Bike ralley
-
ఎల్డర్స్.. రైడర్స్
-
ఘనంగా హనుమాన్ జయంతి
కొల్చారం(నర్సాపూర్): హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కొల్చారం మండలంలోని ఆయా గ్రామాల్లో యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రంగంపేటకు చెందిన ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్ ఆధర్వంలో స్థానిక హనుమాన్ మందిర్ నుంచి చేపట్టిన బైక్ ర్యాలీ తుక్కాపూర్ , పైతర, కోనాపూర్, వై, మందాపూర్, ఎనగండ్ల, సంగాయిపేట గ్రామాల వరకు కొనసాగింది. పోతంశెట్టిపల్లి, రాంపూర్ గ్రామాలలో బైక్ ర్యాలీలను నిర్వహించారు. అంతకు ముందు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో రంగంపేట గ్రామానికి చెందిన ఆరెస్సెస్ కార్యకర్తలు మహేందర్, మచ్చరాజు, వెంకటేశం, శేఖర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారంతో సంబరాలు
తాండూరు రూరల్, న్యూస్‌లైన్: దేశ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడంతో బీజేపీ, టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. సోమవారం సాయంత్రం ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీచౌక్, వినాయక్‌చౌక్, భద్రప్పచౌక్ మీదుగా ర్యాలీ కొనసాగింది. అనంతరం బస్టాండ్‌లో ప్రయాణికులకు మిఠాయిలు పంచి పెట్టారు. బాణసంచా పేల్చి ఒకరికొకరు శుభాకాంక్ష లు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు మోడీ అని కొనియాడారు. ఆయన పాలనలో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమం లో బీజేపీ, టీడీపీ నాయకులు ప్యాట బాల్‌రెడ్డి, నాగారం నర్సిములు, బాలేశ్వర్ గుప్తా, రాజుగౌడ్, కృష్ణ ముదిరాజ్, బాల శివకుమార్, బొప్పి సురేష్, బాల శివకుమార్, బంట్వారం భధ్రేశ్వర్, పూజారి పాండు, అశోక్, రాకేష్, కిరణ్ పాల్గొన్నారు. -
సమైక్య హోరు
ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రను కాంక్షిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లాలో పార్టీ శ్రేణులు పలుచోట్ల మోటారుబైక్ ర్యాలీలు నిర్వహించాయి. దర్శి నియోజకవర్గ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్‌ర్యాలీ నిర్వహించారు. 3 వేలకుపైగా మోటారు బైకులతో పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం తాళ్లూరు మండలంలోని గుంటిగంగ భవాని ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ నిర్వాహకులు వేదమంత్రోచ్ఛరణలతో ఆహ్వానించగా.. శివప్రసాదరెడ్డి తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకొని సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేలా చేయాలని వేడుకున్నారు. అనంతరం బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా శివప్రసాదరెడ్డి మోటారుబైకు నడుపుతూ ర్యాలీకి ముందుభాగంలో నిలిచారు. ఆయన తండ్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కుమారునితో పాటు బైక్‌పై తిరుగుతూ నియోజకవర్గ మొత్తం పర్యటించి సమైక్యాంధ్ర ఉద్దేశాన్ని ప్రజలకు వివరించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుంటిగంగ వద్ద బయల్దేరిన ర్యాలీ గంగవరం, తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి, దొనకొండ, కురిచేడు వరకు సాగింది. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేస్తూ నివాళులర్పించారు. కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, పామూరుల్లో మోటారుబైకు ర్యాలీలు జరిగాయి. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాట అరుణమ్మ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర వాదులమంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు తీరా రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చే సమయంలో మౌనం వహించడం దారుణమన్నారు. దీన్ని బట్టే వారి రెండు కళ్ల సిద్ధాంతం స్పష్టమవుతోందన్నారు. యర్రగొండపాలెంలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. గిద్దలూరులో నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుమల అశోక్‌రెడ్డి, జిల్లా అధికారప్రతినిధి సూరా సామిరంగారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర నాయకులు దప్పిలి రాజేంద్రప్రసాద్ తదితరులు సమైక్యాంధ్రకు సంఘీభావంగా జరిగిన మోటారు బైకు ర్యాలీలో పాల్గొన్నారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డిలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మోటారు బైకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఒక్కటే సమైక్యాంధ్రే లక్ష్యంగా ముందుకు సాగుతోందని నాయకులు పేర్కొన్నారు. చీమకుర్తిలో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, వరికూటి అమృతపాణి, చీమకుర్తి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు స్థానిక నేతలతో కలిసి మోటారు బైకు ర్యాలీ చేపట్టారు. ఒంగోలులో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి సమైక్య మోటారు బైకు ర్యాలీ ప్రారంభమైంది. నగరంలోని అన్ని వీధుల్లో తిరుగుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు సమైక్యాంధ్ర నినాదాలను హోరెత్తించారు. కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల దళిత విభాగం కోఆర్డినేటర్ పాలడుగు విజేంద్ర బహుజన్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, వైఎస్సార్సీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు తదితరులు ర్యాలీకి అగ్రభాగంలో నిలిచారు. స్థానిక చర్చి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే అని, త్వరలో జరిగే ఎన్నికల్లో ద్వంద్వ వైఖరిని పాటించే పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. -
