breaking news
Bihar Assembly Election 2025
-
Bihar Election: ఎన్డీఏ, మహాకూటమిపై పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్‌లో ఎన్నికల వేడి నెలకొంది. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, రాష్ట్రంలోని పార్టీలన్నీ రాజకీయ సందడి చేస్తున్నాయి. తాజాగా జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్(పీకే) ఎన్డీఏ, మహాకూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, తమ ‘జన్ సురాజ్’ పార్టీల మధ్యనే ఉంటుందని, మహాకూటమి ఓటమిపాలై, మూడో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు.ఎన్నికల వ్యూహకర్త, రాజకీయవేత్త, జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్(మహాకూటమి) రాబోయే ఎన్నికల్లో ఓటమిపాలై మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. తాము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో మహాకూటమి మూడవ స్థానంలో ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ, జన్ సురాజ్ మధ్యనే ఉంటుందన్నారు. గత ఐదు రోజుల్లో తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనల్లో అస్సలు అర్థం లేదని, వీటిపై ఎవరూ ఆసక్తి చూపడం లేదన్నారు.దీనికి ముందు మధుబనిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ బీహార్ ఓటర్లు నితీష్ కుమార్, బీజేపీ, లాలు యాదవ్‌ల ఆధిపత్య పార్టీల రాజకీయాలను దాటి వెళుతున్నారని అన్నారు. రాష్ట్ర యువతపై తటస్థ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నదన్నారు. బీహార్‌లో కొత్త రాజకీయ చరిత్రను అంతా చూస్తారని.. లాలు, నితీష్,బీజేపీలకు భయపడి ఓటు వేసిన 30 ఏళ్ల యుగం ముగియబోతున్నదన్నారు. కొత్త ప్రత్యామ్నాయం ఉద్భవిస్తోందని, దాని నేత.. ఏ నాయకుడు, కుటుంబం లేదా కులానికి చెందినవాడు కాదని, బీహార్‌కు చెందినవాడేనని అన్నారు. జన్ సురాజ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, జీవనోపాధి కోసం ఎవరూ రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని కిషోర్ పేర్కొన్నారు. #WATCH | Purnea, Bihar | On #BiharAssemblyElections, Jan Suraaj founder Prashant Kishor says, "We are visiting every assembly constituency. Mahagathbandhan is in the third position. The fight is between NDA and Jan Suraaj. The announcements made by Tejashwi Yadav in the last 5… pic.twitter.com/9I3DWgpzfU— ANI (@ANI) October 27, 2025 -
నితీశ్‌కు ‘రెబల్స్’ టెన్షన్.. సిట్టింగ్ ఎమ్మెల్యే సహా 16 మందిపై వేటు
పాట్న: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్‌లో(Bihar Assembly Election) కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార జేడీయూలోని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ మంత్రులు సహా 16 మంది నేతలపై పార్టీ చీఫ్, సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) బహిష్కరణ వేటు వేశారు. ఎన్డీయే అధికారిక అభ్యర్థులకు పోటీగా ఎన్నికల బరిలో నిలిచినందుకు గాను ఈ చర్య తీసుకున్నట్లు ఆయన ఆదివారం ప్రకటించారు. వీరు జేడీయూ సిద్ధాంతాలను ఉల్లంఘించడంతోపాటు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు.భాగల్పూర్ జిల్లా గోపాల్పూర్ ఎమ్మెల్యే నరేంద్ర నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ ఇటీవల తనకు వరుసగా ఐదో విడత టికెట్ ఇవ్వలేదని సీఎం కార్యాలయం వద్ద నిరసనకు దిగి, వార్తల్లోకి ఎక్కారు. అంతకుమునుపు, జేడీయూకే చెందిన ఎంపీ అజయ్ మండల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో, పార్టీ టికెట్ మరొకరికి కేటాయించింది. ఈ నేపథ్యంలో గోపాల్ మండల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఈయనతోపాటు ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ తరఫున గయా జిల్లా గురువా స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్, కటిహార్‌లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి హిమ్‌రాజ్ సింగ్ వేటు పడిన వారిలో ఉన్నారు. అధికార పార్టీ రెండు రోజుల వ్యవధిలో 16 మందిపై బహిష్కరణ వేటు వేసింది.ఇదిలా ఉండగా.. 243 అసెంబ్లీ స్థానాలు కలిగిన బీహార్ (Bihar News)లో ఎన్డీయే కూటమిలో భాగంగా జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేస్తోంది. వచ్చే నెల 6న, 11న రెండు విడతల్లో పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
Bihar Elections: ‘20 నెలల్లో నం. వన్’: తేజస్వి యాదవ్
పట్నా: నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింతగా రాజుకుంటోంది. అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ప్రతిపక్ష మహాఘట్ బంధన్.. రెండూ కూడా పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజలకు హామీలను కూడా గుప్పిస్తున్నాయి. తాజాగా పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే కేవలం 20 నెలల్లో బీహార్‌ను నంబర్ వన్ చేస్తామని పేర్కొన్నారు.మహా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘మా ప్రచారం ప్రారంభమైంది. బీహార్ మార్పు కోసం ఆసక్తిగా వేచి చూస్తోంది. మేము ఎక్కడికి వెళ్లినా, అన్ని కులాలు, మతాల ప్రజలు మాకు మద్దతు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. దానిని మార్చాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో అవినీతి, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. బీహార్ ప్రజల నుండి మేము 20 నెలలు కోరుకుంటున్నాం. ఈ కాలంలో బీహార్‌ను నంబర్ వన్‌గా మార్చడానికి మేము కృషి చేస్తాం’ అని అన్నారు.ఈ సమావేశంలో తేజస్వి యాదవ్ పలు ప్రధాన ప్రకటనలు కూడా చేశారు. మూడు అంచెలుగా పంచాయతీ ప్రతినిధులు, గ్రామ ప్రతినిధుల గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తామని హామీనిచ్చారు. వారికి పెన్షన్లు అందించాలని కూడా నిర్ణయించామన్నారు. వారికి రూ. 50 లక్షల బీమా అందజేయనున్నామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారుల గౌరవ వేతనాన్ని నిర్ధారించడానికి కృషి చేస్తామని, క్వింటాలుకు మార్జిన్ మనీ పెంచుతామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఉన్నవారికి కారుణ్య ఉపాధికి వర్తించే వయోపరిమితి కూడా పెంచుతామన్నారు. కుమ్మరి, కమ్మరి వడ్రంగి తదితర స్వయం ఉపాధి పనుల కోసం ఐదేళ్ల వ్యవధితో వడ్డీ లేని విధంగా రూ. 5 లక్షల రుణం అందిస్తామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: అమ్మని విడిచి ఉండలేక.. 15వ అంతస్తు నుంచి దూకి.. -
చొరబాటుదారులను వెళ్లగొట్టుడే..
నలంద: బిహార్‌లో జంగిల్‌రాజ్ మళ్లీ రావాలా? లేక రాష్ట్రం అభివృద్ధి పథంలో ప్రయాణం కొనసాగించాలా? అనేది ఈ ఎన్నికలే తేల్చబోతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. చొరబాటుదారుల ఓట్ల కోసమే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. మన దేశంలో తిష్టవేసిన చొరబాటుదారులందరినీ గుర్తించి, ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించి, వారిని సొంత దేశాలకు పంపించడం తథ్యమని తేల్చిచెప్పారు. చొరబాటుదారులను బిహార్‌లో ఉండిపోనివ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్నారని ఆక్షేపించారు. చొరబాటుదారులను కాపాడేందుకు ఆయన ఎన్ని ర్యాలీలు నిర్వహించినా ఫలితం ఉండదని స్పష్టంచేశారు. చొరబాటుదారులను బయటకు వెళ్లగొట్టక తప్పదని పునరుద్ఘాటించారు. అక్రమంగా మనదేశంలోకి ప్రవేశించినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రాహుల్ గాంధీ బిహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర పేరిట చొరబాటుదారులను కాపాడే యాత్ర నిర్వహించారని ధ్వజమెత్తారు. అమిత్ షా శనివారం బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఒకవేళ లాలూ–రబ్రీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరోసారి జంగిల్‌రాజ్ తప్పదని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్డీఏ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ధిలో బిహార్ మొత్తం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అందుకోసమే లాలూ, సోనియా ఆరాటం బిహార్‌లో నలంద యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పునఃప్రతిష్టించారని అమిత్ షా తెలిపారు. ఇప్పుడు వంద మంది భక్తియార్ ఖిల్జీలు వచి్చనా ఈ యూనివర్సిటీని ధ్వంసం చేయలేరని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలన కారణంగానే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు కేవలం రెండు దశల్లో జరుగుతున్నాయని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఆరు దశల్లో ఎన్నికలు జరిగాయని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటు వేస్తే వచ్చేసారి ఎన్నికలు ఒకదశలోనే జరుగుతాయని తేలి్చచెప్పారు. విపక్ష మహాగఠ్‌బంధన్ అవినీతి, ఆశ్రితపక్షపాతానికి మారుపేరు అని దుయ్యబట్టారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సొంత కుటుంబం తప్ప ప్రజల బాగు పట్టదన్నారు. బిహార్‌ను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంకలి్పంచారని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని కోరారు. కుమారుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్, కుమారుడిని ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా గాంధీ ఆరాటపడుతున్నారని విమర్శించారు. బిహార్ ప్రజల సంక్షేమం గురించి నిజాయితీగా కృషి చేస్తున్న నాయకులు ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ మాత్రమేనని స్పష్టంచేశారు. మోదీ, నితీశ్‌పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ లెక్కలేనన్ని కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయని, జంగిల్రాజ్తో జనం కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. నితీశ్ కుమార్ రాకతో జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి లభించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ అహరి్నశలూ శ్రమిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులను వారి అడ్డాలోకి వెళ్లి మరీ ఖతం చేశామని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
బిహార్ ఎన్నికల్లో హాట్‌టాపిక్!
'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు' - పాపులర్ సినిమా డైలాగ్. ముందు 60 సీట్లు అన్నాడు, తర్వాత 30కి దిగాడు. చివరకు 15తోనే సరిపెట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు బిహార్‌లో ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయన పేరు ముకేష్ సహానీ. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) వ్యవస్థాపకుడు. మహాగఠ్‌బంధన్ (మహా కూటమి) ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి. ప్రస్తుతం బిహార్ పాలిటిక్స్‌లో (Bihar Politics) హాట్‌టాపిక్‌గా మారారు. అంతగా ఆయన గురించి మాట్లాడుకోవాల్సి ఏముంది అనుకుంటున్నారా? చాలానే ఉంది!ముకేష్ సహానీ గురించి తెలుసుకోవాలంటే 2020 నాటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు జరిగిన పరిణామాలను ప్రస్తావించుకోవాలి. మొదటి దశ ఎన్నికలకు వారం రోజుల ముందు మహాగఠ్‌బంధన్‌కు హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ కూటమిలోకి జంప్ చేశారు. తాను అడిగిన 25 సీట్లు, డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వం దక్కకపోవడంతో బీజేపీ-జేడీయూ కూటమితో చేతులు కలిపాడు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన 11 స్థానాలతోనే సరిపెట్టుకున్నాడు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా తాను కోరుకున్న డిప్యూటీ సీఎం మాత్రం దక్కలేదు. ఆ ఎన్నికల్లో వీఐపీకి నాలుగు సీట్లు మాత్రమే దక్కాయి.ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్బీజేపీ సిఫారసు మేరకు సహానీని ఎమ్మెల్సీ చేసి పశుసంవర్ధక, మత్స్యకార మంత్రి పదవి కట్టబెట్టారు. అది కూడా ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. 16 నెలలకే మంత్రి పదవి నుంచి ఆయనను తప్పించారు. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వీఐపీ తరపున 53 మంది అభ్యర్థులను నిలబెట్టినందుకు ఆయనపై ఈ చర్య తీసుకున్నారు. అంతకు వారం ముందే వీఐపీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సహానీని కాదని బీజేపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఒంటరి అయ్యారు. చివరకు మంత్రి పదవి, ఎమ్మెల్సీ పదవి కూడా లాగేసుకున్నారు. ఇది జరిగి మూడున్నరేళ్లు అయింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.15 అసెంబ్లీ సీట్లు, 2 ఎమ్మెల్సీప్రస్తుత బిహార్ ఎన్నికల విషయానికి వస్తే ముకేష్ సహానీ.. మహాగఠ్‌బంధన్‌లో భాగస్వామిగా ఉన్నారు. సీట్ల విషయంలో గట్టిగానే పట్టుబట్టారు. ముందు 60 అన్నట్టుగా వార్తలు వచ్చాయి. తర్వాత 30కి తగ్గారని ఊహగానాలు వచ్చాయి. పాతిక సీట్లు, డిప్యూటీ సీఎం అభ్యర్థిత్వం ఇస్తేనే ఉంటానని సహానీ కుండబద్దలు కొట్టారు. చివరి నిమిషం వరకు కాంగ్రెస్, ఆర్జేడీ సీట్ల విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో సహానీని ఆకర్షించేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు మీడియాలో వార్తలు షికారు చేశాయి. చివరకు 15 అసెంబ్లీ సీట్లు, రెండు శాసనమండలి స్థానాలతో పాటు రాజ్యసభ సీటుతో సర్దుకుపోయారు. కానీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం విషయంలో మాత్రం రాజీపడలేదు.బలమైన ఓటు బ్యాంకుముకేష్ సహానీ విషయంలో అధికార, విపక్ష ఆసక్తి కనబరచడానికి ప్రధాన కారణం కులం. ఉత్తర బిహార్, లోతట్టు ప్రాంతాల్లో 20 ఉపకులాలతో కూడిన బోట్మెన్- ఫిషర్మెన్ కమ్యూనిటీ 'నిషాద్ కి బలమైన ఓటు బ్యాంకు ఉంది. నిషాద్‌లో మల్లా, బింద్, బెల్దార్, కేవత్ వంటి ఉప కులాలు ఉన్నాయి. ముకేష్ సహానీ మల్లా సామాజిక వర్గానికి చెందిన వాడు. ప్రస్తుతం అతడి పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా ప్రధాన పార్టీలు అతడికి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఈ ఓటు బ్యాంక్. పట్నాకు ఉత్తరాన ఉన్న వైశాలి, ముజఫర్‌పూర్, దర్భంగా, మధుబని ప్రాంతాలతో పాటు సీమాంచల్ వైపు తూర్పున కూడా కీలకమైన నిషాద్ కి ఓటు బ్యాంకు ఉంది.2020 బిహార్ శాసనసభ ఎన్నికల్లో చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీలో మహాకూటమి అభ్యర్థులు ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ, మహాకూటమి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.03 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో బలమైన ఓట్లు బ్యాంకు కలిగిన ముకేష్ సహానీ తమతో పాటే ఉండాలని మహాకూటమి బలంగా కోరుకుంది. అందుకే అతడిని డిప్యూటీ సీఎం (Deputy CM) అభ్యర్థిగా ప్రకటించింది. కాగా, తాము అధికారంలోకి మిగతా కులాల నుంచి కూడా ఉప ముఖ్యమంత్రులను నియమిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ ప్రకటించడం గమనార్హం.చదవండి: బిహార్ సీఎం అభ్యర్థిగా అతడే బెస్ట్!అందుకే ఒప్పుకున్నాతమకు తక్కువ సీట్లు కేటాయించినా, డిప్యూటీ సీఎం అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో మహాకూటమిలో ఉండేందుకు ఒప్పుకున్నారని ముకేష్ సహానీ తెలిపారు. మహాకూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) పేరు ప్రకటించినప్పడే సహానీ పేరు కూడా వెల్లడించారు. సన్ ఆఫ్ మల్లాగా పాపులర్ అయిన 44 ఏళ్ల సహానీ ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. బాలీవుడ్లో సెట్ అసిస్టెంట్‌గా పనిచేసిన ముకేష్ రాజకీయ రంగంలో ఎలా రాణిస్తారోనని బిహారీలు ఎదురు చూస్తున్నారు. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో (నవంబర్ 6, 11) జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వస్తాయి. -
‘చావనైనా చస్తాను.. ఆర్జేడీలో చేరను’: తేజ్ ప్రతాప్
హాజీపూర్: బీహార్ రాజకీయ దిగ్గజం, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది నెలల క్రితమే పార్టీ నుంచి బహిష్కృతుడైన తేజ్ ప్రతాప్ పలు అంశాలలో వివాస్పదునిగా వార్తల్లో కనిపిస్తున్నారు.జనశక్తి జనతా దళ్ పార్టీని స్థాపించి, మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన తేజ్ ప్రతాప్ యాదవ్ తన తమ్ముడు తేజస్విపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరం అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ‘ఆర్జేడీ పార్టీలోకి తిరిగి వెళ్లేకంటే చావడమే నయం. నాకు అధికార దాహం లేదు. మానవీయ సూత్రాలు, ఆత్మగౌరవం అత్యున్నతమైనవి’ అని తేజ్ ప్రతాప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ప్రజల కోసం పనిచేయడమే తనకు సంబంధించిన పెద్ద విషయం అని, నిజాయితీగా అదే పని చేస్తానని, అప్పుడే ప్రజలు తనను ప్రేమిస్తారు.. నమ్ముతారని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఆయన 2015లో ఎన్నికల అరంగేట్రం చేసిన మహువా స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ముందు నుండే ఈ నియోజకవర్గంతో అనుబంధం కలిగి ఉన్నానని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. తన తమ్మునికి నమ్మకస్థుడైన సిట్టింగ్ ఆర్జేడీ శాసనసభ్యుడు ముఖేష్ రౌషన్‌ను తాను పోటీదారుగా భావించడం లేదన్నారు.తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ తాము చాలా కాలంగా మాట్లాడుకోవడం లేదని, కానీ వారి ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతున్నానని అన్నారు.ఇండియా కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్విని ఎంపిక చేయడం తనకు నచ్చలేదన్నారు. పలు రకాల ప్రకటనలు చేయడం రాజకీయ నాయకుల లక్షణమని, కానీ ప్రజల ఆశీస్సులు పొందిన వ్యక్తి మాత్రమే అధికారాన్ని చేజిక్కించకుంటాడని తేజ్ ప్రతాప్ అన్నారు. -
‘ఇండియా కూటమి అలా నెగ్గాలనుకుంది..’ నడ్డా సంచలన ఆరోపణలు
బీహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన ఆరోపణలకు దిగారు. చొరబాటుదారుల ఓట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి భావిస్తోందని.. అయితే ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు సాగనివ్వబోదని అన్నారు. శుక్రవారం వైశాలి జిల్లాలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొని జేపీ నడ్డా ప్రసంగించారు. ‘‘బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక పునఃసమీక్ష (special intensive revision)కు ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఎందుకంటే.. చొరబాటుదారుల ఓట్ల ఆధారంగానే వాళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు కాబట్టి. కానీ, ఎన్డీయే ప్రభుత్వం అలాంటి ప్రయత్నాన్ని ఎప్పటికీ సాగనివ్వబోదు.. .. ఓటు చోరీ ఆరోపణలపై అఫిడవిట్లు సమర్పించాలని ఎన్నికల కమిషన్ కోరిన తర్వాత ప్రతిపక్షాలు ఆ ఆరోపణలపై మాట్లాడటమే మానేశాయి. అక్కడే అసలు వాస్తవం బయటపడింది. తమ ఆరోపణలకు ఆధారాలు చూపలేకనే వాళ్లు తోకముడిచారు అని నడ్డా ఎద్దేవా చేశారు. ఆర్జేడీది జంగిల్ రాజ్లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీకి గూండా, రౌడీ పార్టీ అనే ముద్ర ఉందని నడ్డా ఆరోపించారు. 2005కి ముందు బీహార్‌లో శాంతి భద్రతలు ఎలా ఉండేవి?. డాక్టర్లు, వ్యాపారులు, న్యాయవాదులు అప్పట్లో కిడ్నాప్, హత్యలకు గురైన సంగతి ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సమయంలో అప్పటి సీఎం లాలూ నివాసంలోనే ఫిర్యాదులపై చర్చలు జరిగేవి కదా.. నడ్డా ఆరోపించారు. కానీ.. నితీశ్ కుమార్‌లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్ నుంచి బీహార్ ప్రజలకు విముక్తి కలిగించిందని నడ్డా అన్నారు. గత 20 ఏళ్లుగా సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో బీహార్ గణనీయంగా పురోగతి సాధించిందని, మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి గణనీయమైన నిధులూ బీహార్‌కు సమకూరుతున్నాయని నడ్డా అన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించి ఆ అభివృద్ధిని కొనసాగించాలని ఈ సందర్భంగా మేధావులకు నడ్డా విజ్ఞప్తి చేశారు. -
14న బిహార్‌కు అసలైన దీపావళి
సివాన్: బిహార్ ప్రజలు నవంబర్ 14వ తేదీన అసలైన దీపావళి వేడుకలను జరుపుకోనున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఆర్జేడీతోపాటు మహాగఠ్ బంధన్ కూటమికి ఘోర పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సివాన్ జిల్లాలో శుక్రవారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. లాలూ ప్రసాద్ సారథ్యంలోని ఆర్జేడీ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత మహ్మద్ షహబుద్దీన్ కుమారుడు ఒసామా షాహాబ్‌కు టికెట్ ఇవ్వడంపై అమిత్ షా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో షహబుద్దీన్ కుమారుడిని ఘోరంగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లాలూ ప్రసాద్, రబ్డీదేవిల ఇరవయ్యేళ్ల జంగిల్ రాజ్‌ను సివాన్ వాసులు చవిచూశారని విమర్శించారు. లాలూ మళ్లీ జంగిల్ రాజ్ తేవాలనుకుంటున్నారని ఆరోపించారు. నవంబర్ 14వ తేదీన ప్రకటించే ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ, ఆ పార్టీ మిత్రపక్షాలను అవమానకర రీతిలో ఓడించి, బిహార్ ప్రజలు అసలైన దీపావళిని జరుపుకోవడం ఖాయమని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
అప్పట్లో ఆర్జేడీతో పొత్తు తప్పే: నితీశ్
సమస్తీపూర్: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో బిహార్ అభివృద్ధి చెందుతోందని జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీయేకే ఓటేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. సమస్తీపూర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఎన్నికల ర్యాలీలో నితీశ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. 1997లో దాణా కుంభకోణంలో కేసు నమోదు కావడంతో గతంలో లాలూ సీఎం పదవి నుంచి వైదొలిగి, భార్య రబ్డీదేవికి బాధ్యతలను అప్పగించడాన్ని నితీశ్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాన్ని లాలూ అధోగతి పాల్జేశారన్నారు. ఆయన ఇప్పటికీ మారలేదు. అప్పట్లో భార్యకు ముఖ్యమంత్రి పదవిని అప్పగించిన లాలూ, కుమారులు, కుమార్తెలకు అధికారం కట్టబెట్టేందుకు మళ్లీ తెరపైకి వచ్చారని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. ఆయన పా ర్టీతో స్వల్పకాలం మైత్రి సాగించా. అది తప్పని ఆ తర్వాత తెలుసుకుని, ఆ కూటమి నుంచి బయటకు వచ్చి తిరిగి బీజేపీతో మైత్రి కొనసాగించా’అంటూ నితీశ్ చెప్పుకొచ్చారు. -
రికార్డులు బద్దలు కొడతాం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విజయం మళ్లీ తమదేనని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిని బెయిల్‌పై బయటకు వచ్చిన నేరగాళ్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఈ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో సుడిగాలి పర్యటనలు చేశారు. జన నాయక్, భారతరత్న కర్పూరీ ఠాకూర్ సొంత గ్రామాన్ని సందర్శించారు. సమస్తీపూర్, బెగూసరాయ్ జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. సొంత ప్రయోజనాలు మాత్రమే కాపాడుకొనే ‘ఇండియా’ కూటమిని పక్కనపెట్టాలని, అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎన్డీఏను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీని ఆ పార్టీ శ్రేణులు ‘జన నాయక్’ అని సంబోధించడాన్ని మోదీ తప్పుపట్టారు. జన నాయక్ అంటే కర్పూరీ ఠాకూర్ మాత్రమేనని స్పష్టంచేశారు. కర్పూర్ ఠాకూర్‌కు ప్రజలిచి్చన బిరుదును దొంగిలించే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. సుపరిపాలనను ఆదరించాలి ‘‘2005లో బిహార్ ప్రజలు జంగిల్‌రాజ్‌కు ముగింపు పలికారు. ఆర్జేడీ–కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేశారు. ఈ విషయం ఇప్పటి యువత తెలుసుకోవాలి. యువత భుజస్కంధాలపై పెద్ద బాధ్యత ఉంది. సుపరిపాలనను ఆదరించాలి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. గుజరాత్, మధ్యప్రదేశ్, హరియాణాతోపాటు మహారాష్ట్రలోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. బిహార్‌లో సైతం పాత రికార్డులను తిరగరాయడం తథ్యం. నయీ రఫ్తార్ సే చలేగా బిహార్, జబ్ ఫిర్ సే ఆయేగీ ఎన్డీఏ సర్కార్(ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ వస్తే బిహార్ కొత్త వేగంతో ముందుకెళ్తుంది) వారిలో అహంకారం తగ్గలేదు విపక్ష ఇండియా కూటమిలో కీచులాటలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. అది మహాగఠ్‌బంధన్ కాదు.. మహాలాఠ్‌బంధన్. ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు అత్యంత అవినీతిపరులు. వారంతా బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. దశాబ్దాలుగా అధికారంలో లేకున్నా వారిలో అహంకారం తగ్గలేదు. సొంత కూటమిలోని పారీ్టలను బయటకు తరిమేశారు. అలాంటి వారికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి. జంగిల్‌రాజ్ వల్ల మహిళలు ఎంతగానో నష్టపోయారు. బాధితులుగా మిగిలారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే పార్లమెంట్లో కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు వ్యతిరేకించారు. ఆ నాయకులు ఓట్ల కోసం వస్తే తలుపులు మూసివేయండి. మహిళల సమస్యలను పరిష్కరించే సత్తా ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి లేదు. నిజానికి ఆ నాయకులే అసలు సమస్య. గతంలో వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి అవహేళన చేశారు. ఆర్జేడీ–కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు. అప్పటి పాలకులు ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్నారు. కానీ, యువతకు ఉపాధి కలి్పంచలేదు. జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు ఎన్డీఏ విముక్తి కలి్పంచింది. ప్రస్తుతం బిహార్ ప్రజలకు లాంతరు (ఆర్జేడీ ఎన్నికల గుర్తు) అవసరం లేదు. ఇప్పుడు వారి మొబైల్ ఫోన్లలో ఫ్లాష్లైట్లు ఉన్నాయి.నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం కేంద్రంలో 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో బిహార్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. యూపీఏ పాలనతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా నిధులు అందజేశాం. కనీస అవసరాల కోసం ఒకప్పుడు ఇతర రాష్ట్రాలపై ఆధారపడిన బిహార్ ఇప్పుడు స్వయం సమృద్ధి సాధిస్తోంది. చేపలు, మఖానాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. బిహార్ రైతుల కోసం మఖానా బోర్డు ఏర్పాటు చేశాం. మఖానా సాగు, మార్కెటింగ్‌కు దోహదపడుతోంది. బిహార్‌లో నక్సలిజం సమస్య చాలావరకు తగ్గిపోయింది. గతంలో దాదాపు 18 జిల్లాల్లో నక్సలైట్ల ప్రభావం ఉండేది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం. ఇదీ నా గ్యారంటీ. పరివార్ వల్ల సీతారాం కేసరికి అవమానాలు పేద కుటుంబంలో జని్మంచిన నేను ప్రధానమంత్రి స్థాయికి ఎదిగానంటే అందుకు కర్పూరీ ఠాకూర్ ఇచి్చన స్ఫూర్తే కారణం. పేదలు కూడా కష్టపడి పనిచేసి ఉన్నతులుగా మారగలరని ఆయన నిరూపించారు. బిహార్‌కు గర్వకారణమైన సీతారాం కేసరిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది. వెనుకబడిన తరగతికి చెందిన కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. కానీ, పరివార్(నెహ్రూ–గాంధీ కుటుంబం) వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయనను బాత్రూమ్లో బంధించారు. అనంతరం వీధుల్లోకి నెట్టేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆయన నుంచి దొంగిలించారు’’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన పట్ల నిరంతరం విశ్వాసం వ్యక్తం చేస్తున్నందుకు బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామని, వస్తువుల ధరలు తగ్గిపోయాయని చెప్పారు. రాబోయే ఛత్ పండుగతోపాటు ఆదా(బచత్) ఉత్సవం కూడా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. -
మహాఘట్బంధన్కు మోదీ కౌంటర్.. బిహార్‌పై కీలక ప్రకటన
సమస్తిపూర్: వచ్చే నెలలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే అన్ని రికార్డులు బద్దలుకొడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఆయన బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్‌లో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. "ఫిర్ ఏక్ బార్ ఎన్డీఏ సర్కార్... ఫిర్ ఏక్ బార్ సుశాసన్ సర్కార్" అని బిహార్ ప్రజలు అంటున్నారన్నారు.నితీశ్ కుమార్‌ను 'సుశాసన్ బాబు' అనే ప్రజాదరణ పొందిన బిరుదు పేరుతో మోదీ ప్రస్తావించారు. మొదటిసారి నితీశ్ కుమార్‌ను ఎన్డీయే ప్రచార ముఖంగా ప్రస్తావించారు. అయితే, ఎన్నికల తర్వాత ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? అనే విషయం స్పష్టంగా చెప్పలేదు. ఎక్కడా కూడా సీఎం అభ్యర్థి అనే మాట ప్రస్తావించకుండానే.. ఈసారి కూడా సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ తేజస్వి సవాల్‌పై ప్రధాని మోదీ స్పందించినట్లయింది.కాగా, బీజేపీ.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంలో వెనుకడుగు వేస్తోందంటూ మహాఘట్బంధన్ విమర్శించింది. సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోందంటూ తేజస్వీ యాదవ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో నితీశ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి?’’ అంటూ తేజస్వీ ధ్వజమెత్తారు. -
నేడు బిహార్‌కు మోదీ, అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా బిహార్ లో పర్యటించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రక టించిన తర్వాత తొలిసారి మోదీ బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అమిత్ షాకు ఇది రెండో పర్యటన. ఎన్డీయే తరఫున శుక్రవారం ఈ ఇద్దరు నేతలు మొత్తం నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. భారత రత్న, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ సొంత జిల్లా సమస్తిపూర్ నుంచి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం.. బెగుసరాయ్‌లో మరో బహిరంగ సభలో పాల్గొంటారు. హోం మంత్రి అమిత్ షా సివాన్, బక్సర్‌ల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 30వ తేదీన కూడా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ముజఫర్‌పూర్, ఛప్రాలలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇద్దరు కీలక నేతలు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరుగుతుందని, ఎన్డీయే ప్రచారానికి మరింత ఊతం ఇస్తాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. 28న మహాగఠ్‌బంధన్ మేనిఫెస్టో విడుదలబిహార్ ఎన్నికల కోసం మహాగఠ్‌బంధన్ మేనిఫెస్టోను ఈ నెల 28న పట్నాలో విడుదల చేసే అవకాశం ఉంది. మొదటి దశ పోలింగ్‌కు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆ తర్వాత రెండో దశ ఎన్నికల కోసం కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఛత్ పూజ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రి యాంకా గాంధీ కూడా ప్రచారంలో పాల్గొంటారని మహా కూటమి వర్గాలంటున్నాయి. -
వికాసానికి– వినాశానికి మధ్య పోరు
ఔరంగాబాద్/హాజీపూర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీయే వికాసానికి, విపక్షాల ఇండియా కూటమి వినాశానికి మధ్య జరుగుతున్న పోరుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అభివర్ణించారు. గురువారం ఆయన ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఔరంగాబాద్, వైశాలి జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఇరవయ్యేళ్ల పాలనలో సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను అంతం చేశారన్నారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీయే పాటుపడుతోందని చెప్పారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అందుకే ఈ ఎన్నికలు వికాసానికి, వినాశానికి మధ్య జరుగుతున్న పోరాటం వంటివని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా నడ్డా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఆ పార్టీని చిన్నవైన భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్నభుక్కుగా ఆయన పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాల కల్పనతోపాటు, వలసలకు చెక్ పెడతామంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇస్తున్న హామీలను ప్రస్తావిస్తూ నడ్డా.. గతంలో ఆ పార్టీ నేతలు పాల్పడిన ‘భూమికి బదులుగా ఉద్యోగాలు’కుంభకోణం గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. భారీ ఉద్యోగాల కల్పన వట్టిదేనంటూ ఆయన వీరందరికీ వేతనాలను చెల్లించేందుకు నిధులెక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు. -
సీఎం అభ్యర్థి తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో విపక్ష మహాగఠ్‌బంధన్ (మ హాకూటమి) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఊహాగానాలకు తెరది ంచుతూ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి గా రాష్రీ్టయ జనతాదళ్(ఆర్జేడీ) యువనేత తేజస్వీ యాదవ్ పేరును కూటమి పక్షాలు ఏకగ్రీవంగా ఖరారు చేశాయి. తమ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాస్‌శీల్ ఇన్సాన్ పారీ్ట(వీఐపీ) అధినేత ముఖేష్ సహానీ పేరును ప్రకటించాయి. సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థుల ఎంపికపై కొన్నిరోజుపాటు జరిగిన చర్చోపచర్చలు ఎట్టకేలకు ముగిశాయి. కూటమి నేతలు గురువారం పటా్నలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిహార్‌లో మార్పు కోసం ఏడు పారీ్టల మహాగఠ్‌బంధన్ ఐక్యంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. తేజస్వీనే మా సీఎం: అశోక్ గహ్లోత్ కూటమి ముఖ్యమంత్రి అభ్యరి్థగా యువనేత తేజస్వీ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ చెప్పారు. ఆయన నవ యువకుడు అని, ఏది చెబితే అది చేస్తారని, ఇచ్చిన హా మీలకు కట్టుబడి ఉంటారని వెల్లడించారు. కూటమిలో కీలక నేత ముఖేష్ సహానీ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టకొని ఆయనను డిప్యూటీ సీఎం అభ్యరి్థగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బిహార్‌లో సామాజిక నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకొని సీఎం, డీప్యూటీ సీఎం అభ్యర్థులను ఖరారు చేశామని వెల్లడించారు. తమ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీతోపాటు కూటమి నేతలను సంప్రదించి తుది నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి కూడా మరికొందరిని ఉప ముఖ్యమంత్రులుగా నియమిస్తామని స్పష్టంచేశారు. కొత్త రాష్ట్రాన్ని నిర్మిస్తాం: తేజస్వీ ఎన్డీఏ ప్రభుత్వంపై తేజస్వీ యాదవ్ నిప్పు లు చెరిగారు. బిహార్‌లో ఓ కొత్త రాష్ట్రాన్ని నిర్మించేందుకు తామంతా ఏకమయ్యామని చెప్పారు. పనికిమాలిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు సంకల్పం తీసుకున్నామని ఉద్ఘాటించారు ‘‘ఎన్డీఏ నేత లు నకలీ్చ(కాపీక్యాట్లు). మేం ఏ హామీ ఇ స్తే, వాళ్లు దాన్నే కాపీ కొడుతున్నారు. వాళ్ల కు సొంత ఏజెండా లేదు. బిహార్‌లో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తే రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తారో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికీ చెప్పలేదు. ఎన్డీఏ నేతలంతా అలసిపోయిన నేత లు. బిహార్‌ను మోసం చేయడంలో వారంతా నిమ గ్నమయ్యారు. సీఎం నితీశ్ కుమా ర్ పార్టీ జేడీ(యూ)ని ఖతం చేయడానికి బీజేపీ కుట్రలు సాగిస్తోంది. గత ఎన్నికల్లో నితీశ్‌ను సీఎం అభ్యరి్థగా ప్రకటించిన బీజేపీ ఈసారి ఎందుకు ప్రకటించడం లేదు? దీని వెనుక అసలు కారణం ఏమిటి? ఇది నితీశ్ కుమార్‌కు జరుగుతున్న అన్యాయం’’ అని తేజస్వీ ధ్వజమెత్తారు. ఎన్డీఏ పాలనలో రా ష్ట్రంలో అవినీతి, నేరాలు విచ్చలవిడిగా పెరి గిపోయాయని ఆరోపించారు. ‘‘రూ.70 వే ల కోట్ల కాగ్ స్కామ్, సృజన్ కుంభకోణం, బాలికా గృహ్ ఘటనలపై చర్యల్లేవు. వంతెనలు కూలుతున్నాయి, ఎలుకలు మద్యం తాగుతున్నాయి, రోజూ కాల్పులు జరుగుతున్నాయి. అవినీతి, ఆఫీసర్ల దౌర్జన్యంతో ప్రజలు విసిగారు’’ అని పేర్కొన్నారు. హామీల వర్షం మహాకూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యో గం, మాయీ–బహిన్ మాన్ యోజన (మహిళలకు ఆర్థిక సాయం), గ్యాస్ సిలిండర్ రూ.500కే అందిస్తామని తేజస్వీ యా దవ్ హామీ ఇచ్చారు. జీవికా దీదీలకు(స్వ యం సహాయక బృందాల మహిళలు) నె లకు రూ.30 వేల జీతంతో శాశ్వత ఉద్యో గం కల్పిస్తామని, కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబదీ్ధకరిస్తామని వాగ్దానం చేశారు. బీజేపీని వదలం: ముఖేష్ సహానీ ఈ రోజు కోసం మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నామని డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహానీ వ్యాఖ్యానించారు. బీజేపీని విచ్ఛిన్నం చేసే వరకు వదిలిపెట్టబోమని ప్రతిజ్ఞ చేశామని, ఆ సమయం ఇప్పుడు వచి్చందని స్పష్టంచేశారు. -
జంగిల్‌రాజ్‌ను వందేళ్లయినా మర్చిపోలేం
న్యూఢిల్లీ: బిహార్‌లో లెక్కలేనన్ని అరాచకాలు సృష్టించిన జంగిల్‌రాజ్‌ను వందేళ్లయినా మర్చిపోలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పాలనపై నిప్పులు చెరిగారు. అప్పటి అకృత్యాలను దాచిపెట్టేందుకు విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మది నుంచి చెరిగిపోవని చెప్పారు. జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు విముక్తి కల్పించేందుకు సీఎం నితీశ్ కుమార్‌తోపాటు ఎన్డీఏ ఎంతగానో కష్టపడిందని తెలిపారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను నెలకొలి్పందని, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు తాము బిహారీలమని గర్వంగా చెప్పుకుంటున్నారని వెల్లడించారు. విపక్ష మహాగఠ్‌బంధన్ నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని, అది నేరగాళ్ల కూటమి(లాఠ్బంధన్) అని మండిపడ్డారు. ప్రధాని మోదీ గురువారం ‘నమో యాప్’ ద్వారా బిహార్ బీజేపీ కార్యకర్తలతో సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ప్రచారం సాగించాలని చెప్పారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. రఫ్తార్ పకడ్ చుకా బిహార్, ఫిర్ సే ఎన్డీఏ సర్కార్(బిహార్‌లో ప్రభంజనం ఊపందుకుంది, మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది) అని మోదీ కొత్త నినాదం ఇచ్చారు. తమ కూటమి పాలనలో ఆల్‌రౌండ్ అభివృద్ధి జరిగిందన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రైలు మార్గాలు నిర్మించినట్లు గుర్తుచేశారు. కేంద్రంలో, బిహార్‌లో స్థిరమైన ప్రభుత్వాలు ఉండడం వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని తేల్చిచెప్పారు. సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31న జరిగే ‘ఐక్యతా పరుగు’లో యువత భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. యువతదే కీలక పాత్ర మరోసారి దగా చేయడానికి వస్తున్న నేరగాళ్ల కూటమికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ కూటమికి సొంత ప్రయోజనాలే తప్ప ప్రజాసేవ అంటే ఏమాత్రం తెలియదన్నారు. నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదం వల్ల బిహార్ యువత దశాబ్దాలపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాలు, ఉపాధికి దూరమయ్యారని చెప్పారు. అప్పటి పాలకులు ఎన్నికల్లో నెగ్గడానికి మావోయిస్టులను వాడుకున్నారని ప్రధానమంత్రి మండిపడ్డారు. కడుపు మండిన ప్రజలు ఓటు అనే ఆయుధంతో జంగిల్‌రాజ్‌ను ఓడించారని తెలిపారు. ఆనాటి అరాచక రాజ్యం మళ్లీ రావాలని ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టంచేశారు. ఓటు విలువ బిహార్ ప్రజలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నారు. జంగిల్‌రాజ్ కాలం నాటి వేధింపులు, ఘోరాల గురించి ఇప్పటి యువతకు తెలియజేయాలని పేర్కొన్నారు. బిహార్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి ఈ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఇందులో యువత కీలక పాత్ర పోషించబోతున్నారని ఉద్ఘాటించారు. మహిళా సాధికారత విషయంలో నవంబర్ 14న నూతన శకం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. -
‘ఆడపడుచు కట్నాలు’ ఫలిస్తాయా?
రానున్న బిహార్ ఎన్నికల్లో మహిళా ఓటు నిర్ణయాత్మకం కాబోతోందా? వారు కింగ్ మేకర్లు కాబోతున్నారా? 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు 54.6 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటే, స్త్రీలు వారికన్నా ఎక్కువగా 59.7 శాతం మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. బిహార్‌లో ఇలా మహిళలు పెద్ద యెత్తున ఓటు వేసేందుకు తరలిరావడం దశాబ్దం పైనుంచి కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విజయాన్ని ఖాయం చేయడంలో వారి ఓటు సహాయపడిందనడంలో సందేహం లేదు. కానీ ఈ నవంబర్‌లో పరిస్థితిలో మార్పు రావచ్చు. వివాదాస్పదంగా మారిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం తర్వాత సిద్ధమైన ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ప్రస్తుత ఓటర్ల జాబితాలోని మొత్తం 7.43 కోట్ల మందిలో మహిళల (3.5 కోట్ల మంది) కన్నా పురుషులు (3.92 కోట్ల మంది) ఎక్కువగా ఉన్నారు. అంటే, ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు మహిళా ఓటర్లు 892 మంది చొప్పున ఉన్నారు. ఈ మార్పు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే, 2015–20 మధ్యలో పురుష ఓటర్ల సంఖ్య 34.42 లక్షలు పెరిగితే, మహిళా ఓటర్లు 39.62 లక్షల మంది పెరిగారు.మహిళల నాడి తెలుసుకొని...బిహార్ ఎన్నికల్లో కులం పాత్ర ముఖ్యమైనదే కానీ, ప్రధానంగా నితీశ్ కుమార్ ఉత్సాహ ప్రోత్సాహాలతోనే ఎన్నికల రాజకీయాల్లో మహిళలు పాల్గొనడం పెరిగింది. పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు నిర్ణాయక శక్తిగా మారే విధంగా, వారు చురుకుగా పోలింగ్‌లో పాల్గొనేటట్లుగా ఆయన 2005 నుంచి కీలకమైన చర్యలు తీసుకుంటూ వచ్చారు. నిజం చెప్పాలంటే, రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించిన కారణంగానే గత రెండు ఎన్నికల్లో నితీశ్ విజయం సాధించగలిగారు. మహిళా సాధికారతకూ, మద్యనిషేదానికీ నితీశ్ ముడిపెట్టారు. తాగుడు వ్యసనం వల్ల మహిళలే ఎక్కువ ఇక్కట్లు పడుతున్నారంటూ ఆయన చేసిన వాదన వారిని ఆకట్టుకుంది. స్కూళ్ళకు వెళ్ళే బాలికలకు సైకిళ్ళు, యూనిఫారాలు పంపిణీ చేయడం ద్వారా, మహిళా ఓటర్లను కూడగట్టుకునే పనిని ఆయన 25 ఏళ్ళ క్రితమే ప్రారంభించారు. వారిలో కొందరు వనితలు వ్యవస్థాపక సామర్థ్యం ఉన్నవారిగా నిరూపించుకున్నారు. కొందరు మాతృమూర్తులయ్యారు. ఇన్నేళ్ళుగా నితీశ్ పట్ల వారి మమకారం చెక్కుచెదరకుండా వస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ‘లాడ్లీ బెహనా యోజన’, ‘లడ్కీ బహిన్∙యోజన’ పథకాలను అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రారంభించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఉండవచ్చు; కానీ, మహిళలపై నితీశ్ ప్రభావం అంతకన్నా పెద్దది.పోటాపోటీ వరాలుఅయితే, మహిళల్లో నితీశ్ పట్ల ఆదరణ తగ్గినట్లు ఇటీవలి ఒక ప్రజాభిప్రాయ సేకరణ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆయన పదవి నుంచి వైదొలగి యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని మహిళల్లో చాలా మంది భావిస్తున్నారు. రాజకీయంగా మరింత పెద్ద పాత్ర వహించే విధంగా నితీశ్ తన కుమారుడు నిశాంత్‌ను తీర్చిదిద్దడం మొదలుపెట్టడానికి బహుశా అదే ప్రధాన కారణం కావచ్చు. రాష్ట్ర ఆర్థిక మంత్రి మార్గదర్శకత్వంలో నిశాంత్ ఎక్కువ సమయాన్ని సమస్తిపూర్ నియోజకవర్గంలో వెచ్చిస్తున్నప్పటికీ, ఆయన ఈ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయడం లేదు. కనుక, రానున్న ఎన్నికల్లో నితీశ్‌దే ప్రధాన పాత్ర. మహిళా ఓటర్లపై తన పట్టును కొనసాగించేందుకు నితీశ్ యుక్తిని ప్రదర్శించారు. మహిళా ఔత్సాహికæ పారిశ్రామికవేత్తలకు ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ కింద ఇవ్వదలచిన రూ. 10,000 కోట్ల మొదటి విడత మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు ఇటీవల ఆయన ప్రకటించారు. వ్యవస్థాపక సామర్థ్యం కనబరచిన మహిళలకు వచ్చే ఆరు నెలల్లో, మరో రూ. 2 లక్షల చొప్పున బదిలీ అవుతాయి. ఈ పథకం కింద దాదాపు రూ. 21,000 కోట్లను వెచ్చించనున్నారు. నితీశ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరికొన్ని పథకాలు ప్రకటించారు. సుమారు 1.89 కోట్ల మంది వినియోగదారులకు రూ. 5,000 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల ఉచిత విద్యుత్తును అందించనున్నారు. సామాజిక భద్రతా పింఛను పథకం 1.11 కోట్ల మందికి లబ్ధి చేకూర్చనుంది. జీవిక, అంగన్వాడి, ‘ఆశా’ వర్కర్ల గౌరవ వేతనాలను పెంచారు. దీనివల్ల, ప్రభుత్వ ఖజానాపై మరో రూ.9,300 కోట్ల భారం పడనుంది. కొత్తగా ప్రకటించిన కేటాయింపుల వల్ల ఏటా అదనంగా రూ. 40,000 కోట్లు ఖర్చు కానున్నాయి. రాష్ట్ర వార్షిక రాబడి మొత్తం దాదాపు రూ. 56,000 కోట్ల మేరకు ఉంటుంది. రూ. 7 లక్షల కోట్ల వ్యయమయ్యే ఈ ఉచిత పథకాల వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారని ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. కానీ, జనాకర్షక వాగ్దానాలు చేయడంలో ఆయనా ఏమీ వెనుకబడి లేరు. ప్రతిపక్ష ‘మహాగuЇబంధన్’ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఖాయమని ఆయన హామీ ఇచ్చారు. ఆ ప్రతిపాదనలోని ఆర్థికాంశాలను తేజస్వి పరిశీలించలేదని వేరే చెప్పనక్కర లేదు. రాష్ట్రం అంత భారాన్ని మోయగల స్థితిలో ఎంతమాత్రం లేదు.తగ్గని అతివల అగచాట్లుఇటీవల రాష్ట్రం నలుమూలల పర్యటించి, గ్రామాలు, పట్టణాలలోని మహిళలతో మాట్లాటిన సామాజిక ఉద్యమకారిణి షబ్నం హష్మీ వారి స్థితిగతులు ఏమీ బాగా లేవని చెబుతున్నారు. వనితలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారనీ, ‘హఫ్తాలు’ (రౌడీ మామూళ్ళు) చెల్లించుకోలేని మహిళల ఇళ్ళకు గూండాలు వచ్చి, ఉన్న వస్తువులను పట్టుకుపోతున్నారనీ ఆమె అంటున్నారు. ముఖ్యంగా, బిహార్ ఉత్తర ప్రాంతంలో మహిళలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారని ఆమె చెబుతున్నారు. తమపైన, తమ పిల్లలపైన హింసాయుత చర్యలు పేట్రేగిపోతున్నాయని వారిలో చాలా మంది వాపోయారని హష్మీ వెల్లడిస్తున్నారు. రేషన్ కార్డు సంపాదించడాని కైనా లేదా రేషన్ కార్డులో కొత్త పేర్లు చేర్చడానికైనా అడుగడుగునా లంచాలు చెల్లించుకోవాల్సి వస్తోందన్నది మహిళల నుంచి ఎదురైన మరో ప్రధాన ఫిర్యాదు. నితీశ్ కుమార్ మహిళలకు స్నేహపూర్వకమైన పథకాలు చేపడుతున్నారని చేస్తున్న ప్రచారంలో పస లేదనీ, వాస్తవానికి, సామూహికంగా వలసపోతున్న, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు మహిళల్లో పెరిగాయనీ హష్మీ మాట. కాగా, గత ఎన్నికల్లో ఆర్.జె.డి., ఇతర ప్రతిపక్షాల వైపు ఓటర్లు మొగ్గినట్లు విశ్లేషణలు సూచించిన ప్రాంతాల్లో మహిళలు, ముస్లింల పేర్లు మాయమయ్యాయని లక్నో యూనివర్సిటీ మాజీ వైస్–చాన్స్‌లర్ ప్రొఫెసర్ రూప్ రేఖ అభిప్రాయపడుతున్నారు. బీజేపీ కార్యకర్తలు లక్నోలో పార్టీకి అనుకూలమైన, వ్యతిరేకమైన ప్రతి గడపనూ గుర్తించడాన్ని ఆమె అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. ‘‘క్షేత్ర స్థాయిలో వారి (బీజేపీ) కార్యకర్తలు మరింత చురుకుగా ఉన్నారన్నది వాస్తవం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఏమైనా బిహార్‌లో తరాలలో మార్పు వచ్చిందనడంలో ఇసుమంత సందేహం కూడా అవసరం లేదు. తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్ ఈ మార్పునకు కరదీపకులుగా ఉన్నారు. బిహార్‌లో పాచికలు పైకి ఎగిరాయి. అవి ఎవరికి అనుకూలంగా పడతాయన్నది ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే!రష్మీ సెహగల్వ్యాసకర్త రచయిత్రి, సీనియర్ జర్నలిస్ట్(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
బీహార్ ‘గేమ్ ప్లాన్’.. లుకలుకలకు పుల్‌స్టాప్!
బీహార్‌లో గ్రాండ్ అలయన్స్(Mahaghat Bandhan) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు అంగీకారం తెలిపింది. సీనియర్ నేత అశోక్ గెహ్లాత్ చొరవతో కూటమి పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి.మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకాలపై ఇప్పటికీ ఓ స్పష్టత కొరవడిన సంగతి తెలిసిందే. లెక్క తేలకపోవడంతో ఎవరికివారే అభ్యర్థులను ప్రకటించుకుని నామినేషన్లు దాఖలు చేయించారు. ఈ క్రమంలో పలు స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. అయితే దీనిని ‘ఫ్రెండ్లీ పోటీ’గా అభివర్ణించుకున్న ఆర్జేడీ-కాంగ్రెస్‌లు.. మరో పక్క ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాత్, మాజీ ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్నాట్నాలో నిన్నంతా బిజీబిజీగా గడిపారు. భాగస్వామ్య పార్టీల కీలక నేతలతో సమావేశమై సీటు పంపకాలపై నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. మొత్తంగా 8 స్థానాల్లో పోటీ స్నేహపూర్వకంగా ఉండాలని నిర్ణయించుకున్నారని, మరీ ముఖ్యంగా తేజస్వి యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. కాంగ్రెస్ ఎంపీ అఖిలేష్ సింగ్ ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించారు. CPI (ML) నేత దీపంకర్ భట్టాచార్య త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు. -
బీహార్ పాలి‘ట్రిక్స్’.. బీజేపీలోకి ‘అనర్హత’ ఆర్జేడీ నేత
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీహార్‌లో నేతల జంప్ జిలానీ వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ఆర్జేడీ నేత అనిల్ సహానీ బుధవారం బీజేపీలో చేరారు. విశేషం ఏమిటంటే ఈయనను మూడేళ్ల క్రితం మోసం కేసులో సీబీఐ కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించటంతో అనర్హత వేటు పడి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.2012లో ఆయన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు ఫోర్జరీ విమాన టికెట్లు సమర్పించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసులో సీబీఐ కోర్టు విచారణ జరుపుతుండగానే 2020లో ఆర్జేడీ తరఫున కుర్హానీ నియోజవర్గంలో పోటీచేసి బీజేపీ నేత కేదార్ గుప్తను ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడేళ్ల క్రితం కోర్టు అనిల్‌ను దోషిగా తేల్చటంతో అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో కేదార్ గుప్త గెలిచి, రాష్ట్ర మంత్రి అయ్యారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ కార్యదర్శి వినోద్ తావ్డేల సమక్షంలో అనిత్ సహానీ బీజేపీలో చేరు. -
ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య గహ్లోత్ రాయబారం
పట్నా: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బిహార్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీల మధ్య ఏర్పడిన విభేదాలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌తో సమావేశమయ్యారు. కూటమిలోని ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకంపై ప్రతిష్టంభన ఏర్పడిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. లాలూతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఓడించాలంటే ఇండియా కూటమి పార్టీల్లో ఐక్యత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అయితే, ఇండియా కూటమి సీఎం అభ్యరి్థగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ను ప్రకటించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ‘నా నుంచి అలాంటి ప్రకటనను మీరు ఎందుకు ఆశిస్తున్నారు?’అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ‘రెండు నెలల క్రితం ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాం«దీ, తేజస్వీ కలిసి రాష్ట్రమంతా పర్యటించడాన్ని మీరంతా చూశారు. అన్ని విషయాలపై తగిన సమయంలో వారే తగిన నిర్ణయం తీసుకుంటారు’అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 143 సీట్లలో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 61 చోట్ల పోటీ పడుతోంది. అయితే, కొన్ని చోట్ల ఈ రెండు పార్టీలు స్నేహపూర్వక పోటీలోనూ ఉన్నాయి. ఆర్జేడీ నేతలు ఇటీవల ‘తేజస్వీ సర్కార్’నినాదం అందుకోవటంతో కాంగ్రెస్ కినుకు వహించినట్లు చెబుతున్నారు. -
‘జీవిక దీదీ’లకు ఆర్జేడీ బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు కీలక హామీలతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక బృందాల సభ్యు(జీవిక దీదీ)లకు ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘‘ రాష్ట్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కారి్మకులందరి ఉద్యోగాలను పరి్మనెంట్ చేస్తాం. జీవిక దీదీలుసహా మొత్తం 2,00,000 మంది కమ్యూనిటీ మొబిలైజర్ల ఉద్యోగాలను క్రమబదీ్ధకరిస్తా. కమ్యూనిటీ మొబిలైజర్లకు రూ.30,000 గౌరవ వేతనం అందిస్తా’’ అని తేజస్వీ ప్రకటించారు. ప్రపంచబ్యాంక్ ఆర్థికసాయంతో బిహార్ గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో ‘జీవిక’ పథకాన్ని ప్రారంభించడం తెల్సిందే.రూ.2,000 అదనపు అలవెన్స్ ‘‘మా ప్రభుత్వం వస్తే జీవిక దీదీలు ఇప్పటికే తీసుకున్న రుణాలను మాఫీ చేస్తా. వచ్చే రెండేళ్లపాటు ఇలాంటి వడ్డీ లేని రుణాలు మంజూరుచేస్తా. జీవిక దీదీలు అందరికీ రూ.5 లక్షల విలువైన ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తాం. ప్రభుత్వకార్యక్రమాల్లో నిమగ్నమైన వారికి నెలకు అదనంగా రూ.2,000 అలవెన్స్ ఇస్తా’’ అని తేజస్వీ అన్నారు. బిహార్‌లో ప్రస్తుతం దాదాపు 1.45 కోట్ల మంది జీవిక దీదీలున్నారు. ‘‘తాము అధికారంలోకి వస్తే 20 రోజుల్లోçపు ఉపాధి గ్యారంటీ పథకం తెస్తా. 20 నెలల్లోపు ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చేస్తా’’ అని తేజస్వీ గతంలోనే ప్రకటించడం తెల్సిందే. ‘‘జీవిక దీదీలకు లభిస్తున్న గౌరవ వేతనం చాలా తక్కువగా ఉంది. వారి సేవలకు తగిన గుర్తింపు లభించడం లేదు’’ అని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తేజస్వీ మండిపడ్డారు. ‘‘ నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రచారం జోరుమీదుంది. పాలనాపగ్గాలు ఎన్డీఏ కూటమి ఇవ్వకూడదని ఓటర్లు నిర్ణయించుకున్నారు. డబుల్ ఇంజిన్ మోతతో ఓటర్ల చెవులకు చిల్లులు పడ్డాయి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు, అవినీతి, నేరాలు నితీశ్ హయాంలో పెరిగాయి. నిరుద్యోగం, వలసలతో ప్రజలు విసిగిపోయారు’’ అని తేజస్వీ వ్యాఖ్యానించారు. -
Bihar Election: ‘లాలూ’కు చెక్ పెట్టిన రీతు.. స్వతంత్రంగా రంగంలోకి..
పట్నా:బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న విచిత్ర పరిణామాలు మీడియా కంట పడుతున్నాయి. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రీతూ జైస్వాల్.. ఆర్జేడీని వీడి బీహార్‌లోని పరిహార్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.రాష్ట్రీయ జనతాదళ్‌పై తిరుగుబాటు ప్రకటించిన జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ నేతలు తనకు టికెట్ నిరాకరించారని, ఇది ఆర్జేడీ నాయకత్వం తనకు తలపెట్టిన ద్రోహంగా ఆమె అభివర్ణించారు. తనను మరో నియోజకవర్గం నుంచి పోటీచేయాలని పార్టీ కోరిందని, అది తన మనస్సాక్షికి వ్యతిరేకమని, అందుకే తాను స్వతంత్రంగా నామినేషన్ వేయాలనుకున్నానని రీతూ జైస్వాల్ తెలిపారు.1977, మార్చి ఒకటిన హాజీపూర్‌లో జన్మించిన జైస్వాల్, ప్రభుత్వ మాజీ ఉద్యోగి అరుణ్ కుమార్ భార్య. కుమార్ తన గ్రామానికి సేవ చేసేందుకు, విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)తీసుకున్నారు. అతని భార్య జైస్వాల్ బీహార్ రాజకీయాల్లో ప్రముఖ నాయకురాలిగా పేరు సంపాదించారు. విద్య, మౌలిక సదుపాయాలు ఇతర సమస్యల పరిష్కారానికి ఆమె ప్రభుత్వంతో పోరాడుతుంటారు. రీతూ జైస్వాల్ రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు.2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆమె పరిహార్ స్థానం నుండి పోటీ చేశారు. అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గాయత్రి దేవి చేతిలో కేవలం 1,569 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో షియోహార్ నియోజకవర్గం నుండి పోటీ చేసి, ఓటమి చవిచూశారు. నాడు ఆమె జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ)నేత లవ్లీ ఆనంద్ చేతిలో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఆమెకు ఓటమి ఎదురైనప్పటికీ, క్షేత్రస్థాయిలో భారీ మద్దతు లభించింది.2020 బీహార్ ఎన్నికల్లో రెండు వేల కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఇప్పుడు పార్టీ తనకు టికెట్ నిరాకరించిందని రీతూ జైస్వాల్ ఆరోపించారు. నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఆమె ఎంతో భావోద్వేగానికి గురై, తాను రాజకీయ కుట్రకు బలయ్యానని పేర్కొన్నారు. జైస్వాల్‌ను బెల్సాండ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని పార్టీ కోరింది. అయితే ఆమె పరిహార్ నుండి పోటీ చేస్తానని పట్టుబట్టారు. -
Bihar Election: మహిళలకు శాశ్వత ఉద్యోగం: తేజస్వీ భారీ హమీ
పట్నా: బిహార్‌లో వచ్చేనెల(నవంబర్)లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో నేతల ప్రచార పర్వం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ రాష్ట్రంలోని మహిళలకు భారీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘జీవికా దీదీ’లకు ఉద్యోగం పర్మినెంట్ చేయడంతోపాటు, నెలకు రూ.30 వేల జీతం అందిస్తామన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న ‘జీవికా దీదీ’ పథకంలోని లోపాలను చక్కదిద్ది, మహిళలకు అండగా ఉంటామని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఆర్జేడీ నేత నేత తేజస్వీ యాదవ్ తన ఎన్నికల ప్రచారంలో ‘జీవికా దీదీ’లపై హామీల వర్షం కురిపించారు. బిహార్‌లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ‘జీవికా దీదీ’లకు రూ. 30 వేల జీతంతోపాటు వారు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వ చేపట్టిన ‘జీవికా దీదీ’ పథకం తీరుతెన్నులపై తేజస్వీ పలు విమర్శలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ‘జీవికా దీదీ’లకు అన్యాయం జరుగుతున్నదనే విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ పథకంలోని మహిళలను పర్మినెంట్ చేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని తాము నిర్ణయించామని తేజస్వీ పేర్కొన్నారు. వారి జీతం కూడా నెలకు రూ. 30 వేలకు పెంచుతామని, ఇది సాధారణ ప్రకటన కాదని అన్నారు. జీవికా దీదీల దీర్ఘకాల డిమాండ్ సాకారం చేయనున్నామని తేజస్వి యాదవ్ పట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. జీవికా దీదీల ప్రస్తుత రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామని, రాబోయే రెండేళ్లకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. దీనికితోడు ప్రతి జీవికా దీదీకి నెలకు రూ. రెండువేల అదనపు భత్యం, రూ. ఐదు లక్షల బీమా కవరేజ్ అందిస్తామన్నారు. కాగా ‘జీవికా దీదీ’ పథకం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. -
బీహార్‌లో బిగ్ ట్విస్ట్.. బీజేపీ బెదిరింపుల వల్లే తప్పుకున్నాం: పీకే సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ ఎన్నికల్లో(bihar Assembly Election) బీజేపీ ఒత్తిళ్ల కారణంగానే తాము ముగ్గురు అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయాల్సి వచ్చిందని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(prashant Kishor) ఆరోపించారు. మంగళవారం ఆయన పట్నాలో మీడియాతో మాట్లాడారు. దానాపూర్, బ్రహాంపూర్, గోపాల్‌గంజ్ సీట్ల నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. ఓటమి భయంతోనే ఎన్డీయే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులకు గురి చేస్తోందన్నారు.ఈ సందర్బంగా ప్రశాంత్ కిషోర్.. ‘ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ఇలాంటి పరిణామాలు దేశంలో ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు తగు భద్రత కల్పించాలి’ అని ఆయన కోరారు. ఆదివారం వరకు పార్టీ తరఫున చురుగ్గా పనిచేసిన బ్రహాంపూర్‌లో తమ అభ్యర్థి సత్యప్రకాశ్ తివారీ సోమవారం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ(BJP Party) ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం తివారీ ఇంటికి వెళ్లి తీవ్రంగా బెదిరించారన్నారు.బీజేపీ నేతలు బెదిరింపుల వల్లే పోటీ నుంచి వైదొలగుతున్నట్లు గోపాల్‌గంజ్‌లోని తమ అభ్యర్థి శేఖర్ సిన్హా, దాన్‌పూర్‌లో అభ్యర్థి అఖిలేశ్ షా తనకు చెప్పారని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని, ప్రజల్లో సడలుతున్న విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పాలన్నారు. అభ్యర్థులనే కాపాడలేని ఈసీ, ఓటర్లకు ఎలా రక్షణ కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఎవరూ పట్టించుకోవడం లేదని భావించిన ప్రశాంత్ కిశోర్ బీజేపీ నేతలపై ఆరోపణల ద్వారా ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడింది. -
అమిత్ షా కామెంట్స్.. నితీశ్‌కు టెన్షన్!
బిహార్ శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. మొదటి దశ పోలింగ్‌కు సరిగ్గా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రధాన కూటములు ఎన్డీఏ, మహాఘఠ్బందన్ గెలుపు వ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఒకవేళ ఎన్డీఏ గెలిస్తే ముఖ్యమంత్రి పీఠం ఎవరు అధిష్టిస్తారనే అనుమానం తాజాగా మొదలయింది. బిహార్‌కు అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన 74 ఏళ్ల నితీశ్ కుమార్‌కు మరో చాన్స్ ఉంటుందా, లేదా అనే చర్చ నడుస్తోంది. నితీశ్ మద్దతుదారులు మాత్రం ఆయనే మళ్లీ సీఎం అంటూ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.తాజా ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే, ఎవరు సీఎం అవుతారనే దానిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలతో నితీశ్ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక టీవీ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. "నితీష్ మా ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ముందుగా తమ తమ పార్టీ నాయకులను ఎన్నుకుంటారు. తర్వాత వారు కలిసి కూర్చుని తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయిస్తారు" అని అన్నారు.నితీశ్‌కు బీజేపీ ధోకాఅమిత్ షా వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. నితీశ్ కుమార్‌కు బీజేపీ ధోకా ఇవ్వడం ఖాయమన్నట్టుగా ప్రచారం మొదలు పెట్టాయి. నితీశ్ మరోసారి సీఎం కాలేరని అమిత్ షా స్పష్టంగా చెప్పారని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. కాంగ్రెస్ మాటలను నమ్మవద్దని ఎక్స్‌లో బీజేపీ వీడియో షేర్ చేసింది. అమిత్ షా మాటలను కాంగ్రెస్ పార్టీ వక్రీకరించిందని, స్వప్రయోజనాల కోసం బిహార్ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కమలనాథులు కౌంటర్ ఇచ్చారు.షాకు చిరాగ్ మద్దతు!అమిత్ షాకు మద్దతుగా బీజేపీ కీలక మిత్రుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. "ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని ఎన్నుకునే సాధారణ ప్రక్రియ గురించి అమిత్ షా ప్రస్తావించారు. ఐదు పార్టీలతో కూడిన మా కూటమిలో గెలిచిన ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ ప్రక్రియను గౌరవించాలి" అని అన్నారు. కాగా, సీట్ల పంపిణీ వ్యవహారంలో చిరాగ్ గట్టిగా పట్టుబట్టి లోక్ జన్ శక్తి పార్టీకి 29 సీట్లు సాధించుకున్న సంగతి తెలిసిందే.ముందే ప్రకటించాలిహిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) వ్యవస్థాపక అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మాత్రం భిన్నంగా మాట్లాడారు. కూటమిలో క్లారిటీ, యునిటీ కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందే ప్రకటించాలన్నారు. ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీశ్ కుమారే అంటూ రాష్ట్రీయ లోక్‌మంచ్ (RLM) జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా ప్రకటించారు. నితీశ్ నాయకత్వంలో ఎన్నికల్లో గెలుస్తామని, మళ్లీ అధికారంలోకి వస్తామని మీడియాతో అన్నారు.పీకే జోస్యం ఫలిస్తుందా?నితీశ్ కుమార్‌కు ఈసారి అధికార యోగం లేదని జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చెబుతూ వస్తున్నారు. జేడీయూకి పరాభవం తప్పదని, 25 సీట్లు కూడా రావని ఆయన అంటున్నారు. శారీరకంగా అలసిపోయి, మానసికంగా బలహీనపడిన నితీశ్ కుమార్ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించలేరని పేర్కొన్నారు. జేడీయూ సంప్రదాయ ఓట్లకు జన్ సురాజ్ పార్టీ గండి కొడుతుందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేస్తున్నారు.చదవండి: 3 కోట్ల లగ్జరీ కారు.. 35 లక్షల బంగారంనల్లేరు మీద నడక కాదుబిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ ఫేస్‌గా నితీశ్ కుమార్ ప్రస్తుతం ఉన్నప్పటికీ తర్వాత పరిస్థితుల గురించి అమిత్ షా సూచనప్రాయంగా వెల్లడించడంతో చర్చ మొదలైంది. ఒకవేళ ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలు సాధించి, జేడీయూకు తక్కువ సీట్లు వస్తే నితీశ్‌కు సీఎం పదవి కట్టబెడతారా, లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 14న వెలువడే ఎన్నికల ఫలితాలపై నితీశ్ భవితవ్యం ఆధారపడి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
3 కోట్ల లగ్జరీ కారు.. 35 లక్షల బంగారం..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. టిక్కెట్లు దక్కించుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన భోజ్‌పురి సూపర్‌స్టార్ ఖేసరి లాల్ యాదవ్ తాజాగా నామినేషన్ వేశారు. సరన్ జిల్లాలోని చాప్రా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అభ్యర్థిగా పోటీకి దిగారు.నామినేషన్ వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ''నా హృదయం ఎప్పుడూ ఆర్జేడీతోనే ఉంద''ని అన్నారు. నామినేషన్ వేయడానికి ఒకరోజు ముందు ఆయన తన భార్య చందాతో కలిసి ఆర్జేడీలో చేరారు. ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) సాదరంగా ఖేసరి లాల్ యాదవ్, ఆయన భార్యను పార్టీలోకి ఆహ్వానించారు. వారికి స్వయంగా పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు.కాగా, తన ఆస్తుల విలువ ₹24.81 కోట్లు అని ఖేసరి లాల్ యాదవ్ (Khesari Lal Yadav) ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ₹16.89 కోట్ల విలువైన చరాస్తులు, ₹7.91 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. భార్య చందా యాదవ్ కు ₹90.02 లక్షల విలువైన చరాస్తులు, ₹6.49 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. తన అసలు పేరు శత్రుఘ్న యాదవ్‌గా అఫిడవిట్లో పేర్కొన్నారు. తన వద్ద ₹5 లక్షల నగదు.. తన సతీమణి వద్ద ₹2 లక్షల నగదుతో పాటు ₹35 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. 2023–24లో ఖేసరి లాల్ యాదవ్ వార్షిక ఆదాయం ₹73.5 లక్షలుగా ఉంది. 2022–23లో ₹95.02 లక్షలు, 2020–21లో ₹1.01 కోట్లుగా ఉంది. ఖేసరి లాల్ యాదవ్ ఆస్తుల్లో 2023లో కొనుగోలు చేసిన ₹3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ లగ్జరీ కారు కూడా ఉంది.పాలు అమ్మి.. స్టార్‌గా ఎదిగిసామాన్య కుటుంబంలో పుట్టిన ఖేసరి లాల్ యాదవ్ తన ప్రతిభతో సెలబ్రిటీగా ఎదిగారు. ఆయన తండ్రి మంగరు యాదవ్ ఒకప్పుడు ఉదయం వీధి వ్యాపారిగా, రాత్రిళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. తన బాల్యంలో తమ గ్రామంలో పశువులను మేపుతూ పాలు అమ్మేవాడినని ఖేకరీ పలు సందర్బాల్లో చెప్పారు. నటుడిగా, గాయకుడిగా ఎదిగిన ఆయన వందకు పైగా భోజ్‌పురి చిత్రాలలో నటించారు. 5 వేలకు పైగా పాటలు పాడారు. తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించాలని భావిస్తున్నారు.చదవండి: బిహార్ ఎన్నికల్లో 'వెరైటీ' ఫ్రెండ్లీ ఫైట్!యువతలో ఫాలోయింగ్భోజ్పురిలో ఖేసరి లాల్ యాదవ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత, వలస కార్మికులు ఆయనను బాగా ఇష్టపడతారు. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన సరన్ జిల్లాలో ఖేసరి లాల్ యాదవ్ ప్రభావం ఉంటుందని ఆర్జేడీ అంచనా వేస్తుంది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి విడత పోలింగ్ నవంబర్ 6న, రెండో దశ పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి. -
బిహార్ ఎన్నికల్లో ‘వెరైటీ’ ఫ్రెండ్లీ ఫైట్!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య లుకలుకలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపకంపై స్పష్టమైన ప్రకటనేదీ చేయకుండానే రాష్ట్రీయ జనతాదళ్(RJD), కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు.. తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించేశాయి. దీంతో మహాఘట్ బంధన్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. పైగా కీలకమైన 11 స్థానాల్లో మిత్రపక్షాల అభ్యర్థులు తలపడబోతుండడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఈ పోటీని ఫ్రెండ్లీ ఫైట్‌గా అభివర్ణించుకున్నప్పటికీ.. బీజేపీ, జేడీయూ, ఇతర ఎన్డీయే మిత్రపక్షాలు మాత్రం విపక్ష కూటమిని ఎద్దేవా చేస్తున్నాయి. ఈలోపు.. ఊహించని పరిణామం ఒకటి అక్కడి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే.. తన పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ప్రచారం చేయాల్సి రావడం!.గౌర బౌరమ్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థి అఫ్జల్ అలీ ఖాన్ పోటీ చేస్తున్నారు. అయితే తేజస్వి యాదవ్ అఫ్జల్ తరఫున కాకుండా వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(VIP Candidate) సంతోష్ సాహ్నికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు.గౌర బౌరమ్ నియోజకవర్గంలో పోటీకి ఆర్జేడీ తరఫున అఫ్జల్ అలీ ఖాన్‌ను తొలుత అధిష్టానం ఎంచుకుంది. ఆ పార్టీ అధినేత లాలూ తన నివాసానికి పిలిచి మరీ అఫ్జల్‌కు పార్టీ గుర్తు (లాంతరు)తో క్లియరెన్స్ ఇస్తూ సీల్డ్ కవర్ అందజేశారు. ఆ సంతోషంలో.. ఆలస్యం చేయకుండా ప్రచారంలోకి దిగిపోయారు. ఆ వెంటనే నామినేషన్ దాఖలు చేశారు.ఈలోపు.. లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ఎంట్రీతో సీన్ మారింది. సీట్ల పంపకంలో భాగంగా.. గౌర బౌరమ్ను వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి అప్పగించినట్లు లాలూకు వివరించారు. ఆపై నామినేషన్ వెనక్కి తీసుకోవాలని అఫ్జల్‌ను కోరారు. కానీ అందుకు ఆయన నిరాకరించాడు. ఈలోపు నామినేషన్ల గడువు ముగిసిపోయింది. దీంతో ఎన్నికల అధికారులను ఆర్జేడీ ఆశ్రయించింది. అయితే రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లో అభ్యంతరాలు లేవని చెబుతూ.. పోటీ నుంచి తొలగించలేమని చేతులెత్తేశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈవీఎం మీద ఆర్జేడీ లాంతర్ గుర్తుతో అఫ్జల్ అలీ అధికారికంగా పోటీ చేయబోతున్నారు. అలా మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకాల గ్యాప్ వల్ల తన పార్టీ గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థికి వ్యతిరేకంగా తేజస్వి ప్రచారం చేసే అరుదైన పరిస్థితి ఏర్పడింది(Gaura Bauram RJD Fight).2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గౌర బౌరమ్ స్థానం వీఐపీ పార్టీకి చెందిన స్వర్ణ సింగ్‌కు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నెగ్గిన ఆమె తర్వాత బీజేపీలో చేరారు. అంతకు ముందు.. 2015, 2010 ఎన్నికల్లో జేడీయూ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. కొసమెరుపు.. పైన చెప్పుకున్న సందర్భం మొదటిసారేం కాదు. కిందటి ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ రాజస్థాన్ బన్స్వారా నియోజకవర్గంలో ఇదే తరహ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అరవింద్ దామోత్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆపై మనసు మార్చుకున్న హైకమాండ్ భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్‌కుమార్ రౌత్‌కు సీటు కేటాయిస్తూ.. తన అభ్యర్థిని సింబల్ రిటర్న్ చేయమని కోరింది. అయితే పార్టీకి మస్కా కొట్టి నామినేషన్ ఉపసంహరణ గడువు దాకా దామోత్ అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో.. కాంగ్రెస్‌కు తన అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే ఆ ఎన్నికల్లో రౌత్ విజయం సాధించినప్పటికీ.. దామోత్కు 60 వేల ఓట్లు పోలయ్యాయి. -
‘మరీ ఇంత వెన్నుపోటు రాజకీయమా?’ ఇండియా కూటమిపై జేఎంఎం సంచలన ఆరోపణలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమి (బీహార్ మహా ఘట్బంధన్) భాగస్వామి జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)నేతలు కాంగ్రెస్, ఆర్జేడీలపై సంచలన ఆరోపణలు చేశారు. పొత్తులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా. ఏమైందంటే..బీహార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించక ముందే కాంగ్రెస్, ఆర్జేడీ, జేఎంఎంలు మహా ఘట్బంధన్ పేరుతో ఒక్కతాటిపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో సీట్ల పంపకం ఎంతకీ తెగలేదు. కాంగ్రెస్ పార్టీ తనకు 70కుపైగా సీట్లు కావాలని డిమాండ్ చేయడం, అన్ని సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని ఆర్జేడీ భీష్మించుకున్నాయి. తరువాతి కాలంలో ఇరుపక్షాలు కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించడంతో తగిన సమయంలోనే ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఇదిలా ఉంటే.. జార్ఖండ్ ముక్తి మోర్చా పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. తాము 12 సీట్లు కావాలని కోరామని, అయితే ఘట్ బంధన్ భాగస్వాములు సీట్ల పంపకంలో తమను అసలు లెక్కలోకే తీసుకోలేదని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య ఆరోపించారు. మూడు రోజుల క్రితమే ఈ పార్టీ తాము అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించిన సంగతి ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. సీట్ల పంపకంపై ఘట్ బంధన్ నుంచి స్పందన లేకపోవడంతోనే తామీ నిర్ణయానికి వచ్చినట్లు (జేఎంఎం) ప్రకటించింది. కాంగ్రెస్, ఆర్జేడీలపై ఒత్తిడి తెచ్చేందుకే చేసిన ఈ ప్రకటన ఫలితమేమీ ఇవ్వలేదు. నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువైన ఆదివారం కూడా సీట్ల పంపిణీ పంచాయతీ తేలలేదు. జేఎంఎం అభ్యర్థులనూ ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు అయ్యింది. ఈ నేపథ్యంలో జేఎంఎం కీలక నేత, జార్ఖండ్ మంత్రి సుదివ్య కుమార్ సైతం కాంగ్రెస్, ఆర్జేడీలపై విమర్శలు గుప్పించారు. సీట్ల పంపకంలో తమ పార్టీని పక్కన పెట్టారని.. వెన్నుపోటు రాజకీయం చేశారని ఆయన ఆరోపించారు. అభ్యర్థులను నిలబెట్టమని చెప్పకుండా, చివరి నిమిషం వరకు స్పష్టత ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. అంతేకాదు.. ఆర్జేడీ-కాంగ్రెస్‌లు ‘కూటమి ఒప్పందాన్ని’ సైతం గౌరవించలేదని అన్నారు.తొలిసారి..ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు జేఎంఎం దూరం కావడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. బీహార్-జార్ఖండ్ సరిహద్దు రాష్ట్రాల నియోజకవర్గాలైన జమై, చకాయి, ధమదాహా, మనిహారి, పిర్పైంటి, కటోరియా.. తదితర ప్రాంతాలలో ఆ పార్టీ క్రమం తప్పుకుండా పోటీ చేస్తుంటుంది. 2020 ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసినా ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. బీహార్ ఎన్నికల నుంచి జేఎంఎం తప్పుకోవడంపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘బీహార్ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసిపోయింది. కానీ JMM ఒక్క అభ్యర్థిని కూడా బరిలో నిలపలేకపోయింది. భారీ ప్రకటనలు చేసే ఆ పార్టీ.. ఈసారి ఏం చేసింది?. జార్ఖండ్ పరువు ప్రతిష్టలను దిగజారుస్తూ సిగ్గులేకుండా వ్యవహరించారని BJP ప్రతినిధి ప్రతుల్ షాహ్దేవ్ మండిపడ్డారు.ముదురుతున్న విబేధాలు..బీహార్ అసెంబ్లీ ఎన్నికల (2025) నేపథ్యంలో రాష్ట్రీయ జనతా దళ్ (RJD), కాంగ్రెస్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు INDIA కూటమిలో భాగస్వాములు అయినప్పటికీ.. సీటు పంపకాలపై ఏకాభిప్రాయానికి రావడం లేదు. ఈ గందరగోళం మధ్య.. ఆర్జేడీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకుంది. అలాగే.. కాంగ్రెస్ 61 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా సీట్లలో వామపక్షాలకు, అలాగే.. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి 15 సీట్లు పోనున్నట్లు తెలుస్తోంది. సీట్ల పంపకాలపై అధికారిక ప్రకటన.. స్పష్టత లేకపోవడంతో కాంగ్రెస్-ఆర్జేడీలు ఐదు నియోజకవర్గాల్లో ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. అలాగే.. కాంగ్రెస్ మరికొన్ని స్థానాలలో వామపక్షాల కూటమితోనూ పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీహార్ ఎన్నికలు నవంబర్ 6, 11వ తేదీల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది. నామినేషన్ల గడువు ముగియడంతో.. ప్రచార కార్యక్రమాలు ఇవాళ్టి (అక్టోబర్ 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముజఫ్ఫర్‌పూర్ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. బీజేపీ నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు.ఇదీ చదవండి: హోరాహోరీ పోరు! ఎలా ఉందంటే.. -
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఆర్జేడీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం (అక్టోబర్20)రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) 143 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అనూహ్యంగా పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరుపుతున్న ఇండియా కూటమి అభ్యర్థులపై పోటీగా ఆర్జేడీ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇక ఆర్జేడీ విడుదల చేసిన జాబితాలో 24 మంది మహిళలు,18 మంది ముస్లిం అభ్యర్థులు ఉన్నారు.ఆర్జేడీ 143 మంది అభ్యర్థులను ప్రకటించడంతో మహాగఠ్‌బంధన్ (విపక్షాల మహా కూటమి)లో సీట్ల పంపకాల ఫార్ములా ఆర్జేడీ (143), కాంగ్రెస్ (55), సీపీఐఎంఎల్(20), సీపీఐ(6),సీపీఎం(4),వీఐపీ (15) సీట్లు ఉన్నాయి. ఓ వైపు కాంగ్రెస్ ఇప్పటికే 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. RJD releases its list of candidates for the Bihar Assembly Election 2025, fielding candidates in 143 seats. RJD leader Tejashwi Yadav will contest from the Raghopur assembly seat in Vaishali district. pic.twitter.com/wSsMEj8gdm— ANI (@ANI) October 20, 2025 -
బిహార్‌లో హోరాహోరీ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. మొత్తం రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి అంకానికి తెరలేచింది. నవంబర్ 6వ తేదీన మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో 18 జిల్లాల పరిధిలోని 121 శాసనసభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోరు ముఖ్యంగా అధికార, విపక్ష కూటముల్లోని ప్రధాన పార్టీలైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), లాలు ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రా్రïÙ్టయ జనతాదళ్ (ఆర్జేడీ)లకే అగ్నిపరీక్షగా మారింది. తొలి దశలోని అత్యధిక స్థానాల్లో ఈ రెండు పార్టీలే పోటీ పడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బరిలో ఎవరెవరు? తొలి దశ ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులు కలిపి మొత్తం 1698 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఎన్డీయే, మహాఘట్బంధన్ కూటముల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. మహాఘట్బంధన్ కూటమి నుంచి ఆర్జేడీ ఏకంగా 71 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 25, సీపీఐ (ఎంఎల్) 13 చోట్ల బరిలో ఉన్నాయి. ఎన్డీయే తరఫున జేడీయూ 57 సీట్లలో, బీజేపీ 48, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి (రామ్ విలాస్) పార్టీ 14 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ముఖాముఖి పోరు.. హోరాహోరీ! ఈ 121 స్థానాల్లో అనేక చోట్ల నువ్వా–నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ముఖ్యంగా 36 కీలక స్థానాల్లో ఆర్జేడీ, జేడీయూ అభ్యర్థులు నేరుగా తలపడుతున్నారు. మరో 23 స్థానాల్లో ఆర్జేడీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా, ఇంకో 23 సీట్లలో కాంగ్రెస్–బీజేపీ మధ్య ముఖాముఖి పోరు జరగనుంది. దిగ్గజాల భవితవ్యం.. పరువు కోసం పోరు! తొలి దశ ఎన్నికలు పలువురు రాజకీయ దిగ్గజాలు, ప్రముఖుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి (తారాపూర్), విజయ్ కుమార్ సిన్హా (లఖిసరాయ్) భవితవ్యం కూడా ఈ దశలోనే తేలనుంది. వీరితో పాటు భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్ (చప్రా నుంచి), జానపద గాయని మైథిలీ ఠాకూర్ (అలీనగర్ నుంచి) వంటి సెలబ్రిటీ అభ్యర్థులు కూడా బరిలో ఉండటం ఆసక్తిని రేపుతోంది. వీరే కాకుండా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు సైతం తొలి విడతలోనే తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో మొదటి దశ ఫలితాలు తదుపరి దశలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
నమ్మక ద్రోహుల ఓట్లు నాకు అక్కర్లేదు
పట్నా: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలుచేసే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి మైనారిటీలపై అనుచితంగా మాట్లాడారు. బిహార్‌లో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఆదివారం అర్వాల్ జిల్లాలో గిరిరాజ్ మాట్లాడారు. ‘‘ఒకసారి నేను మౌల్వి(ముస్లిం మతాధికారి)ని ఒక ప్రశ్న వేశా. మీకు కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యకార్డ్ ఉందా? అని అడిగితే ఉంది అని చెప్పారు. హిందూ–ముస్లిం ప్రాతిపదికన మాత్రమే ప్రభుత్వం ఈ కార్డ్‌లు ఇచ్చిందని భావిస్తున్నారా? అని అడిగితే లేదు అని సమాధానం చెప్పారు. మీకు నాకు ఓటేశారా? అంటే అవునన్నారు. మరి ఖుదా (దైవం) మీద ప్రమాణంచేసి నిజం చెప్పండి అంటే ఆయన చెప్పలేదు. ముస్లింలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ వాడుకుంటారు. వాటి ప్రయోజనాలు, లబ్ధి పొందుతారు. కానీ ఓటు మాత్రం మాకు వేయరు. ఇలాంటి వాళ్లనే నమ్మకద్రోహులు అంటారు. మీలాంటి వాళ్ల ఓటు నాకు వద్దు అని ఆయన ముఖం మీదనే చెప్పేశా’’ అని ర్యాలీలో గిరిరాజ్‌సింగ్ వెల్లడించారు. ‘‘బిహార్‌లో మొత్తం మౌలికసదుపాయాల కల్పనకు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో చేసింది. బిహార్‌లో రోడ్డు కేవలం ఎన్డీఏ నేతల కోసం వేయలేదు. మొత్తం ప్రజల కోసం వేశారు. ఇప్పుడు బిహార్ ఎంతో మారింది. సమాజంలోని ప్రతి వర్గం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది. అయినాసరే ముస్లింలు బీజేపీకి ఓటు వేయట్లేరు’’ అని ఆయన అన్నారు. మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ -
ఎవరీ పుష్పం ప్రియా చౌదరి..? రాజకీయాల్లో సరికొత్త ఫైర్ బ్రాండ్లా..
