Big-C Outlets
-
బిగ్–సి మరో 150 స్టోర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ విక్రయాల్లో ఉన్న బిగ్–సి వచ్చే రెండేళ్లలో రూ.300 కోట్లతో కొత్తగా 150 ఔట్లెట్లను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కంపెనీకి 250 స్టోర్లున్నాయి. 2023–24లో టర్నోవర్ 50 శాతం వృద్ధితో రూ.1,500 కోట్లు లక్ష్యంగా చేసుకున్నామని బిగ్–సి ఫౌండర్, సీఎండీ ఎం.బాలు చౌదరి తెలిపారు. కంపెనీ రెండు దశాబ్దాల వేడుకల్లో భాగంగా బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్ బాబుతో కలిసి ఈడీ వై.స్వప్న కుమార్, డైరెక్టర్లు జి.బాలాజీ రెడ్డి, ఆర్.గౌతమ్ రెడ్డి, కైలాశ్ లఖ్యానితో కలిసి ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘2002 డిసెంబర్ 23న బిగ్–సి మొదలైంది. మొబైల్స్ రిటైల్‌లో తెలంగాణ, ఏపీలో తొలి స్థానంలో నిలిచి రెండు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. మూడవ దశాబ్దంలోనూ అగ్ర స్థానాన్ని కొనసాగిస్తాం. 3 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నాం. మరిన్ని ఎల్రక్టానిక్స్, గ్యాడ్జెట్స్‌ను జతచే స్తాం. 1,500 మందిని కొత్తగా నియమించుకోవడం ద్వారా సిబ్బంది సంఖ్య రెండేళ్లలో 4,000లకు చేరుతుంది. ఒక్కో కుటుంబంలో మూడు తరాలకు సేవలు అందిస్తున్నాం’ అని చెప్పారు. మహేశ్‌బాబుతో గౌతమ్ రెడ్డి, స్వప్న కుమార్, బాలు చౌదరి, బాలాజీ రెడ్డి, కైలాశ్ లఖ్యాని (ఎడమ నుంచి) -
బిగ్–సి ఔట్‌లెట్స్‌లో నోకియా–5 ప్రీబుకింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ రంగంలో ఉన్న హెచ్ఎండీ గ్లోబల్ నోకియా–5 ప్రీ–బుకింగ్స్‌ను బిగ్–సి ఔట్‌లెట్స్‌లో శుక్రవారం ప్రారంభించింది. గొరిల్లా గ్లాస్‌తో 5.2 అంగుళాల ఐపీఎస్ హెచ్డీ డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ 7.1.1 ఓఎస్, 4జీ, డ్యూయల్ సిమ్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 128 జీబీ ఎక్స్పాండెడ్ మెమరీ, డ్యూయల్ టోన్ ఫ్లాష్‌తో 13 ఎంపీ ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ కెమెరా, ఆటోఫోకస్‌తో 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఈ స్మార్ట్‌ఫోన్‌కు పొందుపరిచారు. 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ధర రూ.12,899. నోకియా–5 కొనుగోలుపై ల్యాప్‌టాప్ బ్యాగ్ ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్టు బిగ్–సి మొబైల్స్ చైర్మన్ ఎం.బాలు చౌదరి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఆగస్టు 15 నుంచి విక్రయాలు ఆరంభమవుతాయని హెచ్ఎండీ గ్లోబల్ సౌత్, వెస్ట్ జీఎం టీఎస్ శ్రీధర్ వెల్లడించారు. భారత మొబైల్ మార్కెట్లో 2008–11 మధ్య నోకియా నంబర్ వన్ బ్రాండ్‌గా కొనసాగిందని గుర్తు చేశారు. ఇటీవల విడుదలైన 3310, నోకియా–3 మోడళ్లు హాట్‌కేక్‌లా అమ్ముడయ్యాయని అన్నారు. వీటి విక్రయాలనుబట్టి చూస్తే నోకియా బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. నోకియా–6 అమ్మకాలు ఆగస్టు 23 నుంచి మొదలవుతాయని, ఇప్పటికే 10 లక్షల పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని వెల్లడించారు.