bio toilets
-
రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే!
దేశంలో రైళ్లు.. కోట్లాది మందికి అనువైన ప్రయాణ సాధనాలు. ఇతర సాధనాలతో పోలిస్తే చార్జీలు తక్కువగా ఉండటంతో అనేక మంది రైళ్లనే ఆశ్రయిస్తుంటారు. అయితే సౌకర్యాలు సరిగా లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా టాయిలెట్ల విషయం చెప్పనక్కర్లేదు. ఎక్కువ మంది ప్రయాణిస్తున్న కారణంగా వీటి నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. ఇలాంటి ఇబ్బందులకు భారత రైల్వే శాఖ చెక్ పెడుతూ సరికొత్త సౌకర్యాలను తీసుకొస్తోంది. రైళ్లలో ప్రస్తుతం ఉన్న టాయిలెట్ల స్థానంలో మెరుగైన సౌకర్యాలతో రూపొందించిన బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని భారతీయ రైల్వే తెలిపింది. దీనికి సంబంధించి కొత్తగా రూపొందించిన బయో టాయిలెట్లతో కూడిన ఏసీ కోచ్‌ను రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. దీనిపై ప్రయాణికుల అభిప్రాయాలు తీసుకుని తర్వాత మిగతా రైళ్లలోనూ వీటిని అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ముక్కు మూసుకోవాల్సిన పని లేదు! రైల్వే శాఖ రూపొందించిన ఈ బయో టాయిలెట్లు ఆటోమేటిక్ హైజీన్, వాసన నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. అలాగే నీటి కొళాయిలు, సోప్ డిస్పెన్సర్లు కూడా టచ్ ఫ్రీ అంటే సెన్సార్ ఆధారితంగా ఉంటాయి. అయితే వీటిని దొంగిలించకుండా కూడా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు తలుపులు, గ్యాంగ్‌వేలను మెరుగు పరిచింది రైల్వే శాఖ. అసౌకర్యమైన టాయిలెట్లపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ చర్యలు చేపట్టింది. -
టీఎస్ఆర్టీసీ కార్మికుల కోసం..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల కోసం చేంజ్ ఓవర్ పాయింట్స్‌లో సంచార బయో టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. గంటల తరబడి విధి నిర్వహణ చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు మరుగుదొడ్డి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులైతే వర్ణణాతీతం. సంచార బయో టాయిలెట్లను శుక్రవారం ప్రారంభించడానికి ఆర్టీసీ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. నగరంలో 9 చేంజ్ ఓవర్ పాయింట్లలో టాయిలెట్ల అవసరం ఉందని ఆర్టీసీ యాజమాన్యం గుర్తించింది. అయా ప్రాంతాల్లో సంచార బయో టాయిలెట్లను అందుబాటులో ఉంచనుంది. (చదవండి: పదవీ విరమణ వయసు పెంపు) -
అయ్యయ్యో.. ఏసీ బోగీలు కనబడడం లేదు..!
రైళ్లలో ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, నల్లాలు, కొన్ని సందర్భాల్లో వాష్ బేసిన్లు సైతం చోరీకి గురికావడం, ఏసీ రైళ్లలోనైతే చేతి తువాళ్లు, బ్లాంకెట్లు వంటివి మాయమవుతున్న ఘటనలు ఇతర దేశాల్లోనైతే ఆశ్చర్యంగా చూస్తారు కాని... ఇక్కడైతే ఇదంతా మామూలే అన్నట్టుగా మనవాళ్లు పెద్దగా పట్టించుకోరు. రైళ్లలో ప్రవేశపెట్టిన ‘బయో టాయ్లెట్ల’లోని స్టెయిన్లెస్స్టీల్ డస్ట్బిన్లు కూడా దొంగతనానికి గురవుతున్న జాబితాలో చేరిపోయాయి. అయితే తాజాగా ఏకంగా రైలు బోగీలే అవీ కూడా ఏసీ కోచ్‌లు కొన్ని కనిపించకుండా పోయాయనే వార్తలు నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాయి. వీటి ప్రకారం రాంచీ–న్యూఢిల్లీల మధ్య నడిచే రాజధాని, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించిన కొన్ని కొత్త బోగీలు రాంచీ రైల్వే డివిజన్ యార్డు నుంచి మాయమై పోయాయి. ఈవిధంగా కొన్ని బోగీలకు బోగీలే కనబడకుండా పోవడం పెద్ద కలకలాన్నే సృష్టించింది. రాజధాని, సంపర్క్ క్రాంతి రైళ్లలో జతచేయాల్సిన ఈ బోగీలు మిస్ కావడంతో వాటి స్థానంలో పాత రైలు డబ్బాలతోనే రైల్వేశాఖ పని కానీచ్చేస్తోంది. ఇటీవల రాంఛీ నుంచి బయలుదేరాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మూడోబోగీలు కదలకుండా మొరాయించడంతో ప్రయాణీకులు పెట్టిన గగ్గోలు అంతా ఇంతా కాదు. అధునాతన సౌకర్యాలున్న రైళ్లుగా పరిగణిస్తున్న రాజధాని వంటి రైళ్ల కోసం తెప్పించిన కొత్త కోచ్‌లు ఏమయ్యయో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రైలు డబ్బాలు కనిపించకుండా పోవడం వెనక పెద్ద ముఠాయే పనిచేస్తున్నట్టు ఉందని సందేహాలు వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నారు. అంతకు ముందు కూడా ఒకటో రెండో ఇలాంటి ఘటనలు జరిగినా ఇప్పుడు ఏకంగా కొన్ని ఏసీ బోగీలే కనిపించకుండా పోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఏసీ బోగీలు కనబడకుండా పోయాయన్న వార్తలపై రాంచీ డివిజన్ అధికారి స్పందించినట్టు ఓ పత్రిక వెల్లడించింది. ‘తమ డివిజన్‌లోనే వీటిని ఉపయోగిస్తున్నట్టు మేము మార్క్ చేశాం. ఈ కోచ్‌లు ఉత్తరాది డివిజన్లో వినియోగంలో ఉన్నట్టుగా భావిస్తున్నాం. ఈ ఏసీ బోగీలను తిరిగి తమకు అప్పగించాలంటూ ఉత్తరాది రైల్వేకి ఆగ్నేయ రైల్వే లేఖ రాసింది. త్వరలోనే అవి వెనక్కు వస్తాయని ఆశిస్తున్నాం’ ఆ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది. చిన్న చిన్న చోరీలు ఎక్కువే... 2016 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం...2015లో రైళ్లలో చోటుచేసుకున్న చోరీ కేసులు 9.42 లక్షలుండగా, 2016లో ఈ సంఖ్య11 లక్షలకు చేరుకుంది. వీటిలో 2 లక్షల కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, 1.24 లక్షల కేసులతో ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో నిలిచాయి. 2016–17లో చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కోచింగ్ డిపో పరిధిలో 817 బయో టాయ్‌లెట్లున్నాయి. దీని పరిధిలో 3,601 స్టీల్ డస్ట్బిన్లు కనబడకుండా పోయినట్లు ఫిర్యాదు చేశారు. పశ్చిమబెంగాల్లోని సీయల్దా కోచింగ్ డిపో పరిధిలో 1,304 బయో టాయ్లెట్లుండగా 3,536 చోరీకి గురైనట్టు అధికారులు తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
2020-21లోగా అన్నీ బయో టాయిలెట్లే
న్యూఢిల్లీ: భారత రైల్వేలో పలుసంస్కరణలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు రైళ్లలో ఉన్న సాధారణ టాయిలెట్లను ఉపయోగించిన ఆ శాఖ వాటి స్థానాల్లో పూర్తిస్థాయిలో పర్యావరణ హితమైన బయోటాయిలెట్లను ఏర్పాటుచేయాలనుకుంటుంది. 2020-21నాటికి 17,338 బయోటాయిలెట్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఓ సీనియర్ రైల్వే అధికారి తెలిపాడు. ఇప్పటివరకు రైళ్లలో సహజసిద్ధమైన మరుగుదొడ్లు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. వీటికి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రవిసర్జనకు పెద్దగా తేడాలేదని, దీనివల్ల పర్యావరణం కూడా దెబ్బతింటోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బయోటాయిలెట్లను తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే.