bhavani devotees
-
విజయవాడ దసరా ఉత్సవాల్లో ఘోర అపచారం
-
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ ఫొటోలు
-
ఇంద్రకీలాద్రిలో ప్రారంభమైన భవానీ దీక్ష విరమణలు
-
భవానీ దీక్షల విరమణ..ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమణ ప్రారంభమైంది. దాంతో ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే దీక్ష విరమణ ఉత్సవం 29వ తేదీ వరకు కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భవానీ మాలధారులు దీక్ష విరమణకు ఇంద్రకీలాద్రికి తరలిరానున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే భవానీల రాక ప్రారంభమైంది. దీక్ష విరమణ నేపథ్యంలో దేవదాయ శాఖ, పోలీసు, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు దేవస్థాన ఘాట్ రోడ్డు, రాజగోపురానికి రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల తర్వాతే దర్శనం శనివారం తెల్లవారుజామున దుర్గమ్మ మూలవిరాట్‌కు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం అఖండ జ్యోతిని వెలిగించారు. అఖండ జ్యోతిని వెలిగించిన తర్వాత భవానీలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. హోమగుండాల్లో ఉదయం 8.23 గంటలకు అగ్నిప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ భ్రమరాంబ, వైదిక కమిటీ, అర్చకులు పాల్గొన్నారు. అగ్నిప్రతిష్టాపన అనంతరం ఇరుముడుల సమర్పణ ప్రారంభమైంది. నగరానికి భవానీలు శనివారం దీక్ష విరమణ ఉత్సవం ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచే భవానీలు విజయవాడ నగరానికి చేరుకున్నారు. ఉదయం తమిళనాడుకు చెందిన భవానీలు, పలువురు భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా దీక్ష విరమణకు ముందు రోజు తమిళనాడు నుంచి పలువురు భక్తులు ఇంద్రకీలాద్రికి విచ్చేస్తుంటారు. గిరి ప్రదక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు నగరానికి శుక్రవారం చేరుకున్న భవానీలు దుర్గాఘాట్, కనకదుర్గనగర్‌లో విశ్రాంతి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం గిరి ప్రదక్షణ ప్రారంభించారు. గిరి ప్రదక్షణ మార్గాల్లో భవానీలకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురవకుండా పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది భవానీలు గిరి ప్రదక్షణ చేసే కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాలు, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి ప్రాంతాల్లో ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు గిరి ప్రదక్షణ పూర్తి చేసిన భవానీలు వినాయకుడి గుడి వద్దకు చేరుకుని క్యూలైన్ ద్వారా కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. వినాయకుడి గుడి వద్ద క్యూలైన్లోకి చేరిన భవానీలు, భక్తులు అమ్మవారి దర్శనం అనంతరమే బయటకు చేరుకుంటారు. కొండపై మల్లేశ్వర స్వామి ఆలయ మెట్ల మార్గంతో పాటు మహా మండపం మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకుంటారు. మహా మండపం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ఇరుముడులను సమర్పించాల్సి ఉంటుంది. ఇరుముడులను సమర్పించిన అనంతరం నేతి కొబ్బరికాయలను హోమగుండాలలో సమర్పించి, అమ్మవారి ప్రసాదాలను కొనుగోలు చేసుకునేలా కౌంటర్లు ఏర్పాటు చేశారు. భవానీ, పున్నమి స్నాన ఘాట్లల్లో ఏర్పాట్లు భవానీపురం (విజయవాడ పశ్చిమ): భవానీ దీక్ష విరమణ సందర్భంగా గట్టు వెనుక ప్రాంతంలోని భవానీ, పున్నమి ఘాట్లల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భవానీల వాహనాలను (బస్సులు, కార్లు, టెంపోలు) పార్కింగ్ చేసుకునేందుకు భవానీపురంలోని పున్నమి హోటల్ పక్కనగల ఖాళీ ప్రదేశాన్ని నిర్ణయించారు. అక్కడే తలనీలాలు సమర్పించేందుకు కేశఖండన శాల ఏర్పాటు చేశారు. అనంతరం స్నానాలు చేసేందుకు రెండు ఘాట్లల్లో జల్లు స్నానానికి ఏర్పాట్లు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, మరుగుదొడ్లను సిద్ధం చేశారు. భవానీలు తలనీలాలను సమర్పించిన