తిరుపతి ఉప ఎన్నిక రేపే
హైదరాబాద్: శుక్రవారం జరగబోయే తిరుపతి ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకునే వారు 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చన్నారు. నియోజక వర్గంలోని మొత్తం 256 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.