ఎల్ఓసీ వద్ద మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన | Pakistan violates ceasefire as Manmohan returns after meeting Sharif | Sakshi
Sakshi News home page

ఎల్ఓసీ వద్ద మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన

Published Wed, Oct 2 2013 9:48 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

Pakistan violates ceasefire as Manmohan returns after meeting Sharif

అమెరికా పర్యటనలో భాగంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో భేటీ అయి తిరిగి స్వదేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్ చేరుకునే లోపు పొరుగుదేశం కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని మెందర్ సెక్టర్లో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పాక్ భద్రతా దళాలు కాల్పులు  నిన్న మధ్నాహ్యం జరిపాయని రక్షణ శాఖ ప్రతినిధి కెప్టెన్ ఎస్.ఎన్. ఆచార్య బుధవారం వెల్లడించారు. పాక్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో భారత్ సరిహద్దు వెంబడి కాల్పులు జరిపాయని వివరించారు. అందుకు ప్రతిగా భారత్ కూడా ఎదురు దాడికి దిగిందని చెప్పారు.

 

అయితే ఆ ఘటనలో ఇరువైపులా ఎటువంటి గాయాలు కానీ, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. 2003లో భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చేసుకున్న కాల్పుల ఒప్పందాన్ని ఈ ఏడాది మొదటి నుంచి పాక్ తరచుగా ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల సరిహద్దుల వెంబడి కాల్పులు జరగకుండా ఉండేందుకు మరింత శ్రద్ధ వహిస్తామని యూఎస్ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య  ప్రధానులు అంగీకరించారు. అయినా పాక్ కాల్పులకు తెగబడటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement