సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల కోసం చేంజ్ ఓవర్ పాయింట్స్‌లో సంచార బయో టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంది.
గంటల తరబడి విధి నిర్వహణ చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు మరుగుదొడ్డి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులైతే వర్ణణాతీతం. సంచార బయో టాయిలెట్లను శుక్రవారం ప్రారంభించడానికి ఆర్టీసీ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. నగరంలో 9 చేంజ్ ఓవర్ పాయింట్లలో టాయిలెట్ల అవసరం ఉందని ఆర్టీసీ యాజమాన్యం గుర్తించింది. అయా ప్రాంతాల్లో సంచార బయో టాయిలెట్లను అందుబాటులో ఉంచనుంది. (చదవండి: పదవీ విరమణ వయసు పెంపు)
Comments
Please login to add a commentAdd a comment