విదేశీ విద్య నేపథ్యంతో రాజకీయాల్లో సరికొత్త బ్రాండ్లా ప్రభంజనం సృష్టించాలనుకుంటోంది. మత, కులాలకు అతితంగా ఫైర్‌బ్రాండ్ పాలిటిక్స్‌తో దూసుకుపోవాలనుకుంటోంది. అంతేగాదు బిహార్ రాష్ట్రానికి సరికొత్త పాలిటిక్స్‌ని పరించయం చేస్తూ..నాయకురాలిగా పెనుమార్పుకి శ్రీకారం చుట్టాలనుకుంటోంది. ఆమె పొలిటికల్ వ్యూహం, డ్రెస్సింగ్ విధానం రాజకీయనాయకుల వేషధారణ, ఆలోచనలకే అత్యంత విరుద్ధం. గెలుస్తుందో లేదో తెలియదు గానీ..ఆమె ఆహార్యం నుంచి..రాజకీయ వ్యూహాల వరకు ప్రతీది అత్యంత విభిన్నం. యువ రాజకీయ నాయకురాలికి సీఎం రేసులో గెలిస్తే..సరికొత్త చరిత్రను క్రియేట్ చేయడమే కాదు..పాలిటిక్స్‌లో యువ సత్తా ఏంటన్నది తెలుస్తుంది. ఇంతకీ ఎవరామె..? రాజకీయాల్లో ఎలాంటి బ్రాండ్ సెట్ చేయాలనుకుంటుంది అంటే..ఆ అమ్మాయే యునైటెడ్ కింగ్డమ్ నుండి తిరిగి వచ్చిన పుష్పం ప్రియా చౌదరి. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలనేది ఆమె ప్రగాఢ ఆకాంక్ష. 2020లో 'ది ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించిన పుష్పం ప్రియా చౌదరి కుల, మతాలకు అతీతంగా సరికొత్త బ్రాండ్ రాజకీయాలను బిహార్ రాష్ట్రానికి పరిచయం చేయాలనుకుంటోంది. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి..సరికొత్త నారీశక్తిగా ఓ వెలుగు వెలగాలనే ఉత్సాహంతో ఉంది. ఆమె బిహార్‌లోని దర్భంగా నుంచి పోటీ చేస్తోంది. ప్రియా 2020లో తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లుగా మెగా అడ్వర్టైస్మెంట్ ఇచ్చి మరీ..రాజకీయల్లోకి ప్రవేశించింది. అయితే ఆమె గెలుపుని అందుకునేంత వరకు నలుపు దుస్తులు, బ్లాక్మాస్క్లోనే ఉండాలని ప్రతిజ్ఞ చేయడం విశేషం. కుటుంబ నేపథ్యం..పుష్పం ప్రియ దర్భంగాకు చెందిన మాజీ జెడీయూ శాసనసభ్యుడు వినోద్ కుమార్ చౌదరి కుమార్తె. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితుడు. ఆమె మామ వినయ్ కుమార్ చౌదరి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెనిపూర్ నుంచి గెలిచిన జేడీయూ నాయకుడు. జూన్ 13, 1987న జన్మించిన పుష్పం ప్రియ దర్బంగాలోనే తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఆ తర్వాత యూకేలో ఉన్నత విద్యను అభ్యసించింది. 2019లో సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డెవలప్మెంట్ రీసెర్చ్‌లో మాస్టర్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పూర్తించేసిందామె. అతేగాదు తన పార్టీ పేరు ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుందని చెబుతోందామె. ది ప్లూరల్స్ పార్టీ అనగా అన్ని కులాల, మతాల ప్రజలు కలిసి పాలించడం అని సరికొత్త అర్థం వివరించింది. ఇంతవరకు ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పదాలను ఉచ్ఛరించిలేకపోయారు. మరి ఈ పదం వారికి ఎలా అలవాటవుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రంగు దుస్తులే ఎందుకంటే..రాజకీయ నాయకులు అనగానే తెల్లటి దుస్తులే ఎందుకు ధరిస్తారనేది తనకు అస్సలు తెలియదని అంటోంది. అయతే తాను మాత్రం నలుపు రంగు దుస్తులనే ధరిస్తానని, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించే వరకు ఇలా నల్లటి దుస్తులు, ముసుగుతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయినా అందరి రాజకీయ నాయకులలా కాదని, తనకంటూ ఒక సిద్ధాంతం ఉందని అంటోంది. కాగా, ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ..అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ కంటూ తీవ్రమైన నాయకుడని అభిప్రాయం వెలిబుచ్చింది. ఇక నితీష్ కుమార్ ఇప్పటి వరకు బిహార్‌ని పాలించిన వారి జాబితాలో అత్యత్తుమ ముఖ్యమంతిగా పేర్కొనడం విశేషం. అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యహకర్తగానే ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావించకూడదంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.(చదవండి: ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..) -
Bihar Elections: 25 మంది అభ్యర్థులను ప్రకటించిన ఏఐఎంఐఎం
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తొలిదశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ముస్లిం నేత అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే 25 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆదివారం విడుదల చేసింది. బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న లెక్కింపు ఉంటుంది. ఏఐఎంఐఎం పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో.. ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బీహార్‌లో అత్యంత అణగారిన ప్రజల గొంతుకగా పార్టీ నిలుస్తుందని దానిలో పేర్కొంది. పార్టీ జాతీయ నాయకత్వం అభ్యర్థులను ఎంపికచేసింది. అమౌర్ నుండి అఖ్తరుల్ ఇమాన్(పార్టీ సీనియర్ నేత), గోపాల్‌గంజ్ నుండి అనస్ సలాం, కిషన్‌గంజ్ నుండి న్యాయవాది షమ్స్ ఆగాజ్, నర్కటియా నుండి షమీముల్ హక్, బహదూర్‌గంజ్ నుండి తౌసీఫ్ ఆలం, నవాడా నసీమా ఖాటూన్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. बिहार विधानसभा चुनाव के AIMIM प्रत्याशियों के नाम कुछ इस तरह हैं। इंशाअल्लाह उम्मीद है कि हम बिहार के सबसे मज़लूम लोगों की आवाज़ बनेंगे। यह सूची AIMIM बिहार यूनिट ने तैयार की है और इस सिलसिले में पार्टी की क़ौमी कियादत से भी मशविरा किया गया है।We are happy to announce the list… pic.twitter.com/9ec1t4KpR2— AIMIM (@aimim_national) October 19, 2025243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ భారీ స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ,జేడీయూలతో కూడిన అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఇందుకు ముమ్మర కసరత్తు చేసింది. అక్టోబర్ 24 నుండి ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అంతటా 12 ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు కీలక నియోజకవర్గాలలో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఎన్డీఏలో సమన్వయం కనిపిస్తుండగా, ‘మహాఘట్ బంధన్’ (గ్రాండ్ అలయన్స్)లో సీట్ల పంపకాల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, సంకీర్ణ వ్యూహం ఇంకా అస్పష్టంగానే ఉంది. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆరు నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 18న తన రెండవ జాబితాను విడుదల చేసింది. దానిలో శాశ్వత్ పాండే (నర్కటియాగంజ్), జితేందర్ యాదవ్(పూర్నియా), మహమ్మద్ కమ్రుల్ హోడా(కిషన్‌గంజ్), మహమ్మద్ ఇర్ఫాన్ ఆలం (కస్బా), మోహన్ శ్రీవాస్తవ (గయా టౌన్) తదితరులు ఉన్నారు. -
Bihar Elections: గేదెనెక్కి ఒకరు.. సంకెళ్లతో మరొకరు.. తెగ నవ్విస్తున్న అభ్యర్థులు
పట్నా: బీహార్‌కు ఎన్నికల పండుగొచ్చింది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో చిత్రవిచిత్రాలు మీడియా కంటపడుతున్నాయి. నామినేషన్లకు వస్తున్న అభ్యర్థులు అందరినీ అకట్టకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు గేదెపై ఊరేగుతూ నామినేషన్ వేసేందుకు వస్తుండగా, మరికొందరు చేతులకు సంకెళ్లు వేసుకుని, మద్దతుదారులను వెంటేసుకుని వస్తున్నారు. गोपालगंज के बरौली में हथकड़ी में बंद धर्मेंद्र कुमार 'क्रांतिकारी' पुलिस की सुरक्षा में नामांकन करने पहुंचे. हथकड़ी हाथ में थी, आंखों में आंसू थे, और जुबान पर गाना था. लोगों की भीड़ जमा हो गई, कोई वीडियो बना रहा था, कोई लाइव चला रहा था.नेताजी बोले, “मैं साजिश का शिकार हूं, जनता… pic.twitter.com/kW5ZXwomWF— NDTV India (@ndtvindia) October 19, 2025లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చెందిన జనశక్తి జనతాదళ్ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర కుమార్ శుక్రవారం బరౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఈ సందర్బంగా అతని చేతులకు సంకెళ్లు ఉన్నాయి. ఈయన కలెక్టరేట్ వద్దకు చేరుకోగానే విలేకరులు, జనం ఆయన చుట్టూ గుమిగూడారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ ‘నేను కుట్రకు బలైపోయాను. అయితే ఇప్పుడు ప్రజల నుండి న్యాయం కోరుకుంటాను’ అని అన్నారు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. तेज प्रताप यादव के प्रत्याशी अरुण यादव भैंस पर चढ़कर नामांकन करने पहुंचे#BiharElection2025 pic.twitter.com/X86XD0BRjo— NDTV India (@ndtvindia) October 18, 2025ఇదేవిధంగా అర్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి దిగిన అరుణ్ యాదవ్ తన నామినేషన్ దాఖలు చేసేందుకు గేదెపై స్వారీ చేస్తూ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. ఇది అక్కడున్నవారిని అమితంగా ఆకట్టుకుంది. లాలూ యాదవ్ ఫొటోను పట్టుకుని.. ‘రాజకీయాల్లో తన ఏకైక రోల్ మోడల్ లాలూ అని, అతని ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాను" అని అరుణ్ యాదవ్ మీడియాకు తెలిపారు. తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీకి చెందిన అభ్యర్థులు విచిత్ర తీరుతెన్నులతో నామినేషన్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్లకు తరలిరావడం విశేషంగా మారింది. -
బీహార్ ఎన్నికలు.. ఎన్డీయే కూటమికి బిగ్ షాక్
పట్నా: బీహార్ అసెంబ్లీ(Bihar Assembly Election) ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే(NDA Alliance) కూటమికి ఊహించని షాక్ తగిలింది. మధుర అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా నిలిచిన సీమా సింగ్(Seema Singh) నామినేషన్ రద్దైంది. దీంతో, మధుర అసెంబ్లీ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి పోటీలో లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీల మధ్య ఉండనుంది.వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాప్రా జిల్లాలోని మధుర అసెంబ్లీ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా సీమా సింగ్ నామినేషన్ వేశారు. మొదటి విడత నామినేషన్ వేయడానికి అక్టోబర్ 17 చివరి తేదీ కావడంతో ఆమె.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అధికారులు శనివారం పరిశీలించగా సీమా సింగ్ నామినేషన్లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె నామినేషన్ రద్దు చేసినట్లు డిప్యూటీ ప్రొవిన్షియల్ ఎలక్షన్ ఆఫీసర్ (డీపీఆర్వో) ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, ఈ నియోజకవర్గంలో నామినేషన్లో లోపం కారణంగా సీమా సింగ్‌తో పాటు మొత్తం నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు.సినిమా నుంచి పాలిటిక్స్‌లోకి.. సీమా సింగ్ పలు భోజ్‌పురి సినిమాల్లో నటించారు. తన మార్క్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమా రంగం నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చి అందరనీ ఆశ్చర్యపర్చారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ తనకు మధుర స్థానాన్ని కేటాయించిన తర్వాత ఆమె చాలా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి రాజకీయంగా యాక్టివ్‌గా ప్రచారం చేసుకుకున్నారు. మరోవైపు.. ఆమె తన అఫిడవిట్లో తొమ్మిదో తరగతి చదివినట్లు పేర్కొన్నారు. దీంతో, ఆమెపై ప్రజల్లో మరింత ఫోకస్ పెరిగింది. ఇదిలా ఉండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సీమా సింగ్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా షేక్‌పురాలో ఆమె హోలీ నిర్వహించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా.. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీకి గడువు నవంబర్ 22తో ముగియనుంది. -
Bihar Elections: బీజేపీపై ఆగ్రహం.. స్వతంత్రంగా పోటీ.. క్షణంలో మారిన సీన్
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ పోలింగ్నకు సంబంధించి, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలో ఒక ఉదంతం మీడియా దృష్టిని ఆకర్షించింది. భాగల్పూర్ బీజేపీ టికెట్ లభించకపోవడంతో కలత చెందిన మాజీ కేంద్ర మంత్రి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ శశ్వత్ చౌబే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలో వచ్చిన ఒక ఫోన్ కాల్‌తో క్షణంలో అతని నిర్ణయం మారిపోయింది.నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థి అర్జిత్ శశ్వత్ చౌబే జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకోగానే, అతని మద్దతుదారులు అతనికి పూలమాలలు వేసి, మరింత ఉత్సాహపరిచారు. ఇంతలో శశ్వత్ చౌబే ఫోన్ రింగ్ అయ్యింది. అదే సమయంలో అతనితో మాట్లాడేందుకు విలేకరులు వేచివున్నారు. శశ్వత్ చౌబే తనకు వచ్చిన కాల్ తీసుకుని, నామినేషన్ పత్రాలను దాఖలు చేయకుండా వెనుదిరిగారు. తరువాత తాను ఊహించని విధంగా యూ టర్న్ తీసుకోవడానికి గల కారణాన్ని మీడియాకు వివరించారు.తన తండ్రి అశ్విని చౌబే సూచనల మేరకు బీజేపీలోనే ఉంటానని శశ్వత్ చౌబే స్పష్టం చేశారు. తన తండ్రి మాటను మన్నిస్తూ, ఆయనకు గౌరవాన్నిస్తూ, ఎన్నికల్లో పోటీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే, బీజేపీ అగ్ర నాయకత్వం నుండి ఒత్తిడిని ఎదురయ్యిందని శశ్వత్ చౌబే పేర్కొన్నారు.‘ఈరోజు, నా తల్లిదండ్రులు నాతో మాట్లాడారు. ఇది బీజేపీ అగ్ర నాయకత్వం నుండి వచ్చిన సూచన. నేను వారికి అవిధేయునిగా ఉండలేను. నేను నా పార్టీకి, దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేను.వారిని వ్యతిరేకించలేను’ అని శశ్వత్ చౌబే మీడియాకు తెలిపారు. -
బిహార్ ఎన్నికల్లో జేఎంఎం సొంతంగా పోటీ
రాంచీ: బిహార్ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)బాంబు పేల్చింది. పక్క రాష్ట్రం బిహార్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా ఆరు సీట్లలో పోటీ చేయనున్నట్లు జేఎంఎం శనివారం ప్రకటించింది. అదేవిధంగా, ప్రస్తుతం జార్ఖండ్‌లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కొనసాగుతున్న పొత్తుపై బిహార్ ఎన్నికల అనంతరం సమీక్షిస్తామని కూడా స్పష్టం చేసింది. జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య మీడియా సమావేశంలో ఈ విషయాలను ప్రకటించారు. బిహార్‌లో తమకు 12 సీట్లు కేటాయించాలని ఇండియా కూటమిని జేఎంఎం కోరింది. స్పందన లేకపోవడంతో స్వయంగా పోటీకి దిగాలని నిర్ణయించుకున్నామన్నారు. -
కొత్త ముసుగులో ‘జంగిల్‌రాజ్’
పట్నా: బిహార్‌లో ‘జంగిల్‌రాజ్’కొత్త ముసుగు ధరించి మళ్లీ వచ్చిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. విపక్ష ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. ఆర్జేడీ పాలనలో అరాచక శక్తులు చెలరేగిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు అవే శక్తులు మరో రూపంలో వస్తున్నాయని దుయ్యబట్టారు. అప్పటి రాక్షస పాలన మళ్లీ రావడాన్ని ప్రజలు అంగీకరించబోరని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ‘ఇండియా’కూటమిని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. శనివారం బిహార్ రాజధాని పట్నాలో ఓ వార్తా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘బిహార్ సమాగం’లో అమిత్ షా మాట్లాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగాలంటే ఎన్డీయేను గెలిపించాలని చెప్పారు. బెంగాల్లో చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ బీజేపీ పాలిత అస్సాంలో అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు అమిత్ షా తెలిపారు. అస్సాం పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లోకి చొరబాట్లు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ వలసదారులకు బెంగాల్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోందని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగించడానికే ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభించినట్లు స్పష్టంచేశారు. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. జమ్మూకశ్మీర్‌కు సరైన సమయలో రాష్ట్ర హోదా జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే లద్దాఖ్ ప్రజల డిమాండ్లకు తగిన పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగం పుంజుకుందని తెలిపారు. అక్కడ ప్రజాస్వామ్యం బలోపేతం అయ్యిందని స్పష్టంచేశారు. -
కుటుంబానికో ఉద్యోగం ఎలా సాధ్యం?
పట్నా: ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఎలా సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్ష ఆర్జేడీ ఇస్తున్న హామీ ఆచరణలో సాధ్యం కాదని అన్నారు. ఓట్ల కోసం విచ్చలవిడిగా హామీలు ఇస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే వారికి వేతనాలు చెల్లించడానికి నిధులు ఎక్కడి తీసుకొస్తారని ప్రశ్నించారు. 2.6 కోట్ల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి వేతనాలు ఇవ్వాలంటే రూ.12 లక్షల కోట్లు కావాలన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు అది నాలుగు రెట్లు అని చెప్పారు. శుక్రవారం బిహార్ రాజధాని పట్నాలో మేధావులు, వివిధ రంగాల నిపుణులతో జరిగిన సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అది చొరబాటుదారులను కాపాడే యాత్ర అని విమర్శించారు. దేశంలోకి అక్రమ వసలదారులను అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. భారత్ ధర్మశాల కాదని స్పష్టంచేశారు. చొరబాటుదారులను కూడా ఓటర్ల జాబితాలో చేర్చాలని రాహుల్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి చొరబాటుదారుల పేర్లను కచి్చతంగా తొలగిస్తామన్నారు. కుటుంబ వారసత్వ రాజకీయాలను నమ్ముకుంటున్న కాంగ్రెస్, ఆర్జేడీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని అమిత్ షా పిలుపునిచ్చారు. అభివృద్ధికే పెద్దపీట వేస్తున్న బీజేపీని గెలిపించాలని కోరారు. బిహార్‌లో డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ఘనతలను ఆయన ప్రస్తావించారు. బిహార్ క్షేమంగా ఉండొద్దా? కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ మొహమ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామాకు బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ టికెట్ ఇవ్వడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి దిగితే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బిహార్ క్షేమంగా ఉండాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. సారణ్ జిల్లాలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. నేరగాళ్లకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఆర్జేడీ లాంటి పారీ్టల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. లాలూ–రబ్రీ హయాంలో బిహార్ రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిందని ఆరోపించారు. జంగిల్ రాజ్ నుంచి సీఎం నితీశ్ కుమార్ విముక్తి కల్పించారని అమిత్ షా ప్రశంసించారు. అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీయేను మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. -
నితీశ్ మళ్లీ సీఎం.. డౌట్ కామెంట్స్ చేసిన అమిత్ షా!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార ఎన్డీయే కూటమిలో లుకలుకలు నడుస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అలాగే.. బీహార్ సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపైనా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ స్పష్టత ఇచ్చారు.బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు(Amit Shah On Bihar CM Candidate). బీహార్ ఎన్డీయే కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పనికి మాలినవని తోసిపుచ్చారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోనే బీహార్ ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని షా ప్రస్తావించారు. అయితే.. బీహార్ ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు.. అంత తొందర ఎందుకంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతారా? కారా?(Will Nitish Kumar CM Again) అనేది నేను ఒక్కడినే నిర్ణయించే అంశం కాదు. ప్రస్తుతానికి ఆయన సారథ్యంలోనే మేం ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలయ్యాక.. మిత్రపక్షాలన్నీ కూర్చుని అప్పుడు సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తాయి అని షా స్పష్టత ఇచ్చారు. గత ఎన్నికల్లో(2020) జేడీయూ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు నెగ్గింది. ఆ టైంలో నితీశ్ కుమార్ ప్రధాని మోదీని కలిసి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండడం సబబని అన్నారు. కానీ, మా మిత్రపక్షానికి మేం ఎప్పుడూ గౌరవం ఇస్తాం. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఆయన్ని సీఎం చేశాం అని షా అన్నారు.నితీశ్ తరచూ పార్టీలు మారుతున్న సందర్భాన్ని ప్రస్తావించగా.. షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1974లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణన్ సారథ్యంలో జరిగిన ఆందోళనతో నితీశ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని, అది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సందర్భాన్ని గుర్తు చేశారు. పైగా నితీశ్ రెండున్నరేళ్లు మాత్రమే కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగించారని.. ఎక్కువ కాలం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇక..నితీశ్ ఆరోగ్యం, పబ్లిక్‌లో ఆయన ప్రవర్తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా అమిత్ షా స్పందించారు. వయసు కారణంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కానీ, ముఖాముఖిగా, ఫోన్ ద్వారానూ నితీశ్ సుదీర్ఘంగా, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారని షా అన్నారు. అంతేకాదు.. సీఎంగా ఆయన సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు.ఇక.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections 2025) ఎన్డీయే కూటమి మునుపెన్నడూ చూడని ఘన విజయం సాధిస్తుందని.. నవంబర్ 14న వెల్లడయ్యే ఫలితాలతో గత రికార్డులను బద్దలు కొడతామని షా ధీమా వ్యక్తం చేశారు.74 ఏళ్ల వయసున్న నితీశ్‌కుమార్ ఇప్పటికే 9 సార్లు(2000 సంవత్సరంలో తొలిసారి) బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ఆయన బీహార్ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని, గవర్నర్‌గానో, రాజ్యసభకో వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. అంతెందుకు మొన్నీమధ్యే ఉప రాష్ట్రపతి పదవి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కూడా. అయితే నితీశ్ 10వ సారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని జేడీయూ అంటోంది.ఇదీ చదవండి: కరూర్ ఘటన తర్వాత.. విజయ్ క్రేజ్ మరింత పెరిగిందా? -
బీహార్‌లో ఓటర్ల సవరణ సర్వేలో తప్పుల్లేవు: ఈసీ
న్యూఢిల్లీ: బీహార్‌లో(Bihar Assembly Elections) నెలల తరబడి కొనసాగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లలేదని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. ఈ సర్వే విశ్వసనీయతను దెబ్బతీసేందుకే కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయని ఈసీ(Election Commission Of India) పేర్కొంది.తుది ఓటర్ల జాబితా ప్రచురించాక తమ పేరు తొలగించాలని కనీసం ఒక్క ఓటరు(Bihar Voter List) కూడా ఫిర్యాదు రాలేదని ఈసీ గుర్తుచేసింది. ముస్లింల ఓట్లను అసహ జరీతిలో తొలగించారన్న ఆరోపణల్లో నిజంలేదు. ఇలా మతపర ఆరోపణలకు అడ్డుకట్ట పడాలి’’ అని ఈసీ వ్యాఖ్యానించింది. అయితే తుది జాబితా లోనూ ఓటర్ల పేర్లలో తప్పులు దొర్లడంపై ఈసీ అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘‘టైపింగ్ తప్పులు ఉండకుండా చూసుకుంటే బాగుండేది. ఇలాంటి వాటికి తగు స్వల్ప పరిష్కారాలు చూపిస్తే మంచిది’’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీల ధర్మాసనం అభిప్రాయపడింది. -
కాంగ్రెస్, జేడీయూ అభ్యర్థుల ప్రకటన.. కూటమిలో ట్విస్ట్!
న్యూఢిల్లీ: బీహార్ (Bihar Assembly Election) అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ (Congress Party) శుక్రవారం 48 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ రామ్ కుటుంబా స్థానం నుంచి... కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత షకీల్ అహ్మద్ ఖాన్‌కు కద్వా నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ చీఫ్ ప్రకాశ్ గరీబ్ దాస్‌కు బెచ్వాడా సీటు కేటాయించారు.బగాహాలో జయేశ్ మంగళ్ సింగ్, నౌతన్లో అమిత్ గిరి, చన్‌పటియాలో అభిషేక్ రంజన్, బెట్టియాలో వాసి అహ్మద్, రక్జౌల్లో శ్యామ్ బిహారీ ప్రసాద్ పోటీ చేయనున్నారు. గోవింద్గన్ స్థానం నుంచి శశి భూషణ్ రాయ్ అలియాస్ గప్పు రాయ్, రిగా నుంచి అమిత్ కుమార్ సింగ్ పోటీకి దిగనున్నారు. కాగా, ఆర్జేడీ సహా మహా ఘఠ్బంధన్ పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాకమునుపే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17వ తేదీ ఆఖరు. రెండో దశ పోలింగ్‌కు నామినేషన్లకు ఈ నెల 20వ తేదీతో గడువు ముగియనుంది.101 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన జేడీయూమరోవైపు.. బీహార్‌లో అధికార ఎన్డీఏ (NDA) కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ జనతాదళ్(యునైటెడ్) తాము పోటీచేయబోయే మొత్తం 101 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 57 మందితో తొలిజాబితా విడుదలచేయగా గురువారం మిగతా 44 మంది అభ్యర్థులతో చివరి జాబితాను వెల్లడించింది. చాలా మంది అభ్యర్థులు వెనువెంటనే తమ నామినేషన్లు దాఖలుచేస్తూ బిజీగా కనిపించారు. మొత్తం 101లో ఓబీసీలకు 37, ఈబీసీలకు 22, అగ్రవర్ణాలకు 22 చోట్ల అవకాశం కల్పించింది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తన రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇచ్చారు. విజయ్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, జామా ఖాన్, షీలా మండల్, లేశీ సింగ్, సుమిత్ సింగ్, విభా దేవి, చేతన్ ఆనంద్, శ్వేతా గుప్తా ఈసారి బరిలో దిగనున్నారు. -
Bihar Election: స్ఫూర్తినిస్తున్న ‘జన్ సురాజ్’ అభ్యర్థి నీరజ్
పట్నా: అతను ఢిల్లీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. అంచలంచలుగా ఎదుగుతూ రూ. 400 కోట్ల టర్నోవర్ గల కంపెనీని నడిపేస్థాయికి చేరుకున్నారు. అతనే బీహార్ పారిశ్రామికవేత్త నీరజ్ సింగ్. అతని జీవన ప్రయాణం సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది.38 ఏళ్ల నీరజ్ సింగ్ రాబోయే బీహార్ ఎన్నికల్లో షియోహార్ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు.బీహార్‌లోని షియోహార్ జిల్లాలోని మధురాపూర్ గ్రామంలో జన్మించిన నీరజ్ సింగ్ పదవ తరగతి పూర్తిచేశాక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్యోగాల వేటలో పడ్డారు. ఎటువంటి ఉద్యోగం దొరక్క, గ్రామంలో పెట్రోల్, డీజిల్ విక్రయించడం మొదలుపెట్టాడు. తరువాత ఢిల్లీకి వెళ్లి, సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరారు. అనంతరం పూణేకు చేరుకుని, ఒక ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ అటెండెంట్‌గా చేరారు. 2010లో ధాన్యం వ్యాపారాన్ని ప్రారంభించారు. అది కలసివచ్చింది. దీంతో ఇటుకలు, బిల్డింగ్ బ్లాక్స్, టైల్స్, ఇతర సిరామిక్ వస్తువులను విక్రయించే ఉషా ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. తదనంతర కాలంలో సింగ్ తన వ్యాపారాన్ని రోడ్డు నిర్మాణ రంగానికి కూడా విస్తరించారు. ఇటీవలే సొంత పెట్రోల్ పంపును ప్రారంభించారు. నీరజ్ సింగ్ స్థాపించిన కంపెనీ ప్రస్తుతం రూ. 400 కోట్ల టర్నోవర్‌తో, రెండువేల మంది సిబ్బందికి ఉపాధిని అందిస్తోంది. ఒకప్పుడు సైకిల్ కూడా లేని నీరజ్ సింగ్ దగ్గర నేడు అర డజనుకు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. సింగ్ తన ఇద్దరు సోదరులు, భార్య, ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులతోపాటు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. పేద మహిళలకు వివాహాలు చేయడం, సీనియర్ సిటిజన్ల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు, వృద్ధుల కోసం తీర్థయాత్రలను నిర్వహించడం లాంటి సేవాకార్యక్రమాలను నీరజ్ సింగ్ నిర్వహిస్తున్నారు. -
Bihar Election: లాలూకు రాహుల్ ఫోన్.. సీట్ల ఒప్పందంపై మంతనాలు
న్యూఢిల్లీ: బీహార్‌లో నవంబర్‌లో జరగనున్న ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాజకీయపార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష కూటమిలో సీట్ల కేటాయింపు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీనిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గురువారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో నేరుగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. పోటీ విషయంలో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని సమాచారం.బీహార్ ఎన్నికలకు సంబంధించి మొదటి దశ నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ కీలక మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఇంతవరకూ సీట్ల కేటాయింపు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. తొలుత ఆర్జేడీ తన మిత్రపక్షం కాంగ్రెస్‌కు 52 సీట్లు ఇచ్చింది. అయితే దానిని కాంగ్రెస్ తిరస్కరించింది. కనీసం 60 నియోజకవర్గాలు కావాలని పట్టుపట్టింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు- ఆర్జేడీ మధ్య చర్చలు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో రెండు పార్టీల జాతీయ నాయకత్వం సీట్ల ప్రతిష్టంభనను తొలగించేందుకు రంగంలోకి దిగింది. అయితే ఆర్జేడీ నేతలు కాంగ్రెస్ 61 సీట్ల డిమాండ్‌ను నెరవేర్చడానికి ముందుకు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పట్టుబట్టిన కొన్ని కీలక నియోజకవర్గాలపై విభేదాలు మొదలయ్యాయని సమాచారం. నర్కటియగంజ్, వాసాలిగంజ్, కహల్గావ్ స్థానాలలో పోటీ విషయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. చైన్పూర్, బచ్వారాలలో ఇదే పరిస్థితి నెలకొన్నదని సమాచారం. కాగా రాహుల్ గాంధీ తాను చేపట్టిన ఓటరు అధికార్ యాత్ర రాష్ట్రంలో తమకు అవకాశాలను పెంచుతుందని నమ్ముతూ మరిన్ని సీట్లు కోరుతున్నారని తెలుస్తోంది. మీడియాకు ప్రాధమికంగా తెలిసిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 61 సీట్లతో సరిపెట్టుకునేందుకు అంగీకరించింది. ఇది 2020లో పోటీ చేసిన 70 సీట్ల కంటే తొమ్మిది సీట్లు తక్కువ. ఆ సమయంలో కాంగ్రెస్ 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయగా, 75 మంది అభ్యర్థులు గెలిచారు. ఇదిలా ఉండగా సీట్ల కేటాయింపు ఇంకా జరగకముందే బుధవారం రాత్రి కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బుధవారం రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కాంగ్రెస్ తమ అభ్యర్థులను తొలి జాబితాను ప్రకటించడం గమనార్హం. -
Bihar Elections: తేజస్వి ఆస్తులెంత? బెరెట్టా పిస్టల్ వివాదమేంటి?
పట్నా: దేశంలో ఎక్కడ చూసినా బీహార్ ఎన్నికలకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం మొదలయ్యింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన అధికారిక అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడిది ఎంతో ఆసక్తికరంగా మారింది.ఆర్జేడీ కోట నుండి వరుసగా మూడవసారి విజయం సాధించాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన తేజస్వి యాదవ్.. బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏపై పలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో బెరెట్టా పిస్టల్‌తో పాటు రూ. 8.98 కోట్ల విలువైన కుటుంబ ఆస్తులను వెల్లడించారు. అలాగే తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా తెలిపారు. ఆ వివరాలు..తేజస్వి యాదవ్ ఆస్తులు- రూ 1.88 కోట్లు (స్థిరచరాస్తులు) భార్య రాజ్శ్రీ యాదవ్ ఆస్తులు- రూ 59.69 లక్షలు(స్థిరచరాస్తులు)ఇద్దరు పిల్లల ఆస్తులు- రూ. 40 లక్షలు(స్థిరచరాస్తులు)మొత్తం కుటుంబపు చరాస్తులు- రూ. 6.12 కోట్లుబంగారం, వెండి- రూ. 85.9 లక్షలు- (980 గ్రాముల బంగారం, 3.5 కిలోల వెండి)ఆయుధాలు- రూ.1.05 లక్షలు ఇటాలియన్ బెరెట్టా ఎన్పీబీ 380 బోర్ పిస్టల్, 50 రౌండ్లుఎలక్ట్రానిక్స్- రూ. 85 లక్షలు డెస్క్‌టాప్, ల్యాప్టాప్మొత్తంగా ప్రకటించిన కుటుంబ ఆస్తులు రూ. 8.98 కోట్లుఈ అఫిడవిట్లో తేజస్వి యాదవ్ పేరు మీద ఏ వ్యక్తిగత వాహనం లేదా రియల్ ఎస్టేట్ వివరాలు లేవు. ఇది తేజస్వి సామాన్యుడనే ఇమేజ్ను బలోపేతం చేస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జాబితాలోని ఎలక్ట్రానిక్స్ , ఆయుధం విలువ అతని సామాన్య జీవనశైలికి విరుద్ధంగా ఉన్నాయనే వాదన విపిస్తోంది. కాగా అఫిడవిట్లో ఇటాలియన్ బెరెట్టా ఎన్పీబీ 380 బోర్ పిస్టల్, 50 బుల్లెట్లను చేర్చడం, దాని విలువ రూ. 1.05 లక్షలుగా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. 1984 నుండి దేశంలో పౌర ఆయుధాల దిగుమతిని నిషేధించారు. ఆయుధ చట్టం- 1959 ప్రకారం అధికారం కలిగిన భారతీయ డీలర్ నుండే ఆయుధాన్ని కొనుగోలు చేయాలి. అయితే తేజస్వి బెరెట్టా పిస్టల్ కలిగివుండటంపై పలు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇది అక్రమంగా వచ్చిన ఆయుధమనే వాదన వినిపిస్తోంది.తేజస్వి యాదవ్ తన అఫిడవిట్లో తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో నాలుగు అప్పీల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులు రాజకీయ ర్యాలీలు, నిరసనలు, వివాదాస్పద ప్రకటనల కారణంగా నమోదయ్యాయి. తాజగా అక్టోబర్ 13న ఢిల్లీ కోర్టు.. ఆయనతో పాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీ దేవిలపై ఐఆర్సీటీసీ హోటళ్ల అవినీతి కుంభకోణం, ల్యాండ్-ఫర్-జాబ్స్ స్కామ్‌లో అధికారికంగా అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఇది ఎన్నికలకు ముందు తేజస్వికి ఎదురుదెబ్బగా మారింది.రాఘోపూర్ నియోజకవర్గం ఆర్జేడీకి ఎంతో కీలకమైనది. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ఇద్దరూ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమిది. తేజస్వి 2015, 2020లలో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇక్కడి ఓటర్లలో యాదవులు 25 శాతం, ముస్లింలు 20 శాతం, ఈబీసీలు 30 శాతం ఉన్నారు. ఇది ఆర్జేడీ విజయానికి కీలకమైన జనాభాగా పరిగణిస్తుంటారు. హాజీపూర్ కలెక్టరేట్లో తేజస్వి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశాక తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ‘ఎక్స్’ ఖాతాలో ‘ఈ నామినేషన్ తేజస్వి ఒక్కడికే కాదు.. బీహార్ అంతటా మార్పు కోసం’ అని పేర్కొన్నారు. -
తెగని సీట్ల పంచాయితీ! ఢిల్లీ పెద్దలను ఉరికించిన కాంగ్రెస్ కార్యకర్తలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండే రోజులు మిగిలి ఉంది. ఇప్పటికీ బీహార్‌లో విపక్ష మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అయోమయం, గందరగోళం నడుమే ఆర్జేడీ 35 మందితో తన జాబితాను విడుదల చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 10 మంది పేర్లను ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.పది మంది అభ్యర్థులకు సింబల్ పంపిణీ చేసింది కాంగ్రెస్. ఆ ఫొటోలను బీహార్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో అధికారికంగా పోస్ట్ చేశారు. అయితే.. సీట్ల పంపిణీ లెక్కలు తేలకుండానే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించిందా? లేదంటే ఒప్పందం ప్రకారమే చేసిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. గత అర్ధరాత్రి పాట్నా ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేగింది.బీహార్ కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణ అల్లవరు, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజేష్ రామ్, సీనియర్ నేత షకీల్ అహ్మద్ ఖాన్లు ఢిల్లీలో సీట్ల పంపిణీపై చర్చలు జరిపిన అనంతరం పాట్నా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి.. బిక్రమ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా.. అది ఘర్షణకు దారి తీసింది.బీహార్‌లో బిక్రం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధార్థ్ సౌరభ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. తాజాగా.. కాంగ్రెస్ ప్రకటించిన పది మంది అభ్యర్థులలోఈ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారు. అయితే.. विधानसभा क्षेत्र - बिक्रम सेINDIA गठबंधन समर्थित कांग्रेस उम्मीदवार श्री अनिल कुमार जी को अनंत बधाई एवं शुभकामनाएं!जीत रहा है INDIA ✊ pic.twitter.com/au4idsuiOm— Bihar Congress (@INCBihar) October 15, 2025ఈ పరిణామంపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు పాట్నా ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకుని తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు రూ.5 కోట్లకు సీటు అమ్ముకున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ మద్దతుదారుడు మనీష్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అలజడి రేగింది.దీంతో ఆ ముగ్గురు పెద్దలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. షకీల్ అహ్మద్ ఖాన్‌ను కార్యకర్తలు రౌండప్ చేయగా.. అతి కష్టం మీద తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఈ సీటు అభ్యర్థికి మార్పు తప్పదా? అనే చర్చ జోరందుకుంది.Congressmen clash at Patna airport, causing uproar over ticket dispute #Patna #Airport #Congress बिहार कांग्रेस के कार्यकर्ता पटना एयरपोर्ट पर टिकट बंटवारे से नाराज़! कृष्णा अल्लावरू, राजेश राम के सामने पहुंचे, लेकिन पप्पू यादव समर्थकों से भिड़ंत। गोली नहीं चली, यही बड़ी बात! pic.twitter.com/cpMcx35U5C— DVN TV (@dvntvnews) October 16, 2025ఇదిలా ఉంటే.. సీట్ల పంపిణీపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దఫా చర్చలు ఇవాళ ఓ కొలిక్కి వచ్చాక.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్జేడీ 130, కాంగ్రెస్ 60, వీఐపీ 18, వామపక్ష పార్టీలు 35 స్థానాలలో పోటీ చేస్తాయని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్! -
సార్‌ను కాదు.. మీ సోదరుడిని
న్యూఢిల్లీ: మహిళా శక్తే దేశానికి బలం, రక్షణ కవచం, స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తనను సార్ అని పిలవొద్దని, సోదరుడిగా సంబోధించాలని బిహార్‌కు చెందిన బీజేపీ బూత్ స్థాయి మహిళా కార్యకర్తకు సూచించారు. బిహార్‌లో నవంబర్ 14న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయని, అదేరోజు ప్రజలు మరో దీపావళి నిర్వహించుకోబోతున్నారని స్పష్టంచేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. తమ కూటమి విజయంలో మహిళలే కీలకపాత్ర పోషించబోతున్నారని తెలిపారు. బిహార్ బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి నమో యాప్ ద్వారా వారితో సంభాషించారు. ప్రజాస్వామ్య వేడుకలో మహిళలంతా ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ గుంపులుగా వెళ్లి ఓటు వేయాలని, పాటలు పాడుతూ, థాలీలు(గిన్నెలు) మోగిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. బిహార్ ప్రజలకు ఈసారి డబుల్ దీపావళి వస్తోందని వ్యాఖ్యానించారు. సోదరీమణులు, ఆడబిడ్డల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని స్పష్టంచేశారు. నా తరఫున గ్యారంటీ ఇవ్వండి భాయి దూజ్ పండుగ సందర్భంగా ఈ నెల 23న సోదరీమణుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. లఖ్పతీ దీదీలను, డ్రోన్ దీదీలను గౌరవించుకోవాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేయాలని, వారికి అవగాహన కల్పించాలని కోరారు. ‘ఏక్జుట్ ఎన్డీఏ, ఏక్జుట్ బిహార్(ఐక్య ఎన్డీఏ, ఐక్య బిహార్)–ఇసే బనేగీ సుశాసన్ కీ సర్కార్’ అనే నినాదాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చారు. మరోసారి సుపరిపాలన అందిస్తామన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ఎన్నికల్లో కచ్చితంగా విజయం లభిస్తుందన్నారు. ప్రతి బూత్ స్థాయి కార్యకర్త ఒక మోదీయేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తన తరఫున ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలని సూచించారు. పథకాలకు సంబంధించిన వీడియోలను అందరికీ చూపించాలన్నారు. బిహార్‌లో గతంలో జంగిల్‌రాజ్ రాజ్యమేలిందని, అప్పటి పరిస్థితుల గురించి నేటి యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్జేడీ పాలనపై విరుచుకుపడ్డారు. బిహార్‌లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మళ్లీ నక్సలైట్ల చేతికి అప్పగించవద్దని ప్రజలను కోరారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల నుంచి బిహార్‌ను రక్షించుకొనే బాధ్యత ప్రజలపైనే ఉందని మోదీ ఉద్ఘాటించారు. బిహార్‌లో నవంబర్ 6, 11న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
జాక్‌పాట్ కొట్టేసింది..ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్‌కు ఎమ్మెల్యే సీటు!
పాట్నా: ప్రముఖ ఫోక్ సింగ్ మైథిలీ ఠాకూర్ జాక్ పాట్ కొట్టేశారు. బుధవారం బిహార్ బీజేపీ అభ్యర్థుల జాబితాలో స్థానం సంపాదించారు. 12 మంది అభ్యర్థులు, వారు పోటీ చేసే నియోజక వర్గాలను బీజేపీ బుధవారం ప్రటించింది. రెండోసారి విడుదల చేసిన బిహార్ బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ (Maithili Thakur), మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు ఉన్నారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ పోటీ చేయనుండగా, బక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా పోటీ చేస్తారు. బిహార్ బీజేపీ రెండవ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 12 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించగా, అలీనగర్ నియోజకవర్గం నుంచి ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్‌కు అవకాశం కల్పించారు. అత్యంత కీలకమైన అలీనగర్ స్థానాన్ని మైథిలీ ఠాకూర్‌కు కట్టబెట్టే విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. మిథిలాంచల్ ప్రాంతానికి చెందిన మైథిలీ ఠాకూర్ ఈ ప్రాంతపు సాంస్కృతిక ప్రతినిధిగా గుర్తింపు పొందారు. మిథిలాంచల్ అనేది భారత్–నేపాల్ మధ్య విస్తరించిన సాంస్కృతిక ప్రాంతం. సీతమ్మతల్లి జన్మస్థలంగా ఈ ప్రాంత స్థల పురాణాలు చెబుతున్నాయి. అలీనగర్ నియోజకవర్గం, దర్భంగా జిల్లాలో ఉంది. ఇది కూడా మిథిలాంచల్‌లో భాగమే. అందుకే మైథిలీ ఠాకూర్‌ను ‘మిథిలా కుమార్తె’గా అభివర్ణిస్తూ, ప్రాంతీయ గౌరవాన్ని, యువతలో ఆదరణను ఆకర్షించేందుకు బీజేపీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది.మైథిలీ ఠాకూర్ ఇంటర్ చదువుకున్న తర్వాత, చిన్న వయస్సులోనే ఫోక్ సింగర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. భోజ్‌పురి, మైథిలీ, హిందీ భక్తి పాటలతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పాడిన పాటలకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ద్వారా యువతను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం జేడీయూ చేతిలో ఉండగా, ఈసారి పొత్తు కారణంగా బీజేపీకి దక్కింది. #WATCH | Ahead of #BiharElection2025, folk and devotional singer Maithili Thakur joins the BJP in Patna, Bihar. pic.twitter.com/qkY1ocUsIZ— ANI (@ANI) October 14, 2025క్లాసికల్, ఫోక్ సంగీతంలో శిక్షణ పొందిన ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ బిస్మిల్మా ఖాన్ యువ పురస్కారం పొందారు. ఓవైపు ఫోక్ సింగర్‌గా రాణిస్తూనే రాజకీయాల్లో రాణించాలని కోరికగా ఉందంటూ పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా, ఆమె తన అభిరుచులకు అనుగుణంగా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ,బిహార్ సీఎం నితీష్ కుమార్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. వారిలాగే తానుకూడా సమాజానికి సేవ చేయడానికి, బిహార్ అభివృద్ధికి తోడ్పడటానికి నేను ఇక్కడ ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు.కాగా,మైథిలీ ఠాగూర్ గతంలో ప్రధాన మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2024 జనవరిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాడిన ‘మా శబరి’పాటను ప్రధాని ప్రశంసించారు. अयोध्या में प्राण-प्रतिष्ठा का अवसर देशभर के मेरे परिवारजनों को प्रभु श्री राम के जीवन और आदर्शों से जुड़े एक-एक प्रसंग का स्मरण करा रहा है। ऐसा ही एक भावुक प्रसंग शबरी से जुड़ा है। सुनिए, मैथिली ठाकुर जी ने किस तरह से इसे अपने सुमधुर सुरों में पिरोया है। #ShriRamBhajan…— Narendra Modi (@narendramodi) January 20, 2024 -
Bihar Election: ఎన్నికల బరిలో ప్రముఖ గాయకుని భార్య?
