నెల్లూరు: భోగి మంటల సంబరం ఓ మహిళ మృతికి దారి తీసింది. తడ మండలం తడ కండ్రిగలో భోగి మంటల వేడుకలో మహిళల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రరూపం దాల్చింది. దాంతో మహిళల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో మనెమ్మ అనే మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.