Bhogi fire
-
భోగి మంటలతో .. కూటమి సర్కార్‌పై వినూత్న నిరసన
విశాఖపట్నం/ విజయవాడ, సాక్షి: ఏపీలో ఇవాళ భోగి మంటలతో కూటమి సర్కార్‌కు నిరసన ఎదురైంది. ఇందులో భాగంగా.. స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగులు వినూత్న నిరసనకు దిగారు. యాజమాన్యం ఇచ్చిన కార్మిక వ్యతిరేక సర్క్యులర్లను భోగి మంటల్లో వేసింది పోరాట కమిటీ.కూటమి ప్రభుత్వ తీరుకి నిరసనగా అడ్మిన్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. విజయవాడలో భోగి పండుగ వేళ సీపీఎం వినూత్న నిరసనకు దిగింది. భోగిమంటల్లో కరెంట్ బిల్లులు వేసి తగలబెట్టింది. తక్షణమే ప్రజల పై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు , రాష్ట్రకార్యవర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, రాష్ట్ర నేత దోనేపూడి కాశీనాధ్ తదితరులు పాల్గొన్నారు. ‘‘విద్యుత్ బిల్లుల భారాలకు వ్యతిరేకంగా భోగి మంటల్లో బిల్లులను దహనం చేశాం. తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలి. విద్యుత్ భారాలు ప్రజల పై లేకుండా చూడాలి. డిస్కంలు అప్పులు పాలైతే ప్రజల నుంచి వసూళ్లు చేస్తారా?. .. ఈ సంక్రాంతి పండుగకు ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు ఇవ్వలేదు. P4 విధానం తెస్తున్నామని చంద్రబాబు గొప్పగా చెబుతున్నారు. P4 విధానం అంటే ప్రజల ఆస్తులను ప్రైవేటు పరం చేయడమే. రాష్ట్రాన్ని సంపన్నం చేయడం కాదు.. సంపన్నులకు దోచి పెట్టడమే చంద్రబాబు విధానం. అనిల్ అంబానీ దివాలా తీసిన పారిశ్రామిక వేత్త. అటువంటి వారితో పెట్టుబడులు ఎలా పెట్టిస్తారు?. దివాలా తీసిన వారితో పెట్టుబడులు పెట్టించడమంటే రాష్ట్రాన్ని దివాలా తీయించడమే!. ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇస్తే... మళ్లీ దోపిడీనే. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
భోగి వైభోగం
సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ భోగి. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. కర్రపుల్లలు, పిడకల దండలు, పాత సామాన్లు, కొబ్బరిమట్టలు... లాంటివాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. పాత వస్తువులతో పాటు, మనుషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆరోజు నుంచి కొత్త ఆయనంలోకి, కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచనగా భావిస్తారు. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ రోజున భోగి మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి తోటి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలికాచుకుంటూ కోలాహలంగా కనిపిస్తారు. సైన్సుపరంగా చెప్పాలంటే, చలికాలం వాతావరణంలో సూక్ష్మక్రిములు అభివృద్ధి చెందడానికి అనువైన కాలం. అందువల్ల అందరూ ఏకకాలంలో భోగిమంటలు వేయడం వల్ల సూక్ష్మక్రిములన్నీ నశించిపోయి అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అదేవిధంగా ఎప్పటెప్పటి నుంచో మూలన పడి ఉన్న పాత సామానును ఏడాదికోసారి ఈ విధంగా వదిలించుకోవడం వల్ల దుమ్ము, ధూళి, ఎలుకలు, వాటిని తినడానికి పాములు చేరకుండా ఉంటాయనేది పెద్దల మాట. భోగం అంటే పిల్లలకు భోగం చేయడం. పిల్లలకు భోగిపళ్లు పోసేటప్పుడు రేగు పళ్లు, రాగి పైసలు, పువ్వులు మూడిటినీ కలిపి తలచుట్టూ మూడుసార్లు తిప్పి తలమీద పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగ ముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూలరేకలు అన్నీ కలిపి పోస్తారు. దీనివల్ల దృష్టి దోషం పోతుందని విశ్వాసం. పిల్లలు కూర్చునే పీటకింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరవాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు. చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో ఆరోగ్యానికి ఉపకరించే మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క ఇస్తారు. మన పండుగల వెనుక సంప్రదాయంతోపాటు ఆరోగ్య కోణమూ దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగా వస్తున్నాయి.వస్తు వ్యామోహానికి మంటమనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరూ వినరు కాబట్టి భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. ఇక పోతే, భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదని దాని అర్థం. రేగుపండ్లు శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఆకలి పుట్టిస్తాయి. రేగుపండ్లకున్నప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. మహా భక్తురాలైన గోదాదేవి భోగినాడే రంగనాథుని పతిగా పొందిందని ద్రవిడ వేదం చెబుతోంది. అందువల్ల విష్ణ్వాలయాలలో భోగిరోజు గోదా రంగనాథులకు కల్యాణం జరిపిస్తారు. – డి.వి.ఆర్. -
బంగార్రాజు సంక్రాంతి బరిలోకి దిగితే.. ఖేల్ ఖతం త్వరలో...
-
అబ్బుర పరచిన భారీ భోగిదండ
తాళ్లరేవు (ముమ్మిడివరం): చొల్లంగిపేట శ్రీవివేకానంద ఇంగ్లిషు మీడియం హైసూ్కల్ విద్యార్థులు తయారు చేసిన భారీ భోగిదండ అందరినీ అబ్బురపరచింది. నెల రోజులుగా విద్యార్థులు ఆవుపేడను సేకరించి, ఎంతో శ్రమించి ఈ దండను తయారు చేసినట్లు ప్రిన్సిపాల్ ఎంబీ శంకర్ తెలిపారు. సుమారు లక్షా పది వేలకు పైగా పిడకలతో, సుమారు 1100 మీటర్లు పొడవుతో ఈ భోగిదండ ఉన్నట్లు తెలిపారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా శనివారం ఈ దండను విద్యార్థులు గ్రామంలో ప్రదర్శించారు. ఈ దండను 300 మందికిపైగా విద్యార్థులు గ్రామంలో ప్రదర్శించి అనంతరం భోగిమంటలో వేశారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన పెద్ద పండుగ విశిష్టతను నేటి తరం వారికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ భారీ భోగిదండను తయారు చేసినట్లు స్కూల్ చైర్మన్ కందెళ్ల గంగబాబు తెలిపారు. -
కూకట్‌పల్లిలో భోగి సంబరాలు
-
భోగి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కవిత
-
భోగి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కవిత
హైదరాబాద్: భాగ్యనగరంలో ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి. నగరంలో ప్రతి ఏరియాలో భోగి సంబరాలు జరుపుకుంటున్నారు. నగర ప్రజలు భోగి పండుగను భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకున్నారు. కేబీఆర్ పార్క్‌లో జరిగిన భోగి మంటల వేడుకలో ఎంపీ కవిత పాల్గొన్నారు. గతాన్ని భోగి మంటల్లో కాల్చేద్దాం.. కొత్త ఆశలు, ఆశయాలను ఆహ్వానిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కూకట్పల్లి మలేసియ టౌన్షిప్, ఇతర ప్రాంతాలలో కూడా భోగి మంటలు ఏర్పాటుచేసి నగర ప్రజలు వేడుకగా సంక్రాంతి పండుగకు ఆహ్వానం పలికారు. -
భోగి వేడుకలో ఘర్షణ, మహిళ మృతి
నెల్లూరు: భోగి మంటల సంబరం ఓ మహిళ మృతికి దారి తీసింది. తడ మండలం తడ కండ్రిగలో భోగి మంటల వేడుకలో మహిళల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రరూపం దాల్చింది. దాంతో మహిళల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో మనెమ్మ అనే మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
టి బిల్లు ప్రతులను భోగిమంటల్లో తగలబెట్టిన బాలినేని
-
భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం.
-
భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం
-
భోగిమంటల్లో తెలంగాణ బిల్లు దహనం
రాష్ట్ర విభజన సెగను సీమాంధ్రులు భోగి మంటల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చూపించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పీపీఆర్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భోగి మంటల్లో రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఆధ్వర్యంలో టీ.బిల్లును దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో నేతలు బషీర్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, టీడీపీ నేత కరణం బలరాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో నేతలు మాట్లాడుతూ దేశంలోనే తొలి భాష ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజించిందన్నారు. సీమాంధ్రకు చెందిన ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుండా విభజించిందని మండిపడ్డారు. ఇక సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడలో భోగి మంటలలో బిల్లు ప్రతులను తగలబెట్టారు. గుంటూరులో టీడీపీ నాయకులు కూడా ఇలాంటి నిరసనే తెలియజేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో కూడా సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు టీ బిల్లును తగలబెట్టారు.