
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ విక్రయాల్లో ఉన్న బిగ్–సి వచ్చే రెండేళ్లలో రూ.300 కోట్లతో కొత్తగా 150 ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కంపెనీకి 250 స్టోర్లున్నాయి. 2023–24లో టర్నోవర్ 50 శాతం వృద్ధితో రూ.1,500 కోట్లు లక్ష్యంగా చేసుకున్నామని బిగ్–సి ఫౌండర్, సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. కంపెనీ రెండు దశాబ్దాల వేడుకల్లో భాగంగా బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్ బాబుతో కలిసి ఈడీ వై.స్వప్న కుమార్, డైరెక్టర్లు జి.బాలాజీ రెడ్డి, ఆర్.గౌతమ్ రెడ్డి, కైలాశ్ లఖ్యానితో కలిసి ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
‘2002 డిసెంబర్ 23న బిగ్–సి మొదలైంది. మొబైల్స్ రిటైల్‌లో తెలంగాణ, ఏపీలో తొలి స్థానంలో నిలిచి రెండు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. మూడవ దశాబ్దంలోనూ అగ్ర స్థానాన్ని కొనసాగిస్తాం. 3 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నాం. మరిన్ని ఎల్రక్టానిక్స్, గ్యాడ్జెట్స్‌ను జతచే స్తాం. 1,500 మందిని కొత్తగా నియమించుకోవడం ద్వారా సిబ్బంది సంఖ్య రెండేళ్లలో 4,000లకు చేరుతుంది. ఒక్కో కుటుంబంలో మూడు తరాలకు సేవలు అందిస్తున్నాం’ అని చెప్పారు.
మహేశ్‌బాబుతో గౌతమ్ రెడ్డి, స్వప్న కుమార్, బాలు చౌదరి,
బాలాజీ రెడ్డి, కైలాశ్ లఖ్యాని (ఎడమ నుంచి)
Comments
Please login to add a commentAdd a comment