ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారంతో సంబరాలు | Prime Minister standard accession celebrating | Sakshi
Sakshi News home page

ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారంతో సంబరాలు

Published Mon, May 26 2014 11:49 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారంతో సంబరాలు - Sakshi

ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారంతో సంబరాలు

 తాండూరు రూరల్, న్యూస్‌లైన్: దేశ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడంతో బీజేపీ, టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. సోమవారం సాయంత్రం ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీచౌక్, వినాయక్‌చౌక్, భద్రప్పచౌక్ మీదుగా ర్యాలీ కొనసాగింది. అనంతరం బస్టాండ్‌లో ప్రయాణికులకు మిఠాయిలు పంచి పెట్టారు. బాణసంచా పేల్చి ఒకరికొకరు శుభాకాంక్ష లు తెలుపుకున్నారు.
 
ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడు మోడీ అని కొనియాడారు. ఆయన పాలనలో దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమం లో బీజేపీ, టీడీపీ నాయకులు ప్యాట బాల్‌రెడ్డి, నాగారం నర్సిములు, బాలేశ్వర్ గుప్తా, రాజుగౌడ్, కృష్ణ ముదిరాజ్, బాల శివకుమార్, బొప్పి సురేష్, బాల శివకుమార్, బంట్వారం భధ్రేశ్వర్, పూజారి పాండు, అశోక్, రాకేష్, కిరణ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement