big hospital
-
10 వేల పడకల కోవిడ్ సెంటర్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్ కేర్ సెంటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీలోని చతార్పూర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కేర్ సెంటర్లో 10 వేల పడకలు ఉన్నాయి. దీనికి సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ అని నామకరణం చేశారు. ఇక్కడ అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటలేటర్లు, ఐసీయూను అనిల్ బైజాల్ పరిశీలించారు. ఈ కేంద్రాన్ని ‘ఆపరేషన్ కరోనా వారియర్స్’ పేరిట ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) నిర్వహిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనాపరమైన సహకారం అందిస్తోంది. 1,700 అడుగుల పొడవు, 700 అడగుల వెడల్పు ఉన్న ఈ కేర్ సెంటర్లో 200 ఎన్క్లోజర్లు ఉన్నాయి. ఒక్కో ఎన్‌క్లోజర్‌లో 50 చొప్పున పడకలు ఏర్పాటు చేశారు. మొత్తం సెంటర్లో 20 ఫుట్‌బాల్ ఆట స్థలాలను ఇమడ్చవచ్చు. మరో 200 పడకలను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలం ఇంకా మిగిలి ఉంది. లక్షణాలు కనిపించని, లక్షణాలు కనిపించే.. ఇలా రెండు రకాల కరోనా బాధితులకు ఇక్కడ వేర్వేరుగా సేవలందిస్తారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో డీఆర్డీఓ నిర్మించిన 1,000 పడకల సర్దార్ పటేల్ కోవిడ్ ఆస్పత్రిని కేంద్ర మంత్రులు సందర్శించారు. -
1000 పడకల ఆస్పత్రి 9 రోజుల్లో..
-
9 రోజుల్లో కరోనా ఆస్పత్రి
బీజింగ్/తిరువనంతపురం: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు చైనా ప్రభుత్వం కఠోర యుద్ధం చేస్తోంది. అందుకు ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని చైనా ప్రభుత్వం తేల్చి చెప్పింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు వుహాన్‌లో రికార్డుస్థాయిలో కేవలం తొమ్మిది రోజుల్లోనే 1000 పడకల భారీ ఆస్పత్రిని నిర్మించింది. అత్యంత అధునాతన వైద్య సదుపాయాలతో వుహాన్‌లో నిర్మించిన ఈ హౌషెన్షాన్ ఆసుపత్రిలో ఏకకాలంలో వేలమందికి చికిత్స అందించే ఏర్పాట్లు ఉన్నాయి. గతంలో సార్స్ బారిన పడిన ప్రజలను కాపాడిన అనుభవం ఉన్న వైద్యులను ఇక్కడకు తీసుకొచ్చారు. చైనా సైన్యంలోని 1400 మంది అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందిని ఆసుపత్రిలో నియమించింది. సోమవారం ఈ ఆసుపత్రిలో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. భారత్, అమెరికాలతో కలిపి ఇప్పటికే 25 దేశాలకు పాకిన కరోనా వైరస్.. చైనాలో 17,205 మందికి సోకింది. ఆదివారం ఒక్కరోజే చైనాలో కరోనా మృతుల సంఖ్య 57గా నమోదైంది. ఇప్పటివరకు చైనాలో మొత్తం 361 మంది వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. అయితే 475 మంది వైరస్ నుంచి కోలుకున్నట్టు చైనా అధికారులు వెల్లడించారు. కేరళలో మూడో కరోనా వైరస్ కేసు ఇప్పటికే కేరళలో 2 కరోనా కేసులు గుర్తించగా తాజాగా మరో వ్యక్తికి వైరస్ ఉన్నట్లు తేలిందని కేరళ ఆరోగ్య మంత్రి శైలజ చెప్పారు. ఈ ముగ్గురూ ఇటీవలే చైనాలోని వుహాన్ నుంచి కేరళకు వచ్చారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్న వారే కావడం గమనార్హం. చైనాకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని భారతీయులకు కేంద్రం సూచించింది. చైనా