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ నేతలతో పాటు పలువురు గాయనీగాయకులు, నటులు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా భోజ్‌పురి గాయకుడు, నటుడు ఖేసరి లాల్ యాదవ్ ఈ ఎన్నికల్లో తన పాత్రపై ఏమిటనేది వెల్లడించారు. తాను ఆర్జేడీ తరపున ప్రచారం చేయనున్నానని, తన భార్యను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నానని తెలిపారు. #WATCH | Patna: On the Bihar Assembly elections, Bhojpuri singer and actor Khesari Lal Yadav says, "I want my wife to contest the election, I have been trying to convince her for the last 4 days. If she agrees, we will file the nomination; otherwise, I will only campaign and try… pic.twitter.com/EjzOgdduS3— ANI (@ANI) October 15, 2025భోజ్‌పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తన భార్య చేత పోటీ చేయించాలని అనుకుంటున్నానని, ఇందుకోసం ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఒకవేళ ఆమె ఇందుకు అంగీకరిస్తే, తమ నామినేషన్ దాఖలు చేస్తామని, లేనిపక్షంలో తాను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. ఇటు తేజస్వి యాదవ్, అటు అఖిలేష్ యాదవ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పోటీ చేసే విషయంలో రెండు పార్టీల నుండి తనపై ఒత్తిడి ఉన్నదని ఖేసరి లాల్ యాదవ్ పేర్కొన్నారు. తన భార్య అంగీకరిస్తే, ఆమె చేత ఖచ్చితంగా పోటీ చేయిస్తానని తెలిపారు. -
Bihar Polls: 57 మంది అభ్యర్థులతో జేడీయూ తొలి జాబితా
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌ఎడీఏ)లో తర్జన భర్జనలు జరుగుతుండగా, ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)బుధవారం 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది.రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే కీలక అభ్యర్థుల్లో సోన్బార్సా నుండి రత్నేష్ సదా, మోర్వా నుండి విద్యాసాగర్ నిషాద్, ఎక్మా నుండి ధుమల్ సింగ్, రాజ్‌గిర్ నుండి కౌశల్ కిషోర్ ఉన్నారు. ఈ జాబితాలో పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విజయ్ కుమార్ చౌదరి.. సరాయ్ రంజన్ నుంచి పోటీ చేయనున్నారు. Janata Dal United (JDU) releases the first list of candidates for the Bihar Assembly Elections. pic.twitter.com/Zb2G7PZvv0— ANI (@ANI) October 15, 2025ఆలంనగర్ నుంచి నరేంద్ర నారాయణ్ యాదవ్, బీహారీగంజ్ నుంచి నిరంజన్ కుమార్ మెహతా, సింగేశ్వర్ నుండి రమేష్ రిషి దేవ్, మాధేపురా నుండి కవితా సాహా, మహిసి నుండి గండేశ్వర్ షా, కుశేశ్వరస్థాన్ నుంచి అతిరెక్ కుమార్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇతర ప్రముఖ అభ్యర్థుల విషయానికొస్తే అనంత్ కుమార్ సింగ్ (మొకామా), శ్యామ్ రజక్ (ఫుల్వారీ), కౌశల్ కిషోర్ (రాజ్‌గిర్), ధుమల్ సింగ్ (ఎక్మా), మహేశ్వర్ హజారీ (కళ్యాణ్పూర్), రత్నేష్ సదా (సోన్బర్సా), సంతోష్ కుమార్ నిరాలా (రాజ్పూర్), మదన్ సాహ్ని (బహదూర్‌పూర్), శ్రీష్వా సింఘ్పూర్పూర్), (గైఘాట్) విద్యా సాగర్ సింగ్ నిషాద్.. మోర్వా నుంచి పోటీ చేస్తున్నారు. -
బీహార్ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు
న్యూడిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు(సైలెన్స్ పీరియడ్) ఎలాంటి బల్స్ ఎస్ఎంఎస్లు, ఆడియో మెసేజ్‌లు పంపరాదని ఈసీ హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్ నెట్‌వర్క్‌లు, రేడియోల్లో, సినిమా హాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. పోలింగ్‌నాడు ఆయా ప్రాంతంలో ఆడియో, విజువల్డిస్ప్లేలు నిషేధించినట్లు పేర్కొంది. సోషల్‌మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను పొందుబరచాలని ఆదేశించింది. ముందస్తు అనుమతులు తప్పనిసరి: రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందుస్తు అనుమతులు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎల్రక్టానిక్ లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఏదైనా రాజకీయ ప్రకటనలు ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధృవీకరణ పొందడం తప్పనిసరి అని తెలిపింది. ధృవీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలుమీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీలను ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నారు(అక్టోబర్ 10వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది). అక్టోబర్ 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. నవంబర్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అంత కంటే 48 గంటల ముందు ప్రచారం ముగుస్తుంది. ఇందులో పాట్నా, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, దర్భంగా, బక్సర్, బీహార్ షరీఫ్ లాంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 123 స్థానాల రెండో ఫేజ్ పోలింగ్‌కు అక్టోబర్ 16న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 23 దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 9వ తేదీన ప్రచారానికి చివరి తేదీ. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది. -
ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం
మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(prashant kishor) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారాయన. తాజాగా ఆ పార్టీ తరఫున అభ్యర్థుల రెండో జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. అందులోనూ ఆయన పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో.. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బరిలో నిల్చోవడం లేదంటూ స్పష్టత ఇచ్చారాయన. పోటీకి బదులు తనను సంస్థాగత పనులపై దృష్టిసారించాలని పార్టీ నిర్ణయించింది అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఒకవేళ తాను ఎన్నికల్లో గనుక పోటీ చేస్తే తన స్వస్థలం కర్గాహర్ లేదంటే రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పారు. రాఘోపూర్ ఆర్జేడీ కంచుకోట. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి నెగ్గిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్.. హ్యాట్రిక్‌పై కన్నేశారు. అయితే.. జన్ సురాజ్ తరఫున ప్రశాంత్ కిషోర్ పోటీ చేయబోతున్నారని ప్రచారం నడిచింది. కానీ, జన్ సురాజ్ రెండో జాబితాలో రాఘోపూర్ నుంచి చంచల్ సింగ్ పేరును ప్రకటించారు. దీంతో ఆ ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది. అయితే పోటీ చేయకున్నా పార్టీని బలోపేతం చేయడానికి.. ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి తాను కృషి చేస్తానని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారాయన. జేడీయూకి ఎలాంటి ఓటమి దక్కబోతోందో చెప్పడానికి సెఫాలజిస్ట్( ఎన్నికల విశ్లేషకుడు) అయి ఉండాల్సిన అవసరమేమీ లేదని అన్నారాయన. అలాగే జన్ సురాజ్‌పార్టీ లక్ష్యం భారీదని, 150 స్థానాలకు ఒక్క సీటు తగ్గినా తమ పార్టీ ఓడిపోయినట్లేనని పీకే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
బీహార్ కూటమిలో తేలని సీట్ల లెక్క.. లాలూను అడ్డుకున్న తేజస్వీ
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఆర్జేడీ–కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్లో అస్పష్టత కొనసాగుతోంది. అధికార ఎన్డీయేలోని ప్రధాన పక్షం బీజేపీ ఇప్పటికే 71 స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించగా ఇండియా కూటమి ఇంకా పోటీచేసే స్థానాలపైనే సిగపట్లు పడుతోంది. మరో రెండ్రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో బుధ, గురువారాల్లో ఈ అంశాన్ని తేల్చాలని మిత్రపక్షాలు తేల్చి చెబుతున్నాయి.రాష్ట్రంలోని మొత్తం 243 సీట్లకు గానూ కాంగ్రెస్ గతేడాది పోటీ చేసిన సంఖ్యతో సమానంగా సీట్లను కోరుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీచేసి 19 చోట్ల నెగ్గింది. ఈసారి సైతం తమకే అంతే స్థానాలను కోరుతుండగా, ఆర్జేడీ మాత్రం 54–55 సీట్లకు మాత్రమే ఆఫర్ ఇస్తోంది. ఇదే అంశమై సోమవారం ఏఐసీసీ పెద్దలతో జరిగిన చర్చల సందర్భంగా మరో 3 స్థానాలు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, తమకు కనీసంగా 65 స్థానాలైనా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్లు సమాచారం. దీనిపై బుధ, గురువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.తేజస్వీ జోక్యంతో టికెట్లు ఇవ్వడం ఆపేసిన లాలుఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సోమవారం రాత్రి పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడం ప్రారంభించారు. ఇది సరైన విధానం కాదంటూ కుమారుడు తేజస్వీ యాదవ్ అడ్డుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అప్పటికే టికెట్లు అందుకున్న నేతలు తిరిగి ఇవ్వాలని తేజస్వి కోరారు. ఇందుకు స్పందించింది కొందరే. గత వారమే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సునీల్ సింగ్ మంగళవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ల వ్యవహారంపై ఆర్జేడీ, కాంగ్రెస్ నేతల మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా నడుస్తున్నాయి. -
66 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల నేర చరిత్రను బహిర్గతం చేసింది. 66 శాతం మంది శాసనసభ్యులపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. 241 మంది ఎమ్మెల్యేల్లో 158 మంది (66 శాతం) తమపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఏడీఆర్ తన నివేదికలో (ADR Report) పొందుపరిచింది.అరాయ్ బీజేపీ ఎమ్మెల్యే రామ్‌సురత్ కుమార్, సూర్యగర్హా జేడీయూ ఎమ్మెల్యే పహ్లాద్ యాదవ్ అఫిడవిట్లు అందుబాటు లేనందున వారిద్దరి వివరాలు పరిగణనలోకి తీసుకోలేదని ఏడీఆర్ తెలిపింది. 2020 ఎన్నికల అఫిడవిట్లను పరిగణనలోకి తీసుకున్నందున కొంతమంది ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్యలో ఇప్పుడు కొన్ని మార్పులు ఉండవచ్చని తెలిపింది.ముఖ్యంశాలు119 మంది (49 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 8 మందిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై హత్య కేసులు (ఐపీసీ సెక్షన్ 302) ఉన్నాయి.30 మందిపై హత్యాయత్నం కేసులు (ఐపీసీ సెక్షన్ 307) ఉన్నాయి.53 మంది (64 శాతం) బీజేపీ ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 53 మంది (74 శాతం) ఆర్జేడీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.21 మంది (45 శాతం) జేడీయూ ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 14 మంది (82 శాతం) కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.9 మంది (82 శాతం) సీపీఐ (ఎంఎల్) (ఎల్) ఎమ్మెల్యేలపైనా కేసులున్నాయి.విద్యార్హత- వయసుసిట్టింగ్ ఎమ్మెల్యేల విద్యార్హతలను పరిశీలిస్తే.. 82 మంది (34 శాతం) ఎమ్మెల్యేలు 5 నుంచి 12వ తరగతి చదివిన వారు. గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ చదివిన వారు 149 (62 శాతం) మంది ఉన్నారు. వయసులవారీగా చూస్తే.. 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు 122 మంది (51 శాతం) ఉన్నారు. 241 మంది ఎమ్మెల్యేల్లో 29 మంది (12 శాతం) మాత్రమే మహిళలు.బిహార్ అసెంబ్లీకి తాజా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన వివరాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.చదవండి: అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఆమెనే! -
Bihar: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ తమ తొలి జాబితా విడుదల చేసింది. 71 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం(అక్టోబర్ 14వ తేదీ) తమ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసింది బీజేపీ. ఈ జాబితాలో 9 మంది మహిళలకు టికెట్ ఇచ్చింది బీజేపీ. తారాపూర్ నుంచి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి బరిలో దిగనున్నారు. లకిసరాయి నుంచి డిప్యూటీ సీఎం విజయసింహ పోటీచేయనున్నారు. సివన్ నుంచి మంగళ్ పాండే పోటీకి సిద్ధమయ్యారు. ఇక స్పీకర్ నందకిషోర్ యాదవ్‌కి టికెట్ దక్కలేదు. 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో బీజేపీ పొత్తులో భాగంగా 101 సీట్లలో పోటీ చేయనుంది. भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति द्वारा बिहार विधानसभा चुनाव-2025 के लिए चयनित सभी प्रत्याशियों को हार्दिक बधाई एवं विजयश्री की अग्रिम शुभकामनाएं।#आएगी_NDA pic.twitter.com/vENiqKpx1w— BJP Bihar (@BJP4Bihar) October 14, 2025 రెండు రోజుల క్రితం బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించారు మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఇచ్చారు. ఇదిలా ఉంచితే బిహార్‌లో నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఒప్పందం ఇలా..జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లుభారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లులోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లుహిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం): 6 సీట్లురాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం): 6 సీట్లు ఇదీ చదవండి: బిహార్‌లో సంపన్న ఎమ్మెల్యే ఆమెనే..! -
బిహార్‌లో సంపన్న ఎమ్మెల్యే ఆమెనే!
బిహార్ శాసనసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు వ్యూహాల్లో తలమునకలయ్యాయి. సీట్ల లెక్కలు, ప్రచార పర్వంపై అధికార, విపక్ష కూటముల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ప్రస్తుత ఎమ్మెల్యేలకు సంబంధించిన సమగ్ర నివేదికను వెల్లడించింది. 2020 ఎన్నికలు, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించి ఈ రిపోర్ట్ తయారు చేసింది ఏడీఆర్. బిహార్‌లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 241 మందికి సంబంధించిన పూర్తి డేటాను విడుదల చేసింది.రూ. 1,121 కోట్ల ఆస్తులుఏడీఆర్ నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 194 మంది అంటే 80 శాతం మంది కోటీశ్వరులు. 241 మంది శాసనసభ్యుల మొత్తం ఆస్తులు విలువ దాదాపు రూ. 1,121.6 కోట్లుగా తేలింది. బీజేపీలో 72 మంది (87 శాతం) సంపన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కమలం పార్టీకి మొత్తం 83 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆర్జేడీకి 72 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 63 మంది (88 శాతం) కోటీశ్వరులు. జేడీయూ పార్టీ ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో 39 మంది (83 శాతం) సంపన్నులే.కాంగ్రెస్ పార్టీకి ఉన్న 17 మంది శాసనసభ్యుల్లో 13 మంది (76 శాతం) కరోడ్పతులున్నారు. హిందూస్తానీ అవామీ మోర్చా (సెక్యులర్) పార్టీలోని నలుగురు ఎమ్మెల్లో ఇద్దరు (50 శాతం) సంపన్నులు ఉన్నారు. సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) నుంచి ఒక్కొక్కరు చొప్పున కోటీశ్వరులు ఉన్నారు. బిహార్ శాసనసభలో ఉన్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని ఏడీఆర్ రిపోర్ట్ వెల్లడించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ. 4.7 కోట్లుగా అంచనా వేసింది.నీలం దేవి టాప్బిహార్లోని అత్యంత సంపన్న శాసనసభ్యుల జాబితాలో జేడీయూ ఎమ్మెల్యే నీలం దేవి (Neelam Devi) అగ్రస్థానంలో ఉన్నారు. 2022 ఉప ఎన్నికల్లో మోకామా నియోజకవర్గం నుంచి ఆమె గెలిచారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ఆమెకు రూ. 80 కోట్లుపైగా విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. వీటిలో రూ. 29.8 కోట్ల చరాస్తులు, రూ. 50.6 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. సంపద విషయంలో తన తోటి శాసనసభ్యుల కంటే ఆమె చాలా ముందున్నారు. గయ జిల్లాలోని బెలగంజ్‌కు చెందిన జేడీయూ మరో మహిళా ఎమ్మెల్యే మనోరమా దేవి రెండో స్థానంలో నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.72.8 కోట్లు. భాగల్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.43.2 కోట్లు.నిరుపేద ఎమ్మెల్యే ఆయనేఖగారియా జిల్లాలోని అలౌలి (ఎస్సీ) ఆర్జేడీ ఎమ్మెల్యే రామ్‌వృక్ష సదా నిరుపేద ఎమ్మెల్యే అని ఏడీఆర్ రిపోర్ట్ (ADR Report) తెలిపింది. ఆయన మొత్తం ఆస్తులు కేవలం 70,000 రూపాయలు మాత్రమే. వీటిలో రూ.30,000 చరాస్తులు, రూ.40,000 స్థిరాస్తులు ఉన్నాయి. ఫుల్వారీ (ఎస్సీ) నియోజకవర్గ సీపీఐ (ఎంఎల్) గోపాల్ రవిదాస్ (Gopal Ravidas) తదుపరి స్థానంలో ఉన్నారు. ఆయనకు రూ. 1.59 లక్షలు విలువచేసే ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఇదే పార్టీ నుంచి పాలిగంజ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సందీప్ సౌరవ్ రూ. 3.45 లక్షల విలువైన ఆస్తులను ప్రకటించారు.చదవండి: చెట్లకు సెల్ఫోన్లు.. మహిళలకు తప్పని పాట్లుఅంత వ్యత్యాసమా?బిహార్‌లో ధనిక, పేద ఎమ్మెల్యేల మధ్య భారీ వ్యత్యాసం.. అక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులకు అద్దం పడుపడుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో బిహారీలకు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Election) రెండు విడతల్లో.. నవంబర్ 6, 11న జరగనున్నాయి. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. -
ఎల్లో కవర్ల కలకలం.. అర్ధరాత్రి బీహార్‌లో పొలిటికల్ హైడ్రామా
బీహార్ రాజకీయాల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన పరిణామాలు నిజంగానే హైడ్రామాను తలపించాయి. రాష్ట్రీయ జనతా దళ్(RJD) పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, వాళ్లకు సీల్డ్ కవర్ల అందజేత, కొద్దిగంటలకే తిరిగి వెనక్కి తీసుకోవడం.. తీవ్ర కలకలం రేపాయి. అధిష్టానం పెద్దల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే అభ్యర్థుల ఎంపికలో గందరగోళం నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. అసలేం జరిగిందంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం మహాఘట్ బంధన్‌లో సీట్ల సర్దుబాటు జరిగిపోయిందంటూ జాతీయ మీడియా చానెల్స్‌లో హడావిడి నడుస్తోంది. ఈ తరుణంలో సోమవారం ఢిల్లీలో ఐఆర్సీటీసీ కేసు కోర్టు విచారణ అనంతరం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతో సహా పాట్నాకు చేరుకున్నారు. అయితే కాసేపటికే ఆర్జేడీ శ్రేణులకు అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద కోలాహలం నెలకొంది(RJD Candidates). కాసేపటికి.. లోపలికి వెళ్లిన కొందరు.. నిమిషాల తర్వాత చేతుల్లో ఎల్లో కవర్లతో(RJD Yellow Covers Drama) బయటకు వచ్చి తమ వర్గీయులతో కోలాహలంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందులో వాళ్ల పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే పత్రాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం నడిచింది. అయితే.. కొద్దిసేపటికే లాలూ తనయుడు తేజస్వి యాదవ్, లాలూ నివాసానికి చేరుకున్నారు. ఆ వెంటనే కవర్లు అందుకున్నవాళ్లకు మరోసారి ఫోన్లు వెళ్లాయి. కవర్లు తీసుకెళ్లినవాళ్లు.. అర్ధరాత్రి తిరిగి లాలూ నివాసానికి చేరి వాటిని అప్పగించారు. ఎల్లో కవర్లు అందుకున్నవాళ్లలో.. జేడీయూ నుంచి తాజాగా ఆర్జేడీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నాగేంద్ర కుమార్ సింగ్ అలియాస్ బోగో కూడా ఉన్నారు. అయితే ఇలా ఎందుకు జరిగిందనే దానిపై ఆర్జేడీ నేతలెవరూ స్పష్టత ఇవ్వలేదు. అయితే.. అష్రాఫ్ ఫాతిమా మాత్రం తాము ఎలాంటి కవర్లు అందుకోలేదని, అవి ఏఐ జనరేటెడ్ ఫొటోలు అని ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే.. మహాఘట్ బంధన్‌లో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిందనేది తాజా సమాచారం. మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుందని, కాంగ్రెస్ 70 స్థానాల్లో, ముకేష్ సాన్హీ వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయింపు జరిగిందనేది ఆ కథనాల సారాంశం. బీహార్ ఫస్ట్ ఫేస్‌కు ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ నడుస్తోంది. నవంబర్ 6న పొలింగ్ జరుగుతుంది. రెండో దశ పోలింగ 11వ తేదీన జరుగుతుంది. నవంబర్ 14న కౌంటింగ్.. ఆరోజే ఫలితాలు వెల్లడించనున్నారు.ఇదీ చదవండి: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ -
కొలిక్కి వచ్చిన మహాఘట్ బంధన్ సీట్ల సర్దుబాటు
కాంగ్రెస్ పార్టీ పంతం నెగ్గించుకుంది. రాష్ట్రీయ జనతా దళ్(RJD) మిత్రపక్షం కోసం కాస్త దిగొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీహార్ ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. కోరుకున్న సీట్లకు కేటాయించడంతో మహాఘట్ బంధన్‌లో సీట్ల కేటాయింపు సస్పెన్స్‌కు దాదాపుగా తెర పడినట్లేనని జాతీయ మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి(Bihar Seats Sharing). మొత్తం 243 స్థానాలకుగానూ.. ఆర్జేడీ 144 స్థానాలకు పోటీ చేయాలని తొలుత భావించింది. అయితే సర్దుబాటు నేపథ్యంలో ఇప్పుడు 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అలాగే.. కాంగ్రెస్ పార్టీ తొలుత 61 స్థానాలను కేటాయిస్తారనే ప్రచారం జరగ్గా.. ఇప్పుడు 70 స్థానాల్లో పోటీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కూటమిలో భాగమైన ముకేష్ సాన్హీ వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ(VIP)కి 16, వామపక్ష కూటమికి 29-31 స్థానాలు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక.. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మిత్రపక్షాలు మాత్రం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అని బహిరంగంగా చెప్పేశాయి. మరోవైపు డిప్యూటీ సీఎం పోస్టుకు సంబంధించిన అంశమేదీ మహాఘట్ బంధన్‌లో చర్చకు రాలేదని సమాచారం. అంతకు ముందు..బీహార్‌లో ప్రతిపక్ష కూటమిలో సీట్ల పంపకంపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య తీవ్ర చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ 70 స్థానాలు తమకు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఒకవైపు రాహుల్ గాంధీ సమక్షంలోనే తాను సీఎం అభ్యర్థినంటూ తేజస్వి యాదవ్ ప్రకటించినా.. సీట్ల డిమాండ్‌ను నేరవేర్చుకునేందుకే కాంగ్రెస్ ఆ అంశంపై సైలెంట్‌గా ఉంటూ వచ్చింది. ఇంకోవైపు.. బీహార్ మహాఘట్ బంధన్ కూటమిలో సీట్ల పంపకాన్ని ఇరకున పడేసే పరిణామాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM), ఐపీ గుప్తా నేతృత్వంలోని ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ(IIP) విపక్షాలతో చేతులు కలిపాయి. దీంతో.. ఎనిమిది పార్టీలకు ఈ కూటమి విస్తరించింది. అదే సమయంలో వీఐపీ పార్టీ అధినేత ముకేశ్ సాహ్ని.. 50 స్థానాలు+ఉపముఖ్యమంత్రి డిమాండ్ చేయడంతో సీట్ల పంపకంలో జాప్యం జరిగింది. చివరకు 16 పార్టీలకు సాహ్ని ఒప్పుకోగా.. ఆర్జేడీ తన కోటా నుంచి జేఎంఎంకు, కాంగ్రెస్ తన కోటా నుంచి IIP పార్టీకి స్థానాలు కేటాయించేందుకు అంగీకరించడంతో.. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లైంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో జరగనుంది. మొత్తం 243 స్థానాలకుగానూ.. 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ఇప్పటికే రిలీజ్ కాగా.. నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి దశలో నవంబర్ 6న, రెండో దశలో నవంబర్ 11న పోలింగ్ ఉంటుంది. ఓట్లు లెక్కించే తేదీ నవంబర్ 14. ఇదీ చదవండి: లాలూ కుటంబానికి భారీ షాక్ -
బిహార్‌లో కొత్త ప్రయోగం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పరుగు పందెంలో తనది ముందంజేనని పాలక పక్షమైన ఎన్డీయే నిరూపించుకుంది. ఆదివారం చర్చోపచర్చల తర్వాత జేడీ(యూ), బీజేపీలు చెరో 101 సీట్లకూ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. భాగస్వామ్య పక్షాల్లో ప్రధానమైన లోక్ జనశక్తి పార్టీకి 29 స్థానాలీయగా, మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్తానీ అవామీ పార్టీ (సెక్యులర్), ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌మోర్చా (ఆర్ఎల్ఎం)కు ఆరేసి సీట్ల చొప్పున కేటాయించారు. సర్దుబాటు వ్యవహారం గమనిస్తే బిహార్‌ను గత నాలుగు దశాబ్దాలుగా శాసిస్తున్న మండల్ రాజకీ యాల ప్రభావం కొడిగట్టిందని బీజేపీతోపాటు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా భావిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. వేర్వేరు కారణాలతో ఈసారి బిహార్ పతాక శీర్షికలకెక్కింది. హడావిడిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు పూనుకోవటం వివాదాస్పదంగా మారింది. బీజేపీ వ్యతిరేక ఓటర్ల పేర్లు తొలగింపే దీని ఆంతర్యమని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగబోయే పోలింగ్ కూడా పెద్ద వార్తే. 2010లో ఆరు దశలలో పోలింగ్ జరిగిన ఆ రాష్ట్రంలో అది క్రమేపీ తగ్గుతూ వస్తోంది. క్రితంసారి దాన్ని మూడు దశలకు కుదిస్తే, ఈసారి రెండు దశలుగా మారింది. తొలి దశలో జరిగే 121 స్థానాల్లో అత్యధిక భాగం మధ్య బిహార్ లోనివి కాగా, కొన్ని ఉత్తరప్రదేశ్‌కు పొరుగు నున్నాయి. రెండో దశలోని 122 స్థానాలూ నేపాల్ సరిహద్దుల్లోనూ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల పొరుగున ఉన్నాయి.ఎన్డీయే సీట్ల పంపకమే అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు కుదిరినప్పటినుంచీ జేడీ(యూ) తనకు రావాల్సిన సీట్ల సంఖ్యపై పట్టుదలతో ఉండేది. తమదే పెద్ద పార్టీ గనుక అత్యధిక స్థానాలుండాలని కోరేది. కానీ 2020 ఎన్నికల్లో ప్రజలు జేడీ(యూ)ను బాగా దెబ్బతీశారు. అప్పుడు పట్టుబట్టి బీజేపీ కన్నా ఒక్క సీటైనా తనకు అధికంగా ఉండాల్సిందేనని కోరి 122 స్థానాలు తీసుకున్న జేడీ(యూ), ఒప్పందం ప్రకారం తన వాటా నుంచి మరో భాగస్వామ్య పక్షమైన హిందూస్తానీ ఆవామ్ మోర్చా (హెచ్ఏఎం)కు 11 ఇచ్చింది. 111 చోట్ల పోటీ చేయగా తీరా గెల్చుకున్నవి 43 మాత్రమే. 121 స్థానాలు రాబట్టుకున్న బీజేపీ, వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ)కి 11 కేటాయించింది. 110కి పోటీ చేసి 74 చోట్ల విజయం సాధించింది. అప్పుడు ఎన్డీయే నుంచి బయటకుపోయి 135 చోట్ల పోటీ చేసిన లోక్ జనశక్తి ఒక స్థానమే గెల్చుకున్నా 33 చోట్ల తమను దెబ్బతీయగలిగిందన్న బాధ జేడీ(యూ)ను పీడించింది. బీజేపీ లోపాయకారీ మద్దతు వల్లే ఇలా జరిగిందన్న అభిప్రాయం ఏర్పడింది. అందుకే సీఎంగా ఉన్నా మధ్యలోనే ఎన్డీయేకు గుడ్‌బై చెప్పి మహా కూటమి వైపు వెళ్లి సీఎం పదవిని పదిలం చేసుకున్నారు నితీశ్. కానీ అది కూడా ఎంతోకాలం సాగలేదు. తిరిగి ఎన్డీయే వైపు వచ్చారు. బిహార్ రాజకీయాల్లో నితీశ్ శకం ముగిసిందనీ, తన ప్రాభవం మొదలైందనీ బీజేపీ విశ్వసిస్తోంది. తాజా సర్దుబాటులో 29 స్థానాలు పొందిన ఎల్జేపీ పూర్తిగా తన చెప్పుచేతల్లో ఉంటుంది గనుక ఈసారి సీఎం పదవి సునాయాసంగా రాగలదని భావిస్తోంది. క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీశే తమ సీఎం అని చెప్పిన ఎన్డీయే ఇప్పుడు మౌనం వహించటాన్ని జేడీ(యూ) కూడా గమనించకపోలేదు. కానీ ఆ పార్టీకి వేరే గత్యంతరం లేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనే జేడీ(యూ) కన్నా ఒక స్థానం అధికంగా డిమాండ్ చేసి సాధించుకున్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సరళిని అనుసరిస్తుందని నితీశ్ ముందే గ్రహించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీది పైచేయి అయితే అది నితీశ్‌కు మాత్రమే కాదు... మొత్తంగా మండల్ రాజకీయాలకే విఘాతం. ఎందుకంటే బీజేపీ అధికారం కైవసం చేసుకోవటమంటే విపక్ష ఆర్జేడీని కూడా వెనక్కి నెట్టినట్టే అవుతుంది. పైగా జాతీయ స్థాయిలో బీజేపీ బలం పుంజుకోవటానికి దోహదపడుతుంది. ఇంత కీలకమైన ఈ పోరులో తమ వైఖరి మారబోదని బిహార్ ఓటర్లు తేలుస్తారా... బీజేపీ కోరుకునే కొత్త దోవన పయనిస్తారా అన్నది వచ్చే నెల ఎన్నికల తర్వాత వెలువడబోయే ఫలితాలతో వెల్లడవుతుంది. -
లాలు ఫ్యామిలీకి భారీ షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్సీటీసీ హోటళ్ల అవినీతి కేసుకు సంబంధించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్డీ దేవి, కుమారుడు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో పాటు ఇతర నిందితులపై అభియోగాలను ఖరారు చేసింది. వీరంతా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా, నిందితుల పాత్ర ఆధారంగా న్యాయస్థానం వేర్వేరు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది. ముఖ్యంగా రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లపై ఐపీసీ సెక్షన్ 420 (మోసం), 120బీ (నేరపూరిత కుట్ర) కింద అభియోగాలు మోపింది. అయితే నిందితులందరిపై నేరపూరిత కుట్ర అభియోగం ఉమ్మడిగా ఉంది. తమపై మోపిన ఆరోపణలను లాలు కుటుంబం ఖండించింది. తాము నిర్దోషులమని, విచారణను ఎదుర్కొంటామని కోర్టుకు తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘టెండర్ కుంభకోణానికి సంబంధించిన పూర్తి కుట్ర లాలు ప్రసాద్ యాదవ్‌కు తెలిసే జరిగింది. టెండర్ ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకున్నారు. ఈ కుట్ర ద్వారా లాలు కుటుంబం లబ్ధి పొందింది. రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లకు అత్యంత తక్కువ ధరకే విలువైన భూమి లభించింది’అని పేర్కొంది. కోర్టు లాలు యాదవ్‌ను ఉద్దేశించి, ‘మీరు మీపై మోపిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా? లేక విచారణను ఎదుర్కొంటారా?’అని ప్రశ్నించగా, ‘ఈ ఆరోపణలన్నీ అవాస్తవం’అని లాలూ యాదవ్ బదులిచ్చారు. అదేవిధంగా, రబ్డీ దేవి, తేజస్వీ యాదవ్‌లు కూడా తాము ఏ కుట్రలో, మోసంలో పాలుపంచుకోలేదని స్పష్టం చేశారు. ఏంటీ కుంభకోణం?2004– 2009 మధ్యకాలంలో లాలు ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. సీబీఐ ఆరోపణల ప్రకారం, రాంచీ, పూరీలలో ఉన్న ఐఆర్సీటీసీకి చెందిన రెండు బీఎన్ఆర్ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టులను ‘సుజాత హోటల్స్’అనే ప్రైవేట్ సంస్థకు అక్రమంగా కట్టబెట్టారు. ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాంట్రాక్టుకు ప్రతిఫలంగా, లాలు కుటుంబానికి పట్నాలోని అత్యంత విలువైన భూమిని సుజాత హోటల్స్ యజమానులు బదిలీ చేశారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. 2017 జూలై 17న సీబీఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. #WATCH | Delhi: RJD leader Tejashwi Yadav leaves from the Rouse Avenue Court.The Rouse Avenue court framed charges against former Railway Minister Lalu Prasad Yadav, former Bihar CM Rabri Devi, RJD leader Tejashwi Yadav and others in the IRCTC hotels corruption case. This case… https://t.co/F9E3EhYfJM pic.twitter.com/zpX2ecXFcC— ANI (@ANI) October 13, 2025మరోవైపు.. బీహార్‌లో రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ క్రమంలో లాలూ ఫ్యామిలీపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ఆర్జేడీకీ పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
బీహార్‌లో పొలిటికల్ ట్విస్ట్.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిద్దరూ సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దీంతో, ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఎమ్మెల్యేలు నవాడా ఎమ్మెల్యే విభాదేవి, రజౌలి ఎమ్మెల్యే ప్రకాశ్ వీర్ ఆదివారం స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్‌ను కలిసి రాజీనామా పత్రాలను సమర్పించారు. వీరి రాజీనామాలను స్పీకర్ ఆమోదించారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. విభా దేవి భర్త, మాజీ ఎమ్మెల్యే రాజ్ బల్లభ్ యాదవ్ పోక్సో కేసులో కొన్నేళ్లుగా జైలులో ఉండి, ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబంలోని వారికి టిక్కెట్ ఇవ్వలేదని ఆర్జేడీపై ఈయన ఆగ్రహంతో ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రకాశ్ వీర్ మరోసారి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. బీహార్‌లో సీట్ల సర్దుబాటు పరిష్కారమైంది. బీజేపీ, జేడీ(యూ) చెరో 101 స్థానాల నుంచి పోటీచేయాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీ(యూ)తోపాటు బీజేపీ సైతం చెరో 101 సీట్ల నుంచి బరిలో దిగనుంది. చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి(రామ్ విలాస్) పార్టీ 29 స్థానాల నుంచి పోటీ చేయనుంది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాఝీ సారథ్యంలోని హిందుస్తానీ అవామ్ మోర్చా(సెక్యూలర్), ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చాలు చెరో ఆరు స్థానాల నుంచి పోటీచేయనున్నాయి. 243 నియోజకవర్గాలున్న బీహార్‌లో పాలక ఎన్డీఏ కూటమిలో ఎవరే స్థానం నుంచి పోటీచేయాలన్న దానిపై కొద్దిరోజులుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. -
మహాఘట్బంధన్ సంయుక్త మేనిఫెస్టో
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అధికార ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైన నేపథ్యంలో విపక్ష ‘మహాఘట్బంధన్’ కూటమి పార్టీలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్, ఆర్జేడీ ముఖ్య నేతల మధ్య కీలక భేటీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే సీట్ల పంపకాన్ని ఖరారుచేసి ఈ వారంలోనే సంయుక్త మేనిఫెస్టోను ప్రకటించాలని విపక్ష కూటమి భావిస్తోంది. నేడు జరగబోయే సమావేశం కోసం ఇప్పటికే ఆర్జేడీ అగ్రనేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లు ఢిల్లీకి చేరుకున్నారు. భేటీ కోసం వచ్చానని లాలూ చెప్పగా కోర్టు కేసు కోసం వచ్చానని తేజస్వీ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో చెప్పారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ తక్కువ సీట్లనే కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆనాడు 70 చోట్ల పోటీచేసి 17 చోట్ల మాత్రమే కాంగ్రెస్ గెల్చిన విషయం తెల్సిందే. కాంగ్రెస్ గౌరవప్రదమైన ఆమోదనీయమైన స్థానాలను సాధించవచ్చని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ అన్నారు. -
Bihar: కుదిరిన ఎన్డీయే భాగస్వామ్య పార్టీల సీట్ల సర్దుబాటు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. 243 అసెంబ్లీ సీట్లకు గాను 101 బీజేపీకి, 101 జేడీయూకి సర్దుబాటు చేసుకునేందుకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. బీహార్ సీట్ల ఒప్పందం కుదిరిన విషయాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వె ల్లడించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా సీట్ల సర్దుబాటు జరిగిన విషయాన్ని స్పష్టం చేశారు.సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి 101 సీట్లు, తమకు(బీజేపీ) 101 సీట్ల సర్దుబాటు జరిగిందన్నారు. చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీకి 29 సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగతా రెండు పార్టీలకు తలో ఆరు సీట్ల చొ ప్పున ఒప్పందం కుదిరిందనే విషయాన్ని స్పష్టం చేశారు.हम एनडीए के साथियों ने सौहार्दपूर्ण वातावरण में सीटों का वितरण पूर्ण किया।BJP – 101JDU – 101LJP (R) – 29RLM – 06HAM – 06एनडीए के सभी दलों के कार्यकर्ता और नेता इसका हर्षपूर्वक स्वागत करते हैं।बिहार है तैयार,फिर से एनडीए सरकार।#NDA4Bihar ✌️— Dharmendra Pradhan (@dpradhanbjp) October 12, 2025 జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లుభారతీయ జనతా పార్టీ (బీజేపీ): 101 సీట్లులోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 29 సీట్లుహిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం): 6 సీట్లురాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం): 6 సీట్లు కాగా, బీహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, నవంబర్ 14న లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.ఇదీ చదవండి:బీహార్‌లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ! -
Bihar Election: నాడు చారిత్రక ఘట్టాలకు సాక్షి.. నేడు మరో రికార్డుకు బక్సర్ సిద్ధం
బీహార్‌లోని బక్సర్‌కు భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 1764లో ‘బాటిల్ ఆఫ్ బక్సర్’లో విజయమే బ్రిటిషర్లకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటుకు బాటలు వేసింది. అప్పటి బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాకు మీర్ జాఫర్ వెన్నుపోటు పొడవడంతో దేశంలో తెల్లదొరల పాలనకు బీజం పడింది. ఇప్పుడు కూడా బీహార్ దంగల్‌లో బక్సర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బక్సర్పై పట్టుకు వివిధ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. దీనిపై ‘సాక్షి వెబ్’ ప్రత్యేక కథనం..బక్సర్ జిల్లాకు మతపరమైన నేపధ్యమే కాకుండా పౌరాణిక, చారిత్రక దృక్కోణాల నుండి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఈ భూమి భారత చరిత్రలో పలు నిర్ణయాత్మక మలుపులను చూసింది. భారతదేశం అంతటా బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణకు ఇక్కడే పునాది పడింది. 1764లో జరిగిన చారిత్రాత్మక బక్సర్ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు మార్గం సుగమం చేసింది. 1539లో జరిగిన చౌసా యుద్ధంలో, షేర్ షా సూరి హుమాయున్ను ఓడించి, ఢిల్లీలో అధికారాన్ని స్వాధీనం చేసుకుని, భారత పాలనా విధానాన్ని సమూలంగా మార్చివేశారు. అందుకే బక్సర్.. భారత పాలనను సమూలంగా మార్చిన రెండు యుద్ధాలను చూసిందని చెబుతారు.భారతీయ పురాణాల కోణం నుండి కూడా బక్సర్‌కు ఎంతో ప్రాముఖ్యతను ఉంది. ఈ భూమి శ్రీరాముడు విద్యాభ్యాసం చేసిన ప్రదేశం. వామనుడు జన్మించిన భూమి. మహర్షి విశ్వామిత్రుని తపస్సు చేసిన స్థలం. గంగా నది ఒడ్డున ఉన్న ఈ జిల్లా మత విశ్వాసాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ గంగా మాత ఉత్తరాయణి నది ప్రవహిస్తుంది. ఈ జిల్లాకు తూర్పున భోజ్‌పురి ప్రాంతం, దక్షిణాన రోహ్తాస్, ఉత్తరాన గంగా నది, పశ్చిమాన కైమూర్, కర్మనాస నదుల సరిహద్దులు ఉన్నాయి. ఇక్కడి మతపరమైన ప్రదేశాలలో రామరేఖ ఘాట్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడే శ్రీరాముడు కట్టించిన మొదటి రామేశ్వరనాథ్ ఆలయం ఉంది. శ్రీనాథ్ బాబా ఆలయం, వామనుడి జన్మస్థలం, బాబా బర్మేశ్వర్నాథ్ ఆలయం, నౌలఖా ఆలయం, దుమ్రాలోని బిహారీ ఆలయం ఉన్నాయి.బక్సర్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి బక్సర్, రాజ్పూర్, దుమ్రాన్, బ్రహ్మపూర్. ఈ ప్రాంతాన్ని సాంప్రదాయకంగా బీజేపీకి బలమైన కోటగా పరిగణిస్తారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో ఇక్కడి రాజకీయ సమీకరణాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.బక్సర్: ఈ స్థానాన్ని గత రెండు దఫాల ఎన్నికల్లో కాంగ్రెస్ నేత సంజయ్ కుమార్ తివారీ ఆక్రమించారు. బీజేపీ ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతంలో గెలవడం ద్వారా ఆయన తన రాజకీయ పట్టును బలోపేతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన బీజేపీ రైతు నేత పరశురామ్ చతుర్వేదిని ఓడించారు.రాజ్పూర్ : కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ బీజేపీ నేత విశ్వనాథ్ రామ్..జేడీయూ అభ్యర్థి సంతోష్ కుమార్ నిరాలాను ఓడించి, ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.దుమ్రాన్ : సీపీఐ (ఎంఎల్)కి చెందిన అజిత్ సింగ్ కుష్వాహా జేడీయుకు చెందిన అంజుమ్ అరాను ఓడించి, ఈ అసెంబ్లీ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.బ్రహ్మపూర్ : ఆర్జేడీకి చెందిన శంభు యాదవ్ గత రెండు దఫాల ఎన్నికల్లో ఈ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎల్జేపీ అభ్యర్థి హులాస్ పాండేను ఓడించారు.బక్సర్‌లో ప్రధాన సమస్యలివే..ఈ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి పలు వినతులున్నాయి. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన సీతా మాత ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ చాలాకాలం నుంచి వినిపిస్తోంది. దీనిని రామాయణ సర్క్యూట్‌తో అనుసంధానించాలని కూడా కోరుతున్నారు. అలాగే డుమ్రాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో మలై బ్యారేజ్ ప్రాజెక్టును అమలు చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. -
Bihar Elections: ఆ ఐదుగురు ఓటరు లిస్టులో చనిపోయి.. బతికే ఉన్నామంటూ..