జన గర్జన
సాక్షి, అనంతపురం : సమైక్యవాదులు సమరోత్సాహంతో ఉద్యమిస్తున్నారు. రాష్ట్ర విభజన ఆపేదాకా విశ్రమించబోమంటూ శపథం చేస్తున్నారు. 22వ రోజైన బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉధృతంగా కొనసాగింది. ప్రజలు, వివిధ జేఏసీల నాయకులు, ఎన్జీఓలతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు చురుగ్గా పొల్గొన్నారు. అనంతపురం నగరంలో జేఏసీ, ఎన్జీఓల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. శ్రీకంఠం సర్కిల్లో అరగంట పాటు మానవహారం నిర్మించారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వెంటనే రాజీనామా చేసి.. ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ దిష్టిబొమ్మతో స్థానిక సప్తగిరి సర్కిల్లో బైక్‌లతో రౌండ్లు కొడుతూ.. జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. డ్వామా ఉద్యోగులు ప్రదర్శన చేశారు. అనంతరం సప్తగిరి సర్కిల్ నుంచి టవర్‌క్లాక్ వరకు రోడ్డుపై సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖల ఉద్యోగులు వేలాది మంది రైతులతో ర్యాలీ చేశారు. చిన్న ట్రాక్టర్లతో ర్యాలీ చేయడంతో నగరమంతా హారన్లతో మార్మోగింది. ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ చేశారు. జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు, ప్రభుత్వ ఆస్పత్రి, వాణిజ్య పన్నులశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ , నీటిపారుదల ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు ఎమ్మెల్యే గురునాథరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన నగరంలో వాహనాలకు సమైక్యాంధ్ర స్టిక్కర్లు అతికించారు. నగరానికి చెందిన వేలాది మంది మహిళలు, వృద్ధులు కూడా ర్యాలీ నిర్వహించారు. ‘హైదరాబాద్ వెళ్లేవారికి ఎటువంటి గుర్తింపు కార్డులు లేకుండా ఐదు నిమిషాల్లో పాస్‌పోర్టు, వీసా జారీ చేస్తామం’టూ సమైక్యవాదులు స్థానిక టవర్‌క్లాక్ సర్కిల్లో కట్టిన బ్యానర్ ఆకట్టుకుంది. ఎస్కేయూ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది వర్సిటీ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వర్సిటీ ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు. వైఎస్సార్సీపీ నాయకుడు నాగభూషణ్‌రెడ్డి, ఇటుకలపల్లి సర్పంచ్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లతో వర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ సమీపంలోని మారుతీనగర్ కాలనీ మహిళలు ర్యాలీగా వచ్చి.. వర్సిటీ ఎదుట సోనియా దిష్టిబొమ్మను చెప్పుతో కొడుతూ దహనం చేశారు. సేతు, పాంచజన్య, రాధాస్కూల్ ఆఫ్ లర్నింగ్ పాఠశాలల విద్యార్థులు వర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ రోడ్డుపై బైఠాయించి మధ్యాహ్న భోజనం చేశారు. ధర్మవరంలో వైఎస్సార్సీపీ, ఐక్య ఉపాధ్యాయ సంఘం, రెవెన్యూ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మద్దతు తెలిపాయి. గుంతకల్లులో సమైక్యవాదులు జాతీయరహదారిని దిగ్బంధించారు. వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో ఉపాధ్యాయులు క్యాట్ వాక్ చేస్తూ నిరసన తెలిపారు. పామిడిలో సమైక్యవాదులు, హిందూపురంలో సమైక్యాంధ్ర జేఏసీ, జాక్టో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో రెడ్డిసేవా సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు చేశారు. కదిరిలో మహిళా టీచర్లు రోడ్డుపై ముగ్గులు వేసి నిరసన తెలిపారు. పట్టణంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన వేలాది మంది మహిళలు భారీ ర్యాలీ చేశారు. కటారుపల్లి రైతులు, విద్యార్థి జేఏసీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. కళ్యాణదుర్గంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. జేఏసీ నాయకులు, సమైక్యవాదులు భారీ ప్రదర్శన నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. మడకశిరలో వక్కలిగులు ఎడ్లబండ్ల ప్రదర్శన, రోడ్డుపై వంటా వార్పు చేపట్టారు. వెటర్నరీ సిబ్బంది, వెటర్నరీ పాలిటెక్నిక్ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గుడిబండలో సమైక్యవాదుల ఆందోళనలు మిన్నంటా యి. అమరాపురంలో ఉపాధ్యాయులు, వీఆర్వోలు, వీఆర్ఏలు రిలే దీక్షలు చేపట్టారు. ఓడీసీ, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లో సమైక్య నిరసనలు కొనసాగాయి. పెనుకొండలో సమైక్యవాదులు భారీ ప్రదర్శన నిర్వహించారు. రాయదుర్గంలో సై మెక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, న్యాయవాదులు, కురిహినశెట్టి సమాజ జనుల ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కణేకల్లులో ఇద్దరు సమైక్యవాదులు ఆమరణ దీక్ష చేపట్టారు. సీకేపల్లిలో జాతీయ రహదారిపై వంటా వార్పు చేపట్టారు. ఆత్మకూరులో ఐకేపీ ఉద్యోగులు, రామగిరిలో విద్యార్థులు, శింగనమలలో పెయింటర్లు, నార్పలలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. తాడిపత్రిలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మునిసిపల్ ఉద్యోగులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. ఆర్టీసీ, ట్రాన్స్‌కో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి.. రోడ్డుపై యోగాసనాలు వేశారు. యాడికిలో జేఏసీ నాయకులు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. పెద్దవడుగూరులో జేఏసీ రిలేదీక్షలకు వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఉరవకొండలో ప్రదర్శన నిర్వహించారు. విడపనకల్లులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.