Bhoomana Karunakar Reddy
-
నైతిక విలువలు లేని బాబును నమ్మకండి
అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారు మతతత్వ పార్టీ అని అభివర్ణించిన బీజేపీతోనే పొత్తు బాబు పాలనలో ముస్లిం, మైనారిటీలకు రక్షణ కరువు జగనన్నతోనే అన్ని వర్గాల అభ్యున్నతి ప్రజాబాటలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: నైతిక విలువలు లేని చంద్రబాబు అధికారం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటారని, ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి వెనకాడరని వైఎస్ఆర్ సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. తిరుపతి పరిధిలోని కొర్లగుంటలో పార్టీ నాయకుడు పీ అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ బీజేపీ మతతత్వ పార్టీ అని, ముస్లిం, మైనారిటీలను ఊచకోత కోసిన నరహంతకుడు నరేంద్రమోడి అన్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. కనీస నైతిక విలువలు లేని చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని హెచ్చరించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నరేంద్రమోడి ఎలా చెబితే అలా ఆడే గంగిరెద్దులా మారుతారని, దీంతో మైనారిటీలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుందన్నారు. కలసికట్టుగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలనుకున్న సోనియాగాంధీకి పూర్తి సహకారం అందించిన ద్రోహులు కిరణ్, చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. వీరితో పాటు సోనియాగాంధీకి బీజేపీ అండగా నిలిచిందన్నారు. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబును సీమాంధ్రులు క్షమించరని చెప్పారు. మహానేత పేదల సంక్షేమం ఆకాంక్షించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తండ్రి ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతున్న నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. జగనన్న అధికారంలోకి రాగానే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో తిరిగి అందిస్తారన్నారు. ప్రజలంతా ఆలోచించి ఫ్యాను గుర్తుకు ఓటేస్తే ఐదేళ్ల పాటు ఎవరికీ ఎలాంటి కష్టం రానివ్వకుండా జగనన్న చూసుకుంటారని చెప్పారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే జగనన్న నాయకత్వం కావాలా? లేదా అధికారం కోసం ఉత్తుత్తి హామీలు ఇచ్చి వంచించే చంద్రబాబునాయుడు కావాలా ? అనే విషయాన్ని ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని కోరారు. తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే తిరుపతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చేస్తానని చెప్పారు. పార్టీ నాయకులు పులుగోరు ప్రభాకరరెడ్డి, ఎస్కే బాబు, కేతం జయచంద్రారెడ్డి, పోతిరెడ్డి వెంకటరెడ్డి, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, ఎస్గడీ. శేఖర్, ఎస్కే ముస్తఫా, శ్రీనివాసులురెడ్డి, దేవదానం, మబ్బు మధుసూదన్‌రెడ్డి, రాజేష్, బాల, పీపీ చావడి రఫీ, కల్యాణి, రత్నమ్మ పాల్గొన్నారు. -
జగనన్నతోనే మహిళాభ్యున్నతి
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ‘మాట తప్పని.. మడమ తిప్పని’ వంశం నుంచి వచ్చిన వైఎస్. జగనమోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే మహిళాభ్యున్నతి జరుగుతుందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి పరిధిలోని పార్వతీపురం లెనిన్‌నగర్‌లో పార్టీ నాయకుడు మల్లం రవిచంద్రారెడ్డి, షాజు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ప్రజాబాట నిర్వహించారు. సాయంత్రం కొర్లగుంట మారుతీనగర్‌లో పార్టీ నాయకుడు పి. అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాబాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్‌కోసం మొదటి సంతకం చేశారన్నారు. ఆయన తనయుడు వైఎస్. జగన్మోహన్రెడ్డి సైతం అధికారంలోకి రాగానే ప్రపంచ చరిత్రలో నిలిచిపోయేటన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారని తెలిపారు. తొమ్మిదేళ్ల చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలు పడరాని కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వ పార్టీ బీజేపీ, నరహంతకుడు నరేంద్రమోడి అని అభివర్ణించిన చంద్రబాబు నేడు అధికారం కోసం ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకుని తన దిగజారుడు రాజకీయాలు చాటుకున్నారన్నారు. అన్నదమ్ముల్లా కలసికట్టుగా ఉన్న తెలుగుజాతి ముక్కలు కావడానికి ముఖ్యకారకులు కిరణ్, చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గులు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగేందుకు సిగ్గుపడాలన్నారు. కేవలం జగనన్న అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలతో పాటు ముఖ్యంగా తాము అభివృద్ధి చెందుతామని మహిళలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. రాజన్న రాజ్యం తిరిగి జగనన్నతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్ సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్కే. బాబు, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, కట్టా జయరాంయాదవ్, పుల్లయ్య, జ్యోతిప్రకాష్, తాల్లూరి ప్రసాద్, దేవరాజులురెడ్డి, మోహన, భగీరథరెడ్డి, ముత్తువల్లి రసూల్, గోపాల్‌రెడ్డి, పీపీ చావడి రఫీ, బాల మునిరెడ్డి, నాగేంద్ర, పుణీత, శ్యామల, శాంతారెడ్డి, కృష్ణవేణమ్మ పాల్గొన్నారు. -
'వచ్చే పదేళ్లు శ్రీవారికి జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు'
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని భూమన మండిపడ్డారు. దేవుని సన్నిథిలో రాజకీయాలు దారుణమన్నారు. వైఎస్ జగన్ ఆదరణను తగ్గించాలని చూడాలనుకుంటే చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు తరం కాదని భూమన అన్నారు. 'రాబోయేది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం. వచ్చే పదేళ్లు ప్రతి సంవత్సరం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. దేవుణ్ని రాజకీయాలకు వాడుకుంటే నీ పాపం పండుతుంది అని భూమన అన్నారు. బాబు పాలన మొత్తం అవినీతిమయమని, అందుకే అలిపిరి ఘటన జరిగిందని, అ సంఘటన దేవుడు ఇచ్చిన హెచ్చరిక లాంటిందని భూమన తెలిపారు. సోనియా ఇటలీ మహిళ, అయితే ఆమెకు ఎప్పుడైన తిరుమలలో డిక్లరేషన్ అడిగారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ చిన్ననాటి నుంచి తిరుమలకు వస్తున్నారని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని భూమన నిలదీశారు.