పట్నా: బీహార్‌లో నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి నెలకొంది. ఇంతలో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఉదంతం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రంలోని ఒక గ్రామానికి చెందిన ఐదుగురు ఓటర్ల పేర్లు ‘జాబితా’లో చనిపోయినట్లు ప్రకటించారు. అయితే వారంతా బ్లాక్ డెవలప్మెంట్ అధికారి(బీడీవో)ని కలుసుకుని ‘సర్, మేము బతికే ఉన్నాం’ అని పేర్కొంటూ ఒక మెమోరాండం సమర్పించారు.బీహార్ ఎన్నికల మొదటి దశకు కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉన్న తరుణంలో, బంకా జిల్లాలోని ధోరైయా బ్లాక్‌లోని బట్సర్ గ్రామానికి చెందిన ఐదుగురు ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాలో తమను చనిపోయినట్లు చూపడాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు. వెంటనే వీరంతా బీడీవో అరవింద్ కుమార్‌ను సంప్రదించి, తాము బతికే ఉన్నామంటూ ఒక మెమోరాండం సమర్పించారు. ముసాయిదా ఓటరు జాబితాలో మోహన్ సా, సంజయ్ యాదవ్, రాంరూప్ యాదవ్,నరేంద్ర కుమార్ దాస్, విశ్వవర ప్రసాద్‌ల పేర్లు ఉన్నాయి.సామాజిక కార్యకర్త ఇంద్రదేవ్ మండల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఐదుగురు ఓటర్లు.. జాబితాలోని లోపం కారణంగా ఓటు హక్కును కోల్పోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బీడీఓ కుమార్ వీరి ఫిర్యాదుపై స్పందిస్తూ తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ఏ ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోరని ఆయన పేర్కొన్నారు. దీనికిముందు చంపారన్‌లోని బాగహి పంచాయతీలోని డుమ్రి గ్రామంలో 15 మంది ఓటర్ల పేర్లు జాబితాలో చనిపోయినట్లు చూపించారు. తరువాత దానిని సరిచేశారు. బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు నవంబర్ ఆరు, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. -
రాహుల్ లాగే తేజస్వీకి ఓటమి తప్పదు
రాయపూర్: ఆరేళ్ల క్రితం అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడినట్లుగానే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు పరాజయం తప్పదని జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. వైశాలి జిల్లా రఘోపూర్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో తేజస్వీ ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేయవచ్చని పుకార్లు వస్తున్నాయని విలేకరులు అడగ్గా.., ప్రశాంత్ కిషోర్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘‘మా పార్టీ ఇక్కడ బలమైన అభ్యర్థిని పోటీకి దింపుతుందనే ఊహాగానాలకే తేజస్వీ భయపడుతున్నారు. వారిని రెండు చోట్ల పోటీ చేయనీయండి. 2019లో రాహుల్ గాంధీ కూడా వయనాడ్, అమేథీలో పోటీ చేశారు. కాంగ్రెస్‌కు 15 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీ, బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో అవమానకర రీతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆర్జేడీకి, తేజస్వీ యాదవ్‌కు కూడా అదే గతి పడుతుంది’’ అన్నారు. రఘోపూర్ నియోజకవర్గంలో తేజ్వసీ కుటుంబం దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించారు. అయినప్పట్టకీ ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వారసత్వ పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ సింగ్ శత్రువు కాదుభోజ్పురి సూపర్‌స్టార్ పవన్ తనకు శత్రువు కాదన్నారు. ఆయన వ్యక్తిగతంగా మిత్రుడేనని, బీజేపీలో ఉన్నారనేదానిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పవన్ సింగ్ భార్య తన అభద్రతా భావాలను పంచుకోవడానికి వచ్చినప్పుడు, తాను ఒక సోదరుడిలా హామీ ఇచ్చానన్నారు. తాను కానీ, జన్ సురాజ్ పార్టీ వారి వివాహ వివాదంలో ఎలాంటి జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు.ఆశావహుల్లో అసంతృప్తి సహజంరెండురోజుల క్రితం పార్టీ 51 మంది అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేసిన ఆశావహులను తేలికగా తీసుకున్నారు. ఇది ప్రతిపార్టీలోనూ సహజమని అన్నారు. వేలాది మంది రక్తం, కన్నీళ్లు, చెమటతో జన్ సురాజ్ పార్టీ నిర్మాణం జరిగిందన్నారు. అసెంబ్లీలో కేవలం 243 సీట్లు మాత్రమే ఉన్నప్పుడు వారందరికీ అవకాశం కల్పించడం ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. తమ పార్టీ అత్యంత పారదర్శక ప్రజాస్వామ్య పార్టీ సిద్ధాంతాలు కలిగి ఉందన్నారు. ప్రతీ సమస్య పరిష్కరిస్తామన్నారు.పోటీపై పార్టీదే తుది నిర్ణయంజన్ సురాజ్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఆదివారం(ఇవాళ) జరుగుతుందన్నారు. రఘోపుర్ నుంచి తనకు వచ్చే అభిప్రాయం కూడా చర్చకు వస్తుందన్నారు. దాని ఆధారంగా, అత్యంత అనుకూలమైన అభ్యర్థిని నిర్ణయిస్తారని, అది తానేనేనా అని చెప్పలేనని అన్నారు. ఆ నిర్ణయం పార్టీ తీసుకోవాలని చెప్పారు. -
బిహార్‌లో 100 స్థానాల్లో మజ్లిస్ పోటీ!
పాట్నా: మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఎంఐఎం).. ‘ఇంతింతై.. వటుడింతై.. బ్రహ్మాండాంతపు సంవర్ధియై..’’ అన్నట్లుగా 1969లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(బల్దియా) ఎన్నికల్లో పత్తర్‌గట్టీ డివిజన్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి విజయదుందుభీ మోగించిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ క్రమంగా హైదరాబాద్ పాతనగరంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పాగా వేసింది. తొలినాళ్లలో సలావుద్దీన్, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. క్రమంగా పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించి, జాతీయ స్థాయికి ఎదిగేలా చేశారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్(ఏఐఎంఐఎం)గా పార్టీని అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలో పాగా వేశారు. గత ఎన్నికల్లో బిహార్‌లో ఐదు స్థానాలను గెలుచుకున్నారు. బిహార్ తాజా ఎన్నికల్లో 100 స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు మజ్లిస్ నేతలు.గత ఎన్నికల్లో..నిజానికి 2015 నుంచే బిహార్‌పై మజ్లిస్ వ్యూహరచనను ప్రారంభించింది. అప్పట్లో ఆశాజనకంగా ఓటు బ్యాంకును సాధించినా.. అసెంబ్లీలో పాగా వేయలేకపోయింది. 2020 ఎన్నికల్లో మాత్రం తన సత్తాను చాటుకుంది. సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. అమౌర్ నుంచి ఇమాన్, బైసీ నుంచి రుక్ముద్దీన్ అహ్మద్, కొచ్దమాన్ నుంచి ఇజ్హార్ ఆసిఫీ, బహదూర్ గంజ్ నుంచి అంజార్ నయీమీ, జోకిహాట్ నుంచి షానవాజ్ ఆలం విజయం సాధించి, అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.నాలుగో బలమైన శక్తిగా..బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్-ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి బరిలో ఉండగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పుడు మజ్లిస్ బలమైన ప్రత్యర్థిగా ముందుకు సాగుతోంది. తాజాగా శనివారం హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాము 243 సీట్లకు గాను.. 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో బిహార్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి మజ్లిస్ ఐదు రెట్లు అధిక స్థానాల్లో పోటీ చేయనుంది. ‘‘నిజానికి నేను ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్‌తోపాటు.. తేజస్వీ యాదవ్‌ను సంప్రదించాను. పొత్తు కోసం కృషి చేశాను. వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే.. ఒంటరిపోరుకు సిద్ధమయ్యాం. భావసారూప్యత ఉన్న పార్టీలను కలుపుకొని పోతాం. దీని ద్వారా బిహార్‌లో తృతీయ ఫ్రంట్‌కు అవకాశాలుంటాయి’’ అని మజ్లిస్ బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మీడియాకు చెప్పారు.ఓట్లు చీలుతాయా?మజ్లిస్ పోటీతో సెక్యూలర్ ఓట్లు, ముస్లిం మైనారిటీల ఓట్లు చీలి.. ప్రధాన పార్టీలకు నష్టం వాటిల్లుతుందనే అభిప్రాయాలున్నాయి. 2020లో కూడా మజ్లిస్ ఈ అపవాదును మూటకట్టుకుంది. 2020లో బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఐదు స్థానాల్లో పాగా వేసింది. పలు స్థానాల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ ఫ్రంట్‌ను దారుణంగా దెబ్బకొట్టింది. అయితే.. 2022లో నలుగురు ఎమ్మెల్యేలు మజ్లిన్ను వీడి.. ఆర్జేడీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మాత్రమే మజ్లిస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2022 పార్టీ ఫిరాయింపుల తర్వాత మజ్లిస్ ఓటు బ్యాంకును పెంచుకోవడంపైనే దృష్టి సారించింది. రాష్ట్రంలోని 17శాతానికి పైగా ఉన్న మైనారిటీల తరఫున అసెంబ్లీలో గళం వినిపించేది తామేనని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ముందుకు సాగాలని మజ్లిస్ అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూ అసదుద్దీన్ ఒవైసీ గత నెల నాలుగు రోజులు బిహార్‌లో పర్యటించారు. సీమాంచల్‌పై దృష్టిపెడుతూ.. కిషన్ గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా జిల్లాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. ముస్లిం సమాజాన్ని ఈ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శలు చేశారు.విమర్శలు మొదలు..మజ్లిస్‌పై ప్రధాన పార్టీలు ఇప్పటికే విమర్శలు మొదలు పెట్టాయి. బీజేపీకి మజ్లిస్ బీ-టీమ్ అని ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్-ఆర్జేడీ ఓట్లను చీల్చి, బీజేపీకి మేలు కలిగించడమే ఆ పార్టీ ధ్యేయమంటూ మండిపడుతున్నాయి. సెక్యూలర్ ఓట్లను విభజించి, బీజేపీకి లబ్ధి కలిగేలా చేయడమే మజ్లిస్ వ్యూహమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా.. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇంటింటి ప్రచారం అనేది మజ్లిస్ వ్యూహాల్లో ప్రధానాంశం. -
Bihar elections: పోటీపై ఊహాగానాలు.. స్పందించిన భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్
పట్నా: ప్రముఖ భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్ తనపై వస్తున్న ఊహాగానాలను తిప్పికొట్టారు. బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తాను భారతీయ జనతా పార్టీకి నిజమైన సైనికుడినని చెప్పుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తానువున్న ఫోటోను షేర్ చేసిన పవన్ సింగ్.. తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీలో చేరలేదని స్పష్టం చేశారు. मैं पवन सिंह अपने भोजपुरीया समाज से बताना चाहता हूँ कि मैं बिहार विधानसभा चुनाव लड़ने के लिए पार्टी ज्वाइन नहीं किया था और नाहीं मुझे विधानसभा चुनाव लड़ना है |मैं पार्टी का सच्चा सिपाही हूँ और रहूँगा। pic.twitter.com/reVNwocoav— Pawan Singh (@PawanSingh909) October 11, 2025‘నేను, పవన్ సింగ్.. మా భోజ్‌పురి కమ్యూనిటీకి ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. నేను బీహార్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీలో చేరలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. నేను పార్టీకి నిజమైన సైనికుడిని..అలా సైనికునిగానే ఉంటాను’ అని పవన్ సింగ్ తన ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ 2024లో బీజేపీ నుంచి మొదటిసారిగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నుండి పోటీకి దిగారు. అయితే తన మ్యూజిక్ వీడియో పాటల్లో బెంగాలీ మహిళలను అసభ్యకరంగా చిత్రీకరించారనే ఆరోపణలుతో పార్టీ అతన్ని పోటీ నుంచి ఉపసంహరించుకోవాలని కోరింది. దీంతో ఆయన కరకట్ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఇది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కొన్ని సీట్లను కోల్పోయేలా చేసింది.బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్నాయి. మునుపటి అసెంబ్లీ ఎన్నికలు 2020 అక్టోబర్-నవంబర్‌లో జరిగాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2022, ఆగస్టులో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఎన్డీఏతో సంబంధాలను తెంచుకుని, ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం 2024, జనవరిలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌తో సంబంధాలను తెంచుకుని, తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
Bihar Elections: ఎన్డీఏ సీట్ల కేటాయింపు ఖరారు.. ఏ పార్టీకి ఎన్నంటే..
పట్నా: బీహార్ ఎన్నికలు నవంబర్ నెలలో జరగనున్నారు. ఈ నేపధ్యంలో వివిధ పార్టీలలో సీట్ల కేటాయింపుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్డీఏలో సీట్ల పంపకంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల భాగస్వామ్యాన్ని ఖరారు చేసింది. బీహార్‌లోని 243 సీట్లలో 240 సీట్లపై ఒప్పందం కుదిరింది. మిగిలిన మూడు నియోజకవర్గాలపై నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) మధ్య చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. అయితే దీనిపై పార్టీ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం సీట్ల కేటాయింపు ఇలా..జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ): 101 సీట్లుభారతీయ జనతా పార్టీ (బీజేపీ): 100 సీట్లులోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్): 26 సీట్లుహిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం): 7 సీట్లురాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం): 6 సీట్లుఇండియా టీవీ తెలిపిన వివరాల ప్రకారం కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్కుచెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 40 నుంచి 50 సీట్లను కోరగా, బీజేపీ ఆ పార్టీకి 20 నుంచి 25 సీట్లను ఆఫర్ చేసింది. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా (సెక్యులర్) 15 సీట్లలో పోటీకి ఉత్సాహం చూపింది. అయితే ఎన్డీఏ కేవలం ఏడు నియోజకవర్గాలను మాత్రమే ఆ పార్టీకి ఇచ్చింది. బీహార్‌లోని 243 అసెంబ్లీ సీట్లకు నవంబర్ ఆరు, నవంబర్ 11 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయని, నవంబర్ 14న లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. -
పాలిటిక్స్‌లో పాట కచేరి
ప్రతిభ, పాపులారిటీ.. పాలిటిక్స్‌కి మోస్ట్‌వాంటెడ్ థింగ్స్! ఈ రెండూ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పార్టీ టికెట్స్ వలచి వరిస్తాయి! ఆ కోవలో గ్లామర్ స్టార్స్, కళాకారులకైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది! అందులో అమ్మాౖయెతే.. మహిళా ప్రాతినిధ్యానికి ఒక ఓటు పెరిగినట్టే.. ఓ ఆశ చిగురించినట్టే! ఇప్పుడీ ప్రస్తావనకు ప్రాసంగికత బిహార్ ఎన్నికలు..అలా టాలెంట్ అండ్ ఫాలోయింగ్ గల అభ్యర్థి.. గాయని మైథిలీ ఠాకుర్. ఆమె పరిచయం..గాయనిగా మైథిలీ ఠాకుర్ (Maithili Thakur) దేశమంతటా సుపరిచితం. ఆమె మైథిలీ, భోజ్‌పురి, హిందీ భాషల్లో జానపద సంగీతంతోపాటు శాస్త్రీయ సంగీతంలోనూ ఘనాపాటి. సంగీత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మైథిలీ జన్మస్థలం బిహార్, మధుబని జిల్లాలోని బేనీపట్టీ. తండ్రి రమేశ్ ఠాకుర్ సంగీతం మాస్టారు. మైథిలీ తన ఇద్దరు సోదరులతోపాటు తండ్రి, తాత దగ్గరే శాస్త్రీయ, జానపద సంగీతం నేర్చుకున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ భక్తి, జానపద సంగీత కచేరీలు ఇస్తున్నారు. జానపద సంగీతంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంగీత నాటక అకాడమీ ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది. మైథిలీకి సంగీత కళ మీద ఆరాధనే కాదు. సామాజిక స్పృహ కూడా బాగా ఉంది. ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఓటర్లకు అవగాహన పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆమెను బిహార్ స్టేట్ ఐకాన్‌ను (Bihar State Icon) చేసింది. ఇవన్నీ కూడా ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడేట్టు చేశాయి. ఆయోధ్య రామాలయ (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంలో శబరి మీద ఆమె పాట పాడారు. ఆ గాన మాధుర్యాన్ని ప్రధాని అభినందించారు. ఇవన్నీ ఆమె రాజకీయ ప్రవేశాన్ని సునాయాసం చేయనున్నాయి. బిహార్ ఎన్నికల్లో మధుబని లేదా అలీనగర్ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజక వర్గానికి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేట్టు కనిపిస్తున్నాయి. మధుబని, దర్భంగా (అలీనగర్ ఈ జిల్లాలోనిదే).. ఈ రెండూ కూడా మిథిలా ప్రాంతం కిందకు వస్తాయి. మైథిలీ ఆ సంస్కృతీ సంప్రదాయంలోనే పుట్టి పెరిగిన వనిత. పైగా కళాకారిణి. ఈ రెండూ ఆమెను ఇటు సంప్రదాయవాదులకు, అటు సంప్రదాయవాదులు కాని వాళ్లకూ కూడా కావల్సిన వ్యక్తిగా ఆమెను ప్రజలకు దగ్గర చేస్తున్నాయి. సరిగ్గా బీజేపీ ఈ అంశాన్నే పరిగణనలోకి తీసుకుని ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు ఆమె యంగ్ లేడీ కావడంతో ఇటు యూత్నూ ఆకట్టుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తోందని చెబుతున్నారు. అయితే గెలుపు మాత్రం అంత అనాయాసంగా ఉండక పోవచ్చని మైథిలికి మద్దతిస్తున్న వారి అభిప్రాయం. ఆమె ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఓటరు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే సరిపోదు రాజకీయ ప్రవేశానికి. ఎంతో కొంత క్షేత్రస్థాయి అనుభవం, వ్యూహాలు, సంస్థాగత తోడ్పాటు, పార్టీ అంచనాలకనుగుణంగా పని చేయడం వంటివి మైథిలి ముందున్న సవాళ్లని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా యువత.. అందులో అమ్మాయిలు రాజకీయాల్లోకి రావడం మాత్రం శుభపరిణామమే! -
మెత్తబడ్డ చిరాగ్.. 13న ఎన్డీయే తొలి జాబితా..?
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై విస్తృత చర్చలు కొనసాగుతుండగానే ఏకాభిప్రాయం కుదిరిన స్థానాల్లో తొలి జాబితా విడుదల చేసేందుకు ఎన్డీయే పక్షాలు సిద్ధమవుతున్నాయి. అన్నీ కుదిరితే ఎన్డీయే పారీ్టలు ఈ నెల 13న తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతకుముందే బీజేపీ తన అభ్యర్థుల ఎంపిక కోసం శని, ఆదివారాల్లో కీలక భేటీలు జరుపనుంది.బిహార్‌లోని 243 స్థానాలకు గాను బీజేపీ, జేడీయూలు చెరో వంద స్థానాల్లో పోటీ చేసేందుకు ఇప్పటికే నిర్ణయించాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), హిందుస్తానీ ఆవామ్ మోర్చా కేటాయించాల్సిన సీట్లపై ఎటూ తేలలేదు. లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ మొన్నటివరకు 40 స్థానాలను డిమాండ్ చేయగా, బీజేపీ ఎన్నికల ఇంఛార్జి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అనంతరం ఆయన కొద్దిగా మెత్తబడ్డట్లు తెలుస్తోంది. 35 సీట్లకు ఆయన దిగొచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బీజేపీ ఆయన పార్టీకి 28–30 సీట్లు ఇచ్చేందుకు సుముఖత చూపుతోంది. ఇక చిరాగ్ పార్టీ పోటీ చేసే 20 స్థానాలపై స్పష్టత వచ్చిట్లు సమాచారం. హెచ్ఏఎంకు ఇవ్వాల్సిన 7 స్థానాలు, ఆర్ఎల్ఎంకి ఇవ్వనున్న మరో 6 స్థానాలపై ఇప్పటికే ఒక అంగీకారం కుదిరినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే బీజేపీ, జేడీయూలు పోటీ చేసే స్థానాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి.సుమారు 80కి పైగా స్థానాల్లో స్పష్టత ఏర్పడింది. స్పష్టత ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ఈ నెల11న ఢిల్లీలో బీజేపీ బిహార్ కోర్ గ్రూప్ సమావేశం కానుంది,. మరుసటి రోజున పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నాయకులు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఈ సమావేశాల తర్వాత అభ్యర్థుల జాబితాకు తుది ఆమోదం లభిస్తుందని, అక్టోబర్ 13న తొలి ఉమ్మడి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 స్థానాలను గెలుచుకుంది. ఇందులో 9మంది మహిళలు ఉన్నారు. ఈసారి కూడా 8–10 సిట్టింగ్ స్థానాలు మినహా మిగతావి పాతవారికే ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. -
డెబ్యూతోనే పెద్ద రిస్క్!! పీకే ఏమన్నారంటే..
అదేదో సినిమాలో.. ఏమాత్రం రాజకీయానుభవం లేనివాళ్లను ఎన్నికల్లో నిలబెట్టి గెలిచి.. చివరకు తాను కాకుండా ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని సీఎం చేస్తాడు క్లైమాక్స్‌లో హీరో. బీహార్ ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఈ సీన్‌ను ప్రస్తావిస్తున్నారు పలువురు. ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త(మాజీ).. తన పార్టీ జన్ సురాజ్ తరఫున అభ్యర్థుల ప్రకటనే ఇందుకు ప్రధాన కారణం. ప్రశాంత్ కిషోర్(prashant kishor).. బీహార్ ఎన్నికల బరిలో తొలిసారి తన జన సురాజ్ పార్టీని ఒంటరిగా పోటీకి నిలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం 51 మందితో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేశారాయన. అందులో.. ప్రముఖ మ్యాథ్స్ ప్రొఫెసర్ కేసీ సిన్హా(పాట్నా వర్సిటీ మాజీ వీసీ), మాజీ అడ్వొకేట్ జనరల్ వైబీ గిరి, రితేష్ రంజన్ పాండే (బోజ్‌పురి గాయకుడు)తో పాటు డాక్టర్లు, లాయర్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, పోలీస్ అధికారులు సైతం ఉన్నారు. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే..గోపాల్‌గంజ్ భోరే నియోజక వర్గంలో జన్ సురాజ్(Jan Suraaj Party) తరఫున పోటీ చేయబోతున్న ప్రీతి కిన్నర్(Preeti Kinnar).. ఈ జాబితాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎందుకంటే.. ఆమె ఓ ట్రాన్స్‌జెండర్ కాబట్టి. ప్రీతి కిన్నర్.. స్వస్థలం కల్యాణ్‌పూర్. ట్రాన్స్జెండర్ల నాయకురాలిగా.. సామాజిక వేత్తగా స్థానికంగా ఆమెకు మంచి పేరుంది. ఇంతకీ ఆమె పోటీ చేయబోతోంది ఎవరి మీదనో తెలుసా?.. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సునీల్ కుమార్ మీద. అందుకే ఆమె గురించి ప్రత్యేకంగా చర్చ నడుస్తోంది. అయితే.. స్థానిక సమస్యలపై ఆమెకు అవగాహన ఉండడం కలిసొచ్చే అంశమని జన్ సురాజ్ భావిస్తోంది.గెలిచిన దాఖలాల్లేవ్!రాజకీయాల్లో ట్రాన్స్జెండర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు అత్యంత అరుదనే చెప్పాలి. 1998 మధ్యప్రదేశ్ ఎలక్షన్స్‌లో శబ్నం మౌసీ సోహగ్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. 2015లో మధు కిన్నర్ చత్తీస్‌గఢ్ రాయ్‌ఘడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నెగ్గి.. మేయర్ పదవి చేపట్టారు కూడా. అయితే.. ఆ తర్వాతే ఆ వర్గం నుంచి చెప్పుకోదగ్గ విజయాలేవీ నమోదు కాలేదు.2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నుంచి రాజన్ సింగ్ పోటీ చేసి.. కేవలం 85 ఓట్లే దక్కించుకున్నారు. ఈ తరుణంలో ప్రీతి కిన్నర్.. అదీ జన్ సురాజ్ నుంచి బీహార్ ఎన్నికల బరిలో దిగడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ప్రీతి కిన్నర్(ఎడమ), ప్రొఫెసర్ కేసీ సిన్హా(మధ్యలో), సింగర్ రితేష్ రంజన్ పాండే(చివర.. కుడి)రిస్క్‌పై పీకే ఏమన్నారంటే.. జన్ సురాజ్ తొలి జాబితాలో.. సామాజిక న్యాయం వరకు అయితే బాగానే జరిగింది. 17 మంది ఈబీసీలు, 11 మంది బీసీలు, 9 మంది మైనారిటీలు, ఏడుగురు షెడ్యూల్ కాస్ట్(ప్రీతి కూడా), ఎనిమిది మంది ఇతర వర్గాల వాళ్లు ఉన్నారు. ‘‘జన సురాజ్ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో ఓట్లు పడకపోతే.. అది నా తప్పేం కాదు. అది ముమ్మాటికీ బీహార్ ఓటర్లదే’’ అని ప్రశాంత్ కిషోర్ తేల్చేశారు. ‘పార్టీకి సరైన గుర్తింపు లేదు, ప్రచార నిధులు పరిమితంగా ఉన్నాయి. పైగా అవతల జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ లాంటి పార్టీలు ఉండగా.. ఎన్నికల్లో కొత్త ముఖాలతో వెళ్లడం రిస్క్ కాదా?’ అనే మీడియా ప్రశ్నకు ఆయన పైబదులు ఇచ్చారు. అవినీతి నిర్మూలన, ప్రజా సమస్యల పరిష్కారం నినాదాలతో ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నారు. అక్టోబర్ 11న, రాఘోపూర్ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పేరు తొలి జాబితాలో లేదు, కానీ రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని పార్టీ తెలిపింది. నవంబర్ 6, 11.. రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections 2025) జరగనున్నాయి. నవంబర్ 14వ తేదీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదీ చదవండి: మాయావతి ఎంట్రీ.. సీన్ మారేనా? -
చివరికి రన్నింగ్ పోటీ పెట్టారు.. ఎవరు గెలిస్తే వారికే ఎక్కువ సీట్లట!
చివరికి రన్నింగ్ పోటీ పెట్టారు.. ఎవరు గెలిస్తే వారికే ఎక్కువ సీట్లట! -
‘డీప్ ఫేక్’పై ఈసీ నజర్
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) దృష్టి సారించింది. డీప్‌ఫేక్ వీడియోల ద్వారా ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులను లక్ష్యంగా చేసుకునే ధోరణిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని తుచ తప్పక పాటించాలని హెచ్చరించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ప్రకటన 6న వెలువడిన విషయం తెల్సిందే. విమర్శలకు హద్దుండాలి విమర్శలు విధానాలు, కార్యక్రమాలు, పనితీరుకు మాత్రమే పరిమితం కావాలని ఈసీ పునరుద్ఘాటించింది. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తల ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తిగత జీవితాలపై విమర్శలు చేయరాదని స్పష్టం చేసింది. ధ్రువీకరించుకోని ఆరోపణలు, వాస్తవాలను వక్రీకరించే విమర్శలకు దూరంగా ఉండాలని సూచించింది. ఈ నిబంధనలు ఇంటర్నెట్, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌కు కూడా వర్తిస్తాయని తెలిపింది. ఏఐ కంటెంట్‌కు లేబుల్ తప్పనిసరిఏఐ ఆధారిత టూల్స్‌ను దురి్వనియోగం చేసి సమాచారాన్ని వక్రీకరించే, తప్పుడు ప్రచారాలు చేసే డీప్‌ఫేక్‌ల జోలికిపోవద్దని పార్టీలకు ఈసీ సూచించింది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఒకవేళ ప్రచారం కోసం ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్‌ను సోషల్ మీడియా లేదా ప్రకటనల రూపంలో పంచుకుంటే, దానిపై ‘ఏఐ–జెనరేటెడ్’, ‘డిజిటల్లీ ఎన్హాన్స్డ్’లేదా ‘సింథటిక్ కంటెంట్’వంటి స్పష్టమైన లేబుల్స్‌ను తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించింది. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా ఉండేందుకు సోషల్ మీడియా పోస్టులపై నిఘా ఉంచినట్లు కమిషన్ తెలిపింది. ఎంసీసీ మార్గదర్శకాల సమర్థవంతమైన అమలు కోసం విస్తృత ఏర్పాట్లు చేశామని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. -
అధికారమిస్తే ఇంటికో ఉద్యోగం
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలకమైన ప్రకటన చేశారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కోటికి పైగా ఉన్న యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోగా ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తెస్తామని, 20 నెలల్లోనే ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. యువతను ఆకట్టుకునేందుకు పోటాపోటీ.. బిహార్‌లోని మొత్తం 7.42 కోట్ల ఓటర్లలో 18–35 ఏళ్ల వారి సంఖ్య 1.60 కోట్ల వరకు ఉంది. ఇటీవల యువ ఓటర్లను లక్ష్యంగా చేసుకొని నిర్వహించిన సర్వేలో 18–29 ఏళ్ల వారిలో దాదాపు 44.6 శాతం మంది ఎన్డీయేకు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నారని, 39.5 శాతం మంది మహాఘట్బంధన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. సుమారు 42 శాతం మంది బిహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్‌ను ఇష్టపడుతున్నట్లు తేల్చారు. కేవలం 27.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సర్వే ఫలితాలను దృష్టిలో పెట్టుకొనే ముఖ్యమంత్రి నితీష్ ముందుగానే యువతకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ’ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ యోజన’పథకం కింద, 12వ తరగతి అర్హత సాధించిన విద్యార్థులకు రూ. 4,000, ఐటీఐ లేక డిప్లొమా ఉన్నవారికి రూ. 5,000, ఇంటర్న్‌షిప్‌లు తీసుకుంటున్న గ్రాడ్యుయేట్లు లేక పోస్ట్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.6,000 అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటే 2025– 26 నుంచి 2030–31 వరకు రాష్ట్రం నుంచి లక్ష మంది యువతకు వివిధ సంస్థలలో ఇంటర్న్‌షిప్‌లు అందిస్తామని ప్రకటించారు. దీనిని ఎదుర్కొ ని యువతను తనవైపు తిప్పికునే లక్ష్యంతో ఆర్జేడీ నేత తేజస్వీ ‘ఛాత్ర యువ సంసద్’కార్యక్రమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చచేశారు. యువజన కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, విద్యాపరంగా వెనుకబడ్డ విద్యార్థులకు ఇంటి నుంచి ట్యూటర్లను అందిస్తామని, పరీక్షా కేంద్రాలకు ఉచిత రవాణాను కల్పిస్తామని ప్రకటించారు.సైన్స్, గణితం, ఇంగ్లిష్‌లలో వెనుకబడ్డ ఉన్న విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి వారికి అదనపు సమయం కేటాయిస్తామన్నారు. బిహార్ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు మరోసారి ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఇన్ని హామీలు గుప్పించినా ప్రధాని నరేంద్ర మోదీ, నితీశ్‌కుమార్ నిర్వహిస్తున్న బహిరంగ సభలకు యువత పెద్ద సంఖ్యలో హాజరవుతుండటంతో ఎన్నికల షెడ్యూల్ అనంతరం గురువారం తొలి ఎన్నికల వాగ్ధానం ప్రకటించారు. ‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండేలా చూస్తాం. ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు దీని కోసం చట్టం తెస్తాం. 20 నెలల్లో ఒక్క ఇళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండదు‘అని ప్రకటించారు. ప్రస్తుత నితీశ్ ప్రభుత్వం 20ఏళ్లుగా ఎన్నడూ నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని ఎన్నడూ గుర్తించలేదని, తానుగత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగాలను హామీ ఇచ్చి, అధికారంలో ఉన్న కొద్ది కాలంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించానని గుర్తు చేశారు. ఐదేళ్లపాటు పదవిలో కొనసాగితే ఏమి సాధ్యమవుతుందో మీరు ఊహించవచ్చని తేజస్వీ పేర్కొన్నారు. -
పీకే సెలెక్షన్.. అభ్యర్థుల్లో లాయర్, డాక్టర్లు..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ కూటముల మధ్య సీట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నాయకత్వంలోని మహా ఘఠ్‌బందన్ కూటముల్లో సీట్ల పంపిణీపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్ కిశోర్ నాయకత్వంలోని జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది.జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) మొదటి జాబితాలో బీసీలు, మైనారిటీలకు సముచిత స్థానం కల్పించారు. 16 శాతం మంది అభ్యర్థులు ముస్లింలు, 17 శాతం మంది అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి అవకాశం ఇచ్చారు. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిశోర్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించారు. రాజకీయాల్లో అవినీతి గురించి ప్రముఖంగా గళం విప్పిన పీకే.. అభ్యర్థుల ఎంపికలో క్లీన్ ఇమేజ్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యావేత్తలు, మాజీ ప్రభుత్వ, పోలీసు అధికారులు రంగంలోకి దించారు.అభ్యర్థుల్లో ప్రముఖ గణిత శాస్త్రవేత్తతో పాటు లాయర్, డాక్టర్ కూడా ఉన్నారు. కుమ్రార్ స్థానంలో పోటీకి దిగిన కెసి సిన్హా (KC Sinha).. పట్నా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. ఆయన రచించిన పుస్తకాలు దశాబ్దాలుగా బిహార్, అనేక ఇతర రాష్ట్రాల పాఠశాలల్లోని విద్యార్థులు చదువుతున్నారు.మాంఝీ అభ్యర్థి వైబి గిరి పట్నా హైకోర్టులో (Patna High Court) సీనియర్ న్యాయవాది. అనేక హై ప్రొఫైల్ కేసులను ఆయన వాదించారు. బిహార్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. పట్నా హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ కేసులకు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు.చదవండి: బిహార్ సీఎం అభ్యర్థిగా అతడే బెస్ట్!ముజఫర్‌పూర్ అభ్యర్థి డాక్టర్ అమిత్ కుమార్ దాస్.. పట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ పూర్వ విద్యార్థి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సౌకర్యాలను విస్తరించడానికి కృషి చేశారు. ఆయన భార్య కూడా డాక్టరే. ముజఫర్‌పూర్‌లో ఒక ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.పీకే పోటీపై ఉత్కంఠజన్ సురాజ్ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాలో ఆ పార్టీ ప్రశాంత్ కిశోర్ పేరు లేకపోవడంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఆర్జేడీకి బలమైన స్థానం అయిన రాఘోపూర్ నుంచి, తేజస్వి యాదవ్ స్థానం నుంచి లేదా ఆయన సొంత నియోజకవర్గం కర్గహర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు గతంలో పీకే వెల్లడించారు. కర్గహర్ అభ్యర్థిగా రితేష్ రంజన్ (పాండే)ను ఖరారు చేశారు. దీంతో రఘోపూర్ నుంచి పీకే పోటీ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. जन सुराज के उम्मीदवारों की पहली सूची। pic.twitter.com/5VFYHHWm1W— Jan Suraaj (@jansuraajonline) October 9, 2025 -
Bihar Elections: ‘పీకే’ తొలి జాబితాలో 51 మంది అభ్యర్థులు
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో సందిడి నెలకొంది. పార్టీలలో చేరికలు కొనసాగుతున్నాయి. పోటీలో దిగేందుకు పలువురు నేతలు ఉబలాటపడుతున్నారు. ఈ నేపధ్యంలో రాజకీయ నేత ప్రశాంత్ కిషోర్(పీకే)కు చెందిన జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. వీరిలో 16 శాతం ముస్లిం అభ్యర్థులు ఉన్నారు.‘పీకే’ ప్రకటించిన తొలి జాబితాలో మాజీ అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, వైద్యులు మొదలైనవారు ఉన్నారు. వచ్చే నెలలో బీహార్‌లో జరగబోయే రెండు దశల ఎన్నికల్లో పోటీచేయబోయే జన్ సురాజ్ అభ్యర్థుల మొదటి జాబితా ఇది. ఈ జాబితాలో 16 శాతం ముస్లిం అభ్యర్థులతో పాటు 17 శాతం మంది వెనుకబడిన వర్గాలకు చెందినవారున్నారు. ఎన్నికల వ్యూహకర్త నుండి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో పేరుకుపోయిన అవినీతిని ఎత్తిచూపారు. ఈ నేపధ్యంలోనే పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసేటప్పుడు వారి క్లీన్ ఇమేజ్ కీలక అంశంగా గుర్తించారు. जन सुराज के उम्मीदवारों की पहली सूची। pic.twitter.com/5VFYHHWm1W— Jan Suraaj (@jansuraajonline) October 9, 2025ఇదిలావుండగా బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ప్రశాంత్ కిశోర్ ఇటీవల స్పష్టం చేశారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)తో జతకడతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. తమ కూటమి ప్రజలతోనే ఉంటుందని అన్నారు. బీహార్‌ను దోచుకోవడానికే పోరాటం జరుగుతోందని, ఇది సీట్ల కోసం జరుగుతున్న యుద్ధం కాదని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలపై తీవ్ర చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రశాంత్ కిశోర్, చిరాగ్ పాశ్వాన్ మధ్య పొత్తు కుదరవచ్చనే ప్రచారం జరిగింది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్, మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీకి 40 సీట్లు కేటాయించాలని కోరుతున్నారని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ తాము గెలిచామని, ఈసారి కూడా తమకు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని పాశ్వాన్ డిమాండ్ చేస్తున్నారు. -
Bihar Election: ఎన్డీఎకు ‘చిరాగ్’ చిక్కులు.. రెండో రౌండ్ బుజ్జగింపులు?
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించి మూడు రోజులు అయ్యిందో లేదో.. ఇంతలోనే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించిన కుమ్ములాటలు బయటపడుతున్నాయి. ఇటు ఎన్డీఏ, అటు మహా కూటమిలో సీట్ల భాగస్వామ్య ఒప్పందం ఇంకా కుదరనే లేదు. అన్ని పార్టీలు పరస్పరం గట్టి బేరసారాల్లో మునిగితేలుతున్నాయి.ముఖ్యంగా బీహార్‌లో బలమైన నేతగా పేరొందిన చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్జేపీ(ఆర్), జితన్ రామ్ మాంఝీకి చెందిన హెచ్ఏఎంలు సీట్ల కోసం బీజేపీతో గట్టి బేరసారాలు సాగిస్తున్నాయి. ఎన్డీటీవీ పేర్కొన్న కథనం ప్రకారం టిక్కెట్ల విషయంలో బీజేపీ తన మిత్రుడు చిరాగ్ పాశ్వాన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. చిరాగ్ తో రెండవ రౌండ్ చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న చిరాగ్‌ను తాజాగా బీహార్ ఎన్నికల ఇన్చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, వినోద్ తావ్డే మంగళ్ పాండేలు కలుసుకున్నారు. ఈ చర్చల ద్వారా రాజీమార్గం ఏర్పడవచ్చని భావిస్తున్నారు. బీజేపీకి అతిపెద్ద సవాలు చిరాగ్ పాశ్వాన్‌ను శాంతింపజేయడం. ఆయన బీజేపీ నుండి 30కి పైగా సీట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై బీజేపీతో చర్చలు కొనసాగుతున్నాయని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు.ఇదేవిధంగా అసంతృప్త నేత జితన్ రామ్ మాంఝీని బుజ్జగించేందుకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగారు. మాంఝీకి పలు హామీలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు బీజేపీ ప్రతి అసెంబ్లీ స్థానానికి ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై, తుది పేర్లు ఖరారు చేయనున్నదని తెలుస్తోంది. మరోవైపు మహా కూటమిలోని విశాల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) చీఫ్ ముఖేష్ సాహ్ని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)తో సీట్ల కోసం చర్చలు జరుపుతున్నారని సమాచారం. అలాగే కాంగ్రెస్ కూడా సీట్ల కేటాయింపుపై ఆర్జేడీతో చర్చల్లో మునిగితేలుతోంది.బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. 2020 ఎన్నికలకు భిన్నంగా, పార్టీ గెలిచే సీట్లపై దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో పార్టీ ఆర్జేడీతో చర్చలు జరుపుతోంది. ఈసారి బీహార్‌లో కాంగ్రెస్ 55 సీట్లు గెలుచుకోవచ్చనే అంచనాలున్నాయి. పార్టీ 25 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందని, సీట్ల పంపకం ఖరారు అయిన వెంటనే పేర్లను ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. జేడీయూ రాష్ట్రంలో 102 సీట్లలో పోటీ చేయవచ్చు. పార్టీ 30 సీట్లకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. బీజేపీతో సీట్ల పంపకం ఒప్పందం ఖరారైన వెంటనే, పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నదని తెలుస్తోంది. -
ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఝలక్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా
పాట్నా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్ మాజీ మంత్రి మురారి ప్రసాద్ గౌతమ్ బుధవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. గౌతమ్ రాజీనామాతో రోహ్తాస్ జిల్లా చెనారి రిజర్వుడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని బీహార్ అసెంబ్లీ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ సందర్భంగా ‘శాసన సభ్యత్వానికి రాజీనామా వెనుక ప్రత్యేక కారణమేమీ లేదని గౌతమ్ పీటీఐకి స్పష్టం చేశారు. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలో ఉన్నప్పుడు నితీశ్ కుమార్ ప్రభుత్వంలో గౌతమ్ మంత్రిగా పనిచేశారు. జేడీ(యూ) మళ్లీ ఎన్డీఏలోకి వచ్చిన తర్వాత, ఆయన ట్రెజరీ బెంచ్ సభ్యులతో కలిసి కూర్చోవడం ప్రారంభించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆయన అనర్హత కోరుతూ దాఖలైన పిటిషన్ స్పీకర్ నంద్ కిశోర్ యాదవ్ ముందు పెండింగ్‌లో ఉంది. నవంబర్ 6, 11 తేదీల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుండటం తెలిసిందే. -
Bihar Elections: రెండు స్థానాల నుంచి తేజస్వి పోటీ?
పట్నా: బీహార్‌లో నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. వివిధ పార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ పార్టీల నేతలు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయనున్నారనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. మహాఘట్ బంధన్ ఇంకా అధికారికంగా సీట్ల పంపకాల ఫార్ములాను ప్రకటించనప్పటికీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పోటీపై పలు వార్తలు వినిపిస్తున్నాయి.బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయవచ్చనే వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తేజస్వి ప్రస్తుతం రఘోపూర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోమారు ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అలాగే మధుబని జిల్లాలోని ఫుల్పరాస్ నుండి కూడా పోటీకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఒకప్పుడు ఫుల్పరాస్ కు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి తేజస్వి పోటీ చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని అంటున్నారు. సంప్రదాయ ముస్లిం-యాదవ్ ఓటు స్థావరాన్ని ఏకీకృతం చేయాలని పార్టీ భావిస్తోంది.ఫుల్పరాస్ నుండి ప్రముఖ ఈబీసీ నేత మంగ్ని లాల్ మండల్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆర్జేడీ ఇటీవలే నియమించింది. మిథిలాంచల్‌లో పార్టీని బలోపేతం చేసే ప్రయత్నంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. ఫుల్పరాస్ నుండి తేజస్వి అభ్యర్థిత్వం ఈబీసీ కమ్యూనిటీకి బలమైన సందేశాన్ని పంపగలదని, ఈ ప్రాంతంలో ఆర్జేడీ అవకాశాలను బలోపేతం చేయగలదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తేజస్వి రెండు చోట్ల పోటీ చేయడం ద్వారా బీహార్ అంతటా తన ప్రభావాన్ని పెంచుకునే యోచనలో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
Bihar Election: బెదిరింపులకు దిగిన మాజీ సీఎం.. 15 సీట్ల కోసం మంకుపట్టు
పట్నా: బీహార్ ఎన్నికలకు ముందుగానే ఎన్డీఏలో అసంతృప్తి మొదలయ్యింది. మిత్రపక్షం హిందూస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం) నేత, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తమ పార్టీకి కనీసం 15 సీట్లు ఇవ్వకపోతే, అసలు ఎన్నికల్లో పోటీ చేయబోమని బెదిరింపులకు దిగారు. అయితే తాము ఎన్డీఏ శిబిరంలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఈ అంశంలో జోక్యం చేసుకుని మాంఝీని, శాంతింపజేసే ప్రయత్నం చేశారని సమాచారం.‘ప్రాధాన్యత కలిగిన పార్టీగా గుర్తింపు పొందేందుకు మాకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు అవసరం. ప్రతిపాదిత సంఖ్యలో సీట్లు మాకు లభించకపోతే, మేము ఎన్నికల్లో పోటీ చేయబోము. అయితే మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తాం. కానీ ఎన్నికల్లో పోటీకి దిగం. నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. మా పార్టీ గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను’ అని జితన్ రామ్ మాంఝీ పేర్కొన్నారు.ఇంకా తేలని సీట్ల భాగస్వామ్య సూత్రంనవంబర్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షాలు ఇంకా తమ సీట్ల భాగస్వామ్య సూత్రాన్ని ప్రకటించలేదు. అయితే మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం జేడీయూ, బీజేపీలు దాదాపు 100 సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్జేపీ(రామ్ విలాస్) 24, మాంఝీ పార్టీకి 10, ఉపేంద్ర కుష్వాహా పార్టీకి ఆరు సీట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది. కాగా ఈ తరహా సీట్ల కేటాయింపుపై మాంఝీతో పాటు, చిరాగ్ పాశ్వాన్ కూడా సంతృప్తిగా లేరని తెలుస్తోంది. వారిద్దరూ కనీసం 40 సీట్ల కోసం ఎన్డీఏపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.అందరి దృష్టి బీహార్ ఎన్నికలపైనే..దేశంలోని అందరి దృష్టి బీహార్ ఎన్నికలపైనే ఉండనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సోమవారం ప్రకటించారు. మొదటి దశలో బీహార్‌లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్‌లో 40 ఏళ్ల తర్వాత రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది.ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలుఆపరేషన్ సిందూర్, జీఎస్టీ సంస్కరణలు, ఓటు చోరీ లాంటి ప్రతిపక్షాల ఉద్యమాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బీహార్‌లో ఎన్నికల ఏర్పాట్ల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బూత్‌కు 1,200 కు మించి ఓటర్లు ఉండరు. పోలింగ్ బూత్‌లలో 100 శాతం వెబ్‌కాస్ట్ చేయనున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయి. ఓటర్లు తన మొబైల్ ఫోన్లను బూత్‌కు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.ప్రతి రెండు గంటలకు కౌంటింగ్ అప్డేట్పోలింగ్ ఏజెంట్లు బూత్ సెంటర్ నుండి 100 మీటర్ల దూరంలో ఉండేందుకు అనుమతిస్తారు. బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు బోల్డ్ అక్షరాలతో ఉంటాయి. ఓటర్ స్లిప్‌లలో బూత్ నంబర్ కూడా బోల్డ్ అక్షరాలతోనే ఉంటుంది. ఫారమ్ 17సీ, ఈవీఎం డేటా అందుబాటులో లేకపోతే వీవీపాట్ లెక్కింపు తప్పనిసరి. ప్రతి రెండు గంటలకు రియల్-టైమ్ ఓటరు ఓటింగ్‌ను అప్డేట్ చేస్తారు. -
బీహార్ ఎలక్షన్స్: ‘భారతంలో దృతరాష్ట్రుడిలా..’
