bills sanction
-
అంపశయ్యపై అంబులెన్సులు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెనుముప్పు దాపురించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తుల ప్రాణాలకు అండగా నిలవాల్సిన ‘108’ అంబులెన్సులకు పెద్దఆపద వచ్చింది. ఈ ఆపద్భాందవికి ఫోన్‌చేస్తే కుయ్ కుయ్‌మంటూ నిమిషాల్లో ఘటనా స్థలంలో వాలిపోయి బాధితులకు చేయూతనివ్వాల్సిన అంబులెన్స్‌లు చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మక నిర్లక్ష్యంగా కారణంగా డీజిల్‌లేక ముందుకు కదలడంలేదు. ఇలా బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 290 అంబులెన్స్‌లు ఆగిపోయాయి. దీంతో.. వైద్యసాయం కోసం 108కు ఫోన్‌చేసిన వారికి ‘మీ దగ్గరలో అంబులెన్స్‌లు అందుబాటులో లేవు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆస్పత్రులకు వెళ్లండి’ అని కాల్ సెంటర్ ప్రతినిధులు బదులిచ్చారు. బిల్లులు మంజూరు చేయాలని కోరినా..కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టులన్నీ అస్మదీయులకు కట్టబెట్టడంపై ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ) నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను తప్పించడానికి పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ నుంచి నిర్వహణ సంస్థకు చెల్లించాల్సిన బిల్లుల్లో ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఇలా ఏకంగా రూ.141 కోట్ల బిల్లులు నిలిచిపోవడంతో గడిచిన మూడు నెలలుగా 104, 108 సిబ్బందికి అరబిందో సంస్థ వేతనాలు చెల్లించలేదు. మరోవైపు.. డీజిల్ కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని బిల్లులు మంజూరు చేయాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరారు.అయినప్పటికీ దీపావళికి ముందు 108 కాల్ సెంటర్ నిర్వహణ సంస్థకు బిల్లులు మంజూరు చేసిన ప్రభుత్వం అరబిందోకు మాత్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఒకవైపు ఎంఓయూ రద్దుచేసుకుని వెళ్లిపోవాలని సంస్థపై ఒత్తిడి చేస్తూనే.. నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో తప్పుకుంటోందని ఎల్లో మీడియా లీకులిచ్చి కథనాలు రాయించింది. దీంతో కొన్ని రోజులుగా అరువుపై డీజిల్ పోసే పెట్రోల్ బంకులు సైతం రెండు మూడ్రోజులుగా చేతులెత్తేశాయి. దీంతో.. 108 సేవలకు అంతరాయం ఏర్పడుతుందని.. వెంటనే బిల్లులు మంజూరు చేయాలని అరబిందో సంస్థ మంగళవారం ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఐదు నెలలుగా బిల్లులు నిలిచిపోవడం, రివాల్వింగ్ ఫండ్ కూడా లేకపోవడంతో వారం, పది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా డీజిల్‌లేక అంబులెన్సులు నిలిచిపోతున్నా బాబు సర్కారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.నాలుగుసార్లు ఫోన్‌చేసినా రాలేదు..మా అమ్మాయి తేళ్లూరు అశ్రితకు కడుపులో నొప్పి రావడంతో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాం. ఇక్కడి వైద్యులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఉ.11 గంటల నుంచి మ.12.30 గంటల వరకు నాలుగుసార్లు ఫోన్‌చేసినా 108 రాలేదు. దీంతో.. ప్రైవేటు అంబులెన్స్‌కు డబ్బులు పెట్టే స్థోమతలేక బస్సులో విజయవాడ తీసుకెళ్లాం. – తేళ్లూరు నాగేశ్వరరావు, చాట్రాయిసాయం అందక హాహాకారాలు..నిజానికి.. 2019కు ముందు బాబు పాలనలో కునారిలి్లన 108 వ్యవస్థకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఊపిరిలూదుతూ 768 అంబులెన్సులతో బలోపేతం చేసింది. ఇందులో బ్యాకప్ పోను 731 వాహనాలు క్షేత్రస్థాయిలో నిత్యం సేవలందిస్తుంటాయి. ఇలా సగటున రోజుకు మూడువేలకు పైగా అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు అంబులెన్సులు అండగా నిలుస్తున్నాయి. అంటే.. రోజుకు నాలుగు పైగా కేసులకు ఒక్కో అంబులెన్స్ అటెండ్ అవుతుంటుంది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో డీజిల్‌లేక బుధవారం ఒక్కరోజే 290 అంబులెన్సులు నిలిచిపోయాయి.500లోపు వాహనాలు అరకొరగా సేవలు కొనసాగిస్తున్నాయి. ఉదా.. ఏలూరు జిల్లాలో 108 వాహనాలు మొత్తం 29 ఉండగా మంగళవారం డీజిల్‌లేక 12 వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాటిల్లో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, ముదినేపల్లి, కలిదిండి, కైకలూరు, మండవల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెంలకు చెందిన వాహనాలున్నాయి. ఇక మంగళవారం 108 అంబులెన్సులు అందుబాటులో లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులకు సంబంధించిన బాధితులు ప్రైవేట్ అంబులెన్సులను ఆశ్రయించలేక హాహాకారాలు చేస్తున్నారు.⇒ ఈ చిత్రంలోని మహిళ అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదంలో గాయపడింది. 108 వాహనం కోసం పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో కుటుంబీకులే రూ.500 బాడుగతో ఆటో మాట్లాడుకుని 15 కి.మీ దూరంలోని సర్వజనాస్పత్రికి ఆమెను తీసుకువచ్చారు.⇒ ఈ చిత్రంలోని మహిళ పేరు పార్వతమ్మ. స్వగ్రామం అనంతపురం జిల్లా ముద్దలాపురం. గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు 108 వాహనం కోసం ఫోన్ చేయగా.. అదిగో.. ఇదిగో అంటూ మధ్యాహ్నం వరకూ గడిపారు. ఆ తర్వాత స్పందించ లేదు. దీంతో కుటుంబీకులు 32 కి.మీ దూరంలోని అనంతపురం సర్వజనాస్పత్రికి ఆటోలో తీసుకువచ్చారు. -
ఆరు బిల్లులు.. మూడింటికి ఆమోదం
న్యూఢిల్లీ: పెగసస్ నిఘా వ్యవహారం, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర అంశాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు తమ నిరసన, నినాదాలను కొనసాగించాయి. లోక్‌సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిలో మూడు బిల్లులు ఆమోదం పొందాయి. తమ డిమాండ్లపై చర్చించాలంటూ సభా కార్యకలాపాలకు ప్రతిపక్షాలు అడ్డు తగులుతుండడంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. సభ సజావుగా సాగకున్నా బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదిస్తుండడం పట్ల కాంగ్రెస్ పార్టీ సభ్యులు అధిర్ రంజన్ చౌదరి, మనీష్ తివారీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య నియమాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. 10 నిమిషాల్లోనే బిల్లులా? లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్(అమెండ్మెంట్) బిల్లు–2021, ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(అమెండ్మెంట్) బిల్లు–2021, కానిస్టిట్యూషన్(షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (అమెండ్మెంట్) బిల్లు–2021, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి(అమెండ్మెంట్) బిల్లు–2021, నేషనల్ కమిషనర్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్(అమెండ్మెంట్) బిల్లు–2021తోపాటు కానిస్టిట్యూషన్ (127వ సవరణ) బిల్లు–2021ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే బిల్లులను ప్రవేశపెట్టారని ఆర్ఎస్పీ సభ్యుడు ప్రేమచంద్రన్ విమర్శించారు. ఇలా చేయడాన్ని దోసెలు వేయడంతో పోల్చారు. లోక్‌సభ సోమవారం ఉదయం ప్రారంభమైన తర్వాత స్పీకర్ బిర్లా క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వారికి సభ తరపున నివాళులరి్పంచారు. టోక్యో ఒలంపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ఓంబిర్లా అభినందనలు తెలిపారు. పెగసస్‌పై కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మేఘవాల్ మధ్య వాగ్వాదం జరిగింది. పెగసస్, సాగు చట్టాలపై ప్రతిపక్షాలు పట్టు వీడకుండా ఆందోళనలు కొనసాగిస్తుండడంతో సోమవారం రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ట్యాకేషన్ చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికంటే కేవలం కొన్ని నిమిషాల ముందు సప్లిమెంటరీ అజెండాను అందజేయడం ఏమిటని కాంగ్రెస్ ఎంపీ ఖర్గే ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు విధానాలను తాము అంగీకరించబోమంటూ కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. లోక్‌సభలో.. రాష్ట్రాలకు ‘ఓబీసీ’ అధికారాల పునరుద్ధరణ బిల్లు ఇతర వెనకబడిన తరగతుల జాబితాను సొంతంగా సిద్ధంచేసే అధికారాలను రాష్ట్రాలకు మళ్లీ కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లు–2021ను కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సమాఖ్య స్ఫూర్తిని మరింతగా పెంపొందించేందుకు వీలుగా సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతు(ఎస్ఈబీసీ)ల జాబితాలను రాష్ట్రాలు సొంతంగా రూపొందించుకునేందుకుగాను ఆర్టికల్ 342ఏ, తదనుగుణంగా ఆర్టికల్ 338బీ, 366లకు రాజ్యంగ సవరణలు చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. బిల్లును సభలో ప్రవేశపెట్టగానే కొందరు కాంగ్రెస్ సభ్యులు సహా చాలా మంది సభ్యులు ఈ బిల్లుకు తమ పూర్తి మద్దతు తెలిపారు. పెగసస్ అంశంపై వెల్‌లోకి దూసుకెళ్లి సభ కొనసాగుతున్నంతసేపూ నిరసన తెలుపుతున్న సభ్యులు నిరసనలు ఆపి వెనక్కి వచ్చి కూర్చుని బిల్లుకు మద్దతు పలకడం గమనార్హం. -
మరుగుదొడ్లు కట్టుకోండి.. బిల్లులు నేనిస్తా..
శాయంపేట(భూపాలపల్లి): ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించుకోండి..నెల రోజుల్లో మీ బిల్లులు ప్రభుత్వం ఇవ్వకపోతే నా సొంత డబ్బులు ఇస్తా...పాత బిల్లులకు లింకులు పెట్టకుండా మరుగు దొడ్లు వంద శాతం నిర్మించుకుని వాడితేనే చెల్తిసా..ఒకవేళ డబ్బులివ్వకపోతేనా ఆఫీసు ముందు కూర్చోండి..ఇవ్వకపోతే అక్కడి నుంచి వెళ్లకండి.. అది కూడా నెల రోజుల్లో పూర్తి చేయాలి. అంతేకాదు అనుకున్న సమయానికి పూర్తి చేస్తే నా నిధుల నుంచి రూ.5 లక్షలు అభివృద్ధికి కేటాయిస్తానని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. మండలంలోని గోవిందాపూర్, గట్లకానిపర్తి గ్రామాల్లో మరుగుదొడ్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంగళవారం కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ముందుగా గట్లకానిపర్తిలో మరుగుదొడ్ల నిర్మాణం, వాడకం, పారిశుద్ధ్యంపై ప్రజలతోపాటు అధికారులు, కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం స్వచ్ఛభారత్‌పై అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్డి అనేది ప్రభుత్వ వ్యక్తిగత ఆస్తి అన్నారు. ప్రజాప్రతినిధులు ఎక్కడైతే పనిచేస్తారో అక్కడే వంద శాతం ఓడీఎఫ్ సాధించగలుగుతున్నామన్నారు. ఏ గ్రామంలోనైతే ప్రజాప్రతినిధుల సహకారం అందదో అక్కడ మరుగుదొడ్ల నిర్మాణం సాధ్యంకాదని పేర్కొన్నారు. డిసెంబర్ 15 నాటికి వంద శాతం ఓడీఓఫ్ గ్రామాలుగా చేయాలని కోరారు. ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలి.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు. డిసెంబర్‌లోగా మండలాన్ని ఓడీఎఫ్‌గా తీర్చిదిద్దాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. జిల్లాలోనే శాయంపేట మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి ఉందని తెలిపారు. ప్రతి గ్రామంలో శ్మశానవాటికల కోసం రూ.10 నుంచి 12 లక్షల ప్రభుత్వం మంజూరు చేస్తోందని తెలిపారు. దాతలు గ్రామాల్లో ముందుకు వచ్చి 20 నుంచి 30 గుంటల స్థలాన్ని దానం చేస్తే ప్రభుత్వం శ్మశానవాటికను నిర్మిస్తుందని వివరించారు. క్రమబద్ధీకరణకు మరో అవకాశం.. సాదాబైనామా కింద దరఖాస్తు చేసుకోని రైతులకు ప్రభుత్వం మరోసారి భూముల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిందని తెలిపారు. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో చేపట్టిన భూప్రక్షాళనలో రైతులు మళ్లీ సాదాబైనామాకు ధరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం నుంచి ఎకరాకు రూ.4వేల పెట్టుబడి ఖర్చులను అందుకునే విధంగా చూడాలన్నారు. క్లియర్‌గా ఉన్న భూములకే ప్రభుత్వ పెట్టుబడి వస్తుందని స్పష్టం చేశారు. కాగా గోవిందాపూర్ వీఆర్వో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మొక్కలను కాపాడుకోవాలి.. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను మనమే కాపాడుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతి శుక్రవారం జిల్లా వ్యాప్తంగా గ్రీన్‌డేను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ హరిప్రసాద్, ఎంపీపీ రమాదేవి, సర్పంచ్‌లు చింతనిప్పుల భద్రయ్య, వైనాల విజయ, ఇమ్మడిశెట్టి రవీందర్, ఎంపీటీసీ సభ్యులు బొమ్మకంటి సుజాత, ఎంపీడీఓ రమాదేవి, తహసీల్దార్ వెంకటభాస్కర్, ఆర్ఐ హేమానాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీలత, వీఆర్వోలు రఘు, శివప్రసాద్ పాల్గొన్నారు. -
ఇందిరమ్మ గృహాలకు బిల్లులు మంజూరు
లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు ఆపరేట్ చేసుకోవాలి ఈఈ, ఏఈ, డీఈలతో హౌసింగ్ పీడీ నర్సింహారావు సమీక్ష ముకరంపుర: ఇందిరమ్మ పథకంలో పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్దిదారులకు బిల్లులు మంజూరైనట్లు హౌసింగ్ పీడీ నర్సింహరావు తెలిపారు. శనివారం ఈ విషయమై ఈఈ, ఏఈ, డీఈలతో హౌసింగ్‌శాఖ కార్యాలయంలో సమీక్షించారు. ఇందిరమ్మ పథకంలో ఇంతకు ముందు బిల్లులు పొంది గృహాలు నిర్మాణంలో ఉన్నటువంటి అర్హులైన లబ్ధిదారులకు బిల్లులిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో క్షేత్రస్థాయి విచారణలో భాగంగా బిల్లులు పొంది నిర్మాణ దశలో 3926 ఇందిరమ్మ లబ్ధిదారులున్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. దీనికి రూ.12.75 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా లబ్దిదారుల ఖాతాలు డార్మెంటరీ, నాన్ ఆపరేటివ్లో ఉంటాయని, అర్హత కలిగిన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలో కొంత డబ్బును జమ చేసుకుని అకౌంట్‌ను ఆపరేట్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పాస్‌బుక్, జిరాక్స్, గృహం నిర్మించినప్రస్తుత స్థాయి ఫొటో, ఆధార్‌కార్డు జిరాక్స్, సంబంధిత హౌసింగ్ ఏఈకి బిల్లు కొరకు సమర్పించాలని తెలిపారు. ఆ తదుపరి లబ్ధిదారుల బిల్లులు ఆన్లైన్లో జనరేట్చేసి ప్రధాన కార్యాలయానికి సిఫారసు చేసిన అన ంతరం వారి ఖాతాలో జమ చేయబడుతుందన్నారు.