Birminghome
-
టాప్–6లో నిలిచే జట్లు, ఇంగ్లండ్ నేరుగా అర్హత
దుబాయ్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా సందడి చేయనున్న మహిళల క్రికెట్‌కు సంబంధించిన క్వాలిఫయింగ్ ప్రక్రియ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్) విడుదల చేశాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ వరకు ఐసీసీ మహిళల టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లతో పాటు.... ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్ నేరుగా ఈ పోటీలకు అర్హత సాధించనుంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు మూడో ర్యాంక్‌లో ఉంది. చివరిదైన ఎనిమిదో బెర్త్‌ను ‘కామన్వెల్త్ గేమ్స్ క్వాలిఫయర్ టోర్నీ’లో విజేత జట్టుతో భర్తీ చేస్తారు. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఓవరాల్‌గా కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ పోటీలు భాగస్వామ్యం కావడం ఇది రెండో సారి మాత్రమే. 1998 కౌలాలంపూర్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌కు ఈ అవకాశం దక్కింది. అజయ్ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. -
ఉచిత ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు
లండన్: ఇంటర్నెట్ సేవలను ఉచితంగా పొందడమన్నది మానవుల ప్రాథమిక హక్కు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు ఇంటర్నెట్ను పొందలేకపోతున్నారని, దీంతో ప్రపంచ స్థాయి వ్యక్తులతో సమానంగా తమ జీవితాలను బాగుపరుచుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయని పేర్కొంది. ఈ అధ్యయనాన్ని చేపట్టిన బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకులు భారత్‌లోని కేరళ రాష్ట్రాన్ని ఓ ఉదాహరణగా చూపారు. ఇంటర్నెట్ పొందడమనేది ప్రాథమిక హక్కుగా కేరళ రాష్ట్రం ప్రకటించిందని, ఈ ఏడాది చివర కల్లా 3.5 కోట్ల మందికి ఇంటర్నెట్ను అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. కొందరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండి.. మరికొందరికి లేకపోవడం వల్ల ప్రాథమిక స్వేచ్ఛగా పేర్కొనే వ్యక్తీకరణ, సమాచార స్వేచ్ఛలను కోల్పోతారంది. -
భూమిని దాటిన బాల్!
క్రికెట్ బాల్‌ను మరీ బలంగా బాదితే.. గ్రౌండ్ దాటి పోతుంది. అయితే.. ఇది అంతరిక్షం అంచులదాకా పోయింది. తాజాగా బర్మింగ్‌హాంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ క్లబ్.. హీలియం బెలూన్ సాయంతో ఓ క్రికెట్ బాల్‌ను 1.10 లక్షల అడుగుల ఎత్తుకు.. అంటే అంతరిక్షం అంచులదాకా పంపింది. తర్వాత ప్యారాచూట్ సాయంతో దాన్ని బ్రిటన్‌లోని న్యూబరీ ప్రాంతంలో దించారు.