విమర్శల.. ప్రతివిమర్శలతో.. బీహార్ రాజకీయం నెమ్మదిగా వేడెక్కడం మొదలైంది. ఈ క్రమంలో బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత విజయ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ను ధృతరాష్ట్రుడితో(Lalu As Dhritarashtra) పోల్చడంపై దుమారం రేగింది.ధృతరాష్ట్రుడు తన కుమారుడి తప్పులను క్షమించినట్లే, లాలూ ప్రసాద్ కూడా తన కుమారుల తప్పులను సమర్థిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ విజయ్ సిన్హా(Vijay Sinha Slams Lalu) వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన జీవిత చరమాంకంలో ఉన్నప్పటికీ.. తన కుమారుడిపై ఉన్న ప్రేమ వల్ల ధృతరాష్ట్రుడిలా మారిపోయారు. ఆయన రాజకీయాల్లో తన ఉనికిని చాటేందుకు బీహార్‌ను అపహాస్యం చేస్తూ, ఇష్టమైనట్లు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని విజయ్ సిన్హా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై ఆర్జేడీ స్పందించింది(RJD Reacts on Dhritarashtra Comment). విజయ్ సిన్హా వ్యక్తిగత దాడితో దిగజారిపోయారంటూ మండిపడింది. అయితే లాలూను విజయ్ దృతరాష్ట్రుడిగా అభివర్ణించడం ఇదే తొలిసారి కాదు. బీహార్‌లో విజయం కోరుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పరిశ్రమలను మాత్రం తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోతున్నారంటూ లాలూ ఓ విమర్శ చేశారు. దానికి ఘాటుగా స్పందించే క్రమంలో విజయ్ సిన్హా మాట్లాడుతూ.. బీహార్‌ను నాశనం చేసిన వాళ్లు, ఇక్కడి ప్రజలను ఇతర రాష్ట్రాలకు వలసలు పోయేలా చేసిన వాళ్లు జీవిత చరమాంకంలో ఉన్నారు. అలాంటి వాళ్లు తన కొడుకులపై గుడ్డి ప్రేమతో.. మళ్లీ బీహార్‌లో అలజడిని సృష్టించాలనుకుంటున్నారు. అయితే ఈసారి బీహార్ ప్రజలు అలాంటి చర్యలను సహించబోరు అని విజయ్ సిన్హా అన్నారు. ఇదీ చదవండి: అతని స్టామినా ఏంటో బీజేపీకి తెలుసు.. అందుకే బుజ్జగింపు! -
Bihar Election: ఎన్డీయేకు కొత్త తలనొప్పి?
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ప్రస్తుతం అన్ని పార్టీలు సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి(Bihar Assembly Election 2025). అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి పక్షాలు తమ భాగస్వామ్య పార్టీలతో పొత్తులను తేల్చుకునే చర్చలను ముమ్మరం చేశాయి. ఎన్డీయే కూటమిలోని బీజేపీ, జేడీయూల మధ్య సీట్ల పంపకాలపై ఇప్పటికే ఓ అవగాహన కుదిరింది. చెరో 100–102 చోట్ల పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే.. 243 స్థానాల్లో 204–205 సీట్లలో ఈ రెండు పార్టీలే పోటీ చేయనుండగా.. మిగతా సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి(NDA Bihar Seat Sharing). బిహార్ ఎన్నికల ఇంఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ఇంఛార్జి వినోద్ తావ్డేలు బుధవారం లోక్‌జనశక్తి పార్టీ(LJP రామ్ విలాస్) నేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్(chirag paswan)తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు.. లోక్‌జనశక్తి పార్టీ(LJP)కి 25 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. అయితే.. చిరాగ్ ఆ ఆఫర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్జేపీకి 40 స్థానాలు డిమాండ్ చేస్తూ.. ఆయన అంతకు మించి ఒక్క సీటు తగ్గినా ఊరుకునేది లేదని చెప్పినట్లు సమాచారం. తాము కోరినన్ని సీట్లు ఇవ్వకుంటే తమ దారి తాము చూసుకుంటామని ఆయన ఎన్డీయే పెద్దలకు అల్టిమేటం జారీ చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 5 సీట్లు గెలిచిన విజయంతో.. తన పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందనే భావనలో చిరాగ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పైగా బీహార్‌లో గౌరవప్రదమైన సీట్లు.. కేంద్ర కేబినెట్ పదవికి మించినవని భావిస్తున్నారు. ఈ తరుణంలో.. ఎన్డీఏలో ప్రాధాన్యం లేని తరుణంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీతో పొత్తు కోసం చిరాగ్ ప్రయత్నిస్తున్నారన్న కథనాలు.. బీహార్‌లో రాజకీయ కలకలం సృష్టించాయి. అయితే.. చిరాగ్ పార్టీకి చెందిన ఎంపీ శాంభవి చౌద్రి మాత్రం పరోక్షంగా ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎన్డీయే కూటమి తిరిగి బీహార్‌లో అధికారంలో చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దీంతో బ్లాక్మెయిల్ ద్వారా సీట్లు సాధించుకోవాలని చిరాగ్ చూస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉంటే.. చిరాగ్ నేతృత్వంలోని LJP (RV)కి బీహార్‌లో దళిత ఓటు బ్యాంక్‌ను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది. అంతేకాదు 2020 ఎన్నికల సమయంలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేసిన చిరాగ్ ఎల్జేపీ.. జేడీయూకి నష్టం కలిగించింది. అంటే.. చిరాగ్ తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఎన్డీయేపై ప్రభావం చూపెడుతుందన్నమాట. దీంతో బీజేపీ ఈ విషయాన్నింటిని పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయనతో చర్చలు జరుపుతోంది. మిగతా పార్టీలోని జితన్ రామ్ మాంజీ హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం)కు 7, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ)కి 6 సీట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయితే ఆ రెండు పార్టీలు కూడా డబుల్ డిజిట్ సీట్లు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల పంపకాలపై మరో మూడు, నాలుగు రోజుల పాటు వరుసగా చర్చలు కొనసాగనున్నాయి. మిత్రపక్షాలకు సీట్లు తగ్గితే రాజ్యసభ, శాసనమండలి సీట్ల ఆఫర్లతో వాటిని భర్తీ చేయవచ్చని పార్టీ వర్గాలు సూచిస్తున్నా.. అందుకు వాటిని ఒప్పించడం బీజేపీపై కత్తి మీద సాములాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఇదీ చదవండి: ప్చ్.. నితీశ్‌కు మెట్రో కలిసొచ్చేనా? -
ఊహకందని అంచనాలతో ఉత్కంఠ!
పండుగల సమయంలోనూ బిహార్ రాజకీయాలలో మునిగితేలుతుంది. బిహా రీలకు రాజకీయాలకు మించిన కాలక్షేపం లేదు. బిహార్ శాసన సభ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగ నున్న నేపథ్యంలో ఎన్నికల పండుగ మొద లైపోయింది. నితీశ్ కుమార్ ఎక్కడుంటే అధికారం అక్కడేనని గడిచిన రెండు దశాబ్దాలలో బిహార్‌లో ఒక కొత్త నానుడి రూపుదిద్దు కుంది. పొత్తు పెట్టుకున్న పార్టీలను దూరం పెట్టేదిగా బీజేపీ పేరు మోసినప్పటికీ, రాష్ట్రంలో అది జూనియర్ భాగస్వామిగా సంతృప్తి పడటానికి బహుశా అదే కారణం. నితీశ్ నేతృత్వంలోని జేడీ (యు)తో పొత్తు పెట్టుకున్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నాయక త్వంలోని ఆర్జేడీ కూడా అదే రకమైన సంకట స్థితిని ఎదుర్కొంది.నితీశ్ సరసన లేని ఏ పార్టీ అయినా, ఆయనపై విషం చిమ్మడం ఖాయం. అయినప్పటికీ, ఆయనతో అంటకాగాలని రహస్యంగా కోరుకుంటాయి. లాలూ 2022లో నితీశ్‌తో చేతులు కలపడానికి ఇదే కారణం. 2017లో చీలిక చేదును మిగిల్చినా లాలూ దాన్ని దిగ మింగుకోవాల్సి వచ్చింది. మహాఘట్ బంధన్ రెండు విడతల హయాంలో నితీశ్‌తో ఎన్నడూ పొత్తు పెట్టుకోమని బీజేపీ నాయ కులు బాహాటంగా ప్రతిన బూనారు. కానీ తమ ‘సహజ భాగ స్వామి’తో రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. నితీశ్ బలాబలాలుగతంలో బిహార్‌లో ఎన్నికల విజయాన్ని నితీశ్ ఎలా సొంతం చేసుకున్నట్లు? నితీశ్ 2005లో బిహార్ సీఎం అయినపుడు తన శక్తి యుక్తులన్నింటినీ శాంతి భద్రతల నిర్వహణపై కేంద్రీకరించారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, రవాణా, విద్యా రంగాలు మెరుగుపడ్డాయి. స్కూళ్ళలో అడ్మిషన్లను, హాజరును పెంపొందించేందుకు ఆయన 2006లో ‘స్కూల్ చలో అభియాన్’ ప్రారంభించారు. బాలికలకు సైకిళ్ళు పంపిణీ చేశారు. అలా 2005లో ఒక మౌన విప్లవం మొదలైంది. రాష్ట్రంలో 2005లో కేవలం 1.8 లక్షల మంది బాలికలు 10వ తరగతి పరీక్షకు కూర్చుంటే, ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు రాయ బోతున్న 15.85 లక్షల మంది విద్యార్థులలో సగంపైగా బాలికలే. ప్రతి ఒక్కరికీ ఇల్లు, తాగునీటి సదుపాయం కార్యక్రమాన్ని నితీశే మొదట ప్రారంభించారు. కానీ, అంతగా సఫలీకృతులు కాలేక పోయారు. రాష్ట్రం నుంచి జనం ఇప్పటికీ వలస పోతూనే ఉన్నారు. అనేక మానవ, అభివృద్ధి సూచికలలో బిహార్ అట్టడుగున ఉంది. నితీశ్ మూడవ, నాల్గవ విడత పాలన అనేక కారణాల రీత్యా అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి నితీశ్ వివిధ వర్గాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోగ్య స్థితి కూడా నిశిత పరిశీలనకు గురవుతోంది. ఈ కారణంగానే, ఈసారి నితీశ్ ప్రభుత్వం కోటి మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 చొప్పున నగదు జమ చేసింది. రకరకాల రాయితీలను, వరాలను ప్రకటించింది. తేజస్వి ప్లస్ కూటమినితీశ్ ప్రధాన ప్రత్యర్థి తేజస్వి యాదవ్, గత ఎన్నికల్లో అద్భు తమైన ఫలితాలు సాధించారు. ఆయన మహాఘట్ బంధన్ కేవలం 16,825 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్, వామ పక్షాలు ఇప్పటికీ ఆయనకే మద్దతు ఇస్తున్నాయి. కాంగ్రెస్ ఓట్ల పునాదికి కోత పడినప్పటికీ, రాహుల్ గాంధీ తన యాత్రలో తేజస్విని పటిష్ఠపరచేందుకు ప్రయత్నించారు. మొత్తం ప్రతిపక్షమంతా తేజస్వి వెనుకనే నిలిచిందని చాటేందుకు దీపాంకర్ భట్టాచార్య (వామపక్షం), అఖిలేశ్ యాదవ్ (సమాజ్ వాదీ పార్టీ), సంజయ్ రౌత్ (శివసేన), ఎం.కె.స్టాలిన్ (డీఎంకే), హేమంత్ సొరేన్ (జేఎంఎం), యూసుఫ్ పఠాన్ (తృణమూల్ కాంగ్రెస్) ఆయన యాత్రలో పాల్గొన్నారు. అయితే, ఆయన సహచరుల,సొంత కుటుంబ సభ్యుల మితిమీరిన ఆశలు పెను సవాలును విసురుతున్నాయి. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన కొత్త ఓటర్ల జాబితా 69 లక్షల ఓటర్ల తొలగింపును, 21 లక్షల మంది పేర్ల కొత్త జోడింపును చవి చూసింది. మహాఘట్ బంధన్ కొన్ని నెలలుగా దాన్నొక రాజకీయ అంశంగా మారుస్తూ వస్తోంది. సీట్ల పంపకంపై ప్రస్తుతం మహా ఘట్ బంధన్‌లో బురద జల్లుకునే కార్యక్రమం సాగుతోంది. ఇది ప్రతిసారీ కనిపించేదే. కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కలసి పోటీ చేయడం మాత్రం ఖాయం. పీకే ప్రభావంప్రశాంత్ కిశోర్, ఆయన ‘జన్ సురాజ్’ పార్టీ మరో ప్రభావిత అంశం కానుంది. ఆయన గతంలో, 2014 ఎన్నికలకు ముందు బీజేపీకి ఎన్నికల నిర్వహణ సేవలందించారు. తదనంతరం,కాంగ్రెస్, వైసీపీ, తృణమూల్, ఆప్, డీఎంకేలతో పాటు, చివరకు నితీశ్ కుమార్‌కు కూడా సేవలందించారు. రాష్ట్రంలో ఈ విడత ఎన్నికల సందర్భంగా, ప్రతి జిల్లాలోనూ ప్రశాంత్ కిశోర్ పాదయాత్రలు చేశారు. గత ఏడాదిగా ఆయన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సందర్శించి ప్రజలతో నేరుగా సంభాషించారు. రాత్రిపూట గ్రామాల్లోనే బస చేశారు. నితీశ్, బీజేపీ, ఆర్జేడీలపై సమానంగా విమర్శలు గుప్పించారు. ఆయన పెద్ద సంఖ్యలో జనాన్ని ఆకర్షిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, ఆయన పార్టీకి నిధుల కొరత కూడా లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారా లేక హంగ్ అసెంబ్లీ ఏర్పడే పక్షంలో కింగ్ మేకర్‌గా మారతారా? విజ యానికి పెద్ద సంఖ్యలో జన వాహినులు, ఆకర్షణీయమైన నినా దాలు అవసరమేగానీ, అవి విజయానికి పూచీ నివ్వలేవు. బీజేపీ గురించి కూడా ముచ్చటించుకుందాం. ఈ కాషాయ పార్టీకి అద్భుతమైన సంస్థాగత బలం ఉంది. కుల సమీకరణలు కూడా దానివైపు పటిష్ఠంగా ఉన్నాయి. జేడీ(యు)తోపాటు, చిరాగ్ పాశ్వాన్, జీతన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయేను తిరుగులేని కూటమిగా నిలబెడుతున్నారు. గత ఎన్నికల్లో, జేడీ (యు)తో పోల్చుకుంటే బీజేపీ రెట్టింపు సీట్లకు పైగా గెలుచుకున్నా, ముఖ్యమంత్రిగా తమ అభ్యర్థే ఉండాలని పట్టుబట్టలేదు. విశ్వస నీయమైన ముఖం ఏదీ లేకపోవడం దాని బలహీనత. ఈ అంశంపై ఇప్పుడు కాకపోయినా, రాబోయే రోజుల్లోనైనా ఆ పార్టీ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. బిహార్ ఒక ఆసక్తికరమైన దశలోకి అడుగిడుతోంది. చివరి నిమిషం వరకు అంతిమ ఫలితం నిర్ణయం కాదని గత అసెంబ్లీ ఎన్నికలు సూచిస్తున్నాయి. ఎన్నికల సంరంభపు హడావిడి సద్దుమణగి,అంతిమ సంఖ్యా బలాలు వెల్లడైన తర్వాత, అసలు క్రీడ ఆరంభం కాబోతోంది. శశి శేఖర్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు(‘ది హిందూస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Bihar Election: ‘మెట్రో’ సెంటిమెంట్.. 12 ఏళ్లలో ఆరు రాష్ట్రాల్లో ప్రభావం..
పట్నా: బీహార్ ఎన్నికల్లో విజయానికి బీజేపీ ‘మెట్రో’ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తోంది. గత 12 ఏళ్లలో ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు వివిధ పార్టీల ప్రభుత్వాలు ‘మెట్రో’ను ప్రారంభించాయి. ఈ మెట్రో సెంటిమెంట్ నాలుగు రాష్ట్రాల్లో విజయానికి దారి తీసింది. మొన్న అక్టోబర్ 6న సాయంత్రం 4 గంటలకు బీహార్‌లో ఎన్నికల తేదీలను ప్రకటించారు. దీంతో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. అయితే దీనికి ఐదు గంటల ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్నా మెట్రోకు పచ్చజెండా ఊపారు. ఎన్నికలకు ముందు మెట్రోలు..2013, రాజస్థాన్: ఎన్నికలకు మూడు నెలల ముందు జైపూర్ మెట్రో ట్రయల్ రన్. దీనిని నాటి కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు జరిగింది. ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.ఫలితం: 200 సీట్లు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ 21 సీట్లకు పడిపోయింది. బీజేపీ 163 సీట్లతో మెజారిటీని సాధించింది. వసుంధర రాజే ముఖ్యమంత్రి అయ్యారు. మెట్రో ప్రారంభించిన జైపూర్ జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. అయితే అక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 17 సీట్లు గెలుచుకుంది.2017, ఉత్తరప్రదేశ్: 2016, అక్టోబర్ 4న నాటి సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కాన్పూర్ మెట్రోకు శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 1న లక్నో మెట్రోను ప్రారంభించారు. 2017, ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎన్నికలు జరిగాయి.ఫలితం: ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీ 47 మాత్రమే గెలుచుకుంది. బీజేపీ 312 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. కాన్పూర్‌లోని 10 సీట్లలో ఎస్పీ రెండు, లక్నోలో ఒక సీటు మాత్రమే గెలుచుకుంది.2022, ఉత్తరప్రదేశ్: కాన్పూర్ మెట్రో మొదటి దశ ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రారంభమయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్ మెట్రో మొదటి దశను ప్రారంభించారు. తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఫలితం: ఉత్తరప్రదేశ్‌లోని 403 సీట్లలో 255 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాన్పూర్‌లోని 10 స్థానాల్లో ఏడు స్థానాలు బీజేపీ ఖాతాలో చేరాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు.2023, మధ్యప్రదేశ్: ఎన్నికలకు 45 రోజుల ముందు భోపాల్ మెట్రో ట్రయల్ రన్‌ను నాటి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఫలితం: నవంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, బీజేపీ 230 సీట్లలో 163 గెలుచుకుంది. భోపాల్ జిల్లాలో 7 సీట్లలో 6 సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో డాక్టర్ మోహన్ యాదవ్ సీఎంగా నియమితులయ్యారు.2024, మహారాష్ట్ర: ఎన్నికలకు కొన్ని నెలల ముందు పూణే, ముంబై మెట్రో ప్రారంభమయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ ముంబై మెట్రోను ప్రారంభించారు. 2024, సెప్టెంబర్ 29న పూణే మెట్రోను ప్రారంభించారు. ఆ సమయంలో రాష్ట్రాన్ని బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)ల మహాయుతి (మహాయుతి) ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఫలితం: నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో, మహాయుతి 288 సీట్లలో 230 గెలుచుకుంది. ముంబైలోని 36 సీట్లలో 22, పూణేలోని 21 సీట్లలో 18 వారి సొంతమయ్యాయి. అయితే, దేవేంద్ర ఫడ్నవీస్.. ఏక్నాథ్ షిండే స్థానంలో ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.2025, ఢిల్లీ: ఎన్నికలకు ఒక నెల ముందు ఢిల్లీ మెట్రో ఫేజ్ 4 ప్రారంభమైంది. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది.ఫలితం: నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 70 సీట్లలో 48 స్థానాలను గెలుచుకుని, 27 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయ్యారు.మెట్రో ప్రారంభం.. ఎన్నికలపై ప్రభావంఆరు రాష్ట్రాల ఎన్నికల విశ్లేషణలో మెట్రో ప్రారంభం ఎన్నికలపై ప్రభావం చూపిందని వెల్లడయ్యింది. ఆరు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో మెట్రోను ప్రారంభించిన పార్టీ ప్రయోజనం పొందింది. ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి తెలిపిన వివరాల ప్రకారం భారతదేశ జనాభాలో దాదాపు 42 శాతం మంది పట్టణ ప్రజలు. వారు పట్టణీకరణను అభివృద్ధిగా భావిస్తారు. అందుకే పార్టీలు ఎన్నికల్లో ప్రయోజనం కోసం మెట్రో కార్డును ఉపయోగిస్తున్నాయి. -
Bihar Elections : 40 ఏళ్ల తర్వాత రెండు దశలు.. మరిన్ని ఆసక్తికర సంగతులు
న్యూఢిల్లీ: రాబోయే 38 రోజుల్లో దేశంలోని అందరి దృష్టి బీహార్‌పైనే ఉండనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సోమవారం ప్రకటించారు. మొదటి దశలో బీహార్‌లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. బీహార్‌లో 40 ఏళ్ల తర్వాత రెండు దశల్లో పోలింగ్ జరగబోతోంది.ఆపరేషన్ సిందూర్, జీఎస్టీ సంస్కరణలు, ఓటు చోరీ లాంటి ప్రతిపక్షాల ఉద్యమాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. బీహార్‌లో ఎన్నికల ఏర్పాట్ల విషయానికొస్తే రాష్ట్రంలో మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బూత్‌కు 1,200 కు మించి ఓటర్లు ఉండరు. పోలింగ్ బూత్‌లలో 100 శాతం వెబ్‌కాస్ట్ చేయనున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంటాయి. ఓటర్లు తన మొబైల్ ఫోన్లను బూత్‌కు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు.పోలింగ్ ఏజెంట్లు బూత్ సెంటర్ నుండి 100 మీటర్ల దూరంలో ఉండేందుకు అనుమతిస్తారు. బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు బోల్డ్ అక్షరాలతో ఉంటాయి. ఓటర్ స్లిప్‌లలో బూత్ నంబర్ కూడా బోల్డ్ అక్షరాలతోనే ఉంటుంది. ఫారమ్ 17సీ, ఈవీఎం డేటా అందుబాటులో లేకపోతే వీవీపాట్ లెక్కింపు తప్పనిసరి. ప్రతి రెండు గంటలకు రియల్-టైమ్ ఓటరు ఓటింగ్‌ను అప్డేట్ చేస్తారు.ఎవరి సంగతి ఏమిటి?నితీష్ కుమార్.. రికార్డు స్థాయిలో 10వ సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం.తేజస్వి యాదవ్.. 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చేందుకు మరో అవకాశం.రాహుల్ గాంధీ .. తన ఓటు చోరీ నినాదానికి ప్రజల ఆమోదం పొందే ఛాన్స్ప్రశాంత్ కిషోర్.. ఓట్లు చీలుస్తారా? కింగ్ మేకర్ అవుతారా? అనేది తేలనుంది.చిరాగ్ పాస్వాన్.. బీహార్‌లో తన పార్టీ ఉనికిని బలోపేతం చేసేందుకు అవకాశం.ఒవైసీ.. అనుకున్న స్థాయిలో ముస్లిం ఓట్లను పొందగలరా? అనేది తేలనుంది.నితీష్‌కు నిజమైన పరీక్షఫలితాల సమయంలో అందరి దృష్టి నితీష్ కుమార్ పైనే ఉండనుంది. తేజస్వి యాదవ్ తరచూ నితీష్ కుమార్ ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.లాలూ కుటుంబంలో అంతర్గత పోరులాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. అతని సోదరి రోహిణి ఆచార్య తన సోదరునిపైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.మహిళల చేతుల్లో ఫలితాలు?బీహార్ ఎన్నికల ఫలితాలను మహిళలే నిర్ణయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని లక్షలాది మహిళల ఖాతాలలో నితీష్ కుమార్ ఇప్పటికే ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున జమచేశారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.2,500 అందించాలనే ప్రతిపక్షాల ప్రయత్నాన్న ఇది గండికొట్టనున్నదని పలువురు అంటున్నారు. ఇన్ని అంశాల మధ్య రాబోయే 11 రోజులు బీహార్‌కు అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. అక్టోబర్ 17 మొదటి దశ నామినేషన్లకు చివరి తేదీ. ఈ లోపునే, సీట్ల కేటాయింపు, పార్టీల సమీకరణలు స్పష్టం కానున్నాయి. -
Bihar Elections-2025: ‘ఎవరికెన్ని?’.. మొదలైన లెక్కల నినాదాలు
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించడంతో అటు రాజకీయ నేతలు, ఇటు పార్టీలలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6,11 తేదీలలో ఓటింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెల్లడికానున్నాయి. ఎన్నికల తేదీల ప్రకటన దరిమిలా అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ), ప్రతిపక్ష మహా కూటమి మధ్య ‘ఎవరికెన్ని?’ నినాదాల యుద్ధం ఊపందుకుంది.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ‘25 నుంచి 30.. మా ఇద్దరు సోదరులు.. నరేంద్ర మోదీ, నితీష్లకు’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా, మహా కూటమి (ఆర్జేడీ) నేత లాలూ ప్రసాద్ యాదవ్ రంగంలోకి దిగి, తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ఖాతాలో ‘ఆరు- పదకొండు, ఎన్డీఏకి ‘నౌ దో గ్యారహ్’ అని పేర్కొన్నారు. (ఈ హిందీ సామెతకు ఓటమి అని అర్థం). విజయ్ కుమార్ సిన్హా -లాలూ యాదవ్ మధ్య నినాద యుద్ధానికి ముందు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) ‘25 నుండి 30.. మళ్లీ నితీష్’ అనే నినాదాన్ని వినిపించారు. ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ సీఎం అవుతారనే సందేశాన్ని జేడీయూ ఇంతకుముందే వినిపించింది. छह और ग्यारह NDA नौ दो ग्यारह!— Lalu Prasad Yadav (@laluprasadrjd) October 7, 2025ఎన్నికల కమిషన్ బృందంతో జరిగిన సమావేశంలో జేడీయూ, బీజేపీలతో పాటు పలు రాజకీయ పార్టీలు ఛత్ పూజ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థించాయి. సూర్య ఆరాధన ఉత్పవంగా పేరొందిన ఛత్ వ్రతం అక్టోబర్ 25 నుండి 28 వరకు జరగనుంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల కమిషన్ నవంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో బీహార్‌లోని 16 జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ జరగనుంది. మిగిలిన స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. किसानों को रुलाने वाली 20 सालों की निर्दयी एनडीए सरकार को बदलने का वक्त आ गया है। #LaluYadav #Bihar #RJD #बिहार pic.twitter.com/LPTH7MUiIc— Lalu Prasad Yadav (@laluprasadrjd) September 26, 2025 -
బీహార్ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టత ఇచ్చిన ఆయన.. నితీశ్ కుమార్‌కు ఇవి ఫేర్వెల్ ఎలక్షన్స్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో.. తాము అధికారంలోకి వస్తే గనుక అవినీతిపరుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని ఓ ప్రకటన చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ‘‘మోదీ, నితీశ్, లాలూ వీళ్ల కోసం ఓట్లు వేయొద్దు. ఈ ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం. వలసలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ఒక్కసారి ఆలోచన చేయండి. కొత్త భవిష్యత్తు కోసం ఓటు వేయండి’’ బీహార్ ఓటర్లకు ప్రశాంత్ కిషోర్ పిలుపు ఇచ్చారు.జన్ సురాజ్ పార్టీ(Jan Suraaj Party) ఈ ఎన్నికల్లో 48% ఓట్లు దక్కించుకుంటుందని అంచనా వేస్తున్నారాయన. ఇది బీహార్‌కు కొత్త అధ్యాయం అని, జన సురాజ్ పార్టీ నేతృత్వంలో తాము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం అవినీతి రాజకీయ నాయకులు, అధికారులపై విచారణ జరిపించి వాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. అలాగే.. బీహార్‌ను దేశంలో టాప్ 10 రాష్ట్రాల్లోకి తీసుకెళ్లే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఇదే చివరి ఎన్నికలని, ఆయన ఇక ముఖ్యమంత్రి పదవిలో ఉండరని, ఈ ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని ప్రశాంత్ కిషోర్ ధీమాగా ప్రకటించారు. బహుశా.. పట్నా మెట్రో ప్రారంభం సీఎంగా నితీశ్ చివరి కార్యక్రమం అంటూ ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Election 2025) ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేయబోతున్నారు. అక్టోబర్ 9వ తేదీన జన్ సురాజ్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నట్లు ప్రకటించారాయన.బీహార్ అసెంబ్లీని రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫలితాలను వెల్లడించనుంది. బీహార్ అసెంబ్లీ మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అంటే మెజారిటీ మార్క్ 122 సీట్లు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. ప్రస్తుతానికి.. అధికార ఎన్డీయే కూటమికి 131 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమికి 111 సీట్లు, మిగిలినవి ఇతరులు ఉన్నారు.అధికారంలో కొనసాగాలని ఎన్డీయే కూటమి(జేడీ(యూ)+బీజేపీ), అధికారం చేజిక్కించుకోవాలని ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్ష మహాఘట్బంధన్ కూటమి, అవినీతి.. ప్రజా సమస్యలే ప్రదాన అజెండా తొలిసారి పోటీకి దిగుతున్న జన్ సురాజ్‌తో త్రిముఖ పోటీ హోరాహోరీగానే నడవచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయక్కడ. ఇదీ చదవండి: బీహార్ ఎన్నికల్లో.. తొలిసారిగా ఈసీఐ నెట్! -
రెండు దశల్లో బిహార్ ఎన్నికలు
న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల రణరంగానికి తెరలేచింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కేంద్రం ఎన్నికల సంఘం సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్న ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మొత్తం 243 స్థానాలకు గాను.. మొదటి దశలో నవంబర్ 6న 121 స్థానాలకు, రెండో దశలో నవంబర్ 11న 122 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. నవంబర్ 16 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలో బిహార్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎంసీసీ) తక్షణమే అమల్లోకి వచి్చంది. నామినేషన్ల ప్రక్రియ మొదటి దశ పోలింగ్‌కు అక్టోబర్ 17న, రెండో దశ పోలింగ్‌కు అక్టోబర్ 20న ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 7.43 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఎస్ఐఆర్ను ఓటర్ల జాబితా శుద్ధీకరణగా జ్ఞానేశ్ కుమార్ అభివరి్ణంచారు. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 69 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. అయితే, భారత పౌరసత్వం లేనికారణంగా ఎన్ని పేర్లు తొలగించారో ఆయన బయటపెట్టలేదు. మరణాలు, పౌరసత్వం లేకపోవడం, ఇతర రాష్ట్రాలకు శాశ్వతంగా వలస వెళ్లడం వంటి కారణాలతో పేర్లు తొలగించినట్లు స్పష్టంచేశారు. 8 అసెంబ్లీ స్థానాలకు వచ్చేనెల 11న ఉప ఎన్నికలు తెలంగాణ, రాజస్తాన్, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, మిజోరం తదితర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నట్లు తెలిపింది. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ బిహార్ ఎన్నికలు అన్ని ఎన్నికలకు తల్లిలాంటివని జ్ఞానేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల్లో 17 సంస్కరణలు చేపడుతున్నామని, దేశవ్యాప్తంగా వీటిని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. దేశ ఎన్నికల చరిత్రలో బిహార్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగిన ఎన్నికల్లో ఒకటిగా రికార్డుకెక్కబోతున్నాయని చెప్పారు. ఓటర్ల జాబితా శుద్ధీకరణ విషయంలో మొత్తం దేశానికి బిహార్ ఒక మార్గం చూపిందని అన్నారు. రాజకీయ పారీ్టల విజ్ఞప్తి మేరకు.. బిహార్‌లో ఈవీఎంల చివరి రెండు రౌండ్ల కౌంటింగ్ కంటే ముందే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తిచేస్తామని వివరించారు. మహిళలు ఓటు వేసే సమయంలో బుర్ఖా లేదా తలపై ముసుగు ధరించవచ్చా? అని ప్రశ్నించగా, ఓటర్ల గుర్తింపును నిర్ధారించే విషయంలో మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేస్తామని జ్ఞానేశ్ కుమార్ బదులిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లో ఉంటారని, మహిళా ఓటర్ల గుర్తింపును వారు తనిఖీ చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో 250 పోలింగ్ బూత్‌ల పరిధిలో పోలీసులు గుర్రాలపై పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలియజేశారు. 197 పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది పడవలపై అక్కడికి చేరుకుంటారని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావడం దగ్గర్నుంచి, ఓట్ల లెక్కింపు దాకా.. మొత్తం 17 సంస్కరణలు చేపట్టబోతున్నామని మరోసారి స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ వీటిని అమలు చేస్తామన్నారు. తొలిసారిగా ‘ఈసీఐ నెట్’ ఎన్నికల్లో పారదర్శకతను మరింత పెంచడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా బిహార్ ఎన్నికల్లో ‘ఈసీఐ నెట్’ను ప్రవేశపెడుతోంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన 40కిపైగా యాప్‌లను ఒకే వేదికపైకి తీసుకొస్తూ ఈసీఐ నెట్‌ను రూపొందించారు. ఇదొక డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఇది ‘మదర్ ఆఫ్ ఆల్ యాప్స్’ అని చెబుతున్నారు. బూత్ లెవెల్ అధికారులు, చీఫ్ ఎలక్టోరల్ అధికారులు సహా ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది దీన్ని వినియోగించుకుంటారు. ఓటర్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, రిపోర్టింగ్ తదితర పనులు దీనిద్వారా నిర్వహిస్తారు. ఫలితంగా వారిమధ్య సమన్వయం పెరుగుతుంది. ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. మొత్తానికి ఎన్నికల నిర్వహణ సులభంగా మారుతుంది. ఓటర్లు కూడా ఈ వేదికను వాడుకోవచ్చు. పోలింగ్ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే యాప్ ద్వారానే ఫిర్యాదు చేయొచ్చు. కౌంటింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. తొలుత బిహార్‌లో.. అనంతరం దేశమంతటా ఈసీఐ నెట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
బిహార్ ఎటువైపు?
