ఎనర్జీ సెక్టార్ రెండవ స్థానంలో ఉంది. వీటిల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి. నాల్కో, ఒఎన్‌జిసి, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, బిపిసిఎల్, కోల్ ఇండియా ఎనర్జీ , దీని తరువాత ఎఫ్ఎంసీజీ, కంపెనీలు, ఐటీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీర్స్ ఇండియా, ఎన్బీసిసిలది 22.6 శాతం వాటా. అలాగే పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎన్టీపిసి లిమిటెడ్, గెయిల్ ఇండియా, ఎన్హెచ్పీసి, ఎన్ఎల్సీ ఇండియా, ఎస్వీజేఎన్ఎన్ ఆరు యుటిలిటీ కంపెనీలు 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. జైట్లీ ఈ ప్రకటన వెంటనే శుక్రవారం నాటి మార్కెట్ ముగింపులో పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆయిల్ అండ్‌గ్యాస్ సెక్టార్ భారీగా లాభపడింది.