దూరంగా కేశఖండనశాల
ఇరుకిరుగ్గా హోమగుండం
సాక్షి, విజయవాడ: దుర్గగుడి అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని మండల కాలం పాటు దీక్షబూని కాలినడకన దుర్గమ్మ దేవస్థానానికి వచ్చే భవానీలు అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో దుర్గాఘాట్‌లో కేశఖండన శాల ఉండేది. ఈ ఏడాది సీతమ్మపాదాల వద్దకు మార్చారు. దీంతో భక్తులు సీతమ్మ వారి పాదాలు వద్ద తలనీలాలు ఇచ్చి కృష్ణానదిలో స్నానాలు చేసి కొండమీదకు చేరుకోవడానికి మహిళలు,పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
భవానీ బంధనాలు తీయడానికి స్టాల్స్‌ను ఏర్పాటు చేయలేదు. గతంలో మల్లికార్జున మహమండపం వద్ద ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం కొండపైన అర్చకులు బంధనాలు తీసివేసి అందులోని డబ్బులు అమ్మవారికి చెందనీయకుండా కైకర్యం చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈసారి ఒకే హోమగుండం అదీ మరుగుదొడ్ల వద్ద చిన్నదిగా ఏర్పాటు చేయడంతో గురు భవానీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.