- లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు ఆపరేట్ చేసుకోవాలి
- ఈఈ, ఏఈ, డీఈలతో హౌసింగ్ పీడీ నర్సింహారావు సమీక్ష
ఇందిరమ్మ గృహాలకు బిల్లులు మంజూరు
Published Sat, Jul 23 2016 9:00 PM | Last Updated on Sat, Aug 11 2018 8:06 PM
ముకరంపుర: ఇందిరమ్మ పథకంలో పెండింగ్‌లో ఉన్న అర్హులైన లబ్దిదారులకు బిల్లులు మంజూరైనట్లు హౌసింగ్ పీడీ నర్సింహరావు తెలిపారు. శనివారం ఈ విషయమై ఈఈ, ఏఈ, డీఈలతో హౌసింగ్‌శాఖ కార్యాలయంలో సమీక్షించారు. ఇందిరమ్మ పథకంలో ఇంతకు ముందు బిల్లులు పొంది గృహాలు నిర్మాణంలో ఉన్నటువంటి అర్హులైన లబ్ధిదారులకు బిల్లులిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో క్షేత్రస్థాయి విచారణలో భాగంగా బిల్లులు పొంది నిర్మాణ దశలో 3926 ఇందిరమ్మ లబ్ధిదారులున్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. దీనికి రూ.12.75 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా లబ్దిదారుల ఖాతాలు డార్‌మెంటరీ, నాన్ ఆపరేటివ్‌లో ఉంటాయని, అర్హత కలిగిన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలో కొంత డబ్బును జమ చేసుకుని అకౌంట్‌ను ఆపరేట్ చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పాస్‌బుక్, జిరాక్స్, గృహం నిర్మించినప్రస్తుత స్థాయి ఫొటో, ఆధార్‌కార్డు జిరాక్స్, సంబంధిత హౌసింగ్ ఏఈకి బిల్లు కొరకు సమర్పించాలని తెలిపారు. ఆ తదుపరి లబ్ధిదారుల బిల్లులు ఆన్‌లైన్‌లో జనరేట్‌చేసి ప్రధాన కార్యాలయానికి సిఫారసు చేసిన అన ంతరం వారి ఖాతాలో జమ చేయబడుతుందన్నారు.
Advertisement
Advertisement