bit college
-
మాయగాడు.. టెక్కీ దంపతులనే బురిడి కొట్టించాడు
సాక్షి, హైదరాబాద్: క్రిప్టోకరెన్సీగా పిలిచే బిట్ కాయిన్స్ దందాను వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో చేయవచ్చంటూ నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లయిన భార్యాభర్తల నుంచి రూ.60 లక్షలు కాజేసిన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అమీర్‌పేటకు చెందిన వంశీమోహన్ దంపతులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడి పెట్టి ఇంట్లో కూర్చొనే భారీగా లాభాలు గడించవచ్చనే ప్రకటనకు వీళ్లు ఆకర్షితులయ్యారు. రూ.50 లక్షల ఇన్వెస్ట్‌తో.. ‘జిప్‌బిట్’ యాప్ ద్వారా కాయిన్ల క్రయవిక్రయాలు చేపట్టారు. దీని ద్వారానే వీరికి పరిచయమైన ఓ వ్యక్తి ఆ దందాలో లాభాలు కురిపిస్తానంటూ ఎర వేశాడు. తొలుత రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచ మార్కెట్లో బిట్ కాయిన్ విలువ పెరుగుతున్నా.. వీరి కాయిన్స్ వివరాలు తెలియట్లేదు. దీంతో ఆ వ్యక్తిని మరోసారి సంప్రదించారు. మీ కాయిన్లు భద్రమని, ప్రస్తుత పరిస్థితుల్లో రూ.50 లక్షలకు పైగా వెచ్చించి కాయిన్స్ ఖరీదు చేస్తేనే అధిక లాభాలని నమ్మబలికాడు. దీంతో ఆ మొత్తం అతడు చెప్పినట్లే బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇందులో కొంత జిప్‌బిట్ యాప్ ద్వారా, మిగిలింది ముంబై, పూణే నగరాలకు చెందిన పలు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. ఆన్లైన్లో చూసుకోండి.. లాభాలు రాకపోవడంతో సదరు వ్యక్తితో చాటింగ్ చేశారు. లాభం ఖచ్చితంగా ఉందని, ఆన్లైన్లో కాయిన్ ధర చూసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించి ఈ నెల రెండో వారంలో సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ డి.ప్రశాంత్ దర్యాప్తు చేపట్టారు. ఈమె పంపిన డబ్బులో రూ.30 లక్షలు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఉన్న ఇస్కాన్ సిటీవాసి తమ్ము అనిల్‌కుమార్‌కు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. 10 నుంచి 20 శాతం కమీషన్ వృత్తిరీత్యా ఏసీ టెక్నీషియన్ అయిన అనిల్‌కు ఇంటర్నెట్లో ద్వారానే జిప్‌బిట్ యాప్ కోసం పనిచేస్తున్న వ్యక్తితో పరిచయమైంది. అతడితో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేశారు. తాము సూచించిన లావాదేవీలకు సహకరిస్తూ వెళ్లడమే పనని, అలా చేస్తే 10 నుంచి 20 శాతం కమీషన్ ఇస్తామంటూ ఆ వ్యక్తులు ఇతడిని రంగంలోకి దింపారు. మిగిలిన మొత్తాన్ని బినాన్స్ యాప్ ద్వారా బిట్ కాయిన్స్ రూపంలో మార్చి తమకు పంపాలని వాళ్లు స్పష్టం చేశారు. దీనికి అంగీకరించిన అతడు వంశీమోహన్ దంపతులకు చెందిన రూ.30 లక్షలు, రాచకొండ పరిధికి చెందిన మరో మహిళ నుంచి రూ.6.5 లక్షలు తన ఖాతాల్లో వేయించుకున్నాడు. ఈ మొత్తంలో తన కమీషన్ మినహాయించుకుని మిగిలింది బిట్ కాయిన్స్‌గా మార్చేశాడు. వాటిని సూత్రధారులకు అందించాడు. రాచకొండ పోలీసులు అనిల్ వ్యవహారాన్ని గుర్తించి తమ కేసులో ఇటీవల అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిటీ సైబర్ క్రైమ్ అధికారులు పీటీ వారెంట్‌పై శుక్రవారం అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
సాక్షి మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన
– ఉత్సాహంగా తరలివచ్చిన విద్యార్థులు రాప్తాడు / హిందూపురం అర్బన్ : సాక్షి మీడియా గ్రూప్‌తో పాటు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ), బిట్ ఇంజినీరింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివారం నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన లభించింది. హంపాపురం వద్ద ఉన్న ఎస్వీఐటీ, హిందూపురంలోని బిట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షను నిర్వహించారు. అనంతపురం నుండే కాక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మూడు గంటల పాటు కళాశాలలో నిర్వహించిన ఈ పరీక్షలను ఎస్వీఐటీలో సాక్షి దినపత్రిక బ్రాంచ్ మేనేజర్ కేదార్‌నాథ్‌రెడ్డి, కళాశాల వైస్ చైర్మన్ సి.చక్రధర్‌రెడ్డి, పర్యవేక్షించారు. హిందూపురంలో పరీక్ష పత్రాలను బిట్ కళాశాల చైర్మన్ పి.చంద్రమోహన్, కళాశాల ప్రిన్సిపల్ రమేష్ విడుదల చేశారు. సమయపాలన తెలిసింది - నవ్యశ్రీ, బాలాయేసు కళాశాల, హిందూపురం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్ చాలా మాకు ఎంతగానో దోహదపడింది. ముఖ్యంగా ఈ పరీక్ష వల్ల సమయ పాలన బాగా తెలిసొచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే ప్రధాన పరీక్షపై పడుతున్న టెన్షన్ బాగా తగ్గిపోయినట్లే. థ్యాంక్స్ టు సాక్షి. మంచి ర్యాంకు వస్తుంది – హరిణిరెడ్డి, అనంతపురం ఎంసెట్ ఎగ్జామ్ అంటే చాలా భయంగా ఉండేది. పరీక్ష ఎలా రాయాలో కూడా తెలియదు. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ ఎంసెట్ ద్వారా పరీక్ష ఎలా రాయాలో తెలిసింది. కచ్చితంగా త్వరలో నిర్వహించే ఎంసెట్ మంచి మార్కులు సాధిస్తా. ఇలాంటి పరీక్షలను విద్యార్థులు తప్పకుండా వినియోగించుకోవాలి.