బిల్లా పవన్‌పై పీడీ యాక్ట్..?
బంజారాహిల్స్(హైదరాబాద్): దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న రహ్మత్‌నగర్ నివాసి బిల్లా పవన్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకుగాను అతనిపై ఉన్న కేసులను తిరగదోడనున్నారు. ఇప్పటికే అతనిపై ఎనిమిది కేసులు ఈ పోలీస్‌స్టేషన్‌లో నమోదై ఉన్నాయి. ఇందులో ఓ హత్యాయత్నం కూడా ఉంది. దీంతో రెండు రోజుల క్రితం పోలీసులు పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే పవన్ రహ్మత్ నగర్ నుంచి సరూర్‌నగర్‌కు మకాం మార్చాడు. రహ్మత్‌నగర్, శ్రీకృష్ణానగర్ ప్రాంతాల్లో కొంతకాలంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పవన్ కేంద్రబిందువుగా మారాడని పోలీసులు అంటున్నారు.