అనంతరం అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పున్నమి హోటల్ వద్ద నుంచి బస్సులను ఏర్పాటు చేసింది. మాస్కు తప్పనిసరి దీక్షల విరమణ ఉత్సవాల ఏర్పాట్లపై దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు శుక్రవారం మీడి యాతో మాట్లాడారు. భవానీలు, భక్తులు తప్పని సరిగా మాస్క్‌లు ధరించి, కోవిడ్ నిబంధలను పాటించాలన్నారు. ఆరోగ్యకర వాతావరణంలో ఇరుముడులను సమర్పించేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తులకు, భవానీలకు దద్దోజనం, పులిహోర ప్యాకెట్ల పంపిణీ చేస్తామని తెలిపారు. ఈఓ భ్రమరాంబ మాట్లాడుతూ దీక్ష విరమణలకు ఐదు లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అంచనావేశామన్నారు. రోజుకు ఆరు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచుతాన్నారు. భవానీ, పున్నమి స్నాన ఘాట్లల్లో భవానీలకు జల్లు స్నానా లకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్.డి.ప్రసాద్, ఈఈ భాస్కర్, పాలక మండలి సభ్యులు కటకం శ్రీదేవి, గంటా ప్రసాద్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కొండపైకి ప్లాస్టిక్ తీసుకురావద్దు: దుర్గాగుడి ఈవో
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించామని, భవానీలెవరూ కొండపైకి ప్లాస్టిక్ కవర్లను తీసుకురావద్దని దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణ కార్యక్రమం ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనుందని తెలిపారు. దీక్షా విరమణ రోజుల్లో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కొనసాగుతుందని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనార్థం ఏడు లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేశారు. బుధవారం నాడు జరిగే కలశ జ్యోతి మహోత్సవానికి జ్యోతుల ఊరేగింపులో హాజరయ్యే భక్తులు ఘాట్ రోడ్డు మీదుగా కాకుండా కనకదుర్గా నగర్ మీదుగా రావాలని విజ్ఞప్తి చేశారు. భవానీల కోసం ఘాట్ రోడ్డు మీదుగా క్యూలైన్లతో పాటు గిరి ప్రదక్షిణ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో భవానీల కోసం మూడు హోమగుండాలను ఏర్పాటు చేశామన్నారు. -
భవానీలతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
-
వెలుగులోకి కేశినేని రమేష్ లీలలు
సాక్షి, విజయవాడ : గురుపీఠం భూ కుంభకోణం నిందితుడు కేశినేని రమేష్ అలియాస్ నవీన్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తీగ లాగాతే డొంక కదిలినట్టుగా రమేష్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. భవానీ గురుపీఠం భూమి అమ్మకం పేరుతో రమేష్ కోటి రూపాయలు ముంచాడు. భవానీ భక్తుల ఆశ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందంటూ రమేష్ అఖిల భారత భవానీ పీఠాన్ని సంప్రదించాడు. ఆ భూమికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు చూపించి విడతల వారీగా వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. అయితే 100 ఎకరాల భూమికి, రమేష్‌కు ఎలాంటి సంబంధం లేదని గుర్తించిన ట్రస్ట్ నిర్వాహకులు కృష్టలంక పోలీసులు అశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం రమేష్, అతని అనుచరుడు సబ్రమణ్యాన్నిఅరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఓ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ కాంట్రాక్టర్ వద్ద రమేష్ పని చేస్తున్నాడు. రమేష్‌పై ఇప్పటికే పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులున్నాయి. అంతేకాక శ్రీకాకుళం మెలియాపుట్టి కురజాడ గ్రామాన్ని దత్తత పేరుతో మోసం చేసినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని గ్రామంలో అప్పలు చేసి తప్పించుకు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ గ్రామంలో శ్రీమంతుడిగా చెలమణి అయిన రమేష్, రెండు నెలలు పని చేయించుకుని గ్రామస్థులకు కూలీ డబ్బులు కూడా ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
దుర్గా ట్రస్ట్‌కు కోటి రూపాయల టోకరా!
సాక్షి, విజయవాడ : భూమి అమ్మకం పేరిట ఓ వ్యక్తి దుర్గా ట్రస్ట్‌కు కోటి రూపాయలు ముంచాడు. భవానీ భక్తుల ఆశ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందని నమ్మ బలికి ట్రస్ట్‌ను మోసం చేసి కటకటాలపాలయ్యాడు. పలు కేసుల్లో నిందితుడైన కేసినేని రమేశ్ అలియాస్ నవీన్ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించి విడతల వారీగా అఖిల భారత భవానీ పీఠం నుంచి డబ్బులు కాజేశాడు. ఈ పీఠానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులు విరాళాలు అందజేశారు. మోసాన్ని గ్రహించిన ట్రస్ట్ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు రమేష్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు పాత నేరస్థుడేనని గుర్తించారు. గతంలో అతనిపై అనేక ఛీటింగ్ కేసులు నమోదయ్యాయని, జైలు శిక్ష కూడా అనుభవించాడని పేర్కొన్నారు. -
విజయవాడలో భవానీల దీక్ష విరమణ
-
జయజయహే మహిషాసుర మర్దిని..
-
ఇబ్బందుల్లో భవానీలు
దూరంగా కేశఖండనశాల ఇరుకిరుగ్గా హోమగుండం సాక్షి, విజయవాడ: దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని మండల కాలం పాటు దీక్షబూని కాలినడకన దుర్గమ్మ దేవస్థానానికి వచ్చే భవానీలు అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో దుర్గాఘాట్‌లో కేశఖండన శాల ఉండేది. ఈ ఏడాది సీతమ్మపాదాల వద్దకు మార్చారు. దీంతో భక్తులు సీతమ్మ వారి పాదాలు వద్ద తలనీలాలు ఇచ్చి కృష్ణానదిలో స్నానాలు చేసి కొండమీదకు చేరుకోవడానికి మహిళలు,పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భవానీ బంధనాలు తీయడానికి స్టాల్స్‌ను ఏర్పాటు చేయలేదు. గతంలో మల్లికార్జున మహమండపం వద్ద ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం కొండపైన అర్చకులు బంధనాలు తీసివేసి అందులోని డబ్బులు అమ్మవారికి చెందనీయకుండా కైకర్యం చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈసారి ఒకే హోమగుండం అదీ మరుగుదొడ్ల వద్ద చిన్నదిగా ఏర్పాటు చేయడంతో గురు భవానీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఇంద్ర కీలాద్రిపై భవానీ భక్తుల ఇక్కట్లు
విజయవాడ : కనకదుర్గమ్మ ఆశీస్సుల కోసం ఇంద్రీకీలాద్రికి సోమవారం భవానీ భక్తులు పోటెత్తారు. తిధి ప్రకారం దసరా ఉత్సవాలు ముగిసినా... భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు. ప్రభుత్వం ప్రకటించిన తేదీ ప్రకారం నేడు దసరా కావడంతో అమ్మవారిని దర్శించడానికి భక్తులు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. దసరా పండుగ రోజు దీక్ష విరమించడానికి భవానీలు వేలాదిగా తరలిరావడంతో క్యూలెన్లు కిక్కిరిసిపోయాయి. మరోవైపు అధికారులు పత్తాలేకపోవడంతో భక్తులు మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా విఐపిల సేవలో అధికారులు తరిస్తున్నారని, సామాన్య భక్తులను పట్టించుకోవట్లేదని విజయవాడలో భవానీలు ధ్వజమెత్తుతున్నారు. పిల్లలు, వృద్ధులతో లైన్లలో గంటలకు గంటలు నిలబడ్డా .. కనీసం మంచినీరు కూడా అందివ్వట్లేదని భక్తులు మండిపడుతున్నారు. సౌకర్యాలు కల్పించడంలో కనకదుర్గ దేవస్థానం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దసరా మహోత్సవాలు ముగియడంతో .. భవానీమాలధారులు, భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. అయితే, రద్దీకి సరిపడా ఏర్పాట్లు చేయకపోవడంతో .. భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.