bhuta singh
-
నేడే భారత్ బంద్
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా రవాణా సేవలపై ప్రభావం పడుతుందని అంచనా. అయితే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు, పాండిచ్చేరిలో మాత్రం భారత్ బంద్ లేదు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన ప్రకారం శుక్రవారం ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు దేశవ్యాప్తం గా బంద్ నిర్వహిస్తారు. రవాణా సేవలను బంద్ సందర్భంగా అడ్డుకుంటామని రైతు నేత బల్బీర్ సింగ్ చెప్పారు. పలు ట్రేడ్ యూనియన్లు, సంఘా లు తమ బంద్‌కు మద్దతు తెలిపాయన్నారు. అంబులెన్స్, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సేవలను మాత్రం అడ్డుకోమని తెలిపారు. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్ తెలిపారు. పాలు, కూరల రవాణాను కూడా అడ్డుకుంటామని కిసాన్ మోర్చా నేత దర్శన్ పాల్ చెప్పారు. మేం పాల్గొనం రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో తాము పాల్గొనమని అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య ప్రకటించింది. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని సమాఖ్య పేర్కొంది. చర్చల ద్వారానే చట్టాలపై ప్రతిష్ఠంభన వీడుతుందని, అందువల్ల సాగు చట్టాలపై చర్చలు జరపాలని సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే కిసాన్ మోర్చా మాత్రం పలు యూనియన్లు, పార్టీలు, సంఘాలు తమకు మద్దతు ఇచ్చినట్లు చెబుతోంది.బంద్ ప్రభావం పంజాబ్, హర్యానాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుందని కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు అభిమన్యు కోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బంద్‌లో పాల్గొనాలని ట్రేడర్ల సమాఖ్యలకు రైతులు విజ్ఞప్తి చేశారని, సాగు చట్టాలు ట్రేడర్లపై కూడా పరోక్షంగా నెగెటివ్ ప్రభావం చూపుతాయని చెప్పారు. -
కాంగ్రెస్ పార్టీకి డబుల్ షాక్
కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి శుక్రవారం షాక్ మీద షాక్ తగిలింది. కాంగ్రెస పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు బూటా సింగ్, సత్పాల్ మహారాజ్‌లు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన సత్తాల్ మహారాజు శుక్రవారం న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనతోపాటు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మరో10 మంది ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు. ఆ పరిణామంతో ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో చిక్కకుంది. ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ లోక్‌సభ స్థానానికి సత్పాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికలలో ఓటమి ఎరుగని ధీరుడిగా సత్పాల్ పేరు పొందారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. అలాగే బూటా సింగ్ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరనున్నారు. ఆయన రాజస్థాన్‌లోని జాలోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎస్పీ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవనున్నారు. గతంలో బూటా సింగ్ కూడా కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. -
‘అతిథి’కి అవమానం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రభుత్వ అతిథిగృహం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడి అధికారుల తీరు అగ్రనేతలను సైతం అవమానించేలా ఉంది. మొన్న సీపీఎం అగ్రనేత.. నిన్న కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి ఈ జాబితాలో చేరిపోయారు. ఎస్టీ రిజర్వేషన్ సాధనకు వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి(వీఆర్పీఎస్) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వాల్మీకి సమరభేరి బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బూటాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నూలులోని ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా.. పత్రిక, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. అయితే అతిథిగృహం అధికారులు సమావేశం నిర్వహించేందుకు వీల్లేదని అడ్డుతగిలారు. చివరకు చేసేది లేక ఆయన అతిథిగృహం బయట నిల్చొనే విలేకరులతో మాట్లాడి వెళ్లిపోయారు. జాతీయ స్థాయి నాయకుడికి జరిగిన అవమానంపై మేధావులు, వీఆర్పీఎస్ నాయకులు మండిపడుతున్నారు. జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన తమ పట్ల అధికార యంత్రాంగం ఈ రీతిలో వ్యవహరించడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా ప్రపంచ దేశాలకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరిని కేంద్ర ప్రభుత్వం రాయబారిగా పంపుతుంది. నేపాల్ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన సమయంలోనూ భారత్ తరఫున ఆయన రాయబారిగా వెళ్లడం తెలిసిందే. అలాంటి నేతకు కూడా ప్రభుత్వ అతిథిగృహంలో అవమానం ఎదురైంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యుస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో పాల్గొనేందుకు ఈ ఏడాది మే 19న సీతారాం ఏచూరి కర్నూలుకు చేరుకున్నారు. ఆ సందర్భంగా ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసేందుకు వెళ్లగా అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన బయటే సమావేశం ముగించుకుని వెళ్లాల్సి వచ్చింది. అతిథిగృహం అధికారులు కనీసం నాయకుల హోదాను కూడా పరిగణలోకి తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై ప్రభుత్వ అతిథిగృహం సూపరింటెండెంట్ రామన్నను ‘సాక్షి’ వివరణ కోరగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి అన్నారు. బూటాసింగ్ విలేకరుల సమావేశానికి డీఆర్వో లేదా కలెక్టర్ అనుమతి తీసుకోవాలని చెప్పామే తప్పిస్తే.. ఆయనను అవమానించాలనే ఉద్దేశం లేదని వెల్లడించారు. -
ఐక్యపోరుకు సిద్ధం కావాలి
వాల్మీకుల సమరభేరి సభలో బూటాసింగ్ కర్నూలు, న్యూస్‌లైన్: వాల్మీకులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కేంద్ర మాజీ మంత్రి బూటాసింగ్ పిలుపునిచ్చారు. వాల్మీకులు ఎదుర్కొంటున్న వివక్షను సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కర్నూలులో ఆదివారం వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి నిర్వహించిన వాల్మీకి సమరభేరి సభలో ఆయన మాట్లాడారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వాల్మీకులను ఎస్సీ, ఎస్టీలుగా పరిగణించబడుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో బీసీలుగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎస్టీలుగా ఉండటం శోచనీయమన్నారు. ఈ వ్యత్యాసాలతో వాల్మీకులు అన్ని రంగాల్లో నష్టపోతున్నారన్నారు. బల్లారి ఎమ్మెల్యే బోయ శ్రీరాములు మాట్లాడుతూ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉంటే వాల్మీకులకు న్యాయం జరిగేదన్నారు. అంతకు ముందు నగరంలో వాల్మీకుల భారీ ర్యాలీ నిర్వహించారు.