
2020-21లోగా అన్నీ బయో టాయిలెట్లే
న్యూఢిల్లీ: భారత రైల్వేలో పలుసంస్కరణలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు రైళ్లలో ఉన్న సాధారణ టాయిలెట్లను ఉపయోగించిన ఆ శాఖ వాటి స్థానాల్లో పూర్తిస్థాయిలో పర్యావరణ హితమైన బయోటాయిలెట్లను ఏర్పాటుచేయాలనుకుంటుంది. 2020-21నాటికి 17,338 బయోటాయిలెట్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఓ సీనియర్ రైల్వే అధికారి తెలిపాడు.
ఇప్పటివరకు రైళ్లలో సహజసిద్ధమైన మరుగుదొడ్లు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. వీటికి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రవిసర్జనకు పెద్దగా తేడాలేదని, దీనివల్ల పర్యావరణం కూడా దెబ్బతింటోందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బయోటాయిలెట్లను తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే.