
హన్మంతు రాములు (ఫైల్)
మెదక్: మనవరాలు పుట్టిన రోజుకు వచ్చిన ఒక తాత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన పాపన్నపేట శివారులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.. మిన్‌పూర్ గ్రామానికి చెందిన హన్మంతు రాములు(50) హైద్రాబాద్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మనవరాలు పుట్టిన రోజు వేడుక కోసం రెండు రోజుల క్రితం మిన్‌పూర్‌కు వచ్చాడు.
గ్రామానికి చెందిన జంగం కిషన్‌తో కలసి టీవీఎస్ మోపెడ్‌పై పాపన్నపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వాకింగ్ చేస్తున్న లక్ష్మణ్‌ను ఢీ కొట్టడంతో హన్మంతు, లక్ష్మణ్ గాయపడ్డారు. వారిని పాపన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుండి మెదక్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హన్మంతు రాములు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment