Big C Founder Balu Choudhury
-
బిగ్–సి మరో 150 స్టోర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ విక్రయాల్లో ఉన్న బిగ్–సి వచ్చే రెండేళ్లలో రూ.300 కోట్లతో కొత్తగా 150 ఔట్లెట్లను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కంపెనీకి 250 స్టోర్లున్నాయి. 2023–24లో టర్నోవర్ 50 శాతం వృద్ధితో రూ.1,500 కోట్లు లక్ష్యంగా చేసుకున్నామని బిగ్–సి ఫౌండర్, సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. కంపెనీ రెండు దశాబ్దాల వేడుకల్లో భాగంగా బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్ బాబుతో కలిసి ఈడీ వై.స్వప్న కుమార్, డైరెక్టర్లు జి.బాలాజీ రెడ్డి, ఆర్.గౌతమ్ రెడ్డి, కైలాశ్ లఖ్యానితో కలిసి ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘2002 డిసెంబర్ 23న బిగ్–సి మొదలైంది. మొబైల్స్ రిటైల్‌లో తెలంగాణ, ఏపీలో తొలి స్థానంలో నిలిచి రెండు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. మూడవ దశాబ్దంలోనూ అగ్ర స్థానాన్ని కొనసాగిస్తాం. 3 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నాం. మరిన్ని ఎల్రక్టానిక్స్, గ్యాడ్జెట్స్‌ను జతచే స్తాం. 1,500 మందిని కొత్తగా నియమించుకోవడం ద్వారా సిబ్బంది సంఖ్య రెండేళ్లలో 4,000లకు చేరుతుంది. ఒక్కో కుటుంబంలో మూడు తరాలకు సేవలు అందిస్తున్నాం’ అని చెప్పారు. మహేశ్‌బాబుతో గౌతమ్ రెడ్డి, స్వప్న కుమార్, బాలు చౌదరి, బాలాజీ రెడ్డి, కైలాశ్ లఖ్యాని (ఎడమ నుంచి) -
బిగ్ సి సంక్రాంతి పండుగ ఆఫర్లు
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ రీటైల్ విక్రయ సంస్థ బిగ్ సి కస్టమర్లకు కోసం సంక్రాంతికి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సందర్భంగా మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నామని బిగ్ సి వ్యవస్థాపకులు, సీఎండీ బాలు చౌదరి తెలిపారు. మొబైళ్ల కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్దతిలో కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రతీ మొబైల్‌పై కచ్చితమైన బహుమతి, స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.4,000 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నామన్నారు. అమెజాన్ పే, డెబిట్‌కార్డు, పేటియం మాల్ ద్వారా కొనుగోళ్లపై పలు ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. -
బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ నటుడు మహేశ్ బాబు నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారని బిగ్–సి సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. కంపెనీ డైరెక్టర్లు స్వప్న కుమార్, జి.బాలాజీ రెడ్డి, కైలాశ్ లఖ్యానీ, గౌతమ్ రెడ్డితో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ప్రస్తుతం 250 స్టోర్లను నిర్వహిస్తున్నాం. కర్ణాటకలో త్వరలో అడుగుపెడతాం. రెండేళ్లలో కొత్తగా 250 ఔట్లెట్లను ఏర్పాటు చేస్తాం. 30,000 జనాభా ఉన్నచోట దుకాణాన్ని తెరుస్తాం. నూతన స్టోర్ల ఏర్పాటుకు రూ.125 కోట్లు పెట్టుబడి అవుతుంది. ఈ నెలలోనే ల్యాప్టాప్స్ అమ్మకాలను ప్రారంభిస్తున్నాం. 19 ఏళ్లలో 3 కోట్ల పైగా వినియోగదార్లను సొంతం చేసుకున్నాం. వీరిలో 70% పాత కస్టమర్లే. తెలుగు రాష్ట్రాల్లో 30% వాటా చేజిక్కించుకున్నాం. సంస్థలో 2,000 మంది ఉద్యోగులు ఉన్నారు. రెండేళ్లలో వీరి సంఖ్య రెండింతలు అవుతుంది. కోవిడ్ ముందస్తు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధిస్తాం. 2022–23లో రూ.1,500 కోట్లు, తర్వాతి ఏడాది రూ.2,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నాం. ఆ తర్వాత ఐపీఓకు వెళ్లాలని భావిస్తున్నాం’ అని వివరించారు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగల సీజన్ నేపథ్యంలో ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రకటించింది. అక్టోబర్ 4 నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుంది. 8.5 లక్షలపైచిలుకు మంది వర్తకులు కోట్లాది ఉత్పత్తులను విక్రయించనున్నారు. మహేశ్ బాబుతో కైలాశ్ లఖ్యానీ, స్వప్న కుమార్, బాలు చౌదరి, బాలాజీ రెడ్డి, గౌతమ్ రెడ్డి (ఎడమ నుంచి కుడికి) -
