bilateral ceasefire
-
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన:భారత జవాన్ మృతి
జమ్మూకాశ్మీర్: భారత్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన పిదప పొరుగుదేశం పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రరణ రేఖ(ఎల్ఓసీ) వద్ద పాక్ భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజాము ప్రాంతంలో కాల్పులు జరిపాయి. పాక్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో భారత్ సరిహద్దులోకి చేరుకుని కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భారత్ కూడా ఎదురుదాడి దిగింది. ఈ ఘటనలో ఒక భారత్ జవాన్ తో పాటు, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలైయ్యాయి. 2003లో భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చేసుకున్న కాల్పుల ఒప్పందాన్ని ఈ ఏడాది మొదటి నుంచి పాక్ తరచుగా ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల సరిహద్దుల వెంబడి కాల్పులు జరగకుండా ఉండేందుకు కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
ఎల్ఓసీ వద్ద మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
అమెరికా పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీ అయి తిరిగి స్వదేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్ చేరుకునే లోపు పొరుగుదేశం కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని మెందర్ సెక్టర్లో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాక్ భద్రతా దళాలు కాల్పులు నిన్న మధ్నాహ్యం జరిపాయని రక్షణ శాఖ ప్రతినిధి కెప్టెన్ ఎస్.ఎన్. ఆచార్య బుధవారం వెల్లడించారు. పాక్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో భారత్ సరిహద్దు వెంబడి కాల్పులు జరిపాయని వివరించారు. అందుకు ప్రతిగా భారత్ కూడా ఎదురు దాడికి దిగిందని చెప్పారు. అయితే ఆ ఘటనలో ఇరువైపులా ఎటువంటి గాయాలు కానీ, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. 2003లో భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చేసుకున్న కాల్పుల ఒప్పందాన్ని ఈ ఏడాది మొదటి నుంచి పాక్ తరచుగా ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల సరిహద్దుల వెంబడి కాల్పులు జరగకుండా ఉండేందుకు మరింత శ్రద్ధ వహిస్తామని యూఎస్ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య ప్రధానులు అంగీకరించారు. అయినా పాక్ కాల్పులకు తెగబడటం గమనార్హం. -
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద సోమవారం అర్థరాత్రి పాకిస్థాన్ దళాలు అఖ్నర్ సెక్టర్పై కాల్పులకు తెగబడిందని ఆర్మీ ప్రతినిధి కెప్టెన్ ఎస్.ఎన్.ఆచార్య మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అందుకు ప్రతిగా తమ భద్రత దళాలు కూడా అదే స్థాయిలో కాల్పులు జరిపిందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఇరు వైపుల కాల్పులు ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి నియంత్రణ రేఖ వద్ద పాక్ భద్రత దళాలు వరుసగా కాల్పులు జరుపుతూ భారత్, పాక్ దేశాలు గతంలో చేసుకున్న ఒప్పందాలను అతిక్రమిస్తున్న సంగతి తెలిసిందే.