ఫేస్బుక్లో ఓ చిన్న చర్చ.. ఇంతపెద్ద తలనొప్పి!
కోల్కత్తా : సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో స్నేహితులతో చాలా విషయాలే చర్చిస్తుంటాం. అలానే ఓ 21 ఏళ్ల ఇంజనీరింగ్ అమ్మాయి కూడా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్వహించిన దుర్గామాత పరేడ్‌పై చర్చించింది. నిరుద్యోగ, పేదరిక సమస్యతో బెంగాల్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రియో ఉత్సవంలో ఎంతో అట్టహాసంగా సీఎం ఆ పరేడ్ నిర్వహించడాన్ని తప్పుడు చర్యగా శుక్రవారం ఆ అమ్మాయి విమర్శించింది. ఎఫ్బీలో స్నేహితులతో నిర్వహించిన చర్చే విద్యార్థికి పెద్ద తలనొప్పిలా మారింది. విమర్శించిన ఒక్కరోజులోనే ఆదివారం ఆమె ఫోటోతో కూడిన ఓ పెద్ద బ్యానర్ విద్యార్థి నివసించే దమ్ దమ్ ప్రాంతాల్లో వెలసింది. ముఖ్యమంత్రిని విమర్శించడాన్ని తాము ఖండిస్తున్నామంటూ పెద్దపెద్ద అక్షరాలతో బ్యానర్‌పై లిఖించారు. ఈ బ్యానర్‌ను చూసిన అమ్మాయి ఒక్కసారిగా బిత్తరపోయింది. వేలమంది ఈ పోస్టర్‌ను చూస్తారని తాను భయపడటం లేదని, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ మహిళ సభ్యుల వల్ల తనకేమన్న ముప్పు వాటిల్లుతుందేమోనని ఆందోళన చెందుతున్నట్టు ఆ విద్యార్థి పేర్కొంది. దమ్ దమ్ వార్డ్8 సిటిజన్స్ కమిటీ ఈ హోర్డింగ్ పెట్టినట్టు తేలింది. మమతా బెనర్జీని విమర్శించే హక్కు తనకుందని ఆ అమ్మాయి భావిస్తే, తనని బహిరంగంగా నిందించే హక్కు ఇతరులకు ఉంటుందని బెదిరించారు.
రియో ఉత్సవంలో దుర్గామాత విగ్రహాలతో ముఖ్యమంత్రి పరేడ్ నిర్వహించడాన్ని శుక్రవారం రోజు ఆ విద్యార్థి తప్పుబట్టింది. నిరుద్యోగ, పేదరిక సమస్యతో బెంగాల్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పరేడ్‌ను తప్పుడు చర్యగా విమర్శించింది. ఆమె ఫేస్బుక్ చర్చలో కొంతమంది స్నేహితులు ఆ విద్యార్థికి మద్దతు పలుకగా, మరికొంతమంది వ్యతిరేకించారు. కానీ ఆ పోస్టు ఇంతపెద్ద సమస్యకు కారణమవుతుందని ఆ విద్యార్థి భావించలేదు.దమ్ దమ్ ప్రాంతానికి చెందిన స్థానికులు కూడా ఆమె ఆలోచనలను తప్పుపడుతున్నారు. బెంగాల్‌కు మమతా బెనర్జీ చేస్తున్న కృషిని చూస్తూ కూడా 21 ఏళ్ల అలా ఎలా విమర్శిస్తుందని మండిపడుతున్నారు. కొంతమంది స్థానికులు విద్యార్థికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎవరికైనా స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉంటుందని, ఇలా హోర్డింగ్ నెలకొల్పడం సరికాదంటున్నారు.