నుంచే కాకుండా సింగపూర్, థాయ్‌లాండ్‌ల నుంచి ముం బైకి వచ్చిన ప్రయాణికులకు సైతం స్క్రీనింగ్ చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వాధికారి వెల్లడించారు. అమెరికా అతిగా స్పందిస్తోంది: చైనా చైనాతో రాకపోకల నిషేధాలు, వ్యాపార సంబంధాలు, దౌత్యాధికారుల తరలింపులు లాంటి చర్యలతో అమెరికా అనవసర భయాందోళనలు రేకెత్తిస్తోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చన్నీంగ్ ఆరోపించారు. పైగా 361 మందిని బలిగొన్న ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు ఎటువంటి తోడ్పాటునీ అందించలేదని అమెరికాపై ఆరోపణలు గుప్పించారు. కరోనాపై జీవోఎం భేటీ.. సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర మంత్రులతో కూడిన బృందం (జీవోఎం) ఏర్పాటైంది. ఈ జీవోఎంకు సంబంధించి తొలి ఉన్నత స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఇందులో జి.కిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. చైనా వెళ్లేందుకు అవసరమైన ఈ–వీసా సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వుహాన్ నుంచి భారత్ చేరుకున్న 645 మంది గురించి అధికారులు మంత్రులకు తెలిపారు. బీజింగ్, షాంఘై, గువాంఝులలోని ఎంబసీలను సంప్రదించడం ద్వారా అక్కడున్నవారు భారత్‌కు చేరుకోవచ్చని భారత పౌరులకు జీవోఎం సూచించింది. కాగా, ఇప్పటి వరకూ 593 విమానాల్లో 72 వేల మంది పౌరులు భారత్‌కు తిరిగొచ్చినట్లు అధికారులు తెలిపారు. -
దూది కూడా లేని ఆసుపత్రులెందుకు?
– ప్రజా సంఘాల ఆగ్రహం – నిధులున్నా మందులు కొనరంటూ ఆరోపణ – పెద్దాసుపత్రి ఎదుట ధర్నా కర్నూలు(హాస్పిటల్): రోగులకు బ్యాండేజి క్లాత్, దూది కూడా ఇవ్వలేని ఆసుపత్రులు ఎందుకని ఐద్వా, డీవైఎఫ్ఐ నాయకులు ప్రశ్నించారు. ఆసుపత్రిలో రూ.9కోట్లకు పైగా నిధులు మూలుగుతున్నా రోగులకు మందులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సమస్యలపై సోమవారం సీపీఎం ప్రజాసంఘాలు ఐద్వా, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆసుపత్రికి ప్రతిరోజూ వివిధ జిల్లాల నుంచి రెండువేలమందికిపైగా చికిత్స కోసం వస్తారన్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి బ్యాండేజ్ క్లాత్, దూది ఇవ్వకుండా బయటకు రాస్తుండడం ఏంటని ప్రశ్నించారు. ఎక్కువశాతం వైద్యపరీక్షలు సైతం బయటకే పంపిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా చికిత్స పొందుతున్న రోగులకు ఉచితంగా వైద్యం అందించాల్సి ఉన్నా వారితో మందులు, వైద్యపరీక్షల కోసం ఖర్చు పెట్టిస్తుండడం సరికాదన్నారు. ఈ పథకం కింద వచ్చిన నిధులు రూ.9కోట్లకు పైగానే ఉన్నాయని, వాటితో మందులు, పరికరాలు కొనే అవకాశం ఉన్నా జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన ఆసుపత్రి అభివద్ధి కమిటి సమావేశం రెండేళ్లయినా జరగడం లేదన్నారు. వెంటనే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వై. శ్రీనివాసులుకు వినతి పత్రం సమర్పించారు. డీవైఎఫ్ఐ నగర అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, రామకష్ణ, నాయకులు ఎల్లప్ప, చంద్రశేఖర్, చరణ్, ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు ఉమ, కె. అరుణ, నాయకులు పీఎస్ సుజాత, పాణ్యం డివిజన్ నాయకులు సి. ప్రమీల, కేఎస్ పద్మావతి పాల్గొన్నారు.