కేంద్రంలోని పాలక పక్షం ఎన్డీయే, విపక్ష కూటమి ‘ఇండియా’ జీవన్మరణ సమస్యగా భావిస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దఫాలుగా పోలింగ్ జరగబోతోంది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. వీటితోపాటు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఎనిమిది స్థానాలకు ఉప ఎన్నికలుంటాయి. వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఎన్నికల జాబితాను నవీకరించాక అది స్వచ్ఛంగా మారిందని జ్ఞానేశ్ ఇప్పటికే చెప్పారు. బిహార్‌లో ఇంతవరకూ సొంతంగా అధికారం చవిచూడని బీజేపీ ఈసారి ఎలాగైనా ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలని తహతహ లాడుతోంది. కానీ కేంద్రంలో మద్దతిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)తో ఎప్పటిలా కూటమి కట్టక తప్పలేదు. 2020 అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాలను గుర్తుంచుకుంటే నవంబర్ 15 తర్వాత ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తం స్థానాల సంఖ్య 243 కాగా, అప్పట్లో జేడీ(యూ) 122, బీజేపీ 121 స్థానాలు పంచుకున్నాయి. తమకన్నా ఒక్కటి ఎక్కువిచ్చి కాబోయే సీఎం నితీశేనని బీజేపీ చాటాల్సివచ్చింది. తీరా ఎన్నికలైన రెండేళ్లలోనే... అంటే 2022 ఆగస్టులో నితీశ్ ప్లేటు ఫిరాయించి ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా కూటమితో చేయి కలిపి మళ్లీ సీఎం అయ్యారు. అది ఎక్కువకాలం సాగలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా ఇండియా కూటమిని నిరుడు జనవరిలో చావుదెబ్బతీసి మళ్లీ ఎన్డీయే గూటికి చేరారు. ఫిరాయించిన ప్రతిసారీ సీఎం పదవికి రాజీనామా చేయటం, కొత్త కూటమి పక్షాన మళ్లీ దక్కించుకోవటం నితీశ్ ప్రత్యేకత. సాధారణ సమయాల్లో రాజకీయాలే ఊపిరిగా భావించే బిహార్ ప్రజానీకం పోలింగ్‌పై పెద్దగా ఆసక్తి చూపరంటే ఆశ్చర్యం కలుగుతుంది. అక్కడ సగటు పోలింగ్ శాతం ఎప్పుడూ 56 శాతం దాటలేదు. ఓటేసేవారిలో కూడా దాదాపు 60 శాతం మహిళలే. ఇది ప్రతిసారీ బీజేపీకి కలిసొస్తున్నది. క్రితంసారి ఎన్డీయేలో జేడీ(యూ) కేవలం 43 గెలుచుకుంది. బీజేపీ 74 సాధించింది. కానీ పొత్తు ధర్మానికి తలొగ్గి నితీశ్‌కే సీఎం పగ్గాలు అప్పగించింది. అప్పట్లో అలిగివెళ్లిన ఎల్జేపీ ఒక స్థానంమించి గెలవకపోయినా 33 చోట్ల అది జేడీ(యూ)ను దెబ్బ తీయగలిగింది. ఇప్పటికైతే ఆ పార్టీ ఎన్డీయే పంచన ఉంది.ఎంఐఎం వల్ల నష్టపోతున్నామన్నది విపక్షాల భావన. సీమాంచల్‌లో క్రితంసారి అది అయిదు గెల్చుకుంది. ఇక ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పార్టీ ఏ మేరకు ఓట్లు చీల్చగలదో చూడాల్సి ఉంది. బిహార్‌లో వామపక్షాలు బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీలు 16 స్థానాలు సాధించాయి. రాష్ట్రంలో నితీశ్‌తో కలిస్తేనే అధికారం దక్కుతుందన్న భావన అన్ని పార్టీల్లోనూ ఉంది. అందుకే ఆయన ఎటు దూకినా, తిరిగొస్తే అక్కున చేర్చుకోవటం ప్రధాన పక్షాలకు అలవాటైంది. నాలుగు దఫాలు సీఎంగా చేశాక ఇంకా ఆయనలో ఆ ‘మ్యాజిక్’ ఉందా అన్నది ఈ ఎన్నికలు తేల్చేస్తాయి. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బొత్తిగా జనాకర్షణ లేని పార్టీతో కలిసి వెళ్లినా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అద్భుతమైన పనితీరు కనబరిచారు. ఎన్డీయేతో పోలిస్తే కేవలం 16,825 ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు. ఈసారి ‘ఓట్ చోరీ’ ప్రచారం ప్రభావం వల్ల తన స్థితి మెరుగైందన్న భరోసాతో కాంగ్రెస్ స్వరం పెంచుతోంది. ఆర్జేడీకి అది గుదిబండగా మారుతుందా... లేక స్వీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మెలగుతుందా అన్నది చూడాలి. సాధారణ సమయాల్లో జనాకర్షణ పథకాలు ప్రమాదమంటూ గంభీరంగా మాట్లాడే ఎన్డీయే, ఎప్పటిలాగే బిహార్‌లో చేతికి ఎముక లేకుండా తాయిలాలు ప్రకటించింది. గత నెలలో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద 75 లక్షల మంది మహిళలకు రూ. 10,000 చొప్పున అందించారు. నెలకు రూ. 2,500 చొప్పున ఇస్తామన్న మహా కూటమి హామీకి ఇది విరుగుడు. ఏదేమైనా ఈసారి బిహార్ తీర్పుపై కేంద్రంలోని ఎన్డీయే కూటమి మనుగడ ఆధారపడి ఉంటుంది. అక్కడ బీజేపీ ప్రాభవం తగ్గితే జేడీ(యూ), టీడీపీలు తోకజాడించే ప్రమాదముంది. అదీగాక 2027 మార్చిలో జరిగే యూపీ ఎన్నికలపై కూడా దాని ప్రభావం పడుతుంది. ఇన్నివిధాల కీలకమైన బిహార్ ఎటు మొగ్గుతుందన్నది మరో నెల్లాళ్ల వ్యవధిలో తేలిపోతుంది. -
మోదీ ఒడిలో తేజస్వి ఓటర్లు: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ ఎన్నికల నేపధ్యంలో ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ యాక్టివ్‌గా మారారు. సోమవారం మధుబని జిల్లాలోని జీరో మైల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, తేజస్వీ యాదవ్‌పై మాటల దాడి చేశారు. వీరి వలనే బీజేపీ గెలుస్తుందని ఆరోపించారు. తేజస్వి ఓటర్లు మోదీ ఒడిలో కూర్చుని టీ తాగుతున్నందున బీజేపీనే గెలుస్తుందని ఆయన అన్నారు. వారు తమ ఓటర్లను ఒప్పించలేక, అందుకు బదులుగా ఒవైసీని నిందిస్తున్నారన్నారు. తేజస్విని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మీరు ఇలాగే అహంకారంతో వ్యవహరిస్తూ ఉంటే, బీహార్ ప్రజలు మిమ్మల్ని క్షమించరని ఆయన అన్నారు.ముస్లిం సమాజం తమ సొంత నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకునే వరకు, వారి సమస్యలను పరిష్కరించలేమని ఎంపీ వ్యాఖ్యానించారు. బీహార్ జనాభాలో ముస్లింలు 19 శాతం ఉన్నారని, వీరు లేకుండా ఏ ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేయలేమని, ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేమని ఒవైసీ అన్నారు. ఏఐఎంఐఎం చేస్తున్న పోరాటంలో ప్రజల మద్దతు చాలా అవసరమన్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదన్నారు. బీహార్‌లో 60 శాతం జనాభా 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారేననని, ఓటర్లు ఓటు వేసేముందు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.తాము కాంగ్రెస్‌కు, లాలూ యాదవ్‌లకు లేఖ రాశామని, తమతో పొత్తు పెట్టుకుని తమకు ఆరు సీట్లు ఇవ్వాలని కోరుతున్నామని ఒవైసీ తెలిపారు. మీరు అధికారంలోకి వస్తే మా ఎమ్మెల్యేలను మంత్రులను చేయనవసరం లేదని, బీజేపీ మతతత్వాన్ని ఎదుర్కోవాలనేదే తమ డిమాండ్ అని అన్నారు. వారు తమ వినతిని అంగీకరించలేదన్నారు. ఎన్నికల ఫలితం భిన్నంగా ఉంటే, మోదీ.. బీహార్‌కు రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ అర్థం అవుతుందన్నారు. -
బరిలో ప్రముఖ సింగర్.. బీజేపీ నేతలతో భేటీ
న్యూఢిల్లీ: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. పార్టీలలో ఉత్సాహం పెరిగింది. టిక్కెట్ల ఆశావహులు వివిధ పార్టీలలో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయని మైథిలి ఠాకూర్ బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్‌లను కలుసుకున్నారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆమె త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దర్భంగా నుండి బీజేపీ టికెట్‌పై పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.వినోద్ తావ్డే తన ‘ఎక్స్’ హ్యాండిల్లో మైథిలి ఠాకూర్‌తో సమావేశం అయిన ఫొటోలను షేర్ చేశారు. 1995లో లాలూ ప్రసాద్ యాదవ్ పదవీకాలంలో బీహార్‌ను విడిచిపెట్టిన మైథిలి ఠాకూర్ కుటుంబం రాష్ట్ర పురోగతిని చూసిన తర్వాత తిరిగి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నట్లు తావ్డే ఆ పోస్ట్‌లో తెలిపారు. కాగా మైథిలి ఠాకూర్ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ‘బీహార్ అభివృద్ధి కోసం కలలుకనే వ్యక్తులను కలుసుకున్నాను. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.जो लोग बिहार के लिए बड़े सपने देखते हैं, उनके साथ हर बातचीत मुझे दूरदृष्टि और सेवा की शक्ति की याद दिलाती है। हृदय से सम्मानित और आभारी हूँ। 🙏✨श्री नित्यानंद राय जी एवं श्री विनोद श्रीधर तावड़े जी 🙏 https://t.co/o6PBAVJaEJ— Maithili Thakur (@maithilithakur) October 5, 2025మైథిలి ఠాకూర్ బీహార్‌లోని మధుబనిలోని బెనిపట్టికి చెందినవారు. ఆమెను ఎన్నికల సంఘం బీహార్ 'స్టేట్ ఐకాన్'గా కూడా నియమించింది. భారతీయ శాస్త్రీయ, జానపద సంగీతంలో శిక్షణ పొందిన ఆమె, బీహార్ జానపద సంగీతానికి చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్‌ను అందుకున్నారు. ఆమె తన ఇద్దరు సోదరులతో పాటు, తాత, తండ్రి నుండి జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. రాబోయే ఎన్నికలు ప్రధానంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి చెందిన తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ మధ్య పోటాపోటీగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం 243 మంది సభ్యులున్న అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22తో ముగియనుంది. -
బీహార్ ఎన్నికల్లో ‘ఆప్’.. తొలి జాబితా ప్రకటించిన కేజ్రీవాల్
పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోమవారం నాడు బీహార్ ఎన్నికల్లో పోటీచేసే 11 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ‘ఆప్’ గత జూలైలో ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ, బీహార్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ‘ఆప్’ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ కూడా బీహార్ ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ధృవీకరించారు. బీహార్ ఎన్నికల్లో పోటీచేయబోయే 11 మంది అభ్యర్థుల జాబితా..డాక్టర్ మీరా సింగ్ - బెగుసరాయ్ (బెగుసరాయ్) యోగి చౌపాల్ - కుశేశ్వరస్థాన్ (దర్భంగా) అమిత్ కుమార్ సింగ్ - తారయ్య (సరణ్) భాను భారతీయ - కస్బా (పూర్ణియ) శుభదా యాదవ్ – బేనిపట్టి (మధుబని) అరుణ్ కుమార్ రజక్ - ఫుల్వారీ షరీఫ్ (పట్నా) డాక్టర్ పంకజ్ కుమార్ - బంకీపూర్ (పట్నా) అష్రఫ్ ఆలం - కిషన్‌గంజ్ (కిషన్‌గంజ్) అఖిలేష్ నారాయణ్ ఠాకూర్ - పరిహార్ (సీతామర్హి) అశోక్ కుమార్ సింగ్ - గోవింద్గంజ్ (మోతిహారి) మాజీ కెప్టెన్ ధరమ్‌రాజ్ సింగ్ - బక్సర్ (బక్సర్)2020 బీహార్ ఎన్నికల ఫలితాలు ఇలా..మునుపటి(2020) బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. మొదటి దశ అక్టోబర్ 28, రెండవ దశ నవంబర్ 3, మూడవ దశ నవంబర్ 7. ఫలితాలు నవంబర్ 10 న ప్రకటించారు. భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) వెల్లడించిన వివరాల ప్రకారం, 2020 బీహార్ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ శాతం 57.05గా ఉంది. మొదటి దశలో 55.68 శాతం, రెండవ దశలో 55.70 శాతం మూడవ దశలో 59.94 శాతం నమోదయ్యాయి. నాటి బీహార్ ఎన్నికల్లో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్ డీఏ) 125 సీట్లను గెలుచుకుని విజయం సాధించింది. రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలోని మహా కూటమి 110 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది. -
బిహార్‌లో రెండు విడతల్లో ఎన్నికలు
సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపుతోన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండుదశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం (అక్టోబరు 6న) 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బిహార్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నవంబర్ 6న తొలిదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 11 రెండోదశ ఎన్నికల పోలింగ్నవంబర్ 14న కౌంటింగ్ తొలిదశ ఎన్నికకు ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదలబిహార్ అసెంబ్లీ స్థానాలు, ఓటర్ల వివరాలు బిహార్‌లో 243అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలుమొత్తం ఓటర్లు 7.42కోట్లు జూన్ 24నుంచి ఓటర్ల అభ్యంతరాలను స్వీకరించాంఆగస్టు 1న తుది జాబితా ప్రకటించాంనామినేషన్ల కంటే 10 రోజల ముందు వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవచ్చుబీహార్లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నవంబర్ 22 నాటికి పూర్తవుతాయి. 22ఏళ్ల తర్వాత బిహార్‌లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సంస్కరించాం. 90వేల 712కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ 14లక్షల మంది కొత్త ఓటర్లు100ఏళ్లకు పైబడిన ఓటర్లు మొత్తం 14వేలఎన్నికల్లో 17 సంస్కరణలు బిహార్ ఎన్నికల నుంచి 17 కొత్త సంస్కరణలు తీసుకొచ్చాంప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్యను 1,200కి పరిమితం చేశాంగతంలో నలుపు, తెలుపు రంగులో ఉండే సీరియల్ నంబర్ ఫాంట్‌ను వినియోగించాం. అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు రంగులో ఉంటాయి. -
ఈసీ ప్రెస్‌మీట్.. నేడు బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఢిల్లీ: నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు(Bihar Assembly Election) షెడ్యూల్ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission Of India) సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. బీహార్(Bihar Election) అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. బీహార్ ఎన్నికలతో పాటే తెలంగాణలోని జూబ్లీహిల్స్(Jubilee Hills Election) అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక షెడ్యూల్(దేశంలో మరో నాలుగు స్థానాల్లో ఉప ఎన్నికలు) విడుదలయ్యే అవకాశం ఉంది. Delhi | Election Commission of India to hold a press conference at 4 PM today to announce the schedule for the upcoming Bihar Assembly Elections pic.twitter.com/YFTiaVTkk0— ANI (@ANI) October 6, 2025కాగా, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను సమీక్షించేందుకు ఇప్పటికే సీఈసీ బృందం రెండు రోజులు బీహార్‌లో పర్యటించింది. అసెంబ్లీ ఎన్నికలతో (Assembly Elections) అనేక కొత్త విధానాలకు శ్రీకారం చుడతామని, తగిన సమయంలో వాటిని దేశమంతటికీ విస్తరిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచడం వంటివి ఇందులో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రత్యేక ముమ్మర సవరణతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. బీహార్ (Bihar)లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చేనెల చివరివారంతో ముగియనుంది. కాగా, ప్రస్తుతం బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూడిన మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో మరోసారి నీతీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. -
పారదర్శకత కోసం 17 మార్పులు
పట్నా: బిహార్ శాసనసభ ఎన్నికల్లో 17 నూతన మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఎన్నికల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని వివరించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశానికి ఒక రోల్‌మోడల్ అవుతాయని అన్నారు. ఎన్నికల నిర్వహణతోపాటు ఓట్ల లెక్కింపులో ఈ కొత్త మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. బిహార్ రాజధాని పట్నాలో ఆదివారం ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సింధూ, వివేక్ జోషీతో కలిసి జ్ఞానేశ్‌కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త ఓటర్ రిజి్స్ట్రేషన్ తర్వాత 15 రోజుల్లోగా ఎలక్టర్ ఫొటో గుర్తింపు కార్డు(ఎపిక్)ను సంబంధిత ఓటర్‌కు అందజేయడానికి ప్రామాణిక నియమావళి (ఎస్ఓపీ)ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు తమ మొబైల్ ఫోన్లను భద్రపర్చుకొనే సౌలభ్యం కల్పించబోతున్నామని వివరించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. మార్పుల్లో కీలకమైనవి..→ బిహార్‌లో ప్రతి పోలింగ్ కేంద్రంలో 1,200 కంటే తక్కువ మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల జనం బారులు తీరి గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. త్వరగా ఓటు వేసి వెళ్లిపోవచ్చు. తక్కువ మంది ఓటర్లతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న తొలి రాష్ట్రంగా బిహార్ రికార్డుకెక్కనుంది. → ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్యపై పరిమితి విధించారు. 1,500 నుంచి 1,200కు తగ్గించారు. దీనివల్ల బిహార్‌లో అదనంగా 12,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మొత్తం కేంద్రాల సంఖ్య 90,712కి చేరుకోనుంది. → ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) బ్యాలె ట్లపై అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తుల విషయంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఈసారి కలర్ ఫోటోలు ముద్రించబోతున్నారు. పేర్లు, సీరియల్ నంబర్లు స్పష్టంగా కనిపెంచేలా పెద్ద అక్షరాల్లో ముద్రిస్తారు. ప్రస్తుతం ఈవీఎంలపై నలుపు తెలుపు రంగు ఫొటోలే ఉంటున్నాయి. దీనివల్ల అభ్యర్థులను గుర్తించడంలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిహార్‌లో ఈ కష్టాలకు తెరపడినట్లే. దేశవ్యాప్తంగా ఇదే విధానం అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయానికి వచి్చంది. దేశంలో ఈవీఎంలపై కలర్ ఫొటోలు ముద్రించిన మొట్టమొదటి ఎన్నికలుగా బిహార్ అసెంబ్లీ ఎన్నికలు చరిత్రకెక్కబోతున్నాయి. → ఎన్నికల విధులు నిర్వర్తించే బూత్–లెవెల్ అధికారులకు అధికారికంగా గుర్తింపు కార్డులు జారీ చేయబోతున్నారు. తద్వారా ఓటర్లు వారిని సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. → బిహార్ ఎన్నికల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ వంద శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కవరేజీని తప్పనిసరి చేశారు. అనుమానాలకు తావులేకుండా ప్రతి అంశాన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు చేశారు. → పోలింగ్ కేంద్రాల వల్ల మొబైల్ ఫోన్లు భద్రపర్చుకోవడానికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయిస్తారు. → పోలింగ్ ఏజెంట్లకు ప్రిసైడింగ్ అధికారి ఫామ్ 17సీని అందజేస్తారు. ఫామ్ 17సీలోని వివరాలకు, ఈవీఎం కౌంటింగ్ యూనిట్లలోని ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైతే దానికి సంబంధించిన వీవీప్యాట్లను రీకౌంటింగ్ చేస్తారు. → ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడానికి ముందే పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. నవంబర్ 22లోగా బిహార్ ఎన్నికలు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది నవంబర్ 22వ తేదీలోగా నిర్వహిస్తామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగుస్తుందని అన్నారు. రాష్ట్రంలో 243 శాసనసభ స్థానాలు ఉండగా, వీటిలో 38 ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కోసం బూత్–లెవెల్ అధికారులకు సైతం శిక్షణ ఇచ్చామన్నారు. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 243 మంది ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ అధికారులను(ఈఆర్ఓ) నియమించామని తెలిపారు. ఎస్ఐఆర్ను జూన్ 24న ప్రారంభించామని, ఈఆర్ఓతోపాటు బూత్–లెవెల్ అధికారుల సాయంతో గడువులోగా విజయవంతంగా పూర్తిచేశామని వివరించారు. ఎస్ఐఆర్ విజయవంతం అయినందుకు ఓటర్లకు జ్ఞానేశ్ కుమార్ అభినందనలు తెలియజేశారు. తమకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో చురుగ్గా భాగస్వాములు కావాలని బిహార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఛత్ వేడుకలో పాల్గొన్నంత ఉత్సాహంగా ఎన్నికల పండుగలో పాల్గొనాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు. బిహార్‌లో 90,217 మంది బూత్ లెవెల్ అధికారులు ఎస్ఐఆర్ నిర్వహించారని, అద్భుతంగా పనిచేసి దేశానికి ఒక ఉదాహరణగా నిలిచారని జ్ఞానేశ్ కుమార్ ప్రశంసించారు. ఓటర్ల జాబితా శుద్ధీ్ధకరణ విషయంలో మొత్తం దేశానికే వారు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. బిహార్‌లో 22 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసినట్లు వెల్లడించారు. -
Bihar Election: ఎన్నికల బరిలో సనాతన అభ్యర్థులు: అవిముక్తేశ్వరానంద సరస్వతి
పట్నా: ఈ ఏడాది చివరిలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్‌తో పాటు, వివిధ పార్టీలు సన్నాహాల్లో మునిగితేలుతున్నాయి. తాజాగా జ్యోతిష్య పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సనాతనుల సత్తాను చాటేందుకు రాబోయే బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.బీహార్‌లోని బెట్టియాలోని అన్ని నియోజకవర్గాల్లో సనాతన లక్ష్యాలకు కట్టుబడిన అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తనతో పాటు వారంతా చురుకుగా పాల్గొంటారని తెలిపారు. బీహార్ ఎన్నికల్లో సామాజిక సమస్యల పరిష్కార లక్ష్యం కలిగి, గో రక్షణతో పాటు సనాతన సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్న తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని శంకరాచార్య ఓటర్లను కోరారు.పట్నాలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడిన స్వామి అవిముక్తేశ్వరానంద.. గో రక్షణ కేవలం మత విశ్వాసానికి సంబంధించినది మాత్రమే కాదని, సమాజం, సంస్కృతికి పునాది అని స్పష్టం చేశారు. గోవును ‘జాతీయ మాత’గా ప్రకటించాలనే డిమాండ్‌తో తాను ఢిల్లీలోని జాతీయ పార్టీలను సంప్రదించానని, కానీ దీనిపై స్పష్టమైన స్పందన రాలేదని అన్నారు. బీహార్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తర్వాత అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తామని అవిముక్తేశ్వరానంద సరస్వతి తెలిపారు. అయితే ఏదైనా పార్టీ అభ్యర్థి గో సంరక్షణకు కట్టుబడి ఉన్నట్లు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేస్తే, ఆ నియోజకవర్గాల్లో, తాము తమ అభ్యర్థిని నిలబెట్టబోమని తెలిపారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని బ్రహ్మన్పూర్ గ్రామంలో 1969, ఆగస్టు 15న జన్మించిన ఉమాశంకర్ ఉపాధ్యాయ, వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో శాస్త్రి, ఆచార్య డిగ్రీలను పూర్తి చేశారు. 2003, ఏప్రిల్ 15న దండ్ సన్యాసం తీసుకున్నాక ఆయన స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిగా మారారు. 2022,సెప్టెంబర్‌లో ఆయన జ్యోతిష్య పీఠానికి శంకరాచార్యగా నియమితులయ్యారు.ఆయన గో రక్షణ, సనాతన సంప్రదాయాల పునరుద్ధరణ తదితర అంశాలపై చాలాకాలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2008లో అవిముక్తేశ్వరానంద సరస్వతి ‘గంగ’ను జాతీయ నదిగా ప్రకటించాలని నిరాహార దీక్ష చేపట్టారు. ఇప్పుడు రాబోయే బీహార్ ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. -
అందరూ కాలేరు జన నాయక్‌లు
న్యూఢిల్లీ: విజ్ఞానం, నైపుణ్యాలకు మన దేశంలో లోటు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. మేధో సంపత్తి మన విలువైన ఆస్తి అని ఉద్ఘాటించారు. విజ్ఞానం, నైపుణ్యాలను దేశ ప్రగతికి ఉపయోగించుకోవాలని చెప్పారు. 21వ శతాబ్దంలో స్థానిక నైపుణ్యాలు, వనరులు, ప్రతిభ, విజ్ఞానానికి డిమాండ్ నానాటికీ పెరుగుతోందని అన్నారు. శనివారం రూ.62,000 కోట్లకుపైగా విలువైన యువత కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని మోదీ ఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌కు అనుసంధానమైన పథకాలు ఇందులో ఉన్నాయి. అలాగే రూ.60,000 కోట్లతో అమలు చేసే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ‘పీఎం–సేతు’ పథకానికి శ్రీకారం చుట్టారు. బిహార్ రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ మోడల్‌గా అభివృద్ధి చేయబోతున్నారు. బిహార్‌లో జన నాయక్ కర్పూరీ ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని సైతం మోదీ ప్రారంభించారు. బిహార్‌లో రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యావ్యవస్థ దిగజారిందని, వలసలు పెరిగిపోయాయని మండిపడ్డారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రశంసించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని ఆ పార్టీ కార్యకర్తలు ‘జన నాయక్’ అని పిలుస్తుండడాన్ని ప్రధానమంత్రి తప్పుపట్టారు. ఓబీసీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మాత్రమే ‘జన నాయక్’ అని తేల్చిచెప్పారు. ఆ గౌరవాన్ని దొంగిలించే కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. అందరూ జన నాయకులు కాలేరని రాహుల్‌ను ఎద్దేవా చేశారు. ఐటీఐలపై ప్రత్యేక దృష్టి ‘‘పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లు పారిశ్రామిక విద్యకు అత్యంత కీలకం. ఇవి ఆత్మనిర్భర్ భారత్‌కు వర్క్‌షాప్‌లుగా పని చేస్తున్నాయి. ఐటీఐల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. 2014 వరకు దేశంలో 10,000 ఐటీఐలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 15,000కు చేరుకుంది. పారిశ్రామిక నైపుణ్య అవసరాలను తీర్చేలా, రాబోయే పదేళ్లలో డిమాండ్‌ను తట్టుకొనేలా ఐటీఐ నెట్వర్క్ ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు. ప్రతి గ్రామంలోనూ పాఠశాల ‘‘బిహార్ పురోభివృద్ధి కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోంది. యువతకు గత 20 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల కంటే రాబోయే ఐదేళ్లలో అంతకు రెట్టింపు ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. వేర్లకు చెదలు పట్టి ఎండిపోయిన చెట్టును బతికించడం కష్టం. ఇతర పార్టీల పాలనలో బిహార్ పరిస్థితి ఇలాగే ఉండేది. నితీశ్ కుమార్ పట్ల బిహార్ ప్రజలు విశ్వాసం ప్రదర్శించారు. ఆయన నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం బిహార్‌ను మళ్లీ దారిలో పెట్టడానికి ఉమ్మడిగా కృషి చేస్తోంది. రెండున్నర దశాబ్దాల క్రితంలో బిహార్‌లో విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో ఇప్పటి తరానికి తెలియదు. తమ బిడ్డలు స్థానికంగానే చదువుకొని, ఉద్యోగం సంపాదించుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, విపక్షాల పాలనలో లక్షలాది మంది బిహార్‌ను విడిచిపెట్టి బనారస్, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు వలసవెళ్లారు. వలసలకు అప్పడే బీజం పడింది. ఎన్డీయే సర్కార్ వచ్చిన తర్వాత బిహార్ ప్రజలు సొంత రాష్ట్రానికి తిరిగి రావడం ఆరంభమైంది’’ అని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. -
నేడు బిహార్‌కు సీఈసీ బృందం
న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్ఎస్ సంధు శనివారం పట్నాకు వెళ్లనున్నారు. వీరు రెండు రోజులపాటు అక్కడి అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షిస్తారు. 243 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 22న ముగియనుంది. అక్టోబర్ నెలాఖరులో పోలింగ్ ప్రారంభమై వచ్చే నెలలో పలు దశల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ముందు ఈసీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించడమనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇందులోభాగంగా ఈసీ రాజకీయ పారీ్టల ప్రతినిధులు, పాలనా సంబంధిత అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశమవుతుంది. ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఆయా చట్టాలు, నియమాలతో పూర్తి అవగాహనతో ఉండి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేలా ఈసీ సమాయత్తం చేస్తుంది. కేంద్ర పరిశీలకులు బరిలో నిలిచే అభ్యర్థులకు సమాన అవకాశాలు ఉండేలా నిర్ధారించుకుంటారు. రాజకీయ పారీ్టలు, అభ్యర్థులు, ఓటర్ల సమస్యలను తీర్చేందుకు పరిశీలకులు అందుబాటులో ఉండాల ని చెప్పారు. ఓటర్ల సౌలభ్యం కోసం ఈసీ తీసుకొ చ్చిన కార్యక్రమాలు సరిగా అమలవుతున్నాయో లేదో చూసేందుకు పరిశీలకులు పోలింగ్ బూత్‌ల ను సందర్శించాలని ఈసీ ఆదేశించింది. గత సెపె్టంబర్ 30న ప్రచురితమైన ఓటర్ల తుది జాబితా ప్రకారం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. -
ఇప్పటికీ వీడని సందేహాలు
బిహార్‌లో వివాదరహితంగా, పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించాలన్న సదుద్దేశం ఎన్నికల సంఘానికి(ఈసీ)కి ఉందా? మంగళవారం విడుదల చేసిన బిహార్ ఓటర్ల తుది జాబితా గమనిస్తే ఈ విషయంలో ఎవరికైనా సంశయం కలుగుతుంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లని ఆ జాబితా ప్రకటిస్తోంది. వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట జూన్ 24న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభించే నాటికి బిహార్ ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. అంతకు ఆర్నెల్ల ముందు ప్రకటించిన ఆ జాబితాను కాదని మళ్లీ ఆదరా బాదరాగా ఈ సవరణ దేనికని విపక్షాలు ప్రశ్నించాయి. 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, అటుపై జాబితాలోకి ఎక్కిన వారిని సంశయ ఓటర్లుగా పరిగణించి వారి నుంచి వివిధ రకాల పత్రాలు కోరటం కొత్తగా అమల్లోకి తెచ్చిన ప్రక్రియ సారాంశం. దాని ప్రకారం 1987 జూలై 1 లేదా అంతకు ముందు జన్మించినవారు జనన ధ్రువీకరణ పత్రం లేదా పుట్టిన ఊరు ధ్రువీకరణ పత్రం... లేదా రెండూ సమర్పించాలి. జూలై 1, 1987– డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు ఈ పత్రాలతో పాటు తల్లితండ్రుల్లో ఎవరో ఒకరి జనన లేదా ప్రాంత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత జన్మించిన వారు తమ ధ్రువీకరణ పత్రాలతో పాటు తల్లితండ్రులిద్దరివీ కూడా సమర్పించాలి. లేనట్టయితే జాబితాలో చోటుండబోదని ఈసీ ప్రకటించింది. సుప్రీంకోర్టు జోక్యంతో చివరకు ఆధార్‌ను చేర్చారు. ఆగస్టు 1న ప్రకటించిన తొలి ముసాయిదా జాబితా ఓటర్ల సంఖ్యను 7.24 కోట్లుగా ప్రకటించినప్పుడు విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్న ధర్మాసనం సూచన అమలు చేసి తాజాగా ప్రకటించిన ముసాయిదాలో కూడా సంశయాలు తప్పలేదు. 2020 జూలైలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ – జనాభా జాతీయ కమిషన్ సంయుక్తంగా విడుదల చేసిన జనాభా అంచనా నివేదిక ప్రకారం బిహార్‌లో 18 ఏళ్లు, అంతకుపైబడి వయసున్న జనాభా 8.18 కోట్లు. తాజా ఓటర్ల జాబితా గమనిస్తే ఇందులో 76 లక్షలమంది ఓటర్లుగా నమోదు చేసుకోలేదనుకోవాలి. అయిదేళ్లనాటి కేంద్ర నివేదిక కేవలం అంచ నాయే అనుకున్నా తాజాగా ప్రకటించిన ఓటర్ల జాబితాలోని సంఖ్య దానికి దరిదాపు ల్లోనైనా ఉండొద్దా? ఈసీ తీరుపై సంశయాలు వ్యక్తం కావటానికి మరో కారణముంది. సెప్టెంబర్ 1న గడువు ముగిసే సమయానికి ఓటర్ల జాబితాలో చేర్చమంటూ తమకు 16.93 లక్షల దరఖాస్తులు అందాయని సంస్థ స్వయంగా ప్రకటించింది. ఇకపై దరఖాస్తులు స్వీకరించేది లేదని కూడా చెప్పింది. మరి 21.53 లక్షలమంది కొత్త ఓటర్లు చేరారని ఇప్పుడెలా ప్రకటించారు? సెప్టెంబర్ 1 తర్వాత కూడా దరఖాస్తులు తీసుకున్నారనుకోవాలా?రెండింటి మధ్యా వ్యత్యాసం ఏకంగా 4.60 లక్షలుంది. మరి సంశయాలు రావా? దీనిపై వివరణనివ్వొద్దా? ఆ సంగతలా ఉంచి తొలగించిన 47 లక్షలమందిలో ఏయే కారణాలతో ఎంతమందిని తొలగించారన్న డేటా లేదు. ఈసీ అనుమానించినట్టు వాస్తవంగా ‘విదేశీయులు’గా ముద్రపడిన వారెందరు? ‘అనర్హులైన ఓటర్లు’గా పరిగణించి 3.66 లక్షలమందిని తొలగించామన్నారు. వీరంతా ‘విదేశీయులు’ అనుకోవాలా? ఏ పత్రమూ దాఖలు చేయలేని వారి మాటేమిటి? ఇక మృతులు, శాశ్వతంగా వలసపోయినవారు,రెండుచోట్ల నమోదైనవారు ఎందరన్న వర్గీకరణ కూడా లేదు. జిల్లాలవారీ డేటా సైతం ఇవ్వలేదు. పట్నా జిల్లాలో ఓటర్ల సంఖ్య 1.63 లక్షలు పెరిగిందని అక్కడి జిల్లా పాలనాయంత్రాంగం చెప్పింది. ఇతర జిల్లాల్లో తగ్గిందని చెప్పటం తప్ప వాటి వివరాలు లేవు.ఇది ఇక్కడితో ఆగిపోదు. తొలగించిన పేర్లు, కొత్తగా చేర్చిన పేర్లు విపక్షాలు జల్లెడపట్టి ఈసీ ప్రకటించిన తుది జాబితా దుమ్ము దులుపుతాయి. దేశమంతటా ‘సర్’ అమలు చేస్తామని సంబరంగా ప్రకటించటం కాదు... బిహార్‌లో తలెత్తుతున్న సందే హాలకు ఈసీ సమాధానం చెప్పాలి. పారదర్శకంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో ఈవీఎంలపై వచ్చిన సంశయాలను ఇంతవరకూ ఈసీ నివృత్తి చేయలేదు. ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను పెంచడానికి ఏం చేయబోతున్నారో చెప్పిందీ లేదు. ఈ దశలో ఈసీ చిత్తశుద్ధిని పార్టీలైనా, ప్రజానీకమైనా నమ్మగలరా? -
బిహార్ సీఎం అభ్యర్థిగా అతడే బెస్ట్!
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యుహాల్లో మునిగి తేలుతున్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్బంధన్ మధ్య ప్రధాన పోరు ఉంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ జన సురాజ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇక సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నట్టు సీ- ఓటర్ సర్వే (C-Voter survey) వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆశ్చర్యకరంగా మూడో స్థానానికి పరిమితం కాగా, ప్రశాంత్ కిశోర్ రెండో స్థానంలో నిలిచారు.ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు సేకరించిన డేటా ఆధారంగా సర్వే ఫలితాలను సీ- ఓటర్ ప్రకటించింది. సెప్టెంబర్ ఫలితాలను తీసుకుంటే.. 35.5 శాతం మంది తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కోరుకున్నారు. ప్రశాంత్ కిశోర్ కావాలని 23.1 శాతం మంది ఆకాంక్షించారు. నితీశ్ కుమార్‌ను కేవలం 16 శాతం మంది మాత్రమే కోరుకున్నారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్‌కు 9.5, బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి (samrat choudhary) 6.8 శాతం మంది మద్దతు ప్రకటించారు.అయితే ఫిబ్రవరి నుంచి చూసుకుంటే తేజస్వి, నితీశ్ కుమార్‌లకు మద్దతు తగ్గుతూ వస్తోంది. ఫిబ్రవరిలో తేజస్వికి 40.6 శాతం మంది, నితీశ్‌కు 18.4 శాతం మంది మద్దతు దక్కింది. మరోవైపు సీఎం అభ్యర్థిగా ప్రశాంత్ కిశోర్‌కు ఆదరణ పెరుగుతోంది. ఫిబ్రవరిలో ఆయనకు మద్దతు ఇచ్చిన వారు 14.9 శాతం మాత్రమే. 8 నెలల్లో ఆయనకు ఆదరణ 8.2 శాతం వరకు పెరిగినట్టు సీ ఓటర్ డేటా వెల్లడించింది. కాగా, మహాఘఠ్బంధన్ సీఎం అభ్యర్థి తానేనని తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఇప్పటికే ప్రకటించుకున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.ఎన్డీఏతో 'మహా' పోటీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, మహాఘఠ్బంధన్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సెప్టెంబర్‌లో నిర్వహించిన స్టేట్ వైబ్ సర్వే ప్రకారం.. మహాఘఠ్బంధన్ కూటమికి 34.9 శాతం, ఎన్డీఏ 34.8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగం, వలసలు గురించి బిహార్ ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని సర్వే వెల్లడించింది. ముస్లింలలో మూడింట ఒక వంతు (38.4%) ఓటు చోరీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేసిన ప్రచారం ఓటర్లపై కొంతమేర ప్రభావం చూపించినట్టుగా కనబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తల్లిపై ఏఐ- వీడియో వివాదాన్ని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు సగం మంది ఓటర్లు (49.8%) దీన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగానే పరిగణించారు.తేజస్వీ యాత్రతో జోష్తేజస్వీ చేపట్టిన యాత్రతో ఆర్జేడీ కార్యకర్తలను ఉత్తేజపరిచిందని 43.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. యాదవుల నుంచి మంచి స్పందన వస్తోందని 76.7 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) కుటుంబంలోని అంతర్గత వివాదాలు ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని 45.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. లాలూ కుటుంబ కలహాలు పార్టీపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాన్ని కలిగించబోవని యాదవుల్లో 70.6 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. అగ్రవర్ణ హిందువులలో 46.6% మంది ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.చదవండి: మహాఘఠ్‌బంధన్‌లో లుకలుకలు..!ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నామని 56.3 శాతం మంది సర్వేలో చెప్పారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని 43.7% మంది తెలిపారు. తమ ఓటు ఎవరికి వేయాలనే విషయంలో గ్రామీణ ఓటర్ల కంటే (51.8%) పట్టణ ఓటర్లు (66.9%) ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు సర్వే వెల్లడించింది.నవంబర్‌లో ఎన్నికలుఈ ఏడాది నవంబర్‌లో బిహార్ శాసనసభ ఎన్నికలు (Bihar Assembly Election) జరగనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందని భావిస్తున్నారు. -
‘సర్’ ఎఫెక్ట్: 47 లక్షల పేర్లుతొలగింపు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంగళవారం ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ముసాయిదా జాబితాలో 7.89 కోట్ల మంది ఓటర్లుండగా, తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు తగ్గింది. అంటే, ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ముగిశాక 47 లక్షల మంది పేర్లు తొలగింపునకు గురయ్యాయి. ఎస్ఐఆర్లో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాపై అందిన అభ్యంతరాలు, దరఖాస్తులను ఇందులో పరిగణనలోకి తీసుకున్నామని ఈసీ తెలిపింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టిన అనంతరం తుది ఓటరు జాబితాను 30.09.2025న విడుదల చేసినట్లు బిహార్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఫేస్బుక్ పేజీలో ప్రకటించారు. voters. eci. gov. in అనే లింకుపై క్లిక్ చేయడం ద్వారా ఓటర్లు జాబితాలో తమ పేర్లను చూసుకోవచ్చని పేర్కొన్నారు. జూన్ 24వ తేదీన విడుదల చేసిన రాష్ట్ర జాబితాలో 7.90 కోట్ల ఓటర్లున్నారు. పేర్కొన్న చిరునామాలో లేకపోవడం, వేరే చోటుకు వెళ్లిపోవడం, మృతి చెందడం వంటి కారణాలతో 65 లక్షల మందిని తొలగించాక ఆగస్ట్ ఒకటో తేదీన విడుదల చేసిన ముసాయిదాలో 7.24 కోట్లకు తగ్గాయి. తుది జాబితాలో 21.53 లక్షల ఓటర్ల పేర్లను కొత్తగా చేర్చి, 3.66 లక్షల పేర్లను తొలగించారు. దీంతో, సెప్టెంబర్ 30న విడుదల చేసిన ఫైనల్ లిస్టులో ఓటర్ల సంఖ్య 7.42 కోట్లుగా ఉంది. అయితే, తమ పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముసాయిదా జాబితాతో పోలిస్తే 1.63 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరారని, మొత్తం ఓటర్ల సంఖ్య 48.15 లక్షలకు చేరుకుందని పట్నా జిల్లా యంత్రాంగం వెల్లడించింది. పట్నా జిల్లాలో 22.75 లక్షల మంది మహిళా ఓటర్లున్నట్లు వివరించింది. అత్యధికంగా దిఘా నియోజకవర్గంలో 4.56 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపింది.వివాదాస్పదంగా ఎస్ఐఆర్బిహార్లో దాదాపు 22 ఏళ్ల తర్వాత చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం తెల్సిందే. ఓటరు జాబితాను అధికార ఎన్డీయేకు అనుకూలంగా మార్చుకునేందుకే ఈసీతో కలిసి బీజేపీ ఈ విధానాన్ని తీసుకువచ్చిందని సుప్రీంకోర్టుకు సైతం వెళ్లాయి. ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కలిసి రాష్ట్రంలో ఓటర్ అధికార్ యాత్రను సైతం చేపట్టారు. అధికార పక్షం, ఈసీ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి.4న పట్నాకు ఈసీఓటరు జాబితా ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ సమాయత్త మవుతోంది. ఇందులో భాగంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు ఎస్ ఎస్ సంధు, వినీత్ జోషిలతో కలిసి అక్టోబర్ 4, 5వ తేదీల్లోపట్నా వెళ్లి ఎన్నికల సన్న ద్ధతను సమీక్షించనున్నారు. పౌరసంఘాలు, రాజకీ య పార్టీల నేతలు, అధికారులతో సమావే శమవనున్నారు. అంతకుముందు ఎన్నికల పరిశీలకులతో 3న సమావేశం ఏర్పా టు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీల ను 6, 7వ తేదీల్లో ఎన్నికల సంఘం త్వరలోనే ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదీ చదవండి: తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తు -
అధికారం మాదే.. లేదంటే చివరి స్థానమే: పీకే ఆసక్తికర వ్యాఖ్యలు
పాట్న: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఫుల్ మెజార్టీ సాధిస్తుంది.. లేదంటే చివరి స్థానంలో నిలుస్తుంది అంటూ జోస్యం చెప్పారు. బీహార్‌లో ఎన్డీయే కూటమికి ఓటమి తప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీకే.. తన పార్టీ బీహార్‌లోని 243 స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో తమ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది. లేదంటే చివరి స్థానంలో నిలుస్తుందన్నారు. ఎటూ కాకుండా మధ్యలో ఉండటం జరగదన్నారు. అలాగే, అధికార ఎన్డీయే కూటమిలోని జేడీ(యూ)కు 25 సీట్లకు మించి రావని తేల్చిచెప్పారు. బీజేపీకి కూడా ఓటమి తప్పదన్నారు. విపక్ష మహాఘట్బంధన్ మూడో స్థానంలో నిలుస్తుందని, తన పార్టీ పూర్తి ఆధిక్యం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.ఇదిలా ఉండగా.. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. జేడీ(యూ)నేత, బీహార్ మంత్రి అశోక్ చౌదరికి పరువు నష్టం నోటీసు పంపుతానని తెలిపారు. రూ.200 కోట్ల అవినీతికి ఆయన పాల్పడినట్లు ఆరోపించారు. కోట్ల విలువైన ఆ భూమిని తన పీఏ పేరుతో ఆయన ఎందుకు కొన్నారు? అని ప్రశ్నించారు. త్వరలోనే నలుగురు లేదా ఐదుగురు ప్రముఖ నేతల గుట్టు బయటపెడతాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఏం జరుగుతుందా? అనే సస్పెన్స్ బీహార్ రాజకీయాల్లో నెలకొంది. -
బిహార్ ఎన్నికల తర్వాతే బీజేపీకి కొత్త అధ్యక్షుడు?
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాతే బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించే అవకాముంది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలను కమలదళం కీలకమైనవిగా భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తే సంస్థాగత సమతుల్యత దెబ్బతింటుందని అధిష్టానం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో అధ్యక్షుడి మార్పు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా, బిహార్ ఎన్నికల ఫలితాలు కొత్త అధ్యక్షుడి ఎంపికలో కీలకంగా మారనున్నాయి. సంస్థాగతంగా, మంత్రి వర్గంలో రాష్ట్ర స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. జాతీయ అధ్యక్షుడి రేసులో ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే, అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బీహార్‌పై కేంద్రం వరాలు కురిపిస్తోంది సార్.. మనకూ ఎన్నికలుంటే బాగుండు!
బీహార్‌పై కేంద్రం వరాలు కురిపిస్తోంది సార్.. మనకూ ఎన్నికలుంటే బాగుండు! -
ముస్లింల స్థలాలను లాక్కోవడానికే వక్ఫ్ చట్టం: ఒవైసీ
కిషన్‌గంజ్ (బిహార్): ముస్లింల మసీదులు, ఇతర పవిత్ర స్థలాలను లాక్కునేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన ’సీమాంచల్ న్యాయ యాత్ర’ను ప్రారంభించారు. రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. రాష్ట్రంలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో తన పార్టీ విజయావకాశాలను పెంచుకునే లక్ష్యంతో మూడు రోజుల సుడిగాలి పర్యటనకు ఒవైసీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోచధమన్ అసెంబ్లీ సెగ్మెంట్లో నిర్వహించిన ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ.. మసీదులు, ఈద్గాలు, ఖబరస్తాన్‌లను లాక్కోవడానికే ప్రధాని నరేంద్ర మోదీ వక్ఫ్ బిల్లును తీసుకొచ్చారని, సదుద్దేశంతో కాదని స్పష్టం చేశారు. ఈ ఆస్తులు అల్లాహ్‌కు చెందినవని మోదీ గ్రహించలేదని విమర్శించారు. మోదీ తన దురుద్దేశపూర్వక ఆలోచనలతో ఎప్పటికీ విజయం సాధించలేరని చెప్పారు. ప్రపంచం ఉన్నంత వరకు ముస్లింలు తమ మసీదులలో ప్రార్థనలు చేస్తూనే ఉంటారని, అల్లాహ్‌ను విశ్వసించేవారి పవిత్రమైన స్థలాలు బీజేపీ–ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్లవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒవైసీ.. బిహార్‌లో ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పారీ్టలపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రం వచి్చనప్పటినుంచి దేశ ముస్లింలు లౌకిక పారీ్టగా చెప్పుకొంటున్న పారీ్టకి మద్దతు ఇస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు.. చాలా కాలంగా ముస్లింల ఓట్లు కోరుకున్నారని, కానీ, కూలీల్లా ఈ భారాన్ని ఎప్పటికీ మోయలేమని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ‘ఒంటరిగా మిగిలిపోతున్న మన యువతపై శ్రద్ధ వహించాలి. మన శ్రేయస్సుకు అవసరమైనవి చేయాలి. కొన్ని పారీ్టలు.. అధికారాన్ని అనుభవించేందుకు ఇకపై మన ఆకాంక్షలను త్యాగం చేయరాదు’.. అని ఒవైసీ పిలుపునిచ్చారు. -
బిహార్ నుంచే మోదీ సర్కార్ పతనం
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలే కేంద్రంలోని మోదీ ప్రభుత్వ అవినీతి పాలన పతనానికి నాంది పలుకుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌ను భారంగా భావిస్తున్న బీజేపీ ఆయనను మానసికంగా రిటైర్ చేసిందని చెప్పారు. బుధవారం పట్నాలో సీడబ్ల్యూసీ భేటీలో ఖర్గే మాట్లాడారు. బిహార్‌ను ఒక ఉదాహరణగా చూపించి లక్షలాది మంది ఓట్లను తొలగించడానికి దేశవ్యాప్తంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఓటరు జాబితాను తారుమారు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని, ఈ సమయంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మనమంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. మన దేశం అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సమస్యలకు మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విఫలమవడం కావడమే కారణమని ఆరోపించారు. మోదీ గొప్పగా చెప్పుకుంటున్న స్నేహితులే భారత్‌ను సమస్యల వలయంలోకి నెట్టారని మండిపడ్డారు. ఒకవైపు స్వదేశీ అని చెబుతున్న మోదీ మరోవైపు చైనాకు బహిరంగంగా ఎర్ర తివాచీ పరుస్తున్నారని ఖర్గే ధ్వజమెత్తారు. ఈబీసీల రక్షణకు చట్టం: రాహుల్ బిహార్‌లో తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రక్షణ చట్టం తరహాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ)ను వేధింపుల నుంచి రక్షించడానికి చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈబీసీలకు న్యాయం చేయడానికి 10 సంకల్పాలను ప్రకటించారు. స్థానిక సంస్థల్లో ఈబీసీల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 30 శాతానికి పెంచుతామన్నారు. రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, ఈబీసీలకు కలిపి 50 శాతం కోటా కలి్పస్తామన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈబీసీలు ప్రవేశాలు కలి్పస్తామని తెలిపారు. అంతేకాకుండా ఉచితంగా భూమి పంపిణీ చేస్తామన్నారు. విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్నత స్థాయి రిజర్వేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేస్తామని రాహుల్ ప్రకటించారు. ఓట్ల చోరీపై త్వరలో హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నానని స్పష్టంచేశారు. -
బీహార్‌లో విజయానికి.. రాహుల్ 10 పాయింట్ల ప్రణాళిక
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే, రూ. 25 కోట్లకు పైగా విలువైన ప్రైవేట్, ప్రభుత్వ కాంట్రాక్టులలో అత్యంత వెనుకబడిన తరగతులకు (ఈబీసీ) రిజర్వేషన్లు కల్పిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పట్నాలో జరిగిన అతి పిచ్రా న్యాయ సంకల్ప్ సింపోజియంలో రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని హామీనిచ్చారు.నేటికీ ఈ దేశంలో అత్యంత వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలవారు ఉన్నారు. వారిలోని అర్హులైనవారికి అన్నింటా భాగస్వామ్యం లభించడం లేదు. దేశం అంతటా ఇలానే ఉంది. తాము కుల గణన నిర్వహించి, ఈ దేశంలో దళితులు, అత్యంత వెనుకబడిన తరగతుల నిజమైన జనాభాను చూపించాలనుకుంటున్నామని రాహుల్ పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తూ, జేడీయూ ప్రభుత్వం ఈబీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు. న్యాయ సంకల్ప్ సింపోజియంలో పది అంశాల తీర్మానాన్ని రాహుల్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు దీనిని అమలు చేస్తామని తెలిపారు. ‘ఎక్స్’లో కాంగ్రెస్ పోస్ట్ లోని వివరాల ప్రకారం పది అంశాలు.. VIDEO: “A ten-point resolution was passed at the 'Ati Pichra Nyay Sankalp' symposium today, to be implemented when the INDIA bloc comes to power in Bihar,” said Congress leader and Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi).(Full video available on PTI Videos -… pic.twitter.com/HQgqtsST1x— Press Trust of India (@PTI_News) September 24, 20251. అత్యంత వెనుకబడిన తరగతులపై దురాగతాల నివారణ చట్టానికి ఆమోదం.2. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో ఈబీసీలకు రిజర్వేషన్లను 20శాతం నుండి 30శాతానికి పెంచడం.3. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయడానికి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌ను సవరించడం.4. నియామకాలలో సముచితమైనది కాదు (ఎన్ఎఫ్ఎస్) నిబంధన చెల్లదని ప్రకటించడం.5. ఈబీసీ జాబితా రూపకల్పనలో సమతుల్యానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం.6. భూమిలేని కుటుంబాలకు భూమిని కేటాయించడం. 7. పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈబీసీల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు.8. విద్యా హక్కు చట్టం (2010) కింద ప్రైవేట్ పాఠశాలల్లో రిజర్వ్ చేసిన సీట్లలో సగం ఈబీసీ, ఓబీసీ, దళిత, గిరిజన వర్గాల పిల్లలకు కేటాయింపు.9 రూ.25 కోట్ల వరకు ప్రభుత్వ కాంట్రాక్టులలో ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించడం.10. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) కింద అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలలో రిజర్వేషన్లను వర్తింపజేయడం.బీహార్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ప్రముఖ పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలు కొనసాగుతున్నాయి. -
బీహార్‌లో మూడు దశల్లో ఎన్నికలు.. ఎప్పుడంటే?
సాక్షి, ఢిల్లీ: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, తాజాగా నవంబర్ 5-15 మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై ఎన్నికల సంఘం మాత్రం షెడ్యూల్‌ను ఇంకా విడుదల చేయలేదు.వివరాల ప్రకారం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను అక్టోబర్ మొదటి వారంలో ఈసీ ప్రకటించే అవకాశం ఉంది. ఛఠ్ పూజా సంబరాలు ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టాలన్న ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ప్రణాళిక వేసినట్లు భావిస్తున్నారు. నవంబర్ తొలి వారంలో తొలి దశ ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: క్రెడిట్ కొట్టేయాలని మోదీ ఆరాటంఅయితే, బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22వ తేదీన ముగుస్తుంది. దీంతో, ఎన్నికలను ఆ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. 2020లో కూడా బీహార్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7వ తేదీల్లో చేపట్టారు. ఫలితాలను నవంబర్ 10వ తేదీన వెల్లడించారు. దీంతో, ఈసారి కూడా ఇంచుమించుగా ఇలాగే మూడు దశల్లో ఎన్నికల జరిగే అవకాశం ఉంది. -
బీహార్‌లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్‌గా ఉండే బీహార్‌లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. 2025 అక్టోబర్/నవంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 41 నుండి 44 శాతం, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుండి 31 శాతం ఓట్లతో, బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్/మైనస్ ఉండే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్‌లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై స్వలంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడయ్యింది. ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు.బీహార్‌లో 2020 శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37 శాతం ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 11 వేలు మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ 74 స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది. సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్ లో గతంలో వలే మరోసారి ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీ (యూ), హెచ్ఏఎమ్, ఎల్జేపి (ఆర్వీ), ఆర్ఎల్ఎమ్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిగా చెలామణి అవుతూ బీహార్‌లో మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీలతో కూడిన ‘ఇండియా’ (మహాఘట్ బంధన్) కూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ‘మార్పు’ (2005), ‘సుశాసన్’ (2010),ఉద్యోగాలు (2020) నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా, ఈ సారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీయేకు కలిసివస్తోంది. ‘జీవికా’ పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యనిషేధం, విడో పింఛన్లు, సబ్సీడీలతో నితీశ్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత ‘జంగిల్ రాజ్’ కంటే నితీశ్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు. రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈ సారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు. ఎన్డీయేకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాఘట్ బంధన్ టికెట్లిస్తే వారికి ఓటు వేయడానికి వెనుకాడమని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ పీడీఏ (పిచ్చడ్, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం విజయవంతమైనా, బీహార్‌లో తేజస్వీ యాదవ్ ఎమ్-వై (ముస్లిం, యాదవ్) వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణలను విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రజాకర్షణగా నిలిచింది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు. సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న అగ్రవర్ణాల్లో 3 శాతం బ్రాహ్మణులు, 3.4 శాతం రాజ్‌పుత్‌లు, 2.8 శాతం భూమిహార్లు, 0.6 శాతం కాయస్తులు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్ లో 14.2 శాతం ఉన్న యాదవ్‌లు ఆర్జేడీ వెంట ఉన్నా మతం ఆధారంగా మిథిలా, సీమంచల్ లో బీజేపీకి కొంత యాదవ్‌ల మద్దతు లభిస్తోంది. 2.8 శాతం ఉన్న కుర్మీలు, 4.2 శాతం ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీశ్ వెంట ఉన్నా, ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36 శాతం ఉన్న ఈబీసీలు జేడీ(యూ), బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో నిశాద్ సామాజికవర్గం ఉప కులాలు ప్రాంతాలవారీగా ఎన్డీయే, వీఐపీ వైపు ఉన్నారు. 19.65 శాతం ఉన్న షెడ్యుల్ కులాలు, 5 శాతం ఉన్న చమార్లు ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల వైపు, 5 శాతమున్న పాశ్వాన్ లు ఎల్జీపీ (ఆర్వీ) వైపు ఉండగా 3 శాతం ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు. 1.68 శాతం ఉన్న షెడ్యూల్ తెగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి. బీహార్ లో 17.7 శాతం ఉన్న ముస్లింలు మహాఘట్ బంధన్ కు పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది. బీహార్‌లో ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచినా కిషన్‌గంజ్ లోక్ సభ నియోజవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది. గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు ఆర్జేడీలో చేరడంతో ఏఐఎంఐఎం బలహీనపడింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించింది. వక్ఫ్ చట్టంపై ఓవైసీ పోరాడుతున్నారనే అభిప్రాయం సీమంచల్ లో ముస్లిం యువత భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ యాత్రతో ఏఐఎంఐఎంకు ముస్లింలలో మద్దతు తగ్గుతోందని సర్వేలో తేలింది. ‘ఇండియా’ గ్రూపులో చేర్చుకోవాలని ఏఐఎంఐఎం కోరుతున్నా కాంగ్రెస్, ఆర్జేడీ నుండి ఆశించన స్పందన రాలేదు. కిషన్‌గంజ్‌తో పాటు పూర్ణియా, అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మద్దతు లభిస్తుండడంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా ఏఐఎంఐఎం 1 నుండి 3 స్థానాల్లో గెలవవచ్చని మూడ్ సర్వేలో తేలింది.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు బీహార్‌లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. నితీశ్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.200 నుండి 300 మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. మహిళల కోసం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద రూ.10 వేలు ఉపాధి ప్రోత్సాహకం, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ.2 లక్షల రుణాలిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీయే మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ట్రైబెల్స్ కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. ఎన్డీయే హామీలకు పోటీగా మహాఘట్ బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలిచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీలిచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి, వారికి భద్రత ఇస్తామని మహాఘట్ బంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ.2000 పింఛన్, మహిళలకు రుణాలు హామీలిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది. శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్ లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని ఎన్డీయే మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీశ్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాఘట్ బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. చిన్నపార్టీలైన హెచ్ ఏఎమ్, ఆర్ ఎల్ ఎమ్ ఎన్డీయే కూటమిలో, వీఐపీ, వామపక్షాలు మహాఘట్ బంధన్ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్, క్షేత్రస్థాయిలో సంస్థగతంగా బలంగా ఉండడం, డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిపేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది. 30 నుండి 31 శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా, ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీ (యు) ఈబీసీ సామాజికవర్గంలో బలంగా ఉండి, మహిళల మద్దతు పొందుతోంది. అయితే 74 ఏండ్ల వయస్సు గల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ(ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్నా, ఎన్డీయేలో చీలిక భయాలున్నాయి. జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవడం బలహీనత.బహుముఖ పోటీలో కూటముల మధ్య సీట్ల కేటాయింపులు, ఓటర్లను ఆకర్షించడం, చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈబీసీలకు సరైన ప్రాధాన్యతిస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయి. ఎన్డీయేలో బీజేపీ, నితీశ్, చిరాగ్ మధ్య విభేదాలొస్తే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. జేఎస్పీ ఎన్నికల్లో కింగ్‌మేకర్ పాత్ర పోషించనుంది. మొత్తం మీద బీహార్ ప్రజలు ఓటేస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసమే కాదు. పార్టీలు హామీలిస్తున్న సంక్షేమాలు కుల రాజకీయాలను దాటగలవా? యువత ఆశలు విధేయతలను అధిగమించగలదా? ప్రశ్నలకు సమాధానం పోటా పోటీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రశాంత కిశోర్ సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్ కు చెందిన జేడీ (యు), ఎల్జేపీ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. బీహార్ లో ఎన్డీయే మెజార్టీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకవపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజార్టీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి పడినా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. :::ఆర్.దిలీప్ రెడ్డి, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ -
మోదీ వీడియో.. కాంగ్రెస్‌కు ఝలక్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి పాట్నా హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియోపై పాట్నా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెంటనే ఏఐ వీడియోను తొలగించాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది.వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ, ఆయన తల్లి హీరాబెన్‌పై కాంగ్రెస్ రూపొందించిన ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బీహార్ యూనిట్ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీంతో, బీజేపీ నేతలు పలుచోట్ల కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే దీనిపై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు వాటిని వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ను ఆదేశించింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ పీబీ బజంత్రి.. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించాలని ఆదేశించారు.Bihar Congress posted this AI Generated Video about Narendra Modi and his mother.These people were screaming only a couple of weeks ago that they had nothing to do with abuse hurled at the Prime Minister's mother.Now they do this.Shocking behaviour. pic.twitter.com/rTsrZtpRFA— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 11, 2025బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలకు దిగడం తీవ్ర కలకలం సృష్టించింది. బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
బీహార్‌లో కూటమి పంచాయతీ.. సీట్ల పంపకాలపై కీలక భేటీ?
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్‌లోని ప్రతిపక్ష ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల పంచాయితీని ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీలో ఉంటామన్న ప్రకటన నేపథ్యంలో కూటమిలో గందరగోళం పెరిగిన నేపథ్యంలో ఈ భేటీని తలపెట్టినట్లు తెలుస్తోంది.ఆరోగ్య సమస్యల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్న ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ ఈ సీట్ల చర్చల బాధ్యతను చేపట్టేందుకు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను సమర్పించాలని ఆయన కోరారని, ఆ పార్టీకి 50–52 సీట్లు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో పాటు, పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలపై ఈ భేటీలో ఓ స్పష్టత తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది.ఆర్జేడీ కోరుకుంటున్న ఓ 25 స్థానాలపై కాంగ్రెస్ సైతం పట్టుబడుతుండటంతోనే సమస్య ఉత్పన్నమవుతోందని, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఏఐసీసీ నేత ఒకరు తెలిపారు. ఇక ప్రస్తుత కూటమిలో వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)తో పాటు, 2020లో 19 సీట్లలో పోటీ చేసి 12 గెలుచుకున్న సీపీఐ(ఎంఎల్)లు ఇప్పుడు 40–45 సీట్లను అడుగుతున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ సైతం ఆర్జేడీతో చర్చలు జరుపుతుండగా, ఎంఐఎం సైతం కూటమిలో చేర్చుకోవాలని ఆర్జేడీని సంప్రదించినట్లు తెలుస్తోంది. వీటన్నింటి దృష్ట్యా సీట్ల పంపకాలపై ఓ స్పష్టతకు రావాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మహాఘఠ్‌బంధన్‌లో లుకలుకలు..!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్‌బంధన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే మహాఘఠ్బంధన్ను వేరుపడి ఒంటరి పోరు చేసేందుకు ఆమ్ఆద్మీ పార్టీ నిర్ణయించగా, అదే దారిలో ఆర్జేడీ సైతం పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్ది వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నా..ఇప్పటివరకు సీట్ల పంపకాలు ఖరారు కాకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ముఖం చాటేస్తుండటంతో కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చేసిన ప్రకటన ఘట్బంధన్ మైత్రిని ప్రశ్నార్థకం చేస్తోంది. అవినీతి.. కులాల లెక్కలు బిహార్‌లో 1980 వరకు కాంగ్రెస్ ప్రధాన రాజకీయ శక్తిగా ఉండేది. 1990లో లాలూప్రసాద్ యాదవ్, నితీశ్‌కుమార్ వంటి ప్రాంతీయ నేతల ఆవిర్భావంతో కాంగ్రెస్ బలం తగ్గిపోయింది. చేసేది లేక వారి దయాదాక్షిణ్యాలపై కాంగ్రెస్ పార్టీ ఆధారపడుతూ వస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. మిత్రపక్షమైన ఆర్జేడీతో కలిసి ఈ ఎన్నికల్లో బిహార్‌లో తిరిగి అధికారంలోకి రావాలని లక్ష్యంతో మొన్నటివరకు ముందుకెళ్లింది. గత ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాలకు గాను 75 స్థానాల్లో గెలిచింది. వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీకి గరిష్ట స్థానాలు దక్కుతాయని, తానే సీఎం అభ్యర్థిని అవుతాననే ఉత్సాహంతో తేజస్వీ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఇటీవలే ఓట్ చోరీపై రెండు వారాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహాఘఠ్బంధన్ తరఫున తేజస్విని సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా తప్పించుకున్నారు. తేజస్వి స్వయంగా తనను తాను బిహార్ సీఎంఅభ్యర్థిగా ప్రకటించుకుంటున్నా, కాంగ్రెస్ మాత్రం మిన్నకుండిపోయింది. ఇటీవలే కాంగ్రెస్ బిహార్ ఇన్చార్జి కృష్ణ అల్లవేరు మాట్లాడుతూ ప్రజలే సీఎంను నిర్ణయిస్తారని ప్రకటించడంతో గందరగోళం ఇంకాస్త పెరిగింది. కాంగ్రెస్ అంచనా వేరే.. తేజస్విని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇందులో కాంగ్రెస్‌కు బిహార్‌లో తమ పార్టీ అభ్యర్థే ముఖ్యమంత్రిగా ఉండాలన్నది పార్టీ దీర్ఘకాలిక వ్యూహంలా ఉంది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ 9 స్థానాలకు గానూ 3 స్థానాలను గెలుచుకోవడం, ఇటీవలి ఓటర్ అధికార్ యాత్రతో కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆదరణ పెరగడంతో కాంగ్రెస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే అదనుగా పార్టీని బలోపేతం చేసుకోవడం సులువని పార్టీ విశ్వసిస్తోంది. ఈ సమయంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఆర్జేడీ బలపడి, కాంగ్రెస్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుందనే భావన ఉంది. గత ఎన్నికల్లో కేవలం 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ ఈసారి 100కు పైగా స్థానాల్లో పోటీ చేయాలని ప్రణాళికలు వేస్తోంది. తేజస్విని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తే సీట్ల బేరసారాల్లో కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుంది. అదీగాక లాలూప్రసాద్ యాదవ్‌తో పాటు తేజస్వియాదవ్ అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వయంగా తేజస్విపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పద నేత నుంచి దూరంగా ఉండటం ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి తోడు ఆర్జేడీకి యాదవ్, ముస్లిం సామాజిక వర్గాల్లో గట్టి పట్టుంటే, కాంగ్రెస్‌కు అగ్రవర్ణాలతో పాటు ముస్లిం, దళిత ఓట్లు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తేజస్విని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు అంతా ఎన్డీఏ పక్షాల వైపు మొగ్గు చూపుతుంది. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తేజస్విని పక్కనపెడుతుండటంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండ్రోజుల కిందట 243 స్థానాల్లో తాము పోటీలో ఉంటామనే ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించలేదు. ప్రస్తుత ఈ పరిణామాలు ఎటువైపు మళ్లుతాయన్నది ఆసక్తికరంగా మారింది. -
బిహార్‌ను బీడీతో పోలుస్తారా!
పుర్నియా: బిహార్ అభివృద్ధిబాటన సాగుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు ఓర్వలేని తనంతో చులకనగా మాట్లాడుతున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. అవమానించడమే ప్రతిపక్ష నాయకులు పనిగా పెట్టుకున్నారని ధ్వజమె త్తారు. మోదీ సోమవారం బిహార్‌లోని పుర్నియా లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిహార్ అంటే బీడీ అంటూ ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిహార్‌లో తయారైన రైలింజిన్లు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్, ఆర్జేడీ నేతలకు నచ్చడం లేదు. బిహార్‌లో అభివృద్ధి ఛాయలు కనిపించినప్పుడల్లా ఈ నేతలు చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఏకమై బిహార్‌ను బీడీతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికలపై చెలరేగిపోతున్నారు’అని ఆయన అన్నారు. ‘ఈ రెండు పార్టీల నేతలు సొంత కుటుంబసభ్యుల గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. మీ కుటుంబం సంక్షేమం వారికి పట్టదు. కానీ, మోదీకి మీరందరూ కుటుంబ సభ్యులే. అందుకే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని మోదీ అంటున్నారు. మీ కుటుంబం, సంక్షేమం, మీ బాగోగుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు’అని తెలిపారు. బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నా యని, వీటి తీరుతో ఆయా రా ష్ట్రాల జనాభాలో తీరుతెన్నుల్లో తీ వ్రమైన మార్పులు సంభవిస్తున్నా యని ఆయన హెచ్చరించారు. ఆయా రాష్ట్రాల్లోని వారు తమ తోబుట్టువులు, కుమార్తెల ఆత్మ గౌరవం గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపారు.దేశ భద్రత, వనరులను ప్రతిపక్షాలు ఫణంగా పెడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. విదేశాల నుంచి అందుతున్న మద్దతుతో వలసదారులకు మద్దతుగా యాత్రలు నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహ రిస్తున్నారంటూ కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార యాత్రనుద్దేశిస్తూ నిప్పులు చెరిగారు. ప్రతి చొరబాటుదారునూ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.40 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. పుర్నియా ఎయిర్‌పోర్టులో కొత్తగా అభివృద్ధి పర్చిన టెర్మినల్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. పుర్నియా–కోల్‌కతా మార్గంలో మొదటి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మఖానా రంగం అభివృద్ధికి నేషనల్ మఖానా బోర్డు ద్వారా రూ.475 కోట్లు వెచ్చిస్తా మని ప్రకటించారు. భాగల్పూర్లో రూ.25 వేల కోట్లతో నిర్మించే ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, రూ.2,680 కోట్ల కోసి–మెచి ఇంట్రా స్టేట్ రివర్ లింకు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు. -
బీహార్‌లో ‘సీట్ల’ లొల్లి.. ‘ఆల్-243’పై తేజస్వి దృష్టి
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి కొనసాగుతోంది. ఇదే సమయంలో మిత్రపక్షాల కూటమి ‘మహాఘట్ బంధన్’లో సీట్ల లొల్లి మొదలయ్యింది. కూటమిలోని అన్ని పార్టీలు అధిక సీట్లు కోరుతున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తాము రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల్లోనూ పోటీచేయనున్నట్లు ప్రకటించారు. శనివారం ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో తేజస్వి ప్రసంగిస్తూ ‘ఈసారి తేజస్వి 243 స్థానాల్లోనూ పోటీ చేస్తారు. అది ముజఫర్‌పూర్ అయినా మరొకటైనా.. తేజస్వి పోరాడుతారు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే నా పేరు మీద ఓటు వేయండి. బీహార్‌ను ముందుకు తీసుకెళ్లడానికి తేజస్వి కృషి చేస్తారు... మనమందరం కలిసి పనిచేసి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి’ అని అన్నారు.ఇటీవల రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన ఓటరు అధికార్ యాత్రలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్.. ప్రజల ఓటు హక్కును లాక్కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరాస్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీలను చేర్చుకోవడం ద్వారా మహాఘట్ బంధన్‌లో ఇప్పటికే సీట్ల కేటాయింపు సమస్యగా మారింది. ఇటువంటి తరుణంలో తేజస్వి యాదవ్ తాజా ప్రకటన సంచలనంగా పరిణమించింది.2020 బీహార్ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కూటమిలో భాగంగా 144 నియోజకవర్గాల్లో పోటీ చేసి, 75 స్థానాలు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 19 స్థానాలు గెలుచుకుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ తాను బలపడినట్లు భావిస్తోంది. ఓటరు అధికార్ యాత్ర, ఓటు 'చోరీ'సందేశం బీహార్ ప్రజలతో ప్రతిధ్వనించిందని, రాహుల్‌కు, పార్టీకి మరింతగా ప్రజాదరణ పెరిగిదని అనుకుంటోంది.ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ కృష్ణ అల్లవారు మాట్లాడుతూ కొత్త పార్టీలు కూటమిలోకి వస్తే, ప్రతి పార్టీ తమ వాటాను అందించాల్సి ఉంటుందనుకుంటున్నామని, అయితే సీట్ల కేటాయింపులో సమతుల్యత ఉండాలన్నారు. కాంగ్రెస్ కనీసం 70 నియోజకవర్గాలను కోరుకుంటున్నదని, ఆ సంఖ్య ఇంకా తక్కువ కూడా కావచ్చన్నారు. అయితే 15 మంది ఎమ్మెల్యేలను కలిగిన వామపక్ష పార్టీలు (సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) కూడా మరిన్ని సీట్ల కోసం అభ్యర్థిస్తున్నాయని సమాచారం.గతంలో రాహుల్ గాంధీ సమక్షంలో తాను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించుకున్న తేజస్వి యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు మహాఘట్ భంధన్లో సీట్ల కేటాయింపును మరిత జఠిలం చేశాయి. ఇదిలా ఉండగా తేజస్వి యాదవ్ మాటలకు స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ ‘తేజస్వి యాదవ్.. మీరు కలలు కనడం ఆపండి. మీకు 243 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే శక్తి లేదు. మీరు ఇలాంటి ప్రకటనలతో కాంగ్రెస్, మీ మిత్రదేశాలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తుండవచ్చు. కానీ బీహార్ ప్రజలకు మీపై నమ్మకం లేదు. మిమ్మల్ని చూస్తే వారికి పశుగ్రాసం కుంభకోణం, ఉద్యోగాల భూకుంభకోణం గుర్తొస్తాయి. ప్రజలు ఎన్డీఏకు, నితీష్ కుమార్, ప్రధాని మోదీ పేరు మీద ఓటు వేస్తారు’ అని అన్నారు. -
హీరాబెన్-మోదీపై ఏఐ వీడియో.. బీజేపీ గుర్రు
బీహార్ ఎన్నికల ప్రచారం పోనుపోను వ్యక్తిగత విమర్శలకు కేరాఫ్‌గా మారేలా కనిపిస్తోంది. మొన్నీమధ్యే రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను బీజేపీ వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సైతం తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.साहब के सपनों में आईं "माँ" देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m— Bihar Congress (@INCBihar) September 10, 2025అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
243 సీట్లు.. 2,300 దరఖాస్తులు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పథక రచన చేస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 243 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది. సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమి ఆమోద ముద్ర వేసేవరకూ ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొనసాగనున్నది. ఆశావహుల నుంచి ఇప్పటికే 2,300పైగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల ఆధారంగా పార్టీ బలం, బలహీనతలపై ఒక అవగాహనతోపాటు.. కొత్తగా ఎదుగుతున్న నేతలపై ప్రధానంగా దృష్టి సారించడమే రాష్ట్ర కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానున్నది. 14వ తేదీలోగా అభ్యర్థుల జాబితాను పంపాలని రాష్ట్ర పార్టీ కోరింది. 16న జరిగే సమావేశంలో ఈ పేర్లపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఒక్కో సీటుకు ముగ్గురు పోటీ: రాష్ట్ర పార్టీ ఎన్నికల కమిటీ మొత్తం 243అసెంబ్లీ స్థానా ల్లో ఒక్కో సీటు నుంచి ముగ్గురి పేర్లను సిద్ధం చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నది. ఈ నెల 19న జరగనున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దరఖాస్తులను పరిశీ లించనున్నారు. అంతిమంగా ఒకరి పేరును ఎంపిక చేసి ఆమోదం కోసం ఢిల్లీలోని అధిష్టానానికి పంపించనున్నారు. ఇదే జాబి తాను యథాతథంగా లేదా కొద్ది మార్పులతో అధిష్టానం ప్రటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బీహార్‌పై వరాల జల్లు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్‌లో ముకామ- ముంగర్ మధ్య 82 కిలోమీటర్ల హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.బక్సర్ బగ్లాపూర్ కారిడార్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న 84 కిలోమీటర్ల జాతీయ రహదారికి రూ.4447 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. దీంతో పాటు బీహార్‌లోని భాగల్పూర్ డంకా రాంపూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 177 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ పనులకు రూ.3,169 కోట్ల రూపాయల్ని కేంద్రం ఖర్చు చేయనుంది. -
Bihar Polls:‘మహాఘట్ బంధన్’లో లొల్లి.. జేఎంఎం, ఆర్‌ఎల్‌జేపీలతో సీట్ల చిచ్చు
పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. తాజాగా వివిధ పార్టీల ‘మహాఘట్ బంధన్’కు కొత్తచిక్కులు వచ్చిపడ్డాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) ప్రతిపక్ష కూటమిలో చేరే అవకాశం ఉంది. దీంతో సీట్ల షేరింగ్ ‘మహాఘట్ బంధన్’కు పెద్ద సవాల్‌గా నిలవనుంది.బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో మరో రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగం కానున్నాయన్నారు. వీరి కోసం తమ సీట్ల వాటాను త్యాగం చేయాల్సి వస్తుందన్నారు. కూటమిలో ఆధిపత్య పార్టీ అయిన ఆర్జేడీ కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. అప్పుడు భాగస్వాములకు కేవలం 93 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కనీసం 40 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్న వామపక్షాల పార్టీలకు కొత్తగా చేరే పార్టీలతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.2020 బీహార్ ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) పోటీ చేసిన 19 సీట్లలో 12 గెలుచుకుంది. సీపీఎం పోటీ చేసిన 4 సీట్లలో 2 గెలుచుకుంది. సీపీఐ పోటీ చేసిన 6 సీట్లలో 2 గెలుచుకుంది. సీట్ల పంపకంపై భిన్నాభిప్రాయాలతో ‘మహాఘట్ బంధన్’ ను వీడి ఎన్డీఏలో చేరిన వీఐపీ ఈసారి 60 సీట్లను అభ్యర్థించినట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ 2020 ఎన్నికల కన్నా తక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020లో కాంగ్రెస్ 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది. -
మాకు 40 సీట్లివ్వాల్సిందే..!
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో జరుగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పక్షం, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్ పాశ్వాన్)తో సీట్ల పంపకాలు కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది. బిహార్ భవిష్యత్ ముఖచిత్రంలో తన మార్కును చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న చిరాగ్ తన పారీ్టకి ఎక్కువ సీట్లు సాధించుకునేందుకు బీజేపీ, ఆర్జేడీలతో బేరసారాలు సాగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ఆధారంగా 40 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో సీట్ల పంపిణీ పెండింగ్‌లో పడిందని సమాచారం. పాశ్వాన్ అడుగులు పెద్ద పదవి వైపే... 2020 బిహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ 134 స్థానాల్లో పోటీ చేసినా ఒకే ఒక్క సీటును గెలుచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఎల్జేపీ ఎన్డీయే కూటమి పొత్తుతో 6 శాతం ఓట్లతో 5 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. హాజీపూర్ స్థానం నుంచి చిరాగ్ ఆర్జేడీ అభ్యరి్థపై ఏకంగా 1.70 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు. బిహార్ ఎన్నికల్లో సైతం బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. బీజేపీ, జేడీయూలకు చెరో 100 సీట్ల చొప్పున 200 సీట్లు పోగా మిగిలిన 20–25 స్థానాలను ఎల్జేపీకి ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన కనీసంగా 40 సీట్లు అడుగుతున్నారనే వాదనలు వినిపించాయి. ఇదే సమయంలో చిరాగ్ పాశ్వాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, ఆయనకు డిప్యూటీ సీఎం పదవి లభించవచ్చనే వార్తలూ వస్తు న్నాయి. ఈ సమయంలోనే ఆయన ‘బిహార్ ఫస్ట్..బిహారీ ఫస్ట్’నినాదాన్ని ఎత్తుకొని తనకు బిహార్ రాష్ట్రంలోనే రాజకీయాలు ఎక్కువ మక్కువని చెప్పకనే చెబుతున్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పేరును చెప్పకుండానే, తనను రాష్ట్రానికి రాకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని గతంలో ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎవ్వరికీ భయపడబోనని పేర్కొన్నారు. పటా్నలో ఇటీవల జరిగిన వ్యాపారవేత్త గోపాల ఖేమ్కా హత్యను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, సుపరిపాలను పేరుగాంచిన రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏంటని నితీశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాశ్వాన్ ప్రకటనల వెనక ప్రధానంగా రాష్ట్రంలో బలహీన వర్గాల్లో తమ పార్టీకి ఉన్న పట్టు కోల్పోరాదని, ఢిల్లీ పేరు చెప్పి..క్షేత్రస్థాయిలో తమ ఉనికినే ప్రశ్నార్థకం చేసుకోరాదనే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పట్టున్న తమ వర్గాలను జేడీయూ పూర్తిగా తనవైపు తిప్పుకుంటుండటం, మరికొందరు కీలక నేతలు ఎన్డీయే కూటమిలో ఇమడలేక ఆర్జేడీ వైపు మొగ్గు చూపుతుండటాన్ని ఇష్టపడని పాశ్వాన్ రాష్ట్రంలో పట్టును నిలుపుకునేందుకే 40 సీట్లపై పట్టు వదలడం లేదని అంటున్నారు. అయితే, సీట్ల పంపకాలపై మరో వారం పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
Bihar: నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. అక్టోబర్‌లో తేదీల వెల్లడి?
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది చూచాయిగా వెల్లడయ్యింది. అక్టోబర్ ప్రారంభంలో ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉండగా, నవంబర్‌లో రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ జరగవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కింద నవీకరించిన ఓటరు జాబితాను ప్రచురించిన తర్వాత, అక్టోబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.దసరా తర్వాత అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన రావచ్చని తెలుస్తోంది. నవంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా రెండు లేదా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. నవంబర్ 15- 20 మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. నవంబర్ 22 గడువుకు ముందే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ బీహార్‌లో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉండగా, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కూడిన ఇండియా బ్లాక్.. సీఎం నితీష్ కుమార్‌ను గద్దె దించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. 243 మంది సభ్యులున్న ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో, ఎన్డీఏలో 131 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీలో 80 మంది ఎమ్మెల్యేలు, జేడీ(యూ)-45, హెచ్ఏఎం(ఎస్)-4, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ప్రతిపక్షాల ఇండియా కూటమికి 111 మంది సభ్యుల బలం ఉంది. ఆర్జేడీ 77లో మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్-19, సీపీఐ(ఎంఎల్)-11, సీపీఐ(ఎం)-ఇద్దరు, సీపీఐ-ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. -
నేను క్షమించినా ప్రజలు క్షమించరు: మోదీ
పట్నా: బిహార్‌లో రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మోదీ తల్లి దివంగత హీరాబెన్నుద్దేశిస్తూ కొందరు విపక్షనేతలు అవమానకరంగా మాట్లాడిన ఉదంతంపై ప్రధాని మోదీ తొలిసారిగా ఆవేదనాభరితంగా స్పందించారు. బిహార్‌లో మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషిచేసే కొత్త ‘బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్’ను మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి లక్షలాది మంది మహిళలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ దివంగత నా మాతృమూర్తికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పా? ఆమెను మాత్రమే దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అంటూ గద్గద స్వరంలో మోదీ తన ప్రసంగాన్ని మొదలెట్టారు.‘‘ నా తల్లిని అవమానించిన బిహార్ ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలను నేను క్షమిస్తానేమోగానీ దేశంలోని ప్రజలెవ్వరూ వారిని క్షమించబోరు. ఒకరి తల్లిని దూషించిన వారిని ఇంకొకరు పొరపాటున కూడా క్షమించబోరు. తల్లిపై దారుణదూషణోదంతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ పార్టీలను బాధ్యులను చేయాల్సిన కనీస బాధ్యత బిహార్‌లోని ప్రతి ఒక్క కుమారుడిపై ఉంది. ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలు ఏ వీధిలోకి వెళ్లినా, ఏ పట్టణంలో ప్రచారంచేసినా అక్కడ మాతృమూర్తులు, సోదరీమణులను అవమానిస్తే అస్స లు ఊరుకోబోమని, సహించబోమని గట్టిగా, స్పష్టంగా తెలిసేలా చేయండి’’ అని బిహార్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.‘‘ తల్లిపై దుర్భాషలాడిన ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలను బిహార్‌లోని తల్లులు, సోదరసోదరీమణులు వీధుల్లోకి వచ్చిమరీ నిలదీయాలి. ఇలాంటివి అస్సలు సహించబోమని స్పష్టంచేయాలి. నన్ను విమర్శించే క్రమంలో తల్లిని, మహిళను తిడితే ఎవ్వరూ ఊరుకోబోరని, తిట్లదండకానికి తెరదించుతామని మీరంతా నిరూపించాలి’’ అని మహిళలకు మోదీ పిలుపునిచ్చారు. బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్ అనేది మహిళా స్వయంసహాయక బృందాలకు తక్కువ వడ్డీలకు రుణాలను అందిస్తూ వారి నైపుణ్యాభివృద్ధికి కృషిచేస్తుంది.జానకీమాతకు జన్మస్థలి‘‘బిహార్ అనేది జానకీమాతకు జన్మస్థలి. బిహార్ రాష్ట్రం ఎల్లవేళలా మహిళలను గౌరవిస్తుంది. ఆర్జేడీ–కాంగ్రెస్ సంయుక్త రాజకీయ కార్యక్రమం నా తల్లిని అవమానించేందుకు వేదికగా మారడం, అందునా బిహార్‌లో ఈ కార్యక్రమం జరగడాన్ని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా బిహార్ తల్లులు, సోదరీమణులను అవమానించడమే. ఇలాంటి నేతలను బిహార్ ప్రజలు అస్సలు క్షమించరు’’ అని మోదీ అన్నారు. ‘‘ ఆర్జేడీ పాలనా కాలంలో తల్లులు, మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారు. నేరçస్తులు, రేపిస్టులు, హంతకులను ఆర్జేడీ ప్రభుత్వం కంటికిరెప్పలా కాపాడుకుంది. తమ కుటుంబసభ్యులు క్షేమంగా రోజూ ఇంటికి తిరిగొస్తారో లేదోనని బిహార్ మహిళలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.అందుకే తర్వాత మహిళా ఓటర్లు ఆర్జేడీ సర్కార్‌ను ఇంటికి సాగనంపారు. నాడు ఆర్జేడీ కూటమిని ఇంటికి సాగనంపిన అదే మహిళాలు ఇప్పుడు నా తల్లికి జరిగిన అవమానాకి ప్రతీకారం తీర్చుకుంటారు. దర్భంగాలో జరిగిన దుర్ఘటన విపక్షాల కూటమి దారుణాలకు దర్పణం పడుతోంది. రాష్ట్రంలో మహిళలు దోపిడీ, అణచివేతకు గురవుతున్నారు’’ అని మోదీ అన్నారు. ‘‘ కొడుక్కి తన తల్లి అంటే దేవత, దైవంతో సమానం’’ అని భోజ్‌పురీ సామెతను రాబోయే నవరాత్రి, ఛాత్ పండుగలను పురస్కరించుకుని మోదీ గుర్తుచేశారు. ‘‘సూర్యభగవానుని మహిళారూపంలో ఏడుగురు దుర్గామాత అక్కచెల్లెళ్ల రూపంలో బిహార్ ప్రజలు పూజిస్తారు. అలాంటి ప్రజలకు కాంగ్రెస్–ఆర్జేడీ క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని మోదీ అన్నారు.‘‘ దేశసేవకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె అందుకు అడ్డుచెప్పలేదు. పైగా దేశసేవ చేస్తానన్నందుకు అభినందించి ప్రోత్సహించారు. కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెబితే వారించలేదు. పేద తల్లి కుమారుడు అధికారాన్ని(ప్రధాని పదవిని) స్వీకరించడం పేరుగొప్ప నేతలకు అస్సలు నచ్చట్లేదు. మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతినీ వాళ్లు ఓర్వలేకపోతున్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ఆసీనులైన ద్రౌపదీముర్మును సైతం అవమానించడానికి వాళ్లు దుస్సాహసం చేశారు. నాకంటే 20 ఏళ్లు జూనియర్ అయిన(రాహుల్‌గాంధీ) ఓ వ్యక్తి ఓ పదిహేను రోజులు ఎస్ఐఆర్పై పోరు పేరు చెప్పి యాత్రచేశారు’’ అని రాహుల్‌గాంధీని పరోక్షంగా విమర్శించారు. -
‘మోదీ క్షమించినా.. బీహార్ వాళ్లను క్షమించదు’
తన మాతృమూర్తి హీరాబెన్‌పై అనుచిత వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తన తల్లికే కాదని.. దేశంలోని తల్లులందరికీ ఇది అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. బీహార్‌లో మహిళల కోసం బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన.. ఆ కార్యక్రమానికి హాజరైన 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.చనిపోయిన నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా అందులోకి లాగారు. కేవలం నా తల్లినే కాదు.. దేశంలోని ప్రతీ తల్లినీ, సోదరినీ కాంగ్రెస్, ఆర్జేడీలు అవమానించాయి అని అన్నారాయన. ఈ మాటలు నా తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించాయి. మీరు కూడా ఈ మాటలు విన్న తర్వాత నాతోపాటు మీరూ ఎంతగా బాధపడి ఉంటారో నాకు తెలుసు అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా నా తల్లి కష్టపడడం ఆపలేదు. మా కోసం దుస్తులు తయారు చేయించేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. దేశంలో కోట్లాది తల్లులు ఇలాగే త్యాగం చేస్తూ జీవిస్తున్నారు. తల్లి స్థానం దేవతలకంటే గొప్పది అని ప్రధాని అన్నారు. బీహార్‌లో కాంగ్రెస్–RJD వేదికపై వాడిన అసభ్య పదజాలం తన తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ కుటుంబాల్లో పుట్టినవారు పేద తల్లుల బాధను, వారి కుమారుల పోరాటాన్ని అర్థం చేసుకోలేరు. వీరంతా బంగారు, వెండి చెంచాలతో పుట్టినవారు. బీహార్‌లో అధికారాన్ని తమ కుటుంబాల స్వంతంగా భావిస్తున్నారు. కానీ మీరు ఒక పేద తల్లి కుమారుడిని ప్రధాన సేవకుడిగా ఆశీర్వదించారు. ఇది ‘నామ్‌దార్’లకు జీర్ణించుకోవడం కష్టమైంది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, RJD నేత తేజస్వీ యాదవ్‌లపై విమర్శలు చేశారు.నాపై అసభ్య పదజాలం వాడిన జాబితా చాలా పొడవుగా ఉంది. నన్ను నీచ్, గంది నాళీ కీ కీడా, పాము అని అంటున్నారు. ఇప్పుడు ‘తూ’ అని కూడా సంబోధిస్తున్నారు.. అంటూ రాహుల్ గాంధీ ర్యాలీలో తనను ‘తూ’ అని పిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలకు మోదీ క్షమించినా.. బీహార్ ప్రజలు క్షమించబోరని అన్నారాయన.ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సందర్బంగా.. దర్భంగలో మోదీ, ఆయన తల్లి హీరాబన్ను దూషించినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై కేసు నమోదుకాగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా. -
హైడ్రోజన్ బాంబు త్వరలో పేలుస్తా!: రాహుల్ గాంధీ
పాట్నా: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో జరుగుతున్న ఓట్ల చోరీపై ఇప్పటికే అణుబాంబు పేల్చానని, త్వరలో హైడ్రోజన్ బాంబు పేలుస్తానని పేర్కొన్నారు. ఓట్ల దొంగతనంపై మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని, ఆయన తలెత్తుకోలేరని చెప్పారు. సోమవారం బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఓట్ల చోరీని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని విప్లవాత్మక రాష్ట్రమైన బిహార్ యావత్ దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చిందని వెల్లడించారు. మహాత్మాగాం«దీని హత్య చేసిన దుష్ట శక్తులే నేడు రాజ్యాంగాన్ని హత్య చేయడానికి కుట్రలు సాగిస్తున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం జోలికి వస్తే సహించబోమని బీజేపీని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును రక్షించడానికే యాత్ర చేపట్టానని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఓటు చోర్, గద్దీ ఛోడ్ అంటూ వారు ముక్తకంఠంతో నినదించారని అన్నారు. రాహుల్ గాంధీ ఇంకా ఏం మాట్లాడారంటే... రేషన్ కార్డును, భూమిని లాక్కుంటారు ‘‘బీజేపీ నాయకులు మాకు నల్లజెండాలు చూపించారు. వారు ఒక విషయం తెలుసుకోవాలి. ఓట్లచోరీపై మహాదేవపురలో అణుబాంబు ప్రయోగించా. త్వరలో హైడ్రోజన్ బాంబు రాబోతోంది. అందుకోసం బీజేపీ నేతలు సిద్ధంగా ఉండాలి. ఓట్ల దొంగతనంపై బీజేపీ అసలు రంగు ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి దక్కాల్సిన విజయాన్ని బీజేపీ కూటమి దొంగిలించింది. ఇది వంద శాతం నిజం. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయి. బిహార్ యువతకు చెప్పదల్చుకున్నది ఏమిటంటే.. ఓటు చోరీ అంటే హక్కుల చోరీ, రిజర్వేషన్ల చోరీ, ప్రజాస్వామ్యం చోరీ, ఉద్యోగాలు–ఉపాధి అవకాశాల చోరీ, విద్య చోరీ, భవిష్యత్తు చోరీ. కేవలం ఓటునే కాకుండా మీ రేషన్ కార్డును, భూమిని సైతం లాక్కొని అదానీకి, అంబానీకి కట్టబెట్టాలని చూస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ బీజేపీపై నిప్పులు చెరిగారు. తప్పుడు విధానాలు నమ్ముకుంటున్న మోదీ: ఖర్గే బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో సోషలిజం గురించి మాట్లాడిన నితీశ్ ఇప్పుడు బీజేపీ–ఆర్ఎస్ఎస్ల ఒడిలో సేదతీరుతున్నారని ధ్వజమెత్తారు. పనికిరాని చెత్తను ఎక్కడ పారేస్తారో నితీశ్‌ను బీజేపీ–ఆర్ఎస్ఎస్లు అక్కడే పారేయడం తథ్యమని స్పష్టంచేశారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సభలో ఖర్గే మాట్లాడారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ నెగ్గడానికి ప్రధాని మోదీ ఓట్ల చోరీకి ఆలోచనతోనే ఉంటారని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం కోసం బోగస్ ఓట్లను, తప్పుడు ప్రచారాన్ని, తప్పు డు హామీలు, తప్పుడు పథకాలను నమ్ముకుంటారని ఆయన తీవ్రంగా విమర్శించారు. -
89 లక్షల ఫిర్యాదులు ఇచ్చినా ‘సర్’ పట్టించుకోలేదు!
బీహార్‌లో ‘సర్’ వేడి ఇంకా తగ్గలేదు. దొంగ ఓట్ల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్సిటివ్ రివిజన్(సర్)పై కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. బీహిర్లో మళ్లీ సర్‌ను నిర్వహించాలని పట్టుబబుతోంది. ఈసీ ఏర్పాటు చేసిన సర్‌కు కాంగ్రెస్ 89 లక్షల ఫిర్యాదులు ఇచ్చినా వాటిని పట్టించుకోలేదని బీహార్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఆరోపించారు. బూత్ లెవెల్ స్థాయిలో లక్షల్లో ఫిర్యాదులు ఇస్తే దానిని సర్ మాత్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు కాబట్టే వాటిని వారు తీసుకోలేదన్నారాయన. దాంతో సర్‌ను కచ్చితంగా బీహార్‌లో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో ఇప్పటికే 60లక్షలకు పైగా ఓట్లను తొలగించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిపై ఈసీపై సైతం రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. కేంద్రంతో కలిసి ఈసీ చేస్తున్న ఓట్ చోరీ అంటూ ధ్వజమెత్తారు. దీనిలో భాగంగా ఆగస్టు 17వ తేదీన బీహార్‌లోని రోహ్తాస్ జిల్లా ససారామ్ నుంచి ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. ఈ రాహుల్ గాంధీ యాత్రకు ఇండియా కూటమి పూర్తి మద్దతు ఇచ్చింది. ఈ యాత్ర తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ(సోమవారం) నుంచి పాట్నాలో ప్రారంభం కానుంది.


