'వచ్చే పదేళ్లు శ్రీవారికి జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు'
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని భూమన మండిపడ్డారు. దేవుని సన్నిథిలో రాజకీయాలు దారుణమన్నారు. వైఎస్ జగన్ ఆదరణను తగ్గించాలని చూడాలనుకుంటే చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు తరం కాదని భూమన అన్నారు.
'రాబోయేది వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం. వచ్చే పదేళ్లు ప్రతి సంవత్సరం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. దేవుణ్ని రాజకీయాలకు వాడుకుంటే నీ పాపం పండుతుంది అని భూమన అన్నారు.
బాబు పాలన మొత్తం అవినీతిమయమని, అందుకే అలిపిరి ఘటన జరిగిందని, అ సంఘటన దేవుడు ఇచ్చిన హెచ్చరిక లాంటిందని భూమన తెలిపారు. సోనియా ఇటలీ మహిళ, అయితే ఆమెకు ఎప్పుడైన తిరుమలలో డిక్లరేషన్ అడిగారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ చిన్ననాటి నుంచి తిరుమలకు వస్తున్నారని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని భూమన నిలదీశారు.