birthday function
-
మనుమరాలి పుట్టిన రోజునాడే.. ఇలా..
మెదక్: మనవరాలు పుట్టిన రోజుకు వచ్చిన ఒక తాత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన పాపన్నపేట శివారులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.. మిన్పూర్ గ్రామానికి చెందిన హన్మంతు రాములు(50) హైద్రాబాద్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మనవరాలు పుట్టిన రోజు వేడుక కోసం రెండు రోజుల క్రితం మిన్పూర్కు వచ్చాడు. గ్రామానికి చెందిన జంగం కిషన్‌తో కలసి టీవీఎస్ మోపెడ్‌పై పాపన్నపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వాకింగ్ చేస్తున్న లక్ష్మణ్‌ను ఢీ కొట్టడంతో హన్మంతు, లక్ష్మణ్ గాయపడ్డారు. వారిని పాపన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుండి మెదక్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హన్మంతు రాములు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు. -
బర్త్‌డే పార్టీ కోసం వెళ్లి.. విషాదం!
జగిత్యాల: ఎన్టీపీసీకి చెందిన ఐదుగురు యువకులు బర్త్ డే పార్టీ కోసం సరదాగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చి మద్యంతో వేడుకలు జరుపుకోగా కొద్ది సేపట్లోనే సరదా కాస్త విషాదంగా మారింది. అంతర్గాం ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఎన్టీపీసీకి చెందిన ఐదుగురు యువకులు బర్త్‌డే పార్టీ పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం కారులో మద్యం బాటిళ్లతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఐదుగురు యువకులు అధికంగా మద్యం సేవించి ప్రాజెక్టులో స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. అందులో ఎవరికీ ఈత రాదు. ముగ్గురు వ్యక్తులు ఒడ్డుకు దగ్గరగా స్నానం చేస్తుండగా, ఇద్దరు వ్యక్తులు కొంచెం దూరంగా నీటిలోకి వెళ్లి సరదాగా గంతులేస్తూ స్నానం చేస్తుండగా కనకమేడల ధర్మతేజ(32) నీటిలో మునిగి కనిపించకపోయాడు. కొంతసేపు పరిశీలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. మిగతా నలుగురు వ్యక్తులు ఒడ్డుకు చేరారు. కాగా అప్పటికే చీకటి పడడంతో మరుసటి రోజు గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెంలోని అయ్యప్ప హొటల్ సమీపంలో మోటార్ సైకిల్‌ను లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెం దగా, ఇద్దరు గాయూల పాలయ్యూరు. పట్టణ ఎస్సై వి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఒక హొటల్లో పనిచేస్తున్న మామిడి అప్పల రాజు, నోముల వెంకన్న, వీరెళ్ల బాబి అనేవారు మోటార్ సైకిల్‌పై తమ స్నేహితుడైన గంగాధర్ కుమారుడి పుట్టిన రోజు ఫంక్షన్‌కు వెళుతున్నారు. అయ్యప్ప హొటల్ సమీపానికి వచ్చేసరికి వెనుకనుంచి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. మోటార్ సైకిల్‌పై వెనుక కూర్చున మామిడి అప్పల రాజు (24) అక్కడికక్కడే మృతిచెందగా, మధ్యలో కూర్చున నోముల వెంకన్నకు తీవ్రగాయాలయ్యా యి. మోటార్ సైకిల్ నడుపుతున్న బాబి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అప్పలరాజుకు ఇంకా వివాహం కాలేదు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న అప్పలరాజు మృతితో ఆ కుటుంబం రోడ్డునపడింది. అప్పలరాజు కష్టపడి చెల్లెల్ని ఇంటర్మీడియెట్ చదివి స్తున్నాడని అతని బంధువులు తెలిపారు. తాలూకా ఆఫీస్‌సెంటర్ సమీపంలో ఒక హొటల్లో అప్పలరాజు క్లీనింగ్ సెక్షన్లో, నోముల వెంకన్న వెజిటేరియన్ కుక్‌గా, బాబి సర్వర్‌గా పనిచేస్తున్నారు. ఎస్సై శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అప్పనవీడులో గుర్తు తెలియని వ్యక్తి మృతి పెదపాడు : ఆగివున్న లారీని మరో లారీ ఢీకొట్టిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు ఎస్సై తాడి వెంకటనాగరాజు చెప్పారు. ఆయన తెలి పిన వివరాల ప్రకారం అప్పనవీడు నుంచి కాకినాడ వైపు వెళ్తున్న సుద్ద లోడు లారీని కలపర్రు టోల్గేట్ సమీపంలో హెచ్చరికలు, సిగ్నల్స్ లేకుండా ఆది వారం రాత్రి 11.30 గంటల సమయంలో నిలుపుదల చేశారు. వెనుకనుంచి వేగంగా వస్తున్న పంచదార లారీ ఆగివున్న లారీని ఢీకొట్టింది. పంచాదార లోడు లారీలో ఉన్న బీహార్‌కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కలపర్రు వీఆర్వో గోపి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. మృతుని వివరాలు తెలియూల్సి ఉందన్నారు. -
కాంచీపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
పళ్లిపట్టు, న్యూస్‌లైన్:చిన్నారి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న సంతోషంతో ఇళ్లకు వెళుతున్న బంధువులను మృత్యు వు బస్సు రూపంలో వెంటాడింది. చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 19 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కాంచీపురం సమీపంలో ఆది వారం రాత్రి చోటుచేసుకుంది. అరక్కోణం సమీపంలోని కీయ్వెన్పాక్కం గ్రామానికి చెందిన మునుస్వామి(55) కూతురు కార్తికాను తిరువణ్ణామలై జిల్లా చెయ్యారు సమీపంలోని చిదాత్తూర్ గ్రామానికి చెందిన రాజసంతోష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతుల కొడుకు కార్తీక్రాజ్కు మొదటి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు మునుస్వామి తన బంధువులతో కలిసి రెండు వ్యాన్లలో చిదాత్తూర్ గ్రామానికి వెళ్లారు. వేడుకలను ముగించుకుని ఆదివారం రాత్రి ఇం టికి తిరుగు ప్రయాణమయ్యారు. కాంచీపురం సమీపంలోని చెవ్విలిమేడు ప్రాంతంలోని పాలారు నది బ్రిడ్జి మీద వెళుతుండగా డీజిల్ అయిపోవడంతో వ్యాన్ ఆగిపోయింది. వ్యాన్‌లో ఉన్న నలుగురు డీజిల్ తీసుకొచ్చి ట్యాంకులో నింపి స్టార్ట్ చేసేందుకు తోశారు. అదే సమయం లో వస్తున్న ప్రైవేటు కర్మాగారానికి చెందిన బస్సు వ్యాన్‌ను ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్‌ను తోస్తున్న శివ(28), శశికుమార్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 19 మందిని పోలీసులు కాంచీపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మునుస్వామి(55), శంకర్ కుమార్తె యోగలక్ష్మీ(3) ప్రాణాలు విడిచారు. ప్రమాదంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంచీ పురం జిల్లా కలెక్టర్ భాస్కరన్ పరామర్శించారు. క్షతగాత్రుల్లో వ్యాన్ డ్రైవర్ చత్రియన్ (24), శబరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుభకార్యానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో వారి బంధువులు బోరుమని విలపించారు.