bioscience
-
అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..!
భూమ్మీద పుట్టిన జీవరాశుల్లో అనేక జీవులు అంతరించిపోయాయి. ఇప్పటికే అంతరించిపోయిన జీవులను తిరిగి పుట్టించడం సాధ్యంకాదనే ఇంతవరకు అనుకుంటూ వచ్చారు. అయితే, అది సాధ్యమేనని రుజువు చేయడానికి శాస్త్రవేత్తలు నడుంబిగించారు. నాలుగు శతాబ్దాల కిందట అంతరించిపోయిన ‘డోడో’ పక్షులను తిరిగి పుట్టించడానికి అమెరికన్ బయోసైన్సెస్–జెనెటిక్ ఇంజినీరింగ్ కంపెనీ ‘కలోసల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు ప్రయత్నాలను ప్రారంభించారు. డోడో పక్షులు భారీగా ఉండేవి. ఇవి ఎగరగలిగేవి కాదు. ఒకప్పుడు మారిషస్‌లో విరివిగా తిరిగేవి. ఈ జాతిలోని చివరి పక్షి 1681లో చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ పక్షులకు చెందిన పురాతన డీఎన్ఏ నమూనాలను సేకరించామని, వాటి ఆధారంగా మారిషన్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ సహకారంతో డోడో పక్షులకు పునర్జీవం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కలోసల్ బయోసైన్సెస్ వ్యవస్థాపకుడు బెన్ లామ్ వెల్లడించారు. డోడో తరహాలోనే ఇప్పటికే అంతరించిన గులాబి పావురానికి కూడా పునర్జీవం కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇవి చదవండి: ‘హషిమా’ దీవి.. ఈ చీకటి చరిత్రను తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది! -
విత్తన్నం నుంచి విక్రయం వరకూ ప్రభుత్వమే..
-
ఈ కంపెనీకి ప్రభుత్వం అండగా ఉంటుంది
-
ప్రకృతి వ్యవసాయం గ్రామ స్థాయి నుంచి శిక్షణ: సీఎం వైఎస్ జగన్
-
పక్షుల రాగాలతో ఒత్తిడి మాయం
లండన్ : పక్షుల కిల కిల రాగాలు వింటే మానసిక ఆందోళన, ఒత్తిడి మాయమవుతాయని లండన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్సెటర్ యూనివర్సిటీ, ఆర్నిథాలజీ బ్రిటిష్ సంస్థ, క్వీన్స్లాండ్ యూనివర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన ఓ పరిశోధనలో పక్షులతో మానసిక ప్రశాంతత పొందవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయోసైన్స్ జర్నల్ ప్రచురించింది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో పక్షులను చూసిన వ్యక్తుల్లో నిరాశ, మానసిక ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు, పక్షులు ఉన్న చోట నివసించే వారిని.. చెట్లు, పక్షలు లేని ప్రాంతాల్లో నివసించేవారిని రెండు భాగాలుగా విభజించి పరిశోధనలు జరిపినట్లు జర్నల్‌లో పేర్కొన్నారు. వీరిలో పక్షులను చూసే వారిలో మానసిక ఆందోళనలు తగ్గడం గమనించామని తెలిపారు. ఈ పరిశోధన ద్వారా ప్రకృతి మానవ మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే విషయం గ్రహించామని పరిశోధకుడు డానియల్ కాక్స్ చెప్పారు. ఇంటి ప్రాంగణంలో చెట్లు, పక్షులు ఉండటం వలన ఆరోగ్యంగా ఉండవచ్చని..అందుకు చెట్లను పెంచాలని సూచించారు. పక్షులను చూస్తే ప్రశాంతమైన అనుభూతి కలుగుతుందని కాక్స్ వెల్లడించారు.