90 నిముషాల్లో ఫోన్ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘బిగ్ సి’ ఆన్లైన్ విక్రయాల్లోకి ప్రవేశించింది. కంపెనీ స్టోర్లున్న నగరం, పట్టణంలో వెబ్, యాప్ ద్వారా ఆర్డరు ఇచ్చిన 90 నిమిషాల్లోనే మొబైల్‌ను ఉచితంగా డెలివరీ చేస్తారు. కస్టమర్ కోరితే ఇంటి వద్దే మొబైల్స్‌ను ప్రదర్శిస్తారు. ప్రస్తుతం సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 81 నగరాలు, పట్టణాల్లో 225 ఔట్లెట్లు ఉన్నాయి. కర్ణాటకలో కొద్ది రోజుల్లో అడుగు పెట్టనున్నట్టు బిగ్ సి ఫౌండర్ ఎం.బాలు చౌదరి తెలిపారు. 17వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించిన సందర్భంగా డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి, కైలాష్ లఖ్యానీతో కలిసి సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. 2021 మార్చి నాటికి స్టోర్ల సంఖ్య 300లకు చేరుతుందన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లదాకా ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్టోర్లలో ఇతర ఉపకరణాలు.. మొబైల్స్, యాక్సెసరీస్‌తోపాటు ఎంఐ, టీసీఎల్ కంపెనీల స్మార్ట్ టీవీల విక్రయాలను ప్రారంభించామని బాలు చౌదరి తెలిపారు. ‘ఇతర కంపెనీల స్మార్ట్ టీవీలను సైతం ప్రవేశపెడతాం. ఇంటర్నెట్తో అనుసంధానించే స్మార్ట్ ఉపకరణాల సంఖ్య పెంచుతాం. 17వ వార్షికోత్సవం పురస్కరించుకుని రూ.12 కోట్ల విలువైన బహుమతులు, రూ.5 కోట్ల విలువైన క్యాష్ పాయింట్లను సైతం ఆఫర్ చేస్తున్నాం. ప్రతి కొనుగోలుపై స్క్రాచ్ కార్డు ద్వారా ఖచ్చితమైన బహుమతిని కస్టమర్ అందుకోవచ్చు. ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఎల్ఈడీ టీవీలు, ల్యాప్‌టాప్‌ల వంటి బహుమతులు వీటిలో ఉన్నాయి. జనవరి 31 వరకు ఈ ఆఫర్ ఉంటుంది’ అని వివరించారు. 5 కోట్ల మంది కస్టమర్లకు చేరువయ్యామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
‘బిగ్ సి’ ప్రచారకర్తగా రకుల్..
మార్చి నాటికి 150 స్టోర్లు * బిగ్ సి ఫౌండర్ బాలు చౌదరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ రిటైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సి’ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా సినీ తార రకుల్‌ప్రీత్ సింగ్‌ను నియమించుకుంది. దేశంలో మొబైల్ రిటైల్ రంగంలో బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకునే ట్రెండ్ తమతోనే ప్రారంభమైందని ఈ సందర్భంగా బిగ్ సి వ్యవస్థాపకులు బాలు చౌదరి తెలిపారు. 2006లో సినీ తార చార్మితో మొదలై కాజల్, ఇలియానా, సమంత, శృతిహాసన్‌లు ప్రచార కర్తలుగా వ్యవహరించారని గుర్తు చేశారు. కొత్త అంబాసిడర్‌ను ప్రకటించేందుకు ఆదివారం ఏర్పాటైన సమావేశంలో డెరైక్టర్లు స్వప్నకుమార్, కృష్ణపవన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. అందుబాటు ధర, విక్రయానంతర సేవలు, కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కల్పించడం వల్లే 14 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్నామని అన్నారు. కస్టమర్ల సంఖ్య 4 కోట్లు దాటిందని వెల్లడించారు. మొబైల్స్ విక్రయంలో సుస్థిర స్థానమున్న బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందని రకుల్ అన్నారు. ఎక్స్‌క్లూజివ్‌గా 4జీ స్మార్ట్‌ఫోన్..: బిగ్ సి స్టోర్లలో అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్లలో 90% 4జీ మోడళ్లు ఉంటున్నాయి. దీంతో నెలాఖరుకల్లా రూ.2,999 ధరలో 4జీ మోడల్‌ను బిగ్ సి ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందుకోసం ప్రముఖ బ్రాండ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు బాలు చౌదరి చెప్పారు. ప్రస్తుతం 118 స్టోర్లున్నాయని, వీటిని మార్చికల్లా 150కి చేర్చుతామన్నారు. ఇక సంస్థ ఆదాయంలో చైనా బ్రాండ్ల వాటా 25%. 3-6 నెలల్లో ఇది 50%కి చేరుతుందని, ఫోన్ల నాణ్యతే ఇందుకు కారణమని చెప్పారు. పండుగల సీజన్లో రెండింతల అమ్మకాలు నమోదవుతాయని ధీమా వ్యక్